కళింగ యుద్ధం

వికీపీడియా నుండి

కళింగ యుద్ధం మౌర్య సామ్రాజ్యానికి, కళింగ రాజ్యానికి మధ్య జరిగింది. దీనికి అశోక చక్రవర్తి సారధ్యం వహించాడు. కళింగ రాజ్యం ఇప్పటి భారతదేశం యొక్క ఒరిస్సా రాష్త్ర ప్రాంతంలో వుండేది.


[మార్చు] యుద్ధం

మౌర్య సామ్రాజ్యం

కళింగ యుద్ధం అశొక చక్రవర్తి పాలనలోని 9వ సంవత్సరం నుండి మొదలయ్యింది. అంటే సుమారు క్రీ.పూ. 265 లేదా 264 లో అన్నమాట. అశోకుని తండ్రి అయిన బిందుసారుడు అంతకుముందు కళింగను జయించడానికి ప్రయత్నించి విఫలుడయినాడు. బిందుసారుని అనంతరం అశోకుడు కళింగను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఎంతో దారుణమైన యుద్ధం తరువాత మాత్రమే అశోకుడు సఫలుడయ్యాడు. అయితే ఆ యుద్ధం అశోకుని జీవనసరళినే మార్చేసింది. యుద్ధ పరిణామాలని కనులారా చూసిన అశోకుని మనసు చలించి పోయింది. ఇక యుద్ధం చేయబోనని ప్రతినబూనాడు. కళింగ యుద్ధంలో లక్ష మంది పైగా కళింగ ప్రజలు, పది వేలకు పైగా ఆశోకుని సైనికులు వధింపబడ్డారు. యుద్ద భూమిని ఆనుకుని ప్రవహించిన నదిలో నీరుకు బదులు రక్తం ప్రవాహమై పారిందని ప్రతీతి.

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు