సింధూ నది (సంస్కృతం: सिन्धु ; ఆంగ్లం: Indus River) భారత ఉపఖండంలో ప్రసిద్దమయిన హిమ నది. ఇది హిమాలయాలలో టిబెట్లో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధ్ రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్‍లో కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో సాగరసంగమం అవుతుంది. సింధు నది ఉపనదులు జీలం, చీనాబ్, రావీ, బియాస్, సట్లెజ్ ప్రవహించే ప్రాంతం అంతా అతి సారవంతమయిన నేల. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా డాము, సుక్కూలారు బ్యారేజ్, భారతదేశంలో పంజాబ్‍లో సట్లెజ్ నది మీద భాక్రానంగల్ ఆనకట్ట, భారీ డాములు, ఆనకట్టలు కట్టి సాగునేలకు పంట నీటిని అందించి గోధుమ, వరి, చెరకు విరివిగా పండించుటయేగాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సింధు నది పొడవు 2880 కి.మీ. హరప్పా, మొహంజోదారో ప్రాంతాల్లో ఈ సింధు నదీ లోయలో సుమారు 5,000 ఏళ్ళ ఉజ్జ్వలమైన సింధు లోయ నాగరికత వెలసి వర్థిల్లింది.
|
సింధూనది |
|
| ఉపనదులు |
|
|
| ప్రాజెక్టులు |
|
|