జ్వరం

వికీపీడియా నుండి

శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత (37°సె, 98.6°ఫా) కంటే మించి ఉంటే ఆ స్థితిని జ్వరం (ఆంగ్లం: Fever) అంటారు. దీనిని ఉష్ణమాపకం లేదా థర్మామీటర్ ( జ్వరమాపకం )ద్వారా కొలిచి గుర్తిస్తారు. మన శరీరంలోని సహజమైన రోగనిరోధక శక్తి రోగాల వైరస్‌లతో, బాక్టీరియా, ఫంగస్‌ లాంటి వాటితో జరిపే పోరాటంలో, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీస్‌ ఫారిన్‌ హీట్‌ దాటితే మన శరీరంలో ఇన్‌ఫెక్షన్‌తో అంతర్యుద్ధం కొనసాగుతున్నదన్న మాట.

[మార్చు] జ్వరం రావడానికి కారణాలు

1. జలుబూ, రొంప, పడిశెం లేదా ఫ్లూ 2. చెవిపోటు 3. బ్రాంఖైటిస్‌ 4. నోటిపూత 5. మూత్రకోశానికీ, మూత్రనాళాల వ్యాధులు. 6. మానసిక ఒత్తిడి, ఆవేదన, శోకం వంటివి 7.నూలుదుస్తులు ధరించేవాళ్లు, పండక్కి కొత్తపాలిస్టర్ బట్టలు కట్టుకున్నా 8.రుతుక్రమం సమయంలో , వ్యాయామాలు అతిగా చేసినా, కొన్ని మందులు మోతాదుకు మించి వాడినా

[మార్చు] రకాలు

[మార్చు] చికిత్స

జ్వరం 101 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ కన్నా తక్కువగా వుంటే, ప్రత్యేకమైన వైద్యం అవసరం లేదు. పుష్కలంగా పానీయాలు సేవిస్తే చాలు. జ్వరం' అదుపు చెయ్యడానికి 'అస్పిరిన్‌' ఎసిటామినో ఫెన్‌, ఐబూప్రొఫేన్‌ వంటివి తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో స్నానం చేసినా, శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది. జ్వరం 103 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ దాటి, 2 గంటలకంటె ఎక్కువసేపు ఉన్నా, వచ్చి 2 రోజులు దాటినా, టెంపరేచర్‌ 105 డిగ్రీస్‌ ఫారిన్‌హీట్‌ దాటినా, వైద్యుడిని సంప్రదించాలి.

సాధారణంగా జ్వరానికి చికిత్స చెయ్యాల్సిన అవసరం లేదు. భారతదేశంలో జ్వరం వస్తే పాలల్లో మిరియాలు కలుపుకొని తాగమని చిట్కా ఇస్తారు.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%82" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు