విజయనగరం జిల్లా

వికీపీడియా నుండి
  ?విజయనగరం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of విజయనగరం జిల్లా, India
అక్షాంశరేఖాంశాలు: 18°07′N 83°25′E / 18.12, 83.42
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 6,539 కి.మీ² (2,525 చ.మై)
ముఖ్య పట్టణము విజయనగరం
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
23,42,868 (2011)
• 358/కి.మీ² (927/చ.మై)
• 1161913
• 1180955
• 51.82(2001)
• 63.0
• 40.73

విజయనగరం జిల్లా భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్యాన ఉన్నది. విజయనగరం జిల్లాకు ముఖ్యపట్టణం విజయనగరం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. ఈ జిల్లా 1979 జూన్ 1 తేదీన ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం బంగాళా ఖాతము నుండి 18 కి.మీ.ల దూరములో, విశాఖపట్నం నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉన్నది. 2001 జనాభా లెక్కల ప్రకారము విజయనగరం జిల్లా యొక్క జనాభా 22,45,100. ఈ జిల్లా సరిహద్దులు శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాలు, ఒరిస్సా రాష్ట్రం మరియు బంగాళా ఖాతము.

విషయ సూచిక

[మార్చు] జిల్లా చరిత్ర

ప్రధాన వ్యాసం: విజయనగరం పూర్వ చరిత్ర

క్రీస్తు శకం 15 వ శతాబ్దం వరకూ కళింగ దేశం మీద ఎందరెందరో దండయాత్రలు చేసినా...ఇక్కడి భాషా సంస్కృతులు మారలేదు. గోదావరి నదికి అవతలి వారిని తెలుగువారని, ఇవతలి వారిని కళింగులని కొందరు భావించారు. ఒరిస్సా రాష్ట్రం సరిహద్దుగా ఉండడం వల్ల ఆ సంస్కృతి కొంత ఆంధ్రుల మీదా పడుతోంది. తెలంగాణా, రాయలసీమల లానే...కళింగం కూడా సమగ్రాంధ్రలో ఒక ప్రాంతం. ఒకప్పుడు ఇది చాలా వెనుక బడి ఉండేది. అందుచేత సంస్కృతాంధ్ర భాషాప్రభావం తక్కువ గానే ఉండేది. దీర్ఘతమసుడు అనే ఆయన అంగవంగ కళింగాలని ఏక దేశంగా చేసుకొని పాలించాడని మహా భారతం లో చెప్పబడింది. కళింగ దేశం లో ఏనుగులు ఎక్కువని అందుకే ఇక్కడి రాజులకి "గజపతులు" అని పేరు వచ్చిందని అర్ధశాస్త్రం లో ఉంది. విదేశీ చరిత్రకారులు ప్లీనీ, మెగస్తనీస్, హుయన్ చాంగ్ లు కళింగ దేశ నాగరికత గురించి రాశారు. కళింగ భూములు ఎంతో సారవంతమయినవని...బెల్లంకొండ నుంచి పాలకొండ వరకూ ఎన్నో కొండలున్నాయని ప్లీనీ రాశాడు. అక్కడి ప్రజలు మోటు వారయినా న్యాయం తప్పని వారని హుయాన్ చాంగ్ రాశాడు. క్రీస్తు పూర్వం తరవాత గంగరాజులు ఈ దేశాన్ని పాలించారు. బౌద్ద, జైన మతాలు ఎక్కువ ప్రాభవం పొందాయి. సాలి హుండం మొదలు కొని జామి వరకూ బౌద్దులూ జైనులూ నివశించారనడానికి ఆధారాలున్నాయి. అశోకుని సైతం అహింసావాదిగా మార్చిన అమృత సీమ ఈ కళింగసీమ అంటారు. ప్రస్తుత విజయనగరం జిల్లా పూర్వం శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో కలసి వుండేది. క్రీ.పూ. 4వ శతాబ్దం నాటికే గోదావరి మహానదుల మధ్య భాగాన్ని అంటే కటకం నుంచి పిటాపురం వరకూ ఉన్న ప్రాంతాన్ని కళింగదేశం అన్నారు.

[మార్చు] భౌగోళిక స్వరూపం

[మార్చు] వాతావరణం

Climate data for విజయనగరం
Month Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec Year
Average high °C (°F) 38.7
(101.7)
31.3
(88.3)
36.2
(97.2)
37.2
(99)
37.0
(98.6)
35.1
(95.2)
32.9
(91.2)
32.8
(91)
33.3
(91.9)
31.9
(89.4)
30.2
(86.4)
29.8
(85.6)
33.87
(92.97)
Average low °C (°F) 17.2
(63)
19.1
(66.4)
23.2
(73.8)
26.1
(79)
27.0
(80.6)
26.8
(80.2)
25.7
(78.3)
26.3
(79.3)
25.7
(78.3)
22.8
(73)
19.5
(67.1)
17.1
(62.8)
23.04
(73.47)

మూస:Infobox weather/line/date

Source: [1]

[మార్చు] ఆర్ధిక స్థితి గతులు

[మార్చు] పరిశ్రమలు

FACOR main unit of Ferro-alloy production unit.

ఈ జిల్లాలోని ప్రారిశ్రామిక అభివృద్ధి ప్రధానంగా వ్యవసాయ పంటల మీద ఆధారపడినది. వీనిలో నార మిల్లులు, చక్కెర కర్మాగారాలు, ధాన్యం మరియు నూనె మిల్లులు మరియు పెంకుల తయారీ ముఖ్యమైనవి. ఇక్కడి ఖనిజాల్ని ఫేకర్ మరియు ఇతర పరిశ్రమలు వినియోగిస్తున్నాయి. ఈ జిల్లాలో సుమారు 520 కర్మాగారాలు నమోదు చేయబడి ఇంచుమించు 27,800 కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.

[మార్చు] డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

భౌగోళికంగా విజయనగరం జిల్లాను 34 రెవిన్యూ మండలములుగా విభజించినారు.[8]

విజయనగరం జిల్లా మండలాలు 1 కొమరాడ 13 రామభద్రపురం 25 పూసపాటిరేగ
2 గుమ్మలక్ష్మీపురం 14 బాడంగి 26 భోగాపురం
3 కురుపాం 15 తెర్లాం 27 డెంకాడ
4 జియ్యమ్మవలస 16 మెరకముడిదాం 28 విజయనగరం మండలం
5 గరుగుబిల్లి 17 దత్తిరాజేరు 29 గంట్యాడ
6 పార్వతీపురం 18 మెంటాడ 30 శృంగవరపుకోట
7 మక్కువ 19 గజపతినగరం 31 వేపాడ
8 సీతానగరం 20 బొండపల్లి 32 లక్కవరపుకోట
9 బలిజిపేట 21 గుర్ల 33 జామి
10 బొబ్బిలి 22 గరివిడి 34 కొత్తవలస
11 సాలూరు 23 చీపురుపల్లి
12 పాచిపెంట 24 నెల్లిమర్ల

[మార్చు] రవాణా వ్వవస్థ

[మార్చు] జనాభా లెక్కలు

2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లా జనాభా 2,342,868,[9] ఇది లాట్వియా (Latvia) దేశ జనాభాకి మరియు అమెరికాలో న్యూ మెక్సికో (New Mexico)[10] రాష్ట్ర జనాభాకి సమానం [11] ఇది భారతదేశంలో జనాభా ప్రకారం 193వ స్థానం ఆక్రమించింది (640 జిల్లాలలో).[9] ఇక్కడ జనాభా సాంధ్రత >

మూస:Convert/PD/sqkmమూస:Convert/test/A .[9] జనాభా వృద్ధి రేటు (2001-2011) 4.16 %.[9] విజయనగరం లో 1000 మంది పురుషులకు 1016 మహిళలు ఉన్నారు,[9] మరియు అక్షరాస్యత రేటు 59.49 %.[9]

ఈ జిల్లా జనాభా 1901 లెక్కల ప్రకారం 9,58,778. ఇది శతాబ్ద కాలంలో 2001 సంవత్సరానికి 22,49,254 చేరుకుంది.[12] వీరిలో 11,19,541 మంది పురుషులు మరియు 11,29,713 మహిళలు. ఇక్కడ 1000 మంది పురుషులకు 1009 స్త్రీలు ఉన్నారు. ఈ జిల్లా మొత్తం 6,539 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. జనాభా సాంధ్రత 344 persons per km². చివరి దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి 6.55 శాతం.

ఈ జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 2,38,023 మరియు షెడ్యూల్డ్ తెగలు జనాభా 2,14,839. ఇది జిల్లా మొత్తం జనాభాలో 10.58 % మరియు 9.55 %.

ఈ జిల్లా ప్రజలలో 18.37 లక్షల మంది అనగా 82 % పల్లెల్లో నివసించగా 4.12 లక్షల మంది అనగా 18 % పట్టణాలలో నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 12 పట్టణాలు ఉన్నాయి. అవి: విజయనగరం, చీపురుపల్లి, గాజులరేగ, కనపాక, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, శ్రీరాంనగర్, నెల్లిమర్ల, కొత్తవలస, చింతలవలస, జరజాపుపేట మరియు గజపతినగరం. ఈ జిల్లాలోని ఒకే ఒక్క మొదటి తరగతి పట్టణం విజయనగరం లో 1,95,801 మంది జీవిస్తున్నారు.

[మార్చు] సంస్కృతి

విజయనగరం జిల్లా ప్రజల సాంఘిక కట్టుబాట్లు చిన్న తేడాలతో దక్షిణ భారతీయ పద్ధతిలో ఉంటాయి. ఇక్కడి ప్రజలు మృదు స్వభావం, జాలిగలిగి, గట్టి కుటుంబ వ్యవస్థను కలిగివుంటారు. గురజాడ అప్పారావు గారి నవలలు, నాటకాలు, గీతాలు మరియు కథలు ఈ ప్రాంత భాష మరియు సంస్కృతులను ప్రతిబింబిస్తాయి.

ఈ ప్రాంతంలో ప్రధానమైనది హిందూ మతం. వీరు జరుపుకునే పండుగలలో సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి, మహాశివరాత్రి, దీపావళి, వినాయక చవితి, దసరా మరియు విజయదశమి ముఖ్యమైనవి. శ్రీరామ నవమి, వినాయక చవితి మరియు దసరా ఉత్సవాలలో భాగంలో జరిగే నవరాత్రోత్సవాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఆ తొమ్మిది రోజులు నాటకాలు, హరికథలు, బుర్రకథలు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్న పట్టణాలు కళకలలాడుతాయి. ఇక్కడి గ్రామదేవత పండుగలు బాగా ప్రసిద్ధిచెందాయి. వీటన్నింటిలోకి విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి పండుగ ప్రధానమైనది కాగా శంబర పోలమ్మ జాతర, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాలలో జరుగుతాయి.

వీరి ప్రధాన ఆహారంలో అన్నం తో కలిపి పప్పు, రసం లేదా సాంబార్, కూరలు, ఆవకాయ మదియు పెరుగుతో పరిపూర్ణంగా ఉంటుంది.

[మార్చు] పశుపక్ష్యాదులు

అరణ్యాలు ఈ జిల్లా ఆర్ధిక వ్యవస్థకు చాలా ప్రధానపాత్ర పోషిస్తుంది. జిల్లాలోని అరణ్యాల రకాలు: 1.Southern tropical mixed deciduous forests, 2.Northern tropical dry deciduous forests, 3.Southern tropical dry mixed deciduous forests, 4.Dry deciduous green forests and 5.Dry evergreen forests.

దట్టమైన కొండ ప్రాంతాలలో జంతుజాలం నివసిస్తూ; కొన్ని జాతులు అంతరించిపోవడానికి దగ్గరగా వున్నాయి. దీనికి ప్రధాన కారణాలు అరణ్యాలను నరకడం మరియు అదుపులేని వేట. ఇక్కడి ప్రధానమైన జంతువులు గబ్బిలాలు, ఎలుగుబంట్లు, అడవి దున్న, నక్క, హైనా, తోడేలు, ముంగిస మొదలైనవి. ఇక్కడి పక్షులలో పావురాలు, కాకి, పిచ్చుక మైనా మొ. ముఖ్యమైనవి.

[మార్చు] విద్యాసంస్థలు

విజయనగరం జిల్లా విద్యావంతుల పరంగా వెనుకబడినది. అక్షరాస్యత రేటు 51.82 % రాష్ట్ర సరాసరి 61.55 % కన్నా బాగా తక్కువ.

ఈ జిల్లాలో 2379 ప్రాథమిక పాఠశాలలు, 462 అప్పర్ ప్రాథమిక పాఠశాలలు మరియు 341 ఉన్నత పాఠశాలలు (2004-2005 అంచనాల ప్రకారం) ఉన్నాయి. అదే ఉన్నత విద్యలో 81 జూనియర్ మరియు 33 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ 14 పారిశ్రామిక శిక్షణా సంస్థలు మరియు 2 పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. అదే 9 బి.ఇడి. కళాశాలు మరియు ఒక ఎమ్.ఎడి. కళాశాల, ఒక సంస్కృత కళాశాల, ఒక సంగీత నృత్య కళాశాలలు కూడా ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రింద ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, 5 ఇంజినీరింగ్ కళాశాలలు, 2 న్యాయ కళాశాలలు మరియు ఒక వైద్య కళాశాల ఈ జిల్లాలో స్థాపించబడ్డాయి.

ఈ జిల్లాలో 38 గ్రంధాలయ శాఖలు ఉన్నాయి. వీటిని జిల్లా గ్రంధాలయ సంస్థ నిర్వహిస్తున్నది. ఇది ప్రతి మండలంలో 1-2 చొప్పున ఉన్నాయి.

  • అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, భోగాపురం.[13]
  • గోకుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బొబ్బిలి.
  • కోడి రామమూర్తి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, బొబ్బిలి.[14]
  • మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల.
  • మహారాజా సంస్కృత కళాశాల.
  • మహారాజా విజయరామ గజపతి రాజు న్యాయ కళాశాల, విజయనగరం.
  • మహారాజా పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, విజయనగరం.
  • మహారాజా విజయరామ గజపతి రాజు ఇంజినీరింగ్ కళాశాల, విజయనగరం.[15]
  • మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నెలిమర్ల.
  • సెయింట్ తెరిస్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గరివిడి.[16]
  • తాండ్ర పాపారాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బొబ్బిలి.[17]
  • శ్రీనివాస జూనియర్ మరియు డిగ్రీ కళాశాల, విజయనగరం
  • గాయత్రీ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల, విజయనగరం
  • మహారాజా కళాశాల, విజయనగరం

[మార్చు] ఆకర్షణలు

విజయనగరం కోట

[మార్చు] క్రీడలు

విజయనగరం యువరాజు పూసపాటి విజయానంద గజపతి రాజు క్రికెట్ ఆటలో సర్ విజ్జీ గా ప్రసిద్ధిచెందారు. విజ్జీ ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా విదేశాలు పర్యటించాడు. ఆ తర్వాత నిర్మాహకుడు మరియు వ్యాఖ్యాతగా పనిచేశాడు. పిదప ఇతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. న్యూఢిల్లీ లోని ఫిరోజ్ షా కొట్లా మైదానం నిర్మాణం కోసం భారీగా విరాళం ఇచ్చిన గొప్ప దాత.

ఇతని స్మారకార్ధం విజయనగరం పట్టణంలో విజ్జీ స్టేడియం నిర్మించబడినది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని మొదటి తరగతి క్రికెట్ ఆడే క్రీడా ప్రాంగణం.

[మార్చు] ప్రముఖవ్యక్తులు

మహాకవి గురజాడ అప్పారావు
  • పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు (1893 - 1964) ఒక గొప్ప వయొలిన్ (వాయులీనం) విద్వాంసుడు. మరియు సంగీత కళానిధి.
  • చెలికాని అన్నారావు (1908 - ?) తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి. వీరు జిల్లాలోని బొబ్బిలి రాజవంశంలో జన్మించారు.
  • సుప్రసిద్ద తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు (1922 - 1974) గారు సంగీతం నేర్చుకున్నది విజయనగరం లొనే.
  • సాలూరి రాజేశ్వరరావు (1922 - 1999) : తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు.
  • సుప్రసిద్ద తెలుగు గాయకురాలు పి. సుశీల గారి జన్మస్థలం. 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో 25 వేలకు పైగా సినిమా పాటలు పాడిన విదుషీమణి.
  • కలియుగ భీమ గా పిలువబడే కోడి రామమూర్తి నాయుడు జన్మ స్థలం.
  • విజయనగరం యువరాజు పూసపాటి విజయానంద గజపతి రాజు క్రికెట్ ఆటలో సర్ విజ్జీ గా ప్రసిద్ధిచెందారు. విజ్జీ ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ కు కెప్టెన్ గా విదేశాలు పర్యటించాడు. ఆ తర్వాత నిర్మాహకుడు మరియు వ్యాఖ్యాతగా పనిచేశాడు. పిదప ఇతడు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు. న్యూఢిల్లీ లోని ఫిరోజ్ షా కొట్లా మైదానం నిర్మాణం కోసం భారీగా విరాళం ఇచ్చిన గొప్ప దాత. ఇతని స్మారకార్ధం విజయనగరం పట్టణంలో విజ్జీ స్టేడియం నిర్మించబడినది.

[మార్చు] పూసపాటి వంశం

  • పూసపాటి అమల రాజు (స్థాపకుడు)
  • పూసపాటి రాచి రాజు
  • పూసపాటి తమ్మ భూపాలుడు (1620-1670)
  • పూసపాటి పెద విజయరామ రాజు (1670-1756)
  • పూసపాటి చిన విజయరామ రాజు (1760-1794)
  • పూసపాటి విజయరామ గజపతి రాజు (1826-1879)
  • పూసపాటి ఆనంద గజపతి రాజు (1879-1897)
  • పూసపాటి విజయరామ గజపతి రాజు (1883-1902)
  • పూసపాటి అలక నారాయణ గజపతి రాజు (1902-1937)
  • పూసపాటి విజయరామ గజపతి రాజు (1945-1995)
  • పూసపాటి ఆనంద గజపతి రాజు (1950- )
  • పూసపాటి అశోక గజపతి రాజు (1951- )
  • పూసపాటి కార్తికేయ విజయవంశీరామ రాజు (1983- )

[మార్చు] నియోజకవర్గాలు

నియోజక వర్గ పునర్విభజనలో విజయనగరం జిల్లాలొని పార్లమెంట్ నియోజక వర్గాలు రెండు నుండి ఒకటికి తగ్గిపోయాయి.

[మార్చు] లోక్‌సభ నియోజకవర్గాలు

[మార్చు] శాసనసభ నియోజకవర్గాలు:

నియోజక వర్గ పునర్విభజనలో విజయనగరం జిల్లాలొని అసెంబ్లీ నియోజక వర్గాలు 14 నుండి తొమ్మిదికి తగ్గిపోయాయి.

ఉత్తరపల్లి, నాగూరు, నెల్లిమర్ల, తెర్లాం మరియు సతివాడ (2009 నుంచి నియొజక వర్గ హోదా కోల్పోయాయి)

[మార్చు] జిల్లా కలెక్టర్లు

ఇది విజయనగరం జిల్లా కలెక్టర్ల జాబితా:

కలక్టరు పేరు From To
ఎస్. పి. కె. నాయిడు 1 జూన్ 1979 15 జూన్ 1979
ఎమ్. సి. మహాపాత్ర 16 జూన్ 1979 23 జూన్ 1979
ఎ. కె. ఝా 27 జూలై 1979 21 సెప్టెంబర్ 1979
పి. వి. బేడీ 22 సెప్టెంబర్ 1979 19 ఏప్రిల్ 1981
పాల్ భూమన్ 20 ఏప్రిల్ 1981 9 ఏప్రిల్ 1983
వి. శర్మా రావు 10 ఏప్రిల్ 1983 28 మార్చి 1987
జి. సుధీర్ 11 మే 1987 26 అక్టోబర్ 1987
ఎమ్. వి. ఎస్. ప్రసాద్ 27 నవంబర్ 1987 31 జనవరి 1989
ఎమ్. ఎస్. ప్రసాద్ 27 ఫిబ్రవరి 1989 5 డిసెంబర్ 1989
జె. ఆర్. ఆనంద్ 18 జనవరి 1990 3 జనవరి 1991
టి. రాధ 4 జనవరి 1991 3 డిసెంబర్ 1992
వి. నాగిరెడ్డి 4 డిసెంబర్ 1992 11 జనవరి 1995
టి. విజయ కుమార్ 11 జనవరి 1995 31 జూలై 1996
కె. ఆర్. డబ్లూ. యేసుదాస్ 1 ఆగష్టు 1996 23 మే 1997
పూనం మాలకొండయ్య 23 మే 1997 12 నవంబర్ 1999
కె. మంగపతి రావు 12 నవంబర్ 1999 12 జూలై 2000
హర్ ప్రీత్ సింగ్ 12 జూలై 2000 24 అక్టోబర్ 2002
రజిత్ కుమార్ 25 అక్టోబర్ 2002 17 నవంబర్ 2004
బి. వెంకటేశ్వరరావు 17 నవంబర్ 2004 12 మే 2006
డా. ఎమ్. జగన్ మోహన్ రావు 13 మే 2006 18 మే 2006
డా. బి. కిషోర్ 19 మే 2006 2008
రామ్ నారాయణ్ రెడ్డి 30 జూన్ 2010
ఎమ్. వీరబ్రహ్మయ్య 7 జూలై 2010 ప్రస్తుతం

[మార్చు] కొన్ని విశేషాలు

  • రెవెన్యూ విభాగాలు (2): విజయనగరం, పార్వతీపురం
  • నదులు: గోస్తని, చంపావతి, నాగావళి, గోముఖనది, సువర్ణముఖీ, వేగావతి. నాగావళిని దిగువ ప్రాంతాల్లో లాంగుల్య నది అని వ్యవహరిస్తారు.
  • ఆంధ్రుల పౌరుషాన్ని చాటిచెప్పిన బొబ్బిలి యుద్ధం జరిగిన జిల్లా.

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది


[మార్చు] వనరులు

[మార్చు] మూలాలు

  1. Handbook of Statistics, Vizianagaram district, 2004-2005, compiled and published by The Chief Planning Officer, Vizianagaram
  2. sQuareindia Advisory Pvt. Ltd.
  3. Sri Padma Infoway
  4. FACOR group
  5. Jindal Steel plants
  6. Andhra Ferro Alloys
  7. Matrix Laboratories
  8. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో విజయనగరం జిల్లా తాలూకాల వివరాలు. జూలై 28, 2007న సేకరించారు.
  9. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; districtcensus అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. 2010 Resident Population Data. U. S. Census Bureau. తీసుకొన్న తేదీ: 2011-09-30. “New Mexico - 2,059,179”
  11. US Directorate of Intelligence. Country Comparison:Population. తీసుకొన్న తేదీ: 2011-10-01. “Latvia 2,204,708 July 2011 est.”
  12. Census GIS India
  13. Avanthi Engineering College.Cherukupally
  14. Rama Murthy College of Physical Education
  15. M.V.G.R.College of Engineering
  16. St. Theressa Institute of Engineering and Technology
  17. Thandra Paparaya Institute of Science and Technology
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు