సహారా ఎడారి
సహారా అంటే అరబ్బీ భాషలో అతిపెద్ద ఎడారి అని అర్థం. (అరబ్బీ : الصحراء الكبرى ) (ఆంగ్లం : "aṣ-ṣaḥrā´ al-koubra), గణాంకాల ప్రకారం అంటార్కిటికా తరువాత ప్రపంచములోనే రెండవ అతి పెద్ద ఎడారి.[1] ఈ ఎడారి వైశాల్యం 9,000,000 చదరపు కి.మీ (3,500,000 చదరపు మైళ్ళు). వైశాల్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలంత పెద్దది, ఆస్ట్రేలియా కంటే పెద్దది. ఈ ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఎర్ర సముద్రం నుండి మధ్యధరా సముద్రతీర ప్రాంతం వరకు, అట్లాంటిక్ మహాసముద్రం పొలిమేర వరకు విస్తరించి ఉన్నది.
భౌగోళిక విస్తీర్ణం [మార్చు]
సహారా ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండమంతటా చాలా దేశాలలో విస్తరించి ఉన్నది. అల్జీరియా, బర్కినా ఫాసో, చాద్, ఈజిప్టు, లిబియా, మాలీ, మొరాకో, నైగర్, సెనెగల్, సూడాన్ మరియు ట్యునీషియా దేశాలలో విస్తరించి ఉన్నది. ఈ ఎడారిలో వైవిధ్యమైన భౌగోళిక స్వరూపాలున్నవి. ఈ భౌగోళిక స్వరూపములో నైలు, సెనెగల్ వంటి నదులు కూడా ప్రవహిస్తున్నాయి. అయిర్ , అహగ్గర్, సహారా అట్లాస్, టిబెట్సి వంటి పర్వతశ్రేణులు ఉన్నాయి. సహారా ఎడారిలోనే మళ్లీ లిబియన్ ఎడారి , టెనిరి, ఈజిప్షియన్ ఇసుకసముద్రం వంటి ఎడారులు ఉన్నవి. చాద్ వంటి సరస్సులు, బహరియా వంటి ఒయాసిస్సులు కూడా ఉన్నాయి.
ఇవీ చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ Since there is little precipitation in Antarctica as well, except at the coasts, the interior of the continent is technically the largest desert in the world.