ఆదోని

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


ఆదోని
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో ఆదోని మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో ఆదోని మండలం యొక్క స్థానము
ఆదోని is located in ఆంధ్ర ప్రదేశ్
ఆదోని
ఆంధ్రప్రదేశ్ పటములో ఆదోని యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°38′N 77°17′E / 15.63°N 77.28°E / 15.63; 77.28
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము ఆదోని
గ్రామాలు 41
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 2,43,247
 - పురుషులు 1,23,252
 - స్త్రీలు 1,19,995
అక్షరాస్యత (2001)
 - మొత్తం 51.25%
 - పురుషులు 62.86%
 - స్త్రీలు 39.35%
పిన్ కోడ్ 518 3xx

ఆదోని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. కర్నూలు జిల్లాలోని వ్యాపార పట్టణము మరియు మున్సిపాలిటీ. ఆదోని రైలుమార్గమున హైదరాబాదు నుండి 225 కి.మీ మరియు మద్రాసు నుండి 494 కి.మీలు దూరములో ఉన్నది. 2005 జనాభా అంచనా ప్రకారం పట్టణ జనాభా 1,64,000. రాష్ట్రములోని అత్యంత పురాతమైన మున్సిపాలిటీలలో ఆదోని ఒకటి. ఆదోని ప్రజల కోరిక మేరకు 1865 మేలో మున్సిపాలిటీగా వ్యవస్థీకరించారు.[1] మధ్యయుగంలో విజయనగర సామ్రాజ్యములో ముఖ్య పట్టణమైన ఆదవోని నేడు వస్త్ర పరిశ్రమలకు పేరుపొందినది. కొండపైన జీర్ణావస్థలో ఉన్న కోట దుర్గం ముస్లింల పాలనలో ప్రభుత్వ కేంద్రముగా ఉన్నది. 18వ శతాబ్దపు ఆంధ్రదేశపు యుద్ధాలలో తరచూ ఆదోని కోట ప్రస్తావన ఉన్నది.[2]

చరిత్ర[మార్చు]

నవాబ్ హాలు
A famous water tank in Adoni town

రాయచూరు అంతర్వేదికి సమీపములో ఉండటం వలన మధ్యయుగపు దక్కన్ చరిత్రలో ఆదోని కీలకపాత్ర పోషించింది. సాంప్రదాయం ప్రకారం ఆదోని క్రీ.పూ.1200లో బీదరు రాజు భీంసింగ్ పాలనలో చంద్ర సేనుడు స్థాపించాడని ప్రతీతి.[3] ఆ తరువాత విజయనగర రాజుల పాలనలో ఉన్నది. 1564లో తళ్ళికోట యుద్ధానంతరం ఆదోని ఆదిల్ షాహీ వంశ పాలకుల చేతిలోకి వచ్చింది. ఆదిల్ షాహీలు వెలుపలి ప్రాకారాలు, దిగువ కోటను నిర్మించి కోటను పటిష్టం చేశారు. అప్పట్లో ఆదోని కోట కేంద్రముగా ఉన్న ఆదోని సీమ ఆదాయము 675,900 పగోడాలు. కోటలో 4వేల మంది ఆశ్వికదళము, 8 వేల సైనికుల పదాతిదళము ఉండేది. 1690లో ఔరంగజేబు యొక్క సేనానులు గట్టి పట్టుతో ఆదోనిపై దాడిచేసి దాన్ని వశపరచుకొని బీజాపూరు సుబాలో భాగంగా మొఘల్ సామ్రాజ్యంలో కలిపారు. దక్షిణాదిపై ఢిల్లీ పట్టుసడలటంలో ఆదోని అసఫ్‌జాహీల రాజ్యంలో భాగమై ఈ కుటుంబము యొక్క చిన్న విభాగము యొక్క సామంతరాజ్యమైంది. ఈ విధంగా 1748లో ముజఫర్ జంగ్ చేతిలో ఉండి 1752లో ఆయన మరణము తర్వాత ఆయన కుమారునికి సంక్రమించింది. 1756లో హైదరాబాదు నిజాం తన సోదరుడైన బసాలత్ జంగ్‌కు ఆదోనిని జాగీరుగా ఇచ్చాడు.[4] బసాలత్ జంగ్ ఆదోనిని రాజధానిగా చేసుకొని స్వతంత్రరాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేశాడు. హైదర్ అలీ రెండుసార్లు ఆదోని కోటను ముట్టడించటానికి విఫలయత్నం చేశాడు. 1758లో ఈ కోట గోడల వద్దే హైదర్ అలీ మారాఠులను ఓడించాడు. ఆ మరు సంవత్సరం చుట్టుపక్కల ప్రాంతలనన్నింటినీ నేలమట్టంచేశాడు కానీ ఆదోని కోట వశం కాలేదు. 1782లో బసాలత్ జంగ్ మరణించాడు. ఆ వెనువెంటనే హైదర్ అలీ కూడా మరణించాడు. 1786లో టిప్పూ సుల్తాన్ నెలరోజులపాటు కోటపై ముట్టడి చేసి వశపరచుకొని కొల్లగొట్టాడు. సంధి జరిగిన తర్వాత ఆదోనిని నిజాంకు తిరిగి ఇచ్చేశాడు. 1799లో నిజాం ఆదోని కోటను ఆంగ్లేయులకు దత్తం చేశాడు.

16వ శతాబ్దములో ఆదోని యాదవుల పాలనలో ఉన్నది. అప్పుడు దీనిపేరు యాదవగిరి. యాదవగిరి ముస్లింల పాలనలో ఆదవోని అయ్యింది. ఆదవోని కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది. బ్రిటీషు పాలనలో ఆదోని మద్రాసు ప్రెసిడెన్సీలోని బళ్ళారి జిల్లాలో భాగంగా ఉండేది. అప్పట్లో దక్షిణాది యొక్క ధాన్యపు మార్కెట్టుగా ప్రసిద్ధి చెందింది. ఆదోని బట్టల మరియు బంగారు మార్కెట్టుకు కూడా పేరొందినది. వందకు పైగా ప్రత్తి మిల్లులు మరియు నూనె మిల్లులతో ప్రత్తివ్యాపారానికి ఆదోనికి ముఖ్యకేంద్రము. ఈ పట్టణానికి రెండో ముంబాయి అని కూడా పేరు.కాని ప్రస్తుతం ఆదోనిలో ఎటువంటి ప్రత్తి మిల్లులు పనిచేయటం లేదు. కాని భీమాస్ వారి ఆయిల్ మిల్లుకు మాత్రం ఇంకా చాలా పేరుంది.ఆ తరువాత జనత మిల్ జిన్ స్టోర్స్ వారు మొదటి సారిగా ఆదోనిలో ఒక మిల్ జిన్ స్టోర్ ఏర్పాటు చేసారు.

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Southern India By Playne Wright Somerset Staff, Somerset Playne, J. W. Bond, Arnold Wright పేజి.738 [1]
  2. The Encyclopædia Britannica: A Dictionary of Arts, Sciences, Literature and General Information By Hugh Chisholm పేజీ.212 [2]
  3. The Imperial Gazetteer of India By William Wilson Hunter పేజీ.26-27
  4. Imperial Gazetteer of India, Provincial series - Madras (1908) పేజీ.453 [3]

బయటి లింకులు[మార్చు]

గ్యాలరీ[మార్చు]"http://te.wikipedia.org/w/index.php?title=ఆదోని&oldid=1338105" నుండి వెలికితీశారు