బెంగుళూరు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?బెంగుళూరు కర్ణాటక • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
741 కి.మీ² (286 sq mi)[1] • 920 మీ (3,018 అడుగులు) |
| జిల్లా(లు) | బెంగుళూరు పట్టణ |
| జనాభా • జనసాంద్రత |
5,280,000 (3rd) (2007) • 7,126/కి.మీ² (18,456/చ.మై) |
| మేయర్ | ముంతాజ్ బేగం |
| కోడులు • పిన్‌కోడు • టెలీఫోను • UN/LOCODE • వాహనం |
• 560 0xx • +91-(0)80 • IN BLR • KA-01; KA-02; KA-03; KA-04; KA-05; KA-41; KA-51; KA-53 |
అక్షాంశరేఖాంశాలు: బెంగుళూరు భారతదేశంలోని మహా నగరాలలో ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రానికి రాజధాని. బెంగుళూరును "హరిత నగరము"(ఆంగ్లములో "గ్రీన్ సిటీ")అని కూడా అంటారు. ఇచట వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ఇచట అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు. బెంగుళూరు భారత దేశంలో సాఫ్ట్‌వేర్ కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.
విషయ సూచిక |
[మార్చు] పుట్టుక
కన్నడం లో దీని అసలు పేరు బెంగళూరు. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ పేరునే వాడాలని నిర్ణయించింది.
[మార్చు] చరిత్ర
పశ్చిమ గంగ వంశీకులు కొన్ని శతాబ్దాల పాటు పరిపాలించిన తరువాత క్రీ.శ 1024 సంవత్సరంలో చోళ రాజులు చేజిక్కించుకున్నారు. తరువాత 1070 లో అధికారం చాళుక్య చోళుల చేతుల్లోకి మారింది. 1116 లో హోయసలులు చోళ రాజులను ఓడించి ఈ నగరాన్ని తమ హస్తగతం చేసుకున్నారు.
[మార్చు] భౌగోళిక పరిస్థితులు మరియు వాతావరణం
బెంగళూరు కర్ణాటక లో ఆగ్నేయ దిశగా, మైసూరు పీఠభూమి మధ్య భాగంలో ఉంటుంది.
16వ శతాబ్దంలో కెంపె గౌడ-1 నగరంలో మంచినీటి అవసరాల కోసం అనేక సరస్సులు తవ్వించాడు. ప్రస్తుతం నగరంలో 80% నీటి అవసరాలు కావేరి జలాల వల్లనే తీరుతున్నాయి. మిగతా 20% తిప్పగొండనహళ్ళి మరియు అర్కావతి నదిపై నిర్మించబడ్డ హేసరగట్ట రిజర్వాయర్ వల్ల తీరుతున్నాయి.
[మార్చు] ఆదాయ వనరులు
భారత దేశపు సిలికాన్ వ్యాలీగా పిలువబడే బెంగళూరు ప్రధానంగా అనేక సాఫ్ట్వేర్ సంస్థలకు నిలయం. దాదాపు ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన సాఫ్ట్వేర్ సంస్థలన్నీ ఈ నగరంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఉన్నాయి. అంతేకాక భారతదేశంలోకెల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం.
[మార్చు] రవాణా సౌకర్యాలు
అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలను తీర్చడం కోసం అత్యంత అధునాతన సౌకర్యాలతో మే 24, 2008 న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఎయిర్ దక్కన్ మరియు కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయాలు బెంగళూరులోనే ఉన్నాయి. బెంగళూరు మహానగర పాలక సంస్థ నిర్వహించే ఇక్కడి ప్రజల ప్రధాన రవాణా సాధనం.
[మార్చు] గణాంకాలు
[మార్చు] సంస్కృతి మరియు సాంప్రదాయాలు
బెంగళూరు భారతదేశపు ఉద్యానవనాల నగరంగా ప్రసిద్ధి గాంచింది. ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ఉద్యానవనాలు సందర్శకులకు నేత్రానందం కలిగిస్తాయి. లాల్ బాగ్, కబ్బన్ పార్క్ లు ప్రముఖ ఉద్యానవనాలు.
ఇక్కడ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.
[మార్చు] క్రీడలు
క్రికెట్ ఇక్కడ బాగా ప్రజాధరణ పొందిన క్రీడగా చెప్పవచ్చు. భారత క్రికెట్ దిగ్గజాలైన అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ బెంగళూరు కు చెందిన వారే.
[మార్చు] విద్య
1909 లో ఇక్కడ ప్రారంభించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన పరిశోధనా కేంద్రాలలో ఒకటి. ఇంకా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, మానసిక ఆరోగ్య కేంద్రమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) మొదలైనని ప్రధాన విద్యా సంస్థలు.
[మార్చు] షాపింగ్ మాల్ లు
- గరుడ మాల్, ఎం.జీ రోడ్
- బెంగుళూరు సెంట్రల్, ఎం.జీ రోడ్
- ది ఫోరం, కోరమంగళ
- గోపాలన్ మాల్, మైసూర్ రోడ్
[మార్చు] హోటళ్ళు
- నందిని
- భగిని
- అడిగాస్
[మార్చు] మాధ్యమాలు
బెంగుళూరు లో మొట్టమొదటి సారిగా 1840 లో ప్రింటింగ్ ప్రెస్ ను నెలకొల్పడం జరిగింది. 1955 నవంబర్ 2 న బెంగళూరులో ఆకాశవాణి రేడియో కేంద్రాన్ని ప్రారంభించింది.
[మార్చు] దర్శనీయ స్థలాలు
- ఇస్కాన్ టెంపుల్
బెంగుళూరులోని ఇస్కాన్ 1987 సెప్టెంబర్లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినది.[2] మధు పండిట్ దాస గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో 11 ఎకరాల స్థలం కేటాయించినారు. అలా కేటాయించిన స్థలంలో 1990 - 1997ల మధ్యలో గుడి కట్టడం పూర్తి అయినది. అలా పూర్తయిన గుడి అప్పటి రాష్ట్రపతి, డా.శంకర దయాళ్ శర్మ చేతుల మీదుగా 1997 మే 31న ప్రారంభమయినది.
ఇక్కడ బంగారు పూతతో ఉన్న ద్వజస్థంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.[3] ఈ గుడి బెంగుళూరులో రాజాజినగర్ అనే ప్రాంతములో ఉన్నది.ఆక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్ (బెంగుళూరు రైల్వే స్టేషను,బస్సు స్టాండు గల ప్రాంతం)నుండి సిటీ బస్సులు కలవు.
- శివ మందిరం
ప్రపంచంలో అతి ఎత్తైన[ఆధారం కోరబడినది] శివుని విగ్రహం ఇచట ఉంది. ఇది బెంగుళూరు విమానాశ్రయం రహదారిపై మురుగేశ్ పాల్య ప్రాంతములో కలదు. ఈ విగ్రహం ఎత్తు 65 అడుగులు. అంతేగాకుండా ఇచట ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా కలవు.
- పెద గణేష మందిరం
అతి పెద్ద గణపతి శిలా విగ్రహం ఇక్కడ ఉంది. ఇది ఏక శిలా విగ్రహము. బెంగుళూరు దక్షిణ ప్రాంతము లొ బసవన గుడి ప్రక్కన వున్నది. బెంగుళూరు సందర్శకులు ఇక్కడికి కూడా వస్తుంటారు.
- బనశంకరి మందిరం
- వాసవీ మందిరం
- దొడ్డ బసవన్న దేవాలయం
- దొడ్డ గణపతి దేవాలయం
- కొటే వెంకటేశ్వర మందిరం
- టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్
- లాల్బాగ్ ఉద్యానవనము
- కబ్బన్ పార్క్ ఉద్యానవనము
- కర్ణాటక విధాన సౌధ (శాసనసభ)
- విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం
- ప్లానిటోరియం
- అక్వేరియం
- యమ్.జి. రోడ్
- ఫోరం మాల్
- గరుడ మాల్
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
[మార్చు] మూలాలు
- ↑ 2007-08 సంవత్సరానికి తయారు చేసిన బడ్జెట్ నివేదిక ప్రకారం గ్రేటర్ బెంగళూరు విస్తీర్ణాం 741 చదరపు కిలోమీటర్లు 2007-08 బడ్జెట్ నివేదిక. జాతీయ సమాచార కేంద్రం (NIC), కర్ణాటక రాష్ట్ర విభాగం. భారతదేశ ప్రభుత్వం. తీసుకొన్న తేదీ: 2007-06-28.
- ↑ ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ మొదటి పేజీ
- ↑ ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ మూడవ పేజీ