మామిడి

వికీపీడియా నుండి

మామిడి (మ్యాంగో)
చెట్టుపై పచ్చిగా ఉన్న మామిడి కాయలు
చెట్టుపై పచ్చిగా ఉన్న మామిడి కాయలు
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
Phylum: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
వర్గము: Sapindales
కుటుంబము: అనకార్డియేసి
ప్రజాతి: మాంగిఫెరా
లిన్నేయస్
జాతులు
షుమారు 35 species -

మామిడి (ఆంగ్లం: Mango) కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. ఇవి మాంగిఫెరా (Mangifera) ప్రజాతికి చెందిన వృక్షాలు. వీటిని ఊరగాయలు తయారీలో ఉపయోగిస్తారు. వీటినుండి రసాలు తీసి తాగుతారు. వీటినుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోటిన్ , విటమిన్ సి, కాల్షియం ఎక్కువ.

విషయ సూచిక

[మార్చు] మామిడిచెట్టు వివరణ

ఇది ఉష్ణదేశపు పండ్ల చెట్టు. తొంభై (90) నుండి నూట ఇరవై (120) అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ముప్పై(30) అడుగుల వ్యాసం వరకు విస్తరించి కిరీటం ఆకారంలో ఉంటుంది. ఆకులు పది (15) నుండి (35) సెంటి మీటర్ల పొడవు ఆరు (6) నుండి పది (10) సెంటి మీటర్ల వెడల్పు ఉండి ఎప్పడూ పచ్చగా ఉంటాయి. చిగుర్లు లేత తేనె రంగు నుండి ముదురు కాఫీ రంగు మారి చివరిగా ముదురు ఆకుపచ్చ రంగుకి వస్తాయి. పూలు గుత్తులు పది (10) నుండి నలభై (40) సెంటి మీటర్ల పొడవు ఉంటాయి. పూవు చిన్నదిగా ఐదు (5) నుండి (10) మిల్లి మీటర్లు పొడవు ఐదు (5) రెక్కలు కలిగి లేలేత సువాసనతో ఉంటాయి. పుష్పించడం పూర్తి ఐన తరవాత కాయలు రూపు దిద్దుకొని మూడు (3) నుండి ఆరు (6) మాసాలలో పక్వానికి వస్తాయి.

నిండు పూతతో ఉన్న మామిడి చెట్టు.

పక్వానికి వచ్చిన పండ్లు పొడవాటి కాడలతో కిందకు వేలాడుతూ ఉంటాయి. ఇవి సూర్యరశ్మి తగిలేవైపు కొంచం లేత ఎరుపు రంగుతోను ఇంకొక వైపు పసుపు రంగుతోను ఉంటాయి.ఇవి తియ్యని సువాసనతో ఉంటాయి. ఏడు (7) నుండి (12) సెంటి మీటర్ల వ్యాసం పది (10) నుండి ఇరవైఐదు (25) సెంటి మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. రెండున్నర (2.5) కిలోగ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. పండు మద్యలో పీచు తోను పీచు లేకుండాను ధృడమైన ముట్టె ఉంటుంది. అది ఒకటి(1)నుండి(2) మిల్లీమీటర్లు మందంతో, పల్చటికాగితం లాంటి పొర ఉన్నవిత్తనంతో (జీడి) ఉంటుంది. విత్తనం నాలుగు (4) నుండి ఏడు (7) సెంటి మీటర్ల పొడవు మూడు (3) నుండి నాలుగు (4) సెంటి మీటర్ల వెడల్పుఒక (1) సెంటీమీటర్ మందం కలిగి ఉంటుంది.

[మార్చు] పంట మరియు ఉపయోగాలు

మామిడి పూత
మామిడి, ముడి
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 70 kcal   270 kJ
పిండిపదార్థాలు     17.00 గ్రా.
- చక్కెరలు  14.8 గ్రా.
- పీచుపదార్థాలు  1.8 గ్రా.  
కొవ్వు పదార్థాలు 0.27 గ్రా.
మాంసకృత్తులు .51 గ్రా.
విటమిన్ A  38 μg 4%
థయామిన్ (విట. బి1)  0.058 mg   4%
రైబోఫ్లేవిన్ (విట. బి2)  0.057 mg   4%
నియాసిన్ (విట. బి3)  0.584 mg   4%
పాంటోథీనిక్ ఆమ్లం (B5)  0.160 mg  3%
విటమిన్ బి6  0.134 mg 10%
ఫోలేట్ (Vit. B9)  14 μg  4%
విటమిన్ సి  27.7 mg 46%
కాల్షియమ్  10 mg 1%
ఇనుము  0.13 mg 1%
మెగ్నీషియమ్  9 mg 2% 
భాస్వరం  11 mg 2%
పొటాషియం  156 mg   3%
జింకు  0.04 mg 0%
శాతములు, అమెరికా వయోజనులకు
సూచించబడిన వాటికి సాపేక్షంగా
Source: USDA పోషక విలువల డేటాబేసు

ప్రపంచం అంతటా ఇప్పుడు మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ఈ పంటను సమశీతోష్ణ పరిస్థితిలో కూడా పండిస్తూ ఉన్నారు భారతద్వీపకల్పం అంతటా, కరేబియన్(Caribbean), మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు అసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాలలోను పండిస్తున్నారు. దీనిని ఎక్కవగా తాజాగానే తింటారు. ఇంకా పంటగా వేయని దక్షిణ ఫ్లోరిడాలో కూడా మామిడిచెట్టుని ఇంటి పెరటిలో చూడవచ్చు.

మామిడిపండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారమే అయినా రైతులు తక్కువ ప్రతిఫలం పొందుచున్నారు. అందువలన ఇవి అందరికి అందుబాటులో ఉంటాయి. తాజా మామిడి పండులో పదిహేను శాతం(15%) చక్కెర, ఒక శాతం(1%) మాంసకృత్తులు మరియు గుర్తించ తగిన మోతాదులో ఎ,బి,సి(A,B,C) విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కవగా తియ్యగా ఉన్నా కొన్నిజాతుల పండు కొంచంపుల్లగా ఉంటుంది, ముఖ్యంగా చిలక ముక్కు(బెంగళూర్) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో వీటిని చిన్నచిన్న వ్యాపారులు బండి మీద వీటిని సన్నని పోడవైన ముక్కలుగా కోసి ఉప్పుకారం చల్లి అమ్ముతూ ఉంటారు. చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు పీచు ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే కండతో ఉంటాయి వీటిని మల్ గోవా మామిడి అంటారు. బంగినపల్లి ఎక్కువ తీయగా మెత్తటి కండ కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక రసభరితంగా ఉంటాయి. కాయలతో దీర్ఘకాలం నిలవ ఉండే పచ్చళ్ళు(ఊరగాయలు)చేస్తారు.

ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ (మామిడి పొడి) అంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాలలోఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను సంవత్సరం అంతా వాడే అలవాటు ఉంది. పచ్చి మామిడి కాయని వివిద రూపాలలో వంటలలో వాడుతుంటారు. సున్నపుశక్తి(కాల్షియమ్) విటమిన్ బి పుష్కలంగా ఉంది కనుక అమెరికన్స్ వీటిని చెక్కుతో చేర్చి తింటారు. పడమటి దేశాలలో పండ్లతో తియ్యటి చట్నీ చేస్తారు. ఫిలిప్పైన్ లో మామిడి కాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో అక్కడ తీపి, ఉప్పు, మసాలా రుచులను చేర్చి ఇతర వంటల లో వాడుతుంటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పై చేస్తున్నారు. తాయ్ లాండ్ లో భోజనానంతర ఆహారం(డిసర్ట్)తో చేర్చి అందిస్తారు.

[మార్చు] ఇతర వ్యాపారాలలో మామిడి

భారతదేశంలో మామిడి తాండ్ర ను చేసి చిన్నచిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇలాంటిదే పెద్దఎత్తున కొన్ని వ్యాపారసంస్తలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మామిడి రసాన్నిబాటిల్స్, మరియు, ప్యాక్ ల రూపంలో వ్యాపారసంస్తలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్,లస్సీపండ్ల రసాల అంగడి లో అమ్ముతుంటారు. మామిడికాయలతో చేసే ఊరగాయలు ఆంధ్రులద్వారా ప్రపంచం అంతటా లభిస్తున్నాయి. ఐస్ క్రీం లో మామిడి గుజ్జును, ఫ్రూట్ సలాడ్ లో మామిడి ముక్కలను వేస్తారు.

[మార్చు] పుట్టు పూర్వోత్తరాలు

2005 లో అధికంగా మామిడి ఉత్పత్తి చేసిన దేశాలు
దేశం హెక్టేరులు
Flag of భారత దేశం భారతదేశం 1,600,000
Flag of చైనా చైనా 433,600
Flag of థాయిలాండ్ థాయిలాండ్ 285,000
Flag of ఇండొనీషియా ఇండొనీషియా 273,440
Flag of మెక్సికో మెక్సికో 173,837
Flag of ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 160,000
Flag of పాకిస్తాన్ పాకిస్తాన్ 151,500
Flag of నైజీరియా నైజీరియా 125,000
Flag of గినియా గునియా 82,000
Flag of బ్రెజిల్ బ్రెజిల్ 68,000
Flag of వియత్నాం వియత్నాం 53,000
Flag of బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 51,000
ప్రపంచం మొత్తం 3,870,200
వనరు:
యు.ఎన్. ఆహారం మరియు వ్యవసాయ సంస్థ. (FAO)
[1]


ఖచ్చితంగా పూర్వీకం ఏక్కడో ఎవరికీ తెలియక పోయినా శిలాజాల ఆధారంగా ఇరవైఐదు(25)నుండి (30)మిలియన్ సంవత్సరాల పూర్వం ఉన్నట్లు రుజువులు ఉన్నాయి. పురాణాలలో వేదకాలంలో ఉన్నట్లు వర్ణనలు ఉన్నాయి. ఇండియా, శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్ మామిడి చెట్టు జన్మ స్థలంగా విశ్వసించ బడుతుంది.

[మార్చు] సంప్రదాయంలో మామిడి

భారతీయ సంప్రదాయంలో మామిడి ఆకులు తోరణం ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి పండుగ లేక శుభకార్యం కాని మామిడి తోరణంతోటే ప్రారంభం ఔతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి. మామిడి కాయ ఆకారం, దుస్తులు, దుప్పట్లు, తివాశీలు మొదలైన బట్టలమీద, నగలు, ముగ్గులు మొదలైన వాటిలో చోటు చేసుకుంది.

[మార్చు] పేరు పుట్టుపూర్వోత్తరాలు

తమిళంలోని మాంగాయ్,లేక మళయాళంలోని మాంగా అనే పేరు పోర్చుగీసులు ఇండియాకు వచ్చిన తరువాత పోర్చుగీసులవలన వ్యాపించినదని గుర్తించారు. పొర్చుగీసు వాళ్ళూ దీనిని మాంగా పిలవడం దీనికి కారణం.

[మార్చు] మామిడి జాతులు

There are many species of mango, including: మూస:Div col

మూస:Div col end

[మార్చు] మామిడి రకాలు

అందంగా కోయబడ్డ మామిడి పండు (ఎడమ). మామిడి నిలువుకోత (కుడి).
  1. బంగినపల్లి
  2. నీలం
  3. చందూరా
  4. రుమానియా
  5. మల్గోవా
  6. చక్కెర కట్టి
  7. అంటు మామిడి లేక చిలక ముక్కు మామిడి లేక బెంగుళూర్ మామిడి.
  8. రసాలు.
  9. చిన్న రసాలు
  10. పెద్ద రసాలు
  11. షోలాపూరి
  12. అల్ఫాన్సా
  13. నూజివీడు రసం
  14. పంచదారకలశ
  15. కోలంగోవా
  16. ఏండ్రాసు
  17. సువర్ణరేఖ
  18. కలెక్టరు
  19. ఇమాంపసంద్
  20. దసేరి

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు