బొబ్బిలి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ?బొబ్బిలి మండలం విజయనగరం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | బొబ్బిలి |
| జిల్లా(లు) | విజయనగరం |
| గ్రామాలు | 38 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,16,213 (2001) • 57910 • 58303 • 58.44 • 70.75 • 46.35 |
'బొబ్బిలి (ఆంగ్లం: Bobbili)', ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాలోని ఒక పట్టణం, అదే పేరుతో గల ఒక మండలానికి కేంద్రం. ఉత్కృష్టమైన చరిత్ర కలిగిన పట్టణమిది. పరాసు ప్రభువుల (ఫ్రెంచి) పాలనలో ఒక సంస్థానంగా ఉన్న బొబ్బిలికి పొరుగు రాజ్యం విజయనగరం తో శతృత్వం ఉండేది. ఈ శతృత్వం ముదిరి బొబ్బిలికీ, పరాసు, విజయనగర సంయుక్త సైన్యానికి మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ద్ధంలో జరిగిన మారణకాండ, బొబ్బిలి వీరుల వీరమరణాలు, బొబ్బిలి స్త్రీల ఆత్మాహుతి మొదలైనవి బొబ్బిలి కథకు ఒక వీరోచిత జానపద గాథ స్థాయి కల్పించాయి. బొబ్బిలి ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గం.
విషయ సూచిక |
బ్రిటిషు వారి కాలంలో బొబ్బిలి గణాంకాలు [మార్చు]
బ్రిటిషు వారి ఇంపీరియల్ గెజెట్ ప్రకారం బొబ్బిలి వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి అప్పటి విజాగపటం జిల్లాలో ఉండేది. 1901లో దీని జానాభా 17,387. బొబ్బిలి రాజా వారి సంస్థానం 227 చ.మై. విస్తీర్ణంలో ఉండేది. ఆదాయం - రూ 40,000. అందులో భూమి శిస్తు: రూ 9,000.
చరిత్ర [మార్చు]
జనవరి 24, 1757లో బుస్సీ బొబ్బిలిపై చేసిన దాడి భారత చరిత్రలో ఒక మరపురాని ఘట్టం. బొబ్బిలికి, పొరుగున ఉన్న విజయనగరానికి మధ్య నిరంతర శతృత్వం ఉండేది. విజయనగర రాజు బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలిపై దాడి చేసాడు. బొబ్బిలి పురుషులు వీరమరణం చెందగా, స్త్రీలు ఆత్మ త్యాగం చేసారు. యుద్ధం ముగిసాక, వీజయరామరాజు తన గుడారంలో నిదుర పోతుండగా, బొబ్బిలి రాజు బావమరిది యైన తాండ్ర పాపారాయుడు అతడిని హతమార్చాడు.
బొబ్బిలి రాజు రంగారాయుని కుమారుడు, పసి బాలుడు చిన్న రంగారావు బుస్సీకి చిక్కాడు. ఆ బాలుడినే బొబ్బిలి రాజుగా బుస్సీ పట్టాభిషేకం చేసాడు. అయితే అతని పసితనాన్ని అవకాశంగా తీసుకుని బంధువులు రాజ్య పీఠాన్ని ఆక్రమించుకున్నారు. విజయనగరం రాజుతో సంధి కుదిరినా అది తాత్కాలికమే అయింది. ఇద్దరి మధ్యా మళ్ళీ ఘర్షణలు మొదలై బొబ్బిలి రాజు పారిపోయి నిజాము రాజ్యంలో తలదాచుకున్నాడు. 1794 లో బ్రిటిషు వారు చిన్న రంగారావును మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టారు.
1801 లో ఆయన కుమారుడితో బ్రిటిషువారు శాశ్వత సంధి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజా అనే బిరుదును వంశపారంపర్య చిహ్నంగా గుర్తించారు. మహారాజ బిరుదును చిన్న రంగారావు ముని మనుమడైన సర్ వేంకటాచలపతి రంగారావు కు వ్యక్తిగత హోదాగా సమర్పించారు.
బొబ్బిలి రాజుల వంశక్రమం [మార్చు]
- రాజా నిర్వాణ రాయడప్ప - 1652
- రాజా లింగప్ప
- రాజా వేంగళరాయ రంగారావు
- రాజా రంగపతి రంగారావు
- రాజా రాయడప్ప రంగారావు
- రాజా గోపాలకృష్ణ రంగారావు
- రాజా గోపాల వెంకటరంగారావు
- రాజా వెంకట రంగారావు
- రాజా సీతా చలపతి రంగారావు
- రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు
- రాజా వేంకట శ్వేతాచలపతి రంగారావు
- రాజా కుమారకృష్ణ రంగారావు
- రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు
- రాజా వేంకట గోపాల కృష్ణ రంగారావు
- రాజా వెంకట సుజయ కృష్ణ రంగారావు ప్రస్తుతం యం.ఏల్.ఏ. బొబ్బిలి నియోజకవర్గం
- రాజా రామ కృష్ణ రంగారావు
- రాజా వెంకట శ్వేతాచలపతి కుమార కృష్ణ రంగారావు మాజీ మున్సిపల్ ఛైర్ పర్స్ న్ బొబ్బిలి మువ్సిపాలిటి
- రాజా విశాల్ గోపాల కృష్ణ రంగారావు.
లోక్‌సభ నియోజక వర్గం [మార్చు]
- పూర్తి వ్యాసం కోసం బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం చూడండి.
- భారత పార్లమెంట్ లో బొబ్బిలి ఒక లోక్‌సభ నియోజకవర్గం. ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ లక్ష్మి.
బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం [మార్చు]
బొబ్బిలి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 1951 సంవత్సరం నుండి ఒక నియోజకవర్గంగా ఏర్పడి శాసనసభ్యుల్ని ఎన్నుకొంటుంది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి మరియు తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో చేర్చారు.
విద్యాసంస్థలు [మార్చు]
- సంస్థానం ఉన్నత పాఠశాల (1864).
- రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు కళాశాల (1962).
- రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు కళాశాల, ఎమ్.సి.ఏ. సెంటర్ (1999)
- గోకుల్ ఇంజనీరింగ్ కళాశాల
- తాండ్రపాపారాయ ఇంజనీరింగ్ కళాశాల
- అభ్యుదయ కాన్వెంట్
- శ్వేత చలపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్
మండలంలోని పట్టణాలు [మార్చు]
- బొబ్బిలి (m)
మండలంలోని గ్రామాలు [మార్చు]
- నిమ్మలపాడు
- వెలగవలస (దరి) అడ్డుమండ
- గోపాలరాయుడుపేట
- రాజుపేట
- సీతయ్యపేట
- జనార్ధన రంగరాయపురం @ కింతలవానిపేట
- లింగంవలస
- కోమటిపల్లి (దరి) బొబ్బిలి
- కలవరాయి అగ్రహారం
- వాకాడవలస
- చింతాడ
- పక్కి
- రాముడువలస
- శివడవలస
- కొండదేవుపల్లి
- కమ్మవలస
- ముత్తావలస
- పిరిడి
- కృష్ణాపురం
- జగన్నాధపురం (దరి) బొబ్బిలి
- పాత బొబ్బిలి (గ్రామీణ)
- చిత్రకోట బొడ్డవలస
- దొంగురువలస
- కసిదొరవలస
- నారాయణప్పవలస
- పరఢి
- బంకురువలస
- భోజరాజపురం
- గొర్లి సీతారాంపురం
- మెట్టవలస
- పణుకువలస (దరి) మెట్టవలస
- గున్నతోటవలస
- బుర్జావలస (దరి) మెట్టవలస
- పెంట
- రంగరాయపురం
- జనార్ధన రంగరాయపురం @ కునుకువానివలస
- అలజంగి
- కారాడ
- గొగడ వలస
ఇవి కూడా చూడండి [మార్చు]
- బొబ్బిలి యుద్ధం, తెలుగు సినిమా.
బయటి లింకులు [మార్చు]
- బొబ్బిలి జమిందారి
- బ్రిటానికా ఎన్సైక్లోపీడియా నుండి బొబ్బిలి గూర్చి
- బొబ్బిలి కోట, రాజులు, ఇతర ఫోటోలు
|
||||||||||||||||||||||||||
విజయనగరం జిల్లా మండలాలు
కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బలిజిపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బాడంగి | తెర్లాం | మెరకముడిదాం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొండపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | డెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస
