అశోక చక్రవర్తి (హిందీ: अशोक) (Ashoka The Great); (క్రీ.పూ.304–క్రీ.పూ.232) (రాచరిక ముకుటము: "దేవానాంపియ పియదస్సీ'" అనగా "దేవతల ప్రీతిపాత్రుడు మరియు చూపులకు అందమైనవాడు")
క్రీ.పూ.273 నుండి క్రీ.పూ.232 వరకు మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ మరియు అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. కళింగ యుద్ధం తరువాత శాంతి కాముకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లే వారనే చరిత్ర చెపుతోంది.
[మార్చు] చారిత్రక మూలాలు
అశోకుడి గురించిన చాలా సమాచారం ప్రధానంగా కొద్దిపాటి బౌద్ధమతానికి సంభందించిన మూలాల నుంచి లభ్యమైనదే. ప్రత్యేకించి 2వ శతాబ్దంలో సంస్కృతంలో రాయబడిన అశోకవదనం, మరియు పాళీ భాషలో రాయబడిన దీప వంశం, మహావంశం అనే శ్రీలంక కు చెందిన గ్రంథాలలో ఇప్పుటి వరకు అశోకుని గురించి తెలిసిన సమాచారం అందుబాటులో ఉంది. మిగతా సమాచారం అశోకుడు రాయించిన శాసనాల నుండి లభ్యమవుతున్నది.
[మార్చు] మరణం, వారసత్వం
అశోకుడు దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలించినట్లుగా అంచనా వేస్తున్నారు. అశోకుడు మరణించిన తరువాత మౌర్య వంశం సుమారు యాభై సంవత్సరాల వరకు అలాగే ఉంది. అశోకుడికి చాలా మంది భార్యాపిల్లలు ఉండేవారు అయితే వారి సంఖ్య, పేర్లు మొదలగునవి కాలగర్భంలో కలిసిపోయాయి. మహీంద్రడు, సంఘమిత్ర అనే కవలలు ఆయన నాలుగవ భార్యయైన దేవికి ఉజ్జయినీ నగరంలో జన్మించారు. వీరిని బౌద్ధమత వ్యాప్తికై అశోకుడే ప్రపంచ దేశాటనకు పంపించి వేశాడు. వీరు శ్రీలంక కు వెళ్ళి అక్కడి రాజును, రాణిని మరియు ప్రజలను బౌద్ధమతంలోకి మార్చారు. కాబట్టి వీరు ఖచ్చితంగా అశోకుడు తర్వాత రాజ్యపాలన చేపట్టి ఉండకపోవచ్చు.
[మార్చు] బయటి లింకులు
భారతదేశానికి సంబంధించిన విషయాలు  |
|
| చరిత్ర |
భారతీయ చరిత్ర కాలసూచిక, సింధు లోయ నాగరికత, మేలుహ్హా, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం, భారతదేశంలో గ్రీకుల దండయాత్రలు, మౌర్య వంశం, అశోకుడు, శుంగ వంశం, శాతవాహనులు, ఇండో గ్రీకు సామ్రాజ్యం, ఇండో స్కిథియనులు, ఇండో పార్థియన్ సామ్రాజ్యం, కుషాణు సామ్రాజ్యం, పశ్చిమ క్షాత్రపులు, గుప్త సామ్రాజ్యం, పాల సామ్రాజ్యం, భారతదేశంలో ఇస్లాం, భారత్లో ఇస్లాం సామ్రాజ్యాలు, మొగలు యుగం, మరాఠా సామ్రాజ్యం, బ్రిటిషు రాజ్, బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ, భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయి, ప్రథమ భారత స్వాతంత్ర్య సమరం, భారత స్వాతంత్ర్య సమరం, క్విట్ ఇండియా ఉద్యమం, భారత విభజన, అలీనోద్యమం, చైనా భారత యుద్ధం, భారత్ పాక్ యుద్ధం 1947, భారత్ పాక్ యుద్ధం 1965, భారత్ పాక్ యుద్ధం 1971, కార్గిల్ యుద్ధం, భారత సైన్యం, భారత జనాభా వివరాలు, భారతీయ తపాల చరిత్ర
|
|
| రాజకీయాలు |
|
|
| ప్రభుత్వం |
భారత ప్రభుత్వ ఏజన్సీలు, శాసన విభాగం ( లోక్ సభ, రాజ్య సభ) కార్య నిర్వాహక విభాగం ( రాష్ట్రపతి & ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత మంత్రివర్గం, భారత అటార్నీ జనరల్, భారత ఎన్నికల కమిషను, భారత విదేశీ వ్యవహారాల మంత్రి; భారత్లో చట్టాల అమలు: సి.బి.ఐ, సి.ఐ.డి, భారత నిఘా సంస్థలు: ఐ.బి, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, న్యాయ విభాగం : ( సుప్రీం కోర్టు), భారత రక్షణ దళాలు ( భారత సైనిక దళం, భారత నావికా దళం, భారత వైమానిక దళం, సరిహదు భద్రతా దళం, భారత తీరరక్షక దళం)
|
|
| భౌగోళిక స్వరూపం |
హిమాలయాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, గంగా మైదానము, దక్కను పీఠభూమి, థార్ ఎడారి, గంగ, కచ్, బ్రహ్మపుత్ర, ఈశాన్య భారతం; భారత్ పర్వతాల జాబితా, భారత లోయల జాబితా, భారత ద్వీపాల జాబితా, భారత నదుల జాబితా; భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, భారత నగరాలు, పట్టణాల జాబితా, భారతదేశ జిల్లాల జాబితా, భారత ప్రాంతాల జాబితా
|
|
| ఆర్ధికం |
|
|
| జనాభా |
|
|
భారత కళలు, వినోదం
& భారతీయ సంస్కృతి |
భారతీయ సంగీతం ( కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతము, ఇండి పాప్), భారతీయ సినిమా & భారత్లో టెలివిజన్ ( హిందీ సినిమా, తెలుగు సినిమా), భారత టెలివిజన్ స్టేషన్ల జాబితా, భారతీయ సాహిత్యం, భారతీయ వంటలు, భారత్లో సెలవులు, జానపద భారతం, భారత శాస్త్రీయ నాట్యం, భారతీయ శిల్పకళా; భారత్లో విద్య, భారతీయ భాషలు, భారత్లో మాధ్యమాలు
|
|
| ఇతరాలు |
కాశ్మీరు తీవ్రవాదం, భారతీయ ఇంగ్లీషు, భారత జాతీయతా చట్టం, రెండు దేశాల పౌరసత్వం, భారతీయ సంఖ్యా మానము, ఇస్రో, భారత సమాచార వ్యవస్థ, భారత రవాణా వ్యవస్థ ( భారత హైవేలు, రైల్వేలు, ఆటో రిక్షా), భారత జాతీయ పతాకం, భారత పర్యాటక రంగం, భారత వార్తా వనరులు, భారత వాహన లైసెన్సులు
|
|