మెగస్తనీసు
వికీపీడియా నుండి
మెగస్తనీసు (350 క్రీ.పూ - 290 క్రీ.పూ) ప్రాచీన గ్రీకు యాత్రికుడు మరియు సందర్శకుడు. ఆసియా మైనర్ ప్రాంతంలో జన్మించిన మెగస్తనీసును సెల్యూకస్ గ్రీకు రాయబారిగా పాటలీపుత్రములోని శాండ్రోకొట్టస్ (చంద్రగుప్త మౌర్యుడు) ఆస్థానానికి పంపినాడు. ఈయన రాయబారిగా పనిచేసిన కాలము ఖచ్చితంగా తెలియదు కానీ చరిత్రకారులు చంద్రగుప్తుని మరణ సంవత్సరమైన క్రీ.పూ.288 కు ముందుగా మాత్రం నిర్ణయించారు. ఇతడు ప్రఖ్యాత చారిత్రక గ్రంథమైన ఇండికాను రచించాడు.