అమలాపురం

వికీపీడియా నుండి

  ?అమలాపురం మండలం
తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
తూర్పు గోదావరి జిల్లా పటములో అమలాపురం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో అమలాపురం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము అమలాపురం
జిల్లా(లు) తూర్పు గోదావరి
గ్రామాలు 16
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
134,785 (2001)
• 67636
• 67149
• 79.73
• 85.09
• 74.33



అమలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. గోదావరి నదీ జలముల మధ్య ఏర్పడిన త్రిభుజాకారపు సుందర కోనసీమలో ముఖ్యమైన ప్రదేశము ఈ అమలాపురం.అమలాపురం తూర్పు గోదావరి జిల్లాకాకినాడ కు 65 కి.మి దూరం లో ఉన్నది.

విషయ సూచిక

[మార్చు] అమలాపురం పట్టణ చరిత్ర

అమలాపురం పూర్వనామం అమృతపురి. కాలక్రమేణా అమ్లీపురిగా మార్పు చెందింది. ఈ అమ్లీపురి కాలానుగతంగా అమలాపురంగా మారింది. అమలాపురంలో ఉన్న అమలేశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల వల్ల ఈ ఊరు పంచలింగాపురంగా కూడా పిలవబడేది. కోనసీమలో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ అమలాపురంలోని SKBR కాలేజ్. ఇది సుమారు 60 ఏళ్ళ చరిత్ర కలిగిన కాలేజ్.

అమలాపురంకి చెందిన ప్రముఖులు
  • కళా వెంకట్రావు,
  • GMC బాలయోగి (లోక్ సభ మాజీ స్పీకర్),
  • BSమూర్తి (కేంద్ర మాజీ న్యాయ శాఖా మంత్రి),
  • పలచోళ్ళ వెంకట రంగయ్య నాయుడు (కోనసీమ మొదటి IPS).
  • గొలకోటి నరశింహ మూర్తి (మొదటి MLA)
  • పుత్సా కృష్ణ కామేశ్వర్(గణితగని రచయిత)

[మార్చు] రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు. దగ్గరలో కోటిపల్లి స్టేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధానపట్టణాలైన విజయవాడ, హైదరాబాద్,విశాఖపట్ణం, రాజమండ్రి తదితర పట్టణాలకు బస్సు శౌకర్యం ఉంది. వివిద నగరాలకు దూరం: హైదరాబాద్ - 493 కి.మీ విజయవాడ - 198 కి.మీ విశాఖపట్ణం - 238 కి.మీ దగ్గరలోని రైల్వే స్టేషన్ : రాజమండ్రి, కాకినాడ.

[మార్చు] ప్రసిద్ధ దేవాలయాలు

  • వేంకటేశ్వరస్వామి దేవాలయం,
  • సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం,
  • చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం

[మార్చు] శాసనసభ నియోజకవర్గం

[మార్చు] అమలాపురం పట్టణం నుండి ప్రముఖులు

భారత దేశపు 12వ, 13వ లోక్ సభాపతి పదవులను చేపట్టిన గంటి మోహన చంద్ర బాలయోగి అమలాపురం నియోజకవర్గం నుండే పోటి చేసి గెలుపొందాడు. ఈ ఊరిలో ఉన్నట్టి శ్రీభూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ కృష్ణేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానములు ప్రసిద్ధమైనవి. ఇవియేగాక ఈ పట్టణం లో రెండు సాంకేతిక కళాశాలలు (ఇంజినీరింగ్ కాలేజీలు), ఒక వైద్య కళాశాల (మెడికల్ కాలేజీ) ఉన్నవి.

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు