నరసరావుపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నరసరావుపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
  ?నరసరావుపేట మండలం
గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జిల్లా పటములో నరసరావుపేట మండలం యొక్క స్థానము
గుంటూరు జిల్లా పటములో నరసరావుపేట మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°15′N 80°04′E / 16.25°N 80.07°E / 16.25; 80.07
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నరసరావుపేట
జిల్లా(లు) గుంటూరు
గ్రామాలు 16
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,79,690 (2001)
• 90740
• 88940
• 63.71
• 73.07
• 54.18


నరసరావుపేట గుంటూరు జిల్లా లోని పట్టణాలలో ప్రముఖమైనది. నరసరావుపేటను పలనాడుకు ముఖద్వారం గా అభివర్ణించారు. జిల్లా లోని నాలుగు రెవెన్యూ కేంద్రాలలో ఇది ఒకటి. ఈమధ్యనే ద్విశతి (200ఏళ్ళు) జరుపుకున్న ఇది రెవిన్యూ మండలానికి కేంద్రం. వాణిజ్యకేంద్రంగా, విద్యా కేంద్రంగా జిల్లాలో ప్రముఖమైన స్థానం పొందింది మరియు రాష్ట్ర రాజకీయాలకు ప్రసిద్ధి


కొండా వెంకటప్పయ్య పంతులు, అన్నాప్రగడ కామేశ్వర రావు వంటి స్వాతంత్ర్య సమర యోధులను నరసరావుపేట అందించింది. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, ప్రముఖ వేణు కళాకారుడు-కవి-సంగీత కారుడు అయిన ఏల్చూరి విజయరాఘవ రావు, అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పర్యవరణ వేత్త ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఎన్ మూర్తి అని ప్రముఖంగా పిలువబడే నారాయణం నరసింహ మూర్తి కూడా నరసరావు పేట నుండి వచ్చిన వాడే.


భారతదేశంలోకెల్లా పెద్ద లోక్‌సభ నియోజక వర్గాలలో నరసరావుపేట ఒకటి. ప్రసిద్ధి చెందిన కోటప్ప కొండ లోని త్రికోటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడికి 12 కి మీల దూరంలో ఉంది. ఆ అలయం లొ శివుడు త్రికొటేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు.కొండ పైకి వెళ్ళే దారిలొ మెట్ల దారి దగ్గర విఘ్నేశ్వరుడి గుడి వుంది.కొండ మీద గొల్లభామ గుడి వుంది.పెద్ద శివుని విగ్రహం వుంది. ప్రతి శివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది.యెన్నొ ప్రభలు వస్తాయి.

ప్రస్థుత సినిమా రంగంలొ వున్న సినీ నటుడు శివాజి కూడా నరసరావుపేట కు చెందినవాడు.


మండలంలోని గ్రామాలు[మార్చు]