ఎల్లోరా గుహలు
వికీపీడియా నుండి
ఎల్లోరా గ్రామము మహారాష్ట్ర లో ఔరంగాబాద్ కు 30 కి.మి. (18.6 మైళ్ళు) దూరము లో ఉన్నది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ది చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. [1] చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. 12 బౌద్ద గుహలు (600-800 బి.సి.), 17 హిందూ గుహలు (600-900 బి.సి.), 5 జైన్ గుహలు (800-1000 బి.సి.) పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చూపిస్తున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడ్డాయి.
ఇందులో భౌద్ద ఛైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. మూడు మతాల భావ సంగమం ఇది. ఎల్లోరా ని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు. ఎల్లోరాను దర్శించడానికి ఆగష్టు-అక్టోబర్ మధ్య కాలం అనువైనది. కాని విధ్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే-జూన్ నెలలలో పర్యాటకులు అధికంగా వస్తారు.
విషయ సూచిక |
[మార్చు] కైలాస దేవాలయం
పదహారవ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టిందట. దీని నిర్మాణానికి సుమారు ఏడు వేలమంది కార్మికులు పాలుపంచుకున్నట్లు చెబుతారు. రాష్ట్ర కూటులకు చెందిన శ్రీక్రిష్ణ -1 కు దీనిని నిర్మించిన ఘవత దక్కింది. ఈ ఆలయం అరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాధలను శిల్పాలుగా చెక్కినారు. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉంది.
[మార్చు] బౌద్ధ గుహలు
12 గుహల్లోనూ బుద్దుని విగ్రహాలు ఉన్నాయి. వీటిలో పదవ నెంబరు గుహ లో15 అడుగుల బుద్ధుని విగ్రహము ధ్యాన ముద్ర లో ఉంటుంది. దీనిని విశ్వకర్మ గుహ అంటారు.
[మార్చు] జైన గుహలు
జైన మతాన్ని ప్రతిబింబించే ఐదు గుహలున్నాయి.ఇందులో 32 వ గుహలో ఆకర్షణీయమైన డిజైనులు పర్యాటకులను అబ్బురపరుస్తాయి.
[మార్చు] ఎలా వెళ్ళాలి
రైలు ద్వారా ఔరంగా బాద్ కు చేరుకుని, అక్కడి నుండి బస్సు లో కానీ, కార్లు, జీపులలో కాని ఎల్లోరా గుహలకు చేరుకోవచ్చు.
[మార్చు] ఇవీ చూడండి
- ప్రపంచ వారసత్వ ప్రదేశం
- ఆసియా మరియు ఆస్ట్రలేషియా లోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
- దర్శనీయ స్థలాలు
[మార్చు] మూలాలు
- ↑ Ellora UNESCO World Heritage Site. తీసుకొన్న తేదీ: 2006-12-19.