ఒంగోలు

వికీపీడియా నుండి
  ?ఒంగోలు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 15°30′N 80°03′E / 15.5, 80.05
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 10 మీ (33 అడుగులు)
దూరాలు
నెల్లూరు నుండి
గుంటూరు నుండి
హైదరాబాదు నుండి

• 125 కి.మీలు ఉ (భూమార్గం)
• 110 కి.మీలు ద (భూమార్గం)
• 320 కి.మీలు ఆ (భూమార్గం)
ముఖ్య పట్టణము ఒంగోలు
ప్రాంతం కోస్తా
జిల్లా(లు) ప్రకాశం జిల్లా
జనాభా 1,49,589 (2001)
మునిసిపల్ కమీషనర్ చల్లా అనురాధ[1]
శాసన సభ ప్రతినిధి బాలినేని శ్రీనివాసులు రెడ్డి
లోక్ సభ ప్రతినిధి సుబ్బా రెడ్డి తానిపర్తి
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 523001
• +08592
• ఎపి-27


ఒంగోలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా యెక్క ముఖ్య పట్టణము మరియు ఒంగోలు మండలానికి కేంద్రము. పూర్వము దీని పేరు వంగవోలు. ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు. ప్రఖ్యాతిచెందిన జేబూ(Zebu)జాతి ఎద్దులలో ఇవి ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో వర్జీనియా రకం పొగాకు పంటకు ఒంగోలు ఒక ప్రధాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రము. గ్రానైటు గనులకు ప్రసిద్ధి చెందినది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

ఒంగోలు పట్టణము - శ్రీగిరి కొండ పైనుండి

ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలను అనుసరించి మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువౌతుంది. శాతవాహనుల తరవాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయలో మోటుపల్లి మరియు వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డి రాజులు మొదట ఒంగోలు సమీపములోని అద్దంకి ని రాజధానిగా పాలించారు. కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు పట్టణాన్ని కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తం చేయబడింది. 1801లో టిప్పూ సుల్తాన్ వద్ద నుండి బ్రిటీషు పాలనలోకి వచ్చింది.[2] ఒంగోలు పట్టణాన్ని మునిసిపాలిటీగా 1876లో వ్యవస్థీకరించారు.[3] ఆంధ్ర కేసరి గా సుప్రసిద్ధులైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి బాల్యం ఒంగోలులోనే గడిచింది.

[మార్చు] ఆర్ధికం

ఒంగోలు గిత్త

ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్థలు రైతుకుటుంబాలచే స్తాపించబడ్డాయి. పొగాకు కంపెనీలు, పంట, వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది. 1970, 80 దశాబ్దాలలో షూ, పెయింట్, మందులకంపెనీ, పివిసి మొదలైన పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ వీటిలో చాలావరకు ఆంధ్ర ప్రదేశ్ లోపల వెలుపల ప్రాతాలలోని పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి. మానవశక్తి, పెట్టుబడులు మరియు విజయవంతంగా నడపటానికి కావలసిన నాయకత్వం కొరతే దీనికి కారణం. ఎనభై(80), తొభైయవ(90)దశాబ్దంలో నూతన సెకండరీ, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆసుపత్రుల స్థాపనలు అధికమైనాయి. ఒంగోలు విద్యాపరంగా అభివృద్దిలో ఉన్న ప్రదేశం. ఎనభైయ్యవ(80) దశకంలో ఒంగోలు పశ్చిమ దిశలో గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూడటంతో వ్యాపార పరంగా సరికొత్త అధ్యాయం మొదలైంది.

[మార్చు] ఆలయాలు

  1. శివాలయం - విష్ణాలయం, ఆంజనేయస్వామి ఆలయం, రాములవారి గుడి, గుర్రము వారి గుడి, మామిడి పాలెం కొండమీద రాముల వారి గుడి, శ్రీగిరి వేంకటేశ్వరాలయం, ఒల్లూరమ్మ గుడి, పంచముఖ ఆంజనేయస్వామి గుడి
  2. మసీదు.
  3. చర్చి.
  4. సిరిడీ సాయిబాబా గుడి సంత పేట, సిరిడీ సాయిబాబా గుడి రింగు రోడ్డు.

[మార్చు] విద్య

  1. పాఠశాలలు.
  • ఆదర్శ పాఠశాల, చైతన్య కాలేజ్, నారాయణా కాలేజ్, శర్మా డిగ్రీ కాలేజ్,

[మార్చు] ఆర్థిక స్థితి

[మార్చు] బ్యాంకులు

ఆంధ్రా బ్యాంక్.బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైస్యా బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్&రూరల్ డెవలప్ మేంట్, ఒంగోల్ కోఆపరేషన్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్, పినాకినీ గ్రామీణ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, విజయ బ్యాంక్, వైశ్యా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ శాఖలున్నాయి.

[మార్చు] రవాణా సౌకర్యాలు

[మార్చు] రహదారి మార్గము

ఒంగోలు బస్ స్టాండు వెనక వైపు

ఒంగోలు పట్టణం చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద నెల్లూరు - గుంటూరు నగరాల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, శ్రీశైలం, విశాఖపట్టణం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు. ఒంగోలుకు తూర్పువైపున ముక్తినూతలపాడు నుంచి పెళ్లూరు వరకు 10 కి.మీ. జాతీయ రహదారి మంజూరైంది.ముక్తినూతలపాడు , ఆగ్రహారం , కొప్పోలు , పెళ్ళూరు పరిసర ప్రాంతాలలో భూముల ధరలు ఒక్కసారిగా మూడు రెట్లు పెరిగాయి.ఒంగోలు పరిసరాలలో నిన్న మొన్నటి వరకు విమానా శ్రయం, కోస్తా కారిడార్ పేరుతో జరిగిన రియల్ వ్యాపారం బైపాస్ రోడ్డు ప్రతిపాదనతో మరింత ఊపందుకుంది. కొత్తపట్నం రోడ్డుకు ఇరువైపుల ఎకరా రూ. 50 లక్షల ఉన్న భూమి ప్రస్తుతం కోటి రూపాయలకు పైన పలుకుతుంది.

[మార్చు] రైలు మార్గము

ఒంగోలు రైలు స్టేషను

ఒంగోలు పట్టణం గూడూరు - విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం, కన్యాకుమారి .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. http://www.hindu.com/2007/10/10/stories/2007101059740300.htm
  2. Handbook of the Madras Presidency By Edward B. Eastwick, John Murray (Firm) పేజీ.329 [1]
  3. Imperial Gazetteer of India. Provincial series - Madras (1908) పేజీ.338 [2]
"http://te.wikipedia.org/w/index.php?title=ఒంగోలు&oldid=713258" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు