థార్ ఎడారి
వికీపీడియా నుండి
థార్ ఏడారి (హిందీ: थार मरुस्थल) భారత దేశానికి వాయువ్య దిశలో భారత పాకిస్తాన్ సరిహద్దులలో ఉన్నది. ఈ ఎడారిని గ్రేట్ ఇండియన్ డెసర్ట్ అని పిలుస్తారు. ఈ ఎడారి ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రములో, కొంత భాగము హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రములో, కొద్ది భాగము పాకిస్తాన్ దేశములోని పంజాబ్ రాష్ట్రములో విస్తరించి ఉన్నది. పాకిస్తాన్లో విస్తరించి ఉన్న ఎడారిని ఖలిస్తాన్ ఎడారి అని పిలుస్తారు. థార్ ఎడారి భౌగోళిక సరిహద్దులు వాయువ్యాన సట్లెజ్ నది, తూర్పున ఆరావళీ పర్వత శ్రేణులు, దక్షిణాన రాణ్ ఆఫ్ కచ్ సాల్ట్ మార్ష్ (ఉప్పుకయ్య), పశ్చిమాన సింధూ నది. ఉత్తరాన థార్ ఎడారికి, విశాలమైన ముళ్ళపొదల భూములకు ఉన్న సరిహద్దు ఖచ్చితంగా నిర్వచించబడలేదు. అందువళ్ళ ఏ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నారో, తీసుకోలేదో అన్న విషయముపై థార్ ఎడారి పరిమాణము యొక్క అచంనాలు గణనీయంగా మారుతుంటాయి.
[మార్చు] విస్తీర్ణం
వర్డల్ వైడ్ ఫండ్ వారి నిర్వచనం ప్రకారం[1], ఎడారి ప్రాంతం 92,200 చదరపు మైళ్ళు (238,700 చ.కి.మీ). ఇతర ఆధారాల ప్రకారం 805 కి.మీ పొడవు (500 మైళ్ళు) 485 కి.మీ (300 మైళ్ళు) వెడల్పుతో 446,000 చదరపు కి.మీల వైశాల్యములో ఉన్నది. భారత దేశ భూభాగములో ఉన్న ఈ ఎడారి 61% రాజస్థాన్ లో 20% గుజరాత్ లో 9% పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది.[2]
[మార్చు] థార్ ఎడారి పుట్టుక
ఈ ఏడారి పుట్టుక మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరి ప్రకారం ఈ ఏడారి 4,000-10,000 సంవత్సరాలు మాత్రమే పురాతనమైనది. క్రీ.పూ. 2000-1500 సంవత్సరాల ప్రకారం ఇక్కడ ప్రవహించే ఘగ్గర్ నది ఇంకి పోవడం వల్ల ఈ ఎడారి ఏర్పడిందని భావిస్తారు.

