చిత్తూరు జిల్లా

వికీపీడియా నుండి


  ?చిత్తూరు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా
అక్షాంశరేఖాంశాలు: 13°12′N 79°07′E / 13.2, 79.1167
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 15,152 కి.మీ² (5,850 చ.మై)
ముఖ్య పట్టణము చిత్తూరు
ప్రాంతం రాయలసీమ
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
37 (2001)
• 247/కి.మీ² (640/చ.మై)
• 810000
• 18,82,999
• 18,10,000
• 67.46
• 78.29
• 56.48

అక్షాంశరేఖాంశాలు: 13°12′N 79°07′E / 13.2, 79.1167 చిత్తూరుజిల్లా రాయలసీమలో ఒక భాగం. చిత్తూరు జిల్లా ఆంద్రప్రదేశ్‌కు దక్షిణాన తమిళనాడు సరిహద్దులలో ఉంది. చిత్తూరుకు పశిమాన తమిళనాడు జిల్లాలైన అయిన ఆర్కాట్ మరియు ధర్మపురి, కర్ణాటక జిల్లా అయిన కోలార్ జిల్లా, తూర్పున తమిళ నాడు జిల్లాలైన అణ్ణా మరియు చెంగై జిల్లాలు, ఉత్తరాన కడప అనంతపురం జిల్లాల మద్య ఉన్నది. జిల్లాను రెండు సహజ విభాగాలుగా విభజించ వచ్చు. ఒకటి కొండలు లోయలతో కూడిన మదనపల్లి విభాగం, రెండవది మదాన ప్రాంత మండలాలతో కూడిన పుత్తూరు విభాగం. చిత్తూరు సముద్రమట్టానికి 2,500 అడుగుల ఎత్తున ఉంది.చిత్తూరు భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక పట్టణము మరియు జిల్లాకేంద్రం. తిరుపతి, కాణిపాకం మరియు శ్రీ కాళహస్తి దేవాలయాలకు ప్రసిద్ధి. చిత్తూరు పట్టణము, ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ప్రాంతములో, పోన్న నది లోయలో, బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉన్నది. ఇది ధాన్యములు, చెరకు, మామిడి, మరియు వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు మరియు బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమలు కలవు.

  • జనాభా కోడు : 23
  • పి.యమ్.జి.ఎస్.వై. కోడు: AP03
  • మండలాల సంఖ్య: 66
  • గ్రామాల సంఖ్య 1399

ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ మండలాలు మరియు గ్రామాలు గలిగిన జిల్లా చిత్తూరు జిల్లా.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

చిత్తూరు జిల్లా ఏప్రిల్ 1, 1911 సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి ఉత్తర ఆర్కాట్ లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు, కడప జిల్లా నుంచి మరి కొన్ని తాలూకాలు, నెల్లూరు జిల్లా నుంచి మరికొన్ని తాలూకాలు కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. 2011 ఏప్రిల్ 1 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19వ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఒక వైపు కర్ణాటక కు, మరో వైపు తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తెలుగుతో బాటు, తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు.

ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి ఉద్భవించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేసిన పి. ఆనందాచార్యులు ఈ జిల్లాకు చెందిన వాడే. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లె లో జన్మించాడు. ప్రముఖ విద్యావేత్త, పండితుడు, కవి, సాహిత్య విమర్శకుడు, చక్కటి నిర్వహకుడు, వోల్టేర్ తో పోల్చదగిన సర్ సీఆర్ రెడ్డి చిత్తూరు వాసే. 18 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ చిత్తూరు జిల్లా వాసి. మా తెలుగు తల్లికి గేయం రచించిన శంకరంబాడి సుందరాచారి ఈ జిల్లాకు చెందిన వాడే. మాజీ లోక్‌సభ స్పీకర్, బీహార్ మాజీ గవర్నర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్,స్వాతంత్ర్య సమరయోధులు పార్థసారథి అయ్యంగార్, పాపన్న గుప్తా, నూతి రాధాకృష్ణ మొదలైన వారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆణిముత్యాలు.

చిత్తూరు జిల్లాకి చెందిన చంద్రగిరి కోట, గుర్రంకొండ, ఆవులకొండ, పుంగనూరు కోటలు చారిత్రక ప్రసిద్ధి గాంచినవి. ప్రసిద్ధి గాంచిన ఋషీ వ్యాలీ పాఠశాల, ఆసియాలోనే అతిపెద్ద చికిత్సా కేంద్రమైన మదనపల్లెకు సమీపంలో ఉన్న ఆరోగ్యవరం జిల్లాకు తలమానికం. దక్షిణాదికి చెందిన శాంతినికేతన్ గా పిలవబడే థియసోఫికల్ కళాశాల మదనపల్లె లో ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి కళాశాల గా పేరు గాంచింది. 1919 లో ఈ కళాశాల సందర్శనకు వచ్చిన రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమణ గీతాన్ని ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించాడు. ప్రస్తుతం జనగణమణ పాడుతున్న రాగాన్ని ఇక్కడే కూర్చడం జరిగింది. అలా జాతీయగీతానికి తుదిరూపునిచ్చిన ప్రాంతంగా ఈ ప్రాంతం చరిత్ర ప్రసిద్ధి గాంచింది. ఆంధ్రప్రదేశ్ లో వేసవి విడిది ఉన్న ఏకైక ప్రాంత్రం చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్. ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నరుకు అధికారిక వేసవి విడిది కేంద్రం కూడా.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలైన వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో చంద్రగిరి కేవలం ప్రధాన కేంద్రంగానే కాక కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలెగాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, చంద్రగిరి ప్రాంతాల్లోనే పదిమంది పాళెగాళ్ళు అధికారం చెలాయించే వాళ్ళు. ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చూసినపుడు మైసూరు నవాబులు, హైదరాలీ, టిప్పు సుల్తాన్ చిత్తూరును తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాలో గుర్రంకొండ నవాబు కుమార్తె అయిన ఫకీరున్నీసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్.

రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని నరసింగరాయనిపేట దగ్గర హైదరాలో డిసెంబరు 6, 1782 లో క్యాన్సర్ సోకి మరణించాడు. ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ, దానికి మొహమ్మద ఆలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు. అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడు. [1]

[మార్చు] చిత్తూరు జిల్లా

జిల్లాకు వాయవ్యమున అనంతపురం జిల్లా, ఉత్తరాన కడప జిల్లా, ఈశాన్యమున నెల్లూరు జిల్లా, దక్షిణమున తమిళనాడు రాష్ట్రము మరియు నైఋతి దిక్కున కర్ణాటక రాష్ట్రము సరిహద్దులుగా కలవు. రాష్ట్రములో బాగా వెనుకబడి ఉన్న ప్రాంతములలో ఈ జిల్లా ఒకటి. చిత్తూరు పట్టణము చుట్టుపక్కల మామిడి తోటలు మరియు చింత తోపులు విస్తారముగా కలవు. జిల్లా, పశుసంపదకు కూడా ప్రసిద్ధి చెందినది.


పూర్వము ఏనుగు మల్లమ్మకొండ అని పిలవబడిన హార్సిలీ హిల్స్ మదనపల్లె పట్టణానికి సమీపమున ఉన్న ఒక వేసవి విడిది. ఈ ప్రదేశము "ఆంధ్ర ఊటీ" గా పేరు పొందినది. అనేక రకమైన పండ్లు మరియు కూరగాయలు (ప్రత్యేకముగా టమాటాలు) పండించే చుట్టు పక్కల వ్యవసాయ ప్రాంతమునకు మదనపల్లె కేంద్ర స్థానము. హా‌ర్స్లీ హిల్స్ వద్దనున్న రిషి వ్యాలీ గురుకుల విద్యకు ప్రసిద్ధి.


జిల్లాకు పశ్చిమ భాగమున ఉన్న గుర్రంకొండ ఒక చారిత్రక ప్రదేశము. ఇక్కడ ఒక పాత కోట మరియు రాగినీ మహల్ అనబడే సుల్తాన్ యొక్క ప్యాలెస్ ఉన్నాయి. ఆర్ధ్రగిరి మరియు చంద్రగిరి జిల్లాలోని ఇతర చెప్పుకోదగిన ప్రదేశములు.

రైల్వే మార్గాలు రైళ్లు నడవడం రాష్ట్రంలోనే ప్ర ప్రదమంగా ఈ జిల్లలోనె ప్రారంబం అయినది. జిల్లాలో ఐదు మార్గాలలో పయనించె రైలు మార్గాలున్నాయి. రేనిగుంట: ఇక్కడ అతి పెద్ద రైల్వే కూడలి. ఇక్కడే రైలు పెట్టెల మరమ్మత్తు కర్మాగారం కలదు. చిత్తూరు జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన పండగలు సంక్రాంతి పండుగల సందర్బంగా జరుపుకునే పశువుల పండగ // దాన్నె జల్లి కట్టు అంటారు. అప్పుడే జరిగే పార్వేట ఉత్సవం గంగ పండగ ఆ సందర్బంలో జరిగే గంగ జాతర., ముక్కోటి ఏకాదసి., కావిళ్లు పండగ, కార్తీక మాసంలో జరిగె సుడ్దుల పండగ , మహాభారత ఉత్సవాలు మొదలగునవి ఈ జిల్లాకే ప్రత్యేకం.

[మార్చు] పాలనా విభాగాలు

లోక్‌సభ స్థానాలు (2)
శాసనసభ స్థానాలు (14)

2007 లో జరిగిన డీలిమిటేషన్ వలన క్రొత్తగా విలీనాలు చేయబడిన నియోజక వర్గాలు.

  • గమనిక : క్రింద ఇవ్వబడిన నియోజకవర్గాలను నొక్కినచో, నేరుగా ఆయా అసెంబ్లీవర్గాల పేజీలలో వెళ్ళవచ్చును. ఎడమవైపున ఇవ్వబడిన సంఖ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల క్రమసంఖ్య.

281. తంబళ్ళపల్లె, 282. పీలేరు, 283. మదనపల్లె, 284. పుంగనూరు, 285. చంద్రగిరి, 286. తిరుపతి, 287. శ్రీకాళహస్తి, 288. సత్యవేడు, 289. నగరి, 290. గంగాధరనెల్లూరు, 291. చిత్తూరు, 292. పూతలపట్టు, 293. పలమనేరు, 294. కుప్పం.

రెవెన్యూ డివిజన్లు
  1. చిత్తూరు.
  2. చంద్రగిరి.
  3. మదనపల్లె.
విద్యారంగ డివిజన్లు

1. చిత్తూరు. 2. తిరుపతి. 3. మదనపల్లె. 4. పుత్తూరు.

పురపాలక సంఘాలు (మునిసిపాలిటీలు)

1. చిత్తూరు. 2. తిరుపతి. 3. మదనపల్లె. 4. శ్రీకాళహస్తి. 5. పుంగనూరు. 6. పలమనేరు. 7. పుత్తూరు.

[మార్చు] నదులు

[మార్చు] పుణ్య క్షేతాలు

తిరుపతి శ్రీనివాస మంగా పురం అప్పలాయ గుంట వెంకటేస్వర స్వామి

తల కోన

[మార్చు] పర్యాటక కేంద్రాలు

+ గుడి మల్లం

[మార్చు] జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు

సాహితీ కారులు
సినీ రంగ ప్రముఖులు

ఎమ్.ఆర్.రాధా

[మార్చు] మండలాలు

భౌగోళికంగా చిత్తూరు జిల్లాను 66 రెవిన్యూ మండలములుగా విభజించినారు[2].

చిత్తూరు జిల్లా మండలాలు
1 పెద్దమండ్యం 23 కె.వీ.పీ.పురం 45 నగరి
2 తంబళ్లపల్లె 24 నారాయణవనం 46 కార్వేటినగరం
3 ములకలచెరువు 25 వడమాలపేట 47 శ్రీరంగరాజపురం
4 పెద్దతిప్ప సముద్రం 26 తిరుపతి గ్రామీణ 48 పాలసముద్రం
5 బీ.కొత్తకోట 27 రామచంద్రాపురం 49 గంగాధర నెల్లూరు
6 కురబలకోట 28 చంద్రగిరి 50 పెనుమూరు
7 గుర్రంకొండ 29 చిన్నగొట్టిగల్లు 51 పూతలపట్టు
8 కలకడ 30 రొంపిచెర్ల 52 ఐరాల
9 కంభంవారిపల్లె 31 పీలేరు 53 తవనంపల్లె
10 యెర్రావారిపాలెం 32 కలికిరి 54 చిత్తూరు
11 తిరుపతి పట్టణ 33 వాయల్పాడు 55 గుడిపాల
12 రేణిగుంట 34 నిమ్మన్నపల్లె 56 యాదమరి
13 యేర్పేడు 35 మదనపల్లె 57 బంగారుపాలెం
14 శ్రీకాళహస్తి 36 రామసముద్రం 58 పలమనేరు
15 తొట్టంబేడు 37 పుంగనూరు 59 గంగవరం
16 బుచ్చినాయుడు ఖండ్రిగ 38 చౌడేపల్లె 60 పెద్దపంజని
17 వరదయ్యపాలెం 39 సోమల 61 బైరెడ్డిపల్లె
18 సత్యవీడు 40 సోదం 62 వెంకటగిరి కోట
19 నాగలాపురం 41 పులిచెర్ల 63 రామకుప్పం
20 పిచ్చాటూరు 42 పాకాల 64 శాంతిపురం
21 విజయపురం 43 వెదురుకుప్పం 65 గుడుపల్లె
22 నింద్ర 44 పుత్తూరు 66 కుప్పం



[మార్చు] మూలాలు

  1. http://www.thehindu.com/arts/history-and-culture/article1587813.ece
  2. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో చిత్తూరు జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.

[మార్చు] వనరులు

  • గౌరు వాస్తు ప్లానర్స్ వారి 2008 కేలెండర్ లోని సమాచారం

[మార్చు] బయటి లింకులు


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు