అజంతా గుహలు

వికీపీడియా నుండి

అజంతా గుహలు

మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. [1] మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'.[2] . ఔరంగాబాద్ జిల్లా లోని అజంతా గ్రామము బైట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో (UNESCO) వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా పరిగణించబడుతున్నాయి.

విషయ సూచిక

[మార్చు] ఉన్న ప్రదేశం

మొదటి గుహ

అజంతా గ్రామానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులతో కూడిన, గుర్రపునాడా ఆకృతిలో ఉన్న కొండ నెట్రముపై ఇవి నెలకొని ఉన్నాయి. ఈ ప్రదేశం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా పరిధిలోనికి వస్తుంది. ఇది ఔరంగాబాద్ పట్టణానికి సుమారు 106 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి దగ్గరగా ఉన్న పట్టణాలు జలగావ్ (60 కి.మీ), మరియు భుసావల్ (70 కి.మీ). దీనికి దిగువన కొండల మధ్య నుంచి ఉద్భవించే వాఘర్ నది ప్రవహిస్తుంది. భారతీయ పురాతత్వ శాఖ అధికారికంగా 29 గుహలను కనుగొన్నట్లు ప్రకటించింది. ఇవి కొండకు దక్షిణంగా క్రింది భాగం నుంచి 35 నుంచి 115 అడుగుల ఎత్తులో ఉన్నాయి.

ఈ సన్యాసాశ్రమ సముదాయంలో చాలా విహారాలు, చైత్య గృహాలు కొండలోకి తొలచబడి ఉన్నాయి.

[మార్చు] మొదటి గుహ

మొదటి గుహ అంటే ఇది మొదటగా గుర్తించబడిన గుహ. కానీ రెండు గుహల్లో ఏది మొదట నిర్మించారన్న దానికి శాసనా పరమైన ఆధారాలేమీ లేవు. గుర్రపు నాడా ఆకారంలో ఉన్న పర్వత నెట్రముపై ఇది నెలకొని ఉంది.

[మార్చు] రెండవ గుహ

ఇది మొదటి గుహను ఆనుకునే ఉంటుంది.

[మార్చు] మూలాలు

  1. UNESCO World Heritage Site. Ajanta Caves, India: Brief Description. Retrieved 27 October 2006.
  2. UNESCO International Council on Monuments and Sites. 1982. Ajanta Caves: Advisory Body Evaluation. Retrieved 27 October 2006.

పేజీకి సంభందించిన లింకులు