విశాఖపట్నం

వికీపీడియా నుండి

  ?విశాఖపట్టణం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°43′N 83°17′E / 17.7221, 83.2902
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 11,161 కి.మీ² (4,309 చ.మై)
ముఖ్య పట్టణము విశాఖపట్నం
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
3,789,000 (2001)
• 340/కి.మీ² (881/చ.మై)
• 1511000
• 1903000
• 1886000
• 59.45
• 68.84
• 49.99

అక్షాంశరేఖాంశాలు: 17°43′N 83°17′E / 17.7221, 83.2902

విశాఖపట్నం నగరతీరం దృశ్యం

విశాఖపట్నం (విశాఖ , విశాఖపట్టణం , వైజాగ్‌) భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని ప్రముఖ నగరం. విశాఖపట్నం (పట్టణ), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము.

విషయ సూచిక

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • విశాఖపట్నం (m corpI.+og) (part)
  • విశాఖపట్నం (m corpI.)

ఆంధ్రప్రదేశ్ లో గ్రేటర్ సిటి హోదా పొందిన తొలి నగరం (హైదరాబాదు కంటే ముందే). బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున కల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ- "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. డాల్ఫిన్స్‌నోస్‌ అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్‌వాటర్స్‌ గా పని చేస్తుంది.

[మార్చు] చరిత్ర

శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన రామాయణ, మహాభారతా లలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరి ని కలవగా ఆమె హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లు గా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతం లోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. ఇక్కడికి 40 కి మీల దూరంలోని ఉప్పలం గ్రామంలో పాండవుల ఆయుధాలను (రాతి)చూడవచ్చు.


స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీ కి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై,తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు - ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.


గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంధాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్ది కి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనల లోను కలదు.


ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దం లో కళింగులు, 8 వ శతాబ్దం లో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, చోళులు, గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహి లు, మొగలులు, హైదరాబాదు నవాబులు.


18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. మద్రాసు ప్రెసిడెన్సీ లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు.

[మార్చు] ఘటనలు

  • ప్రతి సంవత్సరం సంక్రాంతి (జనవరిలో) సందర్భంగా విశాఖ ఉత్సవ్‌ జరుగుతుంది.
  • 2004 డిసెంబరు నాటి సునామీ దుర్ఘటన సందర్భంగా తీరప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎండబెట్టిన చేపలు కొట్టుకొని పోవడం తప్పించి, విశాఖపట్నం ఏమంత దెబ్బ తినలేదు.

[మార్చు] ప్రభుత్వ/ స్వచ్చంద వైద్య సౌకర్యాలు

  • 1. కింగ్ జార్జి ఆసుపత్రి
  • 2. లయన్స్ కేన్సర్‌ ఆసుపత్రి
  • 3. సెవెన్ హిల్ల్స్ ఆసుపత్రి
  • 4. విక్టోరియా ఆసుపత్రి

[మార్చు] విశాఖపట్నం చరిత్ర గతి

[మార్చు] పరిశ్రమలు

విశాఖ ప్రముఖ పారిశ్రామిక కేంద్రం. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. వాటిలో కొన్ని:

IT/ITES రంగంలో శీఘ్రంగా పురోగమిస్తున్న నగరాలలో విశాఖ ఒకటి. ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్న ప్రముఖ సంస్థలు:

  • HSBC BPO
  • సైనెక్టిక్ ఇన్ఫోటెక్ ప్రైవేటు లిమిటెడ్వారు సిరిపురమ్ కుకలి నన్దు గల దుత్త్ ఐలాండ్ నుండి విశాఖ పరిసర మరియౌ దేస విదేసములలోని ఇంజనీరింగ్ సంస్థలకు తమ సేవలను అందిస్తున్నారు.
  • NuNet Technologies [1]
  • సత్యం కంప్యూటర్స్
  • IBM వారు విశాఖ నడి ఒడ్డున వున్న రాంనగర్ లో కార్యాలయం ఏర్పాటు చేసారు
  • పరిశ్రమల అభివృద్ధి కొరకు విశాఖపట్నంలో ఒక ప్రత్యేక ఆర్ధిక ప్రాంతం ను ప్రభుత్వం నెలకొల్పింది.

విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను ప్రారంభించే విషయమై వివిధ సంస్థలతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం సంప్రదిస్తూ ఉంది. భారత ప్రభుత్వపు భాభా అణు పరిశోధనా సంస్థ (BARC) వారు తమ పరిశోధనా కేంద్రాన్ని, ఒక అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నారు.

భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం కేంద్ర స్థానం.(ప్రధాన స్థావరం).

[మార్చు] విశాఖపట్టణం నగరం లో చూడదగిన ప్రదేశాలు

విశాఖపట్నం, కైలాసగిరి పైని దృశ్యం

[మార్చు] చిత్రమాలిక

రామకృష్ణ బీచ్
విశాఖపట్నం స్టేడియంలో క్రికెట్ మాచ్
విశాఖపట్నం ఓడరేవు దృశ్యం
విశాఖపట్నం నగరంలో భవనాలు
విశాఖపట్నం ఓడరేవు సంపూర్ణ దృశ్యం
విశాఖపట్నంలో మత్స్యకారులు

[మార్చు] ఇవికూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు


Visakhapatnam.jpg

విశాఖపట్నం జిల్లా మండలాలు

ముంచింగి‌పుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం

పేజీకి సంభందించిన లింకులు