అనకాపల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అనకాపల్లి
—  మండలం  —
విశాఖపట్నం జిల్లా పటములో అనకాపల్లి మండలం యొక్క స్థానము
విశాఖపట్నం జిల్లా పటములో అనకాపల్లి మండలం యొక్క స్థానము
అనకాపల్లి is located in ఆంధ్ర ప్రదేశ్
అనకాపల్లి
ఆంధ్రప్రదేశ్ పటములో అనకాపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°41′00″N 83°01′00″E / 17.6833°N 83.0167°E / 17.6833; 83.0167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
మండల కేంద్రము అనకాపల్లి
గ్రామాలు 32
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,76,822
 - పురుషులు 88,044
 - స్త్రీలు 88,778
అక్షరాస్యత (2001)
 - మొత్తం 66.58%
 - పురుషులు 77.17%
 - స్త్రీలు 56.17%
పిన్ కోడ్ {{{pincode}}}

అనకాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లా కు చెందిన ఒక మండలము. విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలోనూ, ఉక్కునగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న అనకాపల్లి వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది. చుట్టు ప్రక్కల పల్లెలకు ప్రధాన కూడలిగా ఉన్న అనకాపల్లి కొబ్బరి వ్యాపారానికి మరియు బెల్లం వ్యాపారానికి ప్రసిద్ధి చెందినది. ఈ ఊరుకి దగ్గరగా ఉన్న బొజ్జన్న కొండ అని పిలిచే కొండమీద బౌద్ధారామం ఉంది. బొజ్జన్న అంటే బుద్ధుడన్నమాట.

పట్టణం స్వరూపం, జన విస్తరణ[మార్చు]

అనకాపల్లి పట్టణం 'శారదా నది' అనే చిన్న నది తీరాన ఉన్నది. అక్షాంశ రేఖాంశాలు17.68° N 83.02° E[1]. ఇది సముద్ర మట్టానికి 26 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం తూర్పు కనుమలు విస్తరించిన భాగంలో ఉంది.

పట్టణంలో ఒక వీధి
పట్టణంలో రావు గోపాల రావూ కళాక్షేత్రం

2001 జనాభా లెక్కల ప్రకారం అనకాపల్లి జనాభా 84,523. ఇందులో ఆడు, మగ వారు సమానంగా (50%) ఉన్నారు. అక్షరాస్యత 67% ఉంది (జాతీయ సగటు 59.5%). ఇక్కడ మగవారిలో 54%, ఆడువారిలో 46% అక్షరాస్యులు. మొత్తం జనాభాలో 10% వరకు ఆరు సంవత్సరాల లోపు వయసున్నవారు.

చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతం ఒకప్పుడు కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత గజపతులు, కాకతీయులు, కుతుబ్ షాహి రాజులు పాలించారు. షుమారు 1450 ప్రాంతంలో ఆర్కాటు నవాబు అధీనంలో అప్పలరాజు, ఇతర క్షత్రియ వంశీయులు దీనికి స్థానిక పాలకులైనారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు అనకాపల్లిని దర్శించారు.

Churches[మార్చు]

 • BALL's Home Church
 • Andhra Baptist Church
 • Lutheran Church
 • R C M Church

ఆలయాలు[మార్చు]

అనకాపల్లి సత్యనారాయణ స్వామి కొండ వద్ద సుందర దృశ్యం
 • అప్పలరాజు కులదేవత కాకతాంబిక ఆలయం. తరువాత కాలంలో ఈ దేవతను నూకాలమ్మ లేదా నూకాంబిక అన్నారు. ప్రస్తుతం ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. ఉగాది కి ము౦దు గా వచ్ఛు దినమైన 'క్రొత్త అమావాస్య' నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.[2]
 • 'గౌరమ్మ గుడి' మరొక ప్రసిధ్ద ఆలయం. జనవరి మాసాంతంలో ఇక్కడ 10 రోజుల సంబరం జరుగుతుంది.
 • అనకాపల్లి పట్టణానినకి సమీపంలో 'బొజ్జన్నకొండ' లేదా 'శంకరం' అనే చోట బౌద్ధారామ అవశేషాలున్నాయి.[3]
 • అనకాపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో 'సత్యనారాయణపురము' వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది.
 • పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోని దేవీపురం లో శ్రీచక్రాకృతిలో విర్మించబడిన రాజరాజేశ్వరీదేవి ఆలయం ప్రసిద్ధి చెందినది.[4]
 • మరి కొన్ని ఆలయాలు
  • కమాక్షి ఆలయము
  • గౌరీ పరమేశ్వరాలయము
  • పెదరామస్వామి ఆలయం
  • చిన్నరామస్వామి ఆలయం
  • వెంకటేశ్వరస్వామి ఆలయం.
  • సంతోషీమాత ఆలయం
  • కన్యకా పరమేశ్వరి ఆలయం
  • కాశీ విశ్వనాధ స్వామి ఆలయం
  • భోగ లింగేశ్వర ఆలయం.
  • గాంధీ నగరం వెంకటేశ్వరస్వామి ఆలయం.
  • మరిడీమాంబ ఆలయం.

విద్యా సంస్థలు[మార్చు]

 • B.J.M Educational Institutions
 • A.M.A.L.(అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ లింగమూర్తి) కాలేజి
 • ఆదినారాయణ మహిళా కళాశాల
 • దాడి వీరునాయుడు డిగ్రీ కాలేజి
 • కొణతల కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సు
 • హిమశేఖర్ డిగ్రీ మరియు పి.జి.కాలేజి
 • సాయి కుల్వంత్ ఇంటర్ మరియు డిగ్రీ కాలేజి
 • దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ
 • సర్వేపల్లి రాధాకృష్ణన్ జూనియర్ కాలేజి
 • సంయుక్త డిగ్రీ కాలేజి, పాఠశాల
 • శ్రీకన్య జూనియర్ కాలేజి
 • A.M.A.A.(అనకాపల్లి మర్చంట్స్ అసోసియేషన్ ఆదినారాయన) ఇంగ్లీషు మీడియమ్ స్కూలు
 • మునిసిపల్ గవరపాలెం హైస్కూలు
 • మునిసిపల్ హైస్కూలు
 • మునిసిపల్ బాలికల హైస్కూలు
 • సంయుక్త హైస్కూలు
 • D.A.V. పబ్లిక్ స్కూలు
 • డైమండ్స్ కాన్వెంట్
 • గుడ్ షెఫర్డ్ ఇంగ్లీషు మీడియం హైస్కూలు
 • డా.ఎమ్.వి.వి. సత్యనారాయణ మెమోరియల్ గురజాడ పబ్లిక్ స్కూలు
 • J.M.J. హైస్కూలు
 • ప్రశాంతి నికేతన్
 • బొడ్డెడ గంగాధర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఇంటరాక్టివ్ లెర్నిగ్
 • J.L. ఇంగ్లీషు మీడియమ్ స్కూలు
 • మండల ప్రజా పరిషత్ ప్రాధమిక ఉన్నత పాఠశాల, ముత్రాసి కాలని
 • దాడి సత్యనారాయణ కాలేజి ఆఫ్ Education (బి.ఇడి)

వ్యవసాయం, నీటి వనరులు[మార్చు]

ఈ ప్రాంతంలో వరి, చెరకు, కొబ్బరి ముఖ్యమైన పంటలు.

పరిశ్రమలు, వ్యాపారం[మార్చు]

రైల్వే స్టేషన్
 • ఆనకాపల్లి బెల్లం పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలో ఇది అతి పెద్ద బెల్లం ఉత్పత్తి, వ్యాపార కేంద్రం. మొత్తం దేశంలో రెండవ స్థానంలో ఉంది.[ఆధారం కోరబడినది]
 • అనకా పల్లి సమీపంలో 'వెలగపూడి స్టీల్ మిల్స్' అనే ఉక్కు పరిశ్రమ ఉంది.[5]
 • అనకాపల్లి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్మపాలలో 'అనకాపల్లి సహకార చక్కెర కర్మాగారం' ఉంది.
 • చుట్టుప్రక్కల గ్రామాలకు అనకాపల్లి ప్రధాన వ్యాపార కేంద్రం.
 • విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ, సింహాద్రి పవర్ ప్లాంట్‌లు అనకాపల్లికి దగ్గరలోనే ఉన్నాయి. (షుమారు 15 కి.మీ.)

వైద్య సదుపాయాలు[మార్చు]

 • ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు వారి 'ఏరియా హాస్పిటల్' వంద పడకలు కలిగిన పబ్లిక్ హాస్పిటల్.[6]

విభాగాలు[మార్చు]

పట్టణంలో విభాగాలు, ప్రదేశాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

అనకా పల్లి మండలంలో ఉన్న గ్రామాలు.

లోక్ సభ నియోజక వర్గం[మార్చు]

ఇది లోక్ సభ నియోజక వర్గం కేంద్ర స్థానమే కానీ రెవిన్యూ డివిజన్ కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండడు.ఇది విశాఖపట్నం రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.2013 వ సంవత్సరంలొ అనకాపల్లె కేంద్రం గా రెవెన్యూ డివిజన్ ఏర్పడింది

అనకాపల్లి ఒక లోక్‌సభ నియోజక వర్గం. ఇక్కడినుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

లోక్ సభ
 • 1952 లంకా సుదరం, మల్లుదొర (?)
 • 1957,1962 మరియు 1967 - మిస్సుల సూర్యనారాయణ మూర్తి.
 • 1971, 1977 మరియు 1980 - ఎస్.ఆర్.ఎ.ఎస్.అప్పలనాయుడు
 • 1984 - పి.అప్పల నరసింహం
 • 1989 మరియు 1991 - కొణతల రామకృష్ణ
 • 1996 - చింతకాయల అయ్యన్నపాత్రుడు
 • 1998 - గుడివాడ గురునాధరావు
 • 1999 - గంటా శ్రీనివాసరావు
 • 2004 - పప్పల చలపతిరావు
 • 2009 - సబ్బమ్ హరి
రాజ్యసభ
 • 1953-62 విల్లూరి వెంకట రమణ

అసెంబ్లీ నియోజక వర్గం[మార్చు]

అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక నియోజక వర్గం కూడా. పూర్తి వ్యాసం అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం లో చూడండి.

పర్యాటక కేంద్రాలు[మార్చు]

 • దగ్గరలో ఉన్న పుడిమడక, ముత్యాలమ్మపాలెం బీచిలు అందమైనవి.
 • ఏటికొప్పాక లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందినది.

మూలాలు, వనరులు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

Visakhapatnam.jpg

విశాఖపట్నం జిల్లా మండలాలు

ముంచింగి‌పుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం


"http://te.wikipedia.org/w/index.php?title=అనకాపల్లి&oldid=1418818" నుండి వెలికితీశారు