అటకామా ఎడారి
అటకామా ఎడారి (ఆంగ్లం: Atacama Desert), దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఈ ఎడారిలో వర్షపాతం దాదాపు శూన్యం. దక్షిణ అమెరకా పశ్చిమాన, పసిఫిక్ మహాసముద్రం తీరంలో యాండీస్ పర్వతశ్రేణికి పశ్చిమాన ఉన్న సన్నని భూబాగంలో ఉన్న ఈ ఎడారి 1000 కి.మీ. (600మైళ్ళు) పొడవున విస్తరించి ఉంది. నాసా, నేషనల్ జియొగ్రాఫిక్, మరికొన్ని ప్రచురణల ప్రకారం అటకామా ఎడారి ప్రపంచంలో అత్యంత పొడి ఎడారి (driest desert)[1][2][3]
యాండీస్ పర్వతాలు, చిలీ తీర పర్వతాలు కారణంగా ఏర్పడిన వర్షచ్ఛాయా ప్రాంతం మరియు చల్లని భూభాగపు "హంబోల్ట్ కరెంట్ (Humboldt Current) కారణంగా ఈ ఎడారి ఏర్పడింది. ఈ ఎడారి వయసు 200 మిలియన్ సంవత్సరాలు.[4] కాలిఫోర్నియాలో ప్రసిద్ధి చెందిన "మృత్యులోయ" (Death Valley) కంటే ఈ ఎడారి 50 రెట్లు ఎక్కువ పొడి అయినది. ఉత్తర చిలీలో విస్తరించి ఉన్నఈ ఎడారి వైశాల్యం 181,300 చదరపు కిలోమీటర్లు (70,000 mi²)[5] ఇందులో ఆధిక భాగం ఉప్పు బేసిన్‌లు, ఇసుక మరియు లావా రాళ్ళు.
మూలాలు [మార్చు]
- ↑ http://ngm.nationalgeographic.com/ngm/0308/feature3/
- ↑ http://www.extremescience.com/DriestPlace.htm
- ↑ http://quest.nasa.gov/challenges/marsanalog/egypt/AtacamaAdAstra.pdf
- ↑ Tibor, Dunai(Dr.). Amazing Nature. http://www.nature-blog.com/2007/10/atacama-desert-dryest-place-on-earth.html. Retrieved 3/24/08
- ↑ Wright, John W. (ed.); Editors and reporters of The New York Times (2006). The New York Times Almanac, 2007, New York, New York: Penguin Books, 456. ISBN 0-14-303820-6.