రాజమండ్రి

వికీపీడియా నుండి

ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.
  ?రాజమండ్రి
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
రాజమండ్రి వద్ద గోదావరి నది మీద రైలు బ్రిడ్జి
అక్షాంశరేఖాంశాలు: 16°59′N 81°47′E / 16.98, 81.78
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 14 మీ (46 అడుగులు)
జిల్లా(లు) తూర్పు గోదావరి
జనాభా
ఆడ-మగ నిష్పత్తి
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
315,251 (2001)
• 1.01
• 78.98
• 83.52
• 74.39
కోడులు
పిన్‌కోడు
టెలీఫోను
వాహనం

• 533 10-
• +0883
• AP-5

అక్షాంశరేఖాంశాలు: 16°59′N 81°47′E / 16.98, 81.78 రాజమండ్రి నగరం తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద పట్టణము. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రము.కాకినాడ తూర్పు గోదావరి కి రాజధాని అయినా రాజమండ్రి కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. రాజమండ్రి, అర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. రాజమండ్రి పూర్వపు పేరు రాజమహేంద్రి. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడికి విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. గోదావరి తీరాన ఉంది కనుక ఇది పుణ్య క్షేత్రం. రాజరాజనరేంద్రుడు ఇక్కడ నుండే రాజ్యమేలేడు కనుక ఇది చారిత్రక స్థలం. అభివృద్దిలో రాష్ట్రంలోని నగరాలలొ ఇది 5వ స్థానం లో కలదు. మొదలు రాజమండ్రి పేరు రాజమహేంద్రవరం, రాజమహేంద్రి, తరువాత బ్రిటిషుపాలనలో రాజమండ్రి గా రూపాంతరం జరిగింది.

విషయ సూచిక

[మార్చు] నగర చరిత్ర

రాజమండ్రిని రాజరాజ నరేంద్రుడు రాజధానిగా చేసుకొని పరిపాలన జరిపాడని చరిత్రకారులు చెబుతారు. రాజరాజ నరేంద్రుని పూర్వపు రాజుల చరిత్రాధరాలు లేకపోవడం చరిత్రకారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒక కథనం ప్రకారం 919-934 సంవత్సరాల మధ్య అమ్మరాజు విష్ణువర్ధన రాజు, ఆయన తరువాత అమ్మరాజు విజయాదిత్యుడు (945-970) రాజమండ్రి పరిపాలన చేశారు అని చెబుతారు. రాజమహేంద్రి వేంగి చాళుక్య పరిపాలన లో చారిత్మక, సాంసృతిక ప్రాముఖ్యకత సంపాదించుకొంది. రాజరాజ నరేంద్రుడు 41 ఏళ్ళుపరిపాలన జరిపినా శాంతి సుస్థిరత లేదని చరిత్రకారులు చెబుతారు. ఈ రాజు పరిపాలనలో కవిత్రయం లో మెదటివాడైన నన్నయ్య ఇక్కడే గోదావరి ఒడ్డున శ్రీ మహాభారతం తెనుగించడం ప్రారంభించాడు. ఈ మహారాజు తరువాత విజయాదిత్యుడు (1062-1072), కులోత్తుంగ చోళుడు, రాజరాజవేంగి-2 రాజమండ్రిని పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్యంలో రాజమండ్రికి ప్రముఖస్థానం లేదు. 1323 తుగ్లక్ (ముహమ్మద్ బిన్ తుగ్లక్) ఓరుగల్లును ఆక్రమించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. గుజ్జార్ ని నియమించాడు. ఇప్పటి రాజమండ్రి నడిబోడ్డులో ఉన్న మసీదు ఈ తుగ్లక్ పరిపాలాన కాలంలోనే వేణుగోపాలస్వామివారి ఆలయాన్ని పడగొట్టి (వేంగి చాళుక్యులు నిర్మించారు) నిర్మించబడినది. ఆ తరువాత రెడ్డి రాజులు (1353-1448) తుగ్లక్ కు వ్యతిరేకంగా ఉద్యమించి గెలిచారు. ఆ తరువాత కపిలేశ్వర గజపతి, బహమనీ సుల్తానులు, పురుషోత్తమ గజపతి, శ్రీకృష్ణదేవరాయలు, ప్రతాపరుద్ర గజపతి, రాజమండ్రిని ఏలిన రాజులు. రాజమహేంద్రి, రాజమహేంద్రపురం, రాజమహేంద్రవరం అని ఈ నగరానికి యుండెడి ఇతర నామములు.

[మార్చు] స్థల పురాణము

శ్రీ చక్ర విలసవము అను గ్రంధములో శ్రీ చక్ర అవిర్భావము గురించిన రెండు పౌరాణిక గాథలలోని రెండవ కథ ఈ విధముగా చెప్పబడినది. ఈ కథ బ్రహ్మాండ పురాణమునకు చెందినది. భండాసురుని జయించుటకై శ్రీదేవిని ఉద్దేశించి ఇంద్రుడు మహా యజ్ఞము చేసెను. ఆ యజ్ఞమున దేవతలు తమతమ శరీరమాంసములను కోసి హోమద్రవ్యముగా నొసగిరి. దేవతల త్యాగమునకు సంతోషించిన శ్రీదేవి కోటిసూర్య సమమైన తేజముతోను, కోటిచంద్ర శీతలమయూఖములతోను ఆ హోమాగ్ని మధ్యమున ప్రత్యక్షమయ్యెను. శ్రీదేవి జ్యోతీరూపమైన శ్రీచక్రమధ్యగతమై ప్రత్యక్షమైనది. (ఈ వృత్తాంతమునే లలితాసహస్రనామావళిలో 'చిదగ్నిగుండా సంభూతా దేవకార్య సముద్యతా' ( 4,5 నామములు) అనునవి వెల్లడించుచున్నవి. ఈ వృత్తాంతసందర్బమైన యజ్ఞము నేటి గోదావరి నదీ తీరమున నేటి రాజమహేంద్రవరమున గల ...లింగ క్షేత్రమున జరిగినదనియు అచ్ఛటనే శ్రీ చక్రముతో రాజరాజేశ్వరీదేవి ఉద్భవించుటచేత - ఆ ప్రదేశము రాజరాజేశ్వరీ మందిరమై - రాజమహేంద్రవరముగా మారిపోయినదని స్థలపురాణము.)

[మార్చు] రాజరాజనరేంద్రుని పరిపాలన

[మార్చు] కాకతీయుల పరిపాలన

[మార్చు] రెడ్డిరాజుల, గజపతి రాజుల పరిపాలన

[మార్చు] ఆంగ్లేయుల, ఫ్రెంచ్ పరిపాలన

[మార్చు] అలనాటి ప్రముఖులు

[మార్చు] నిన్నటి ప్రముఖులు

[మార్చు] కవులు

  • నన్నయ్య భట్టు
  • మధిర సుబ్బన్న దీక్షితులు(కాశీమజిలీ కథలు వాసిన కవి)
  • శ్రీపాద క్రిష్ణమూర్తి శాస్త్రి.
  • కందుకూరి వీరేశలింగం
  • భమిడిపాటి కామేశ్వర రావు.
  • కల్లూరి వేంకట రామ శాస్త్రి
  • శ్రీపాద సుభ్రమణ్య శాస్త్రి
  • వావిలాల వాసుదేవ శాస్త్రి
  • శివ సాయి ప్రద్యుమ్న
  • ఆకెళ్ళ వెంకట శాస్త్రి
  • శివ ఫణి సూర్య నారాయణ మూర్తి
  • ఆకెళ్ళ అనిల్ దీక్షిత్

[మార్చు] పురావస్తు సంపద

1. "పెద్ద నేరాలు చేసేవారిచేత బరువైన శిలలు మోయించేవారని శ్రీనాధుడు వర్ణించాడు" ఇది చందా సత్రము సమీపంలో దొరికినది.ప్రస్తుతము రాళ్ళబండి పురావస్తు ప్రదర్శన శాలలో బధ్రపరచబడినది. 2.

[మార్చు] విద్యా సంస్థలు

  • ప్రభుత్వ కళాశాల( ఆర్ట్స్ కళాశాల)

తూర్పు కోస్తాలో ప్రభుత్వ రంగ ఉన్న కళాశాలలో అతి పురాతనమైనది.ఈ కళాశాల 1857 లో స్థాపించబడింది. దీనికి మొదటి ప్రిన్సిపాల్ గా "మెట్కాఫ్" అనే ఆంగ్లేయుడు పనిచేశాడు. ఈయన పేరుతోనే విద్యార్థుల వసతి గృహం (మెట్కాఫ్ హాస్టల్) ఇప్పటికీ నడుస్తున్నది.ఆడవి బాపిరాజు ఇక్కడ చదువుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడ ఈ కళాశాలలో ముఖ్యాధ్యాపకులుగా పనిచేశారు. ఈ కళాశాల ఆంధ్ర విశ్వవిద్యాలయము కంటే పురాతనమయినది.

  • గైట్

ఇంజనీరింగ్ కాలేజ్.2007 లో కొత్తగా పెట్రో వర్సిటి స్తాపించినారు.అక్కడ పెట్రోలియంనకు సంబందించిన విద్యను అందించుచున్నారు

  • రైట్

ఇంజనీరింగ్ కాలేజి..

[మార్చు] ప్రతిభ పబ్లిక్ స్కూలు

[మార్చు] శ్రీ నాగరాజ ఉన్నత పాఠశాల

శ్రీ నాగరాజ ఉన్నత పాఠశాల విద్యానగర్ లో నిర్మితమైనది. ఎంతోమంది పేద విద్యార్ధులకు విద్యను అందించడంలో పేరు గాంచినది. ఎంతోప్రావీణ్యము పొందిన ఆచార్యుల చేతులమీదుగ చాలమంది పేద విద్యార్ధులు ఉత్తీర్ణులై ఎంతో మంచి భనిష్యత్తు పొదుతున్నారు. ఇపుడు ఈ పాఠశాలలో 10వ తరగతి వరకు శిక్షణాతరగతులు కలవు.పూర్వపు విదానలు

[మార్చు] ముఖ్య కూడళ్ళు మరియు నగరం లొ ముఖ్య ప్రదేశాలు

[మార్చు] పాల్ చౌక్

ఇ ప్రదేశం ఇప్పటి కోటిపల్లి బస్సు నిలయం ఉన్న ప్రదేశం క్రిందకు వస్తుంది. 1907 సంవత్సరం ఏప్రియల్ మాసం లొ బిపిల్ చంద్ర పాల్ ఈ ప్రదేశం లొనే ఇదు రోజులు ఉపన్యాసాలు ఇచారు. ఇప్పటీకి ఆసంఘటనాను నగరం 50-60 వయస్సు గల ప్రజలు గుర్తు చేసుకొంటుంటారు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రదేశాన్ని పాల్ చౌక్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం లొ ఇప్పుడు జెట్టి టవర్స్, కోటీపల్లి బస్సు నిలయం, మూడు పార్కులు ఉన్నాయి. ఈ ప్రదేశం కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహం మరియు ఎన్.టి.రామారావు విగ్రహాలు ఉనాయి. ఈ ప్రదేశం నగరం లొ ఒక ముఖ్య కూడలి. ది.6-5-1929 రాత్రి గం.7-50 కు మహాత్మా గాంధీజీ పాల్ చౌక్ కు చేరుకుని ప్రసంగింఛారు. ఇక్కడ నుండి పశ్చిమం వైపు పోతే రోడ్డు రైలు వంతెన వస్తంది, తూర్పు వైపు వెళ్ళితే రాజమండ్రి బస్సు కాంపెక్స్ వస్తుంది, ఉత్తరం వైపు వెళ్ళితే శ్యామలా సినిమా ద్థ్యెటర్, ఇంకా ముందుకు వెళ్తే పొట్టి శ్రీరాములు విగ్రహం, రాజమండ్రి మెయిన్ రోడ్డు వస్తుంది. దక్షిణం వైపు వెళ్ళితే రాజమండ్రి ప్రధాన తపాలా కార్యాలయం, దూరవాణి కేండ్రం (టెలిఫోన్ భవన్) రాజమండ్రి జూనియర్ కళాశాల, రాజమండ్రి రైలు స్టేషన్ వస్తుంది. ఈ పాల్ ఉన్న ప్రదేశం లోనె మూడు పార్కులు ఉన్నాయి. ఈ పార్కులలొ స్వాతంత్రత్య సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి.

కోటిపల్లి బస్సు నిలయం వద్ద నున్న కందుకూరి వీరేశలింగం పంతులు

[మార్చు] శేషయ్య మెట్ట

రాజమండ్రి జిల్లా న్యాయస్థానం వెనుక ఉన్న ప్రదేశాన్ని శేషయ్య మెట్ట అని పిలుస్తారు. రాజమండ్రి పంచ గిరులమీద ఉన్నదని శేషయ్య మెట్ట ఒక గిరి అని ఇక్కడీ ప్రజలు చెబుతారు. ఈ గిరి పేరు వెనుక చరిత్రకారులలొ భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రదేశం రాజమండ్రి పరిపాలించిన మహమదీయుడైన సఏర్ షహిబ్ పేరు క్రింద వచ్చిందని కొంత మంది అంటారు. షేర్ షాహిబ్ నివాసం ఇప్పటి రాజమండ్రి పాత తపాల కార్యాలయం.

[మార్చు] సుబ్రమణ్య మైదానం

1947 ఆగష్టు 15 వ తారీఖు వరకు ఈ ప్రదేశాన్ని పోలిస్ పెరేడ్ గ్రౌండ్స్ అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చాకా ఆప్పటి కొలెనెల్ డి.యస్.రాజు ఈ ప్రదేశాన్ని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బ్రహమజోసుల సుబ్రహ్మణ్యం పేరు కి స్మారకంగా నామకరణం చేశాడు.

[మార్చు] మెరక వీధీ

1565 సంవత్సరం విజయనగర సామ్రాజ్యం పతనమై పోయాక చంద్రగిరి నుండి చాలా మంది ప్రజలు ఈ ప్రదేశానికి వలస వచ్చి, ఇక్కడ తమ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఈ ప్రదేశం లో ఇప్పటి టౌన్ హాలు ఉన్నది. ఈ వలస వచ్చిన వారు, తెలగ కులమునకు చెందిన వారు. వారి ఇంటి పేర్లు కాందల, పోతుల, ముత్తంగి, కత్తుల, యర్ర, నర్ర, నీలం, కంచుమర్తి, నడీపల్లి, బయపునంద. వీరు విజయనగర సైన్యం లో సైనికులు గా పనిచేసేవారు. ఇప్పటికి ఈ వంశానికి చెందిన కుటుంబాల వార ఇళ్ళలొ యుద్ధానికి ఉపయోగింణ్చిన ఆయుధాలు కనిపిస్తాయి. ఈ వంశాల ప్రధాన దైవం వేణుగోపాలస్వామి. వేణు గోపాలస్వామి ఉత్సవ ఊరేగింపుకి వచ్చినప్పుడు ఈ వీధి గుండా ఊరేగింపు జరుగుతుంది. ఈ వంశానికి చెందినవారు చాలా వరకు శ్రీవైష్ణవులు.

[మార్చు] శ్రద్ధానంద ఘాట్

1920 సంవత్సరం లొ పాత సమాచార కేంద్రం వద్ద ఈ ఘాట్ ఏర్పాటు చెయ్యబడింది. ఈ ఘాట్ డిల్లీ లొ ఉన్న ఆర్యామాంస ప్రధానాచార్యుడు శ్రద్ధానంద పేరు మీద పెట్టబడింది.ఈ ప్రదేశం లొ బోస్ విగ్రహం ఇక్కడ ఉండేది. రాజమండ్రి కి వరదలు వచ్చినప్పుడు ఈ విగ్రహం మునిగిపోతుండేది.1991 సంవత్సరం పుష్కరాల ఏర్పాట్లలో ఈ విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించారు. ఆచార్య కృపాలనీ, ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాధం,కాల వేంకట రావు ఈ ప్రదేశం లొ ప్రజలను ఉద్దేశించి ఉపన్యసించేవారు, ప్రజలు ఇక్కడ వినేవారు.

[మార్చు] కోట గుమ్మం

కోట గుమ్మం వద్ద నున్న మృత్యుంజయుడి విగ్రహం

కోట గుమ్మం గోదావరి రైలుస్టేషన్ వద్ద ఉన్న ప్రదేశం.కోట గుమ్మం వద్దనే మృత్యుంజయుడి విగ్రహం, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం, అజంతా హొటలు ఉన్న ప్రదేశాన్ని కోట గుమ్మం అని పిలుస్తారు. ఈ రోజుల్లొ ఇక్కడ కోట గుమ్మం కాని లేక గోడ ఏమి కనిపించదు కాని పాక్షికంగా ప్రధాన వీధి లొ కనిపిస్తుటుంటుంది, ఈ మార్గం ద్వారానే ఏనుగులు, గుర్రాలు గోదావరి నది కి వచ్చి స్నానం చెయ్యడానికి వెళ్ళేవి. ఈ కోట గోడ రెండు వైపుల వాలుగా ఉంటుంది. ఇక్కడ ఆర్థర్ కాటన్ కుమార్తె సమాధి ఉన్నది.1897-1900 సంవత్సరాల మధ్యన రాజమండ్రి గోదావరి పై మీద మొదటి రైలు వంతెన (హేవలాక్ వంతెన) కట్టేటప్పుడు ఈ కోట గుమ్మాన్ని బ్రద్దలు కొట్టారని చెబుతారు. ఈ కోట చాళుక్యులు 8-11 వ సతాబ్ధాలమధ్య నిర్మైంచబడినదని చరిత్ర ఆధారాలు వల్ల తెలుస్తున్నాయి. ఈ ప్రదేశం లొ ఇప్పుడు కండకం వీధి కనిపిస్తుంది. కందకం = పెద్ద కాలువ. గోదావరి నుంది త్రవ్వబడిన ఒక పెద్ద కాలువ. ఈ కందకం శత్రువులు కోట లొకి ప్రవేశించకుండా అడ్డంగా ఈ కాలువ ఉండేది. 20 అడుగులు లోతు , 50 అడుగుల వెడల్పు ఉండేది.

[మార్చు] కంభం సత్రం కంభాల చెరువు

చనిపోయిన తరువాత శాద్ధ్రాలు జరిపే సత్రం.1845-1850 సంవత్సరాల మధ్య కంభం నరసింగ రావు పంతులు స్వంత నిధులతో ఈ సత్ర నిర్మాణం జరిపించారు. అదేసమయం లొనే ఇక్కడ ఒక చెరువు కూడా త్రవ్వించబడింది. చెరువు త్రవ్వగా వచ్చీన మట్టితోనే ఈ సత్రానికి కావలసిన ఇటుకలు తయారుచేశారు. ఈ సత్రం ప్రత్యేకత ఏమిటంటే చనిపోయినవారికి శాద్ధ్రాలు నిర్వహించే ఏకైక సత్రం కాశీలొ కూడా శాద్ధ్రాలు నిర్వహించడానికి ప్రత్యేకంగా సత్రం లేదు. ఈ సత్రం శిధిలాలు గా ఉన్నది. ఇక్కడ ఉన్న చెరువులొ నిరంతరం నీరు ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఒక క్రీడాప్రాంగణం నిర్మించాలని యోచిస్తున్నది, కాని ప్రజలు దీniకి వ్యతిరేకత చూపించడంతో ఈ చెరువు అభివృద్ధి పరచి కంభాల ఉద్యానవనం మరియు ఒక పడవ షికారు జరపడానికి ఏర్పాట్లు చేస్తోంది.

[మార్చు] రాజమండ్రి సెంట్రల్ జైలు

రాజమండ్రి లొ సందర్శించవలసిన ప్రదేశాలలొ రాజమండ్రి సెంట్రల్ జైలు ఒకటి. సెంట్రల్ జైలు కంభాల చెఱువు నుండి తిన్నగా Y-జంక్షన్ వైపు వెళ్ళితే రాజమండ్రి ప్రభుత్వ కళాశాల(ఆర్ట్స్ కాలేజి) ఎదురుగా 100 మీటర్ల దూరంలొ ఉన్నది.ఇది మెదలుగా ఒక కోట దీనిని 2-3 శతాబ్ధాల క్రితం భారత దేశానికి వర్తకం చెయ్యడానికి వచ్చిన డచ్ వారు నిర్మించారు. తరువా ఈ కోట ఆంగ్లేయుల పరిపాలనలొ కారాగారం క్రింద మార్చబడింది.1847 సంవత్సరము నుండి ఈ కారాగారానికి సెంత్రల్ జైల్ స్థనం కలిపించబడింది. ఈ జైలు 35 ఎకరాల విస్తీర్ణం లొ ఉన్నది. ఈ జైలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లొనే అతి పురాతనమైన, అన్ని రకాల సురక్షిత వ్యవస్థలు కలిగిన జైలు. 1991 సంవత్సరం జైలు కార్యాలయం అందించిన ఆధారల ప్రకారం ఈ జైలు లొ 581 మంది జీవైత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఖైఘీలు, 355 స్వల్ప కాలం జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైధీలు ఉన్నారు.రాజమండ్రి కొంత కాలం డచ్ వారి పరిపాలనలొ ఉన్నది.డచ్ వారు మూడు నిల్వ గదులు ఏర్ఫటు చేశారు, డినిలొ ఆయుధాలు తుపాకులు భద్రపరచుకొనే వారు.ఈ గదులపైన ఒక రంధ్రం ఉన్నది , అవసరం పడి నప్పూదు ఆ రంధ్రం గుండా కావలసిన ఆయుధాలు తీసుకొనేవారు. ఈ గదులు కొలతలు 10 అడుగులు ఎత్తు 10 అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు) ఉంటాయి. ఒక గది రాజమండ్రి సెంట్రల్ జైలు లొ ఉన్నది, రెండవది మునిసిపల్ ఆఫీస్ పశ్చిమ గేటు కి ఎదురుగా ఉన్నది, మూడావది పాత సబ్ కల్టకర్ ఆపీసు వెనిక అప్సర హొటలు దగ్గర ఉన్నది. ఈ గదులను ఇప్పుడు రికార్డులను దాచడానికి తగులపెట్టాడానికి ఉపయోగిస్తున్నారు. 1857 సంవత్సరం లొ ప్రధమ స్వాతంత్ర్య సమరం జరిగాక రాజమండ్రి డచ్ వారి చేతుల నుండి ఆంగ్లేయులకు హస్త గతం అయ్యింది, అప్పుడు ఆంగ్లేయులు ఈ కోటను కారాగారం గా మార్చారు. ఈ కారాగారం లొ ఒక పెద్ద దేవాలయం ఉండేదని ( ఇప్పుఊడ్ లేదు) డి.ఐ.జి. కార్యాల్యం లొ ఉన్న శిలా పలకం చెబుతుంది. ఇంకొ ఆకర్షణ ఈ జైలు లొ గజ లక్ష్మి ( లక్ష్మి దేవి విగ్రహం లక్ష్మి దేవి కి ఇరుప్రక్కల రెండు ఏనుగులు ఉన్నయి) విగ్రహం కనిపిస్తుంది, ఇది గజపతుల రాజ చిహ్నం. గోదావరి నది నుంది ప్రవాహించే ఒక నది పాయ ఈ జైలు లొ ప్రవహించేది, కాని ఆ పాయ మార్గం ఇప్పుడు మారి పోయింది. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు ఎందరో ఈ జైలు లొ ఆంగ్లేయుల చేత ఖైదు చేయబడినారు.

[మార్చు] నాగుల చెరువు

ఇప్పటి మున్సిపల్ స్టేడియం ఉన్న ప్రదేశాన్ని నాగుల చెరువు అని పిలిచేవారు. ఒక శతాబ్ధానికి పూర్వం నాగుల అనే పేరు గల వ్యక్తి సామాన్య జనల కొరకు ఇక్కడ ఒక చెరువు త్రవ్వించాడని ఆయన పేరు మీద ఈ ప్రదేశాన్ని నాగుల చెరువు అని పిలిచేవారు. 1955 సంవత్సరం రాజమండ్రి చైర్మన్ గా ఎన్నికైన క్రీడాకారుడు పోతుల వీరభద్ర రావు ఈ ప్రదేశం లొ 1956 సంవత్సరం లొ ఒక క్రీడాప్రాంగ్రణం నిర్మాణం జరిపించాడు. ఈ క్రీడాప్రాంగణం కేంద్ర మంత్రి సురిత్ సింగ్ మజిగ్య ఫుట్ బాల్ ఆట తో ప్రారంభించాడు. ఇప్పుడూ ఈ ప్రదేశం లో ఉన్న మార్కెట్ ని నాగుల చెరువు మార్కెట్ అనిపిలుస్తారు.

[మార్చు] రంగరాజు పేట

1870 ప్రాంతం లొ ఈ ప్రదేశంలొ రాజస్థాన్ మహారాష్ట్ర నుంది ప్రజలు వలస వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఈ ప్రదేశం ఇప్పటి కోట గుమ్మ వద్ద ఉన్నది. వలస వచ్చిన ప్రజలు అద్దకం వృత్తి మరియు కుమ్మర వృత్తి చేసేవారు. వీరు బోంధిలి మతానికీ చెందినవారు. భారత దేశం లోనే ప్రఖ్యాతి గాంచిన రత్నం కలాలు (రత్నం పెన్నులు) పరిశ్రమ మరియు ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉన్నది.

[మార్చు] వీరభద్రపురం

1910 సంవత్సరం లొ కంభాల చెరువు వద్ద నున్న 100 ఎకరాల స్వంత స్థలాన్ని దువ్వురి వీరభద్ర రావు అనే వ్యక్తి ఇళ్ళ స్థలాలుగా విభజించి బ్రాహ్మలకు అతి తక్కువ వెల కి ,రజకులకు,విశ్వబ్రాహ్మణులకు ఉచితంగా ఇచ్చాడు. ఆ మహామనీషీ జ్ఞాపకార్థం ఈ ప్రదేశాన్ని వీరభద్రపురం అని పిలుస్తారు.ఈ ప్రదేశం ఇప్పటి సుభాష్ నగర్, లలితనగర్ లొకి వస్తుంది. 1930 సంవత్సరం లొ ఇక్కడ నివసించే ప్రజలు రాజమండ్రి పురపాలక సంఘం పరిధిలొకి చేరడానికి నిరాకరించారు. కాని తరువాత ఈ ప్రాంతం పురపాలక సంఘం పరిధిలొకి వచ్చింది.వీరభద్ర రావు కంభాల చెరువు వద్ద ఉన్న ప్రదేశాన్ని రామకృష్ణ మిషన్ కి దానం ఇచ్చారు. ఈ మధ్యకాలంలొ రామకృష్ణ మఠం నుండి కొంత ప్రదేశాన్ని సంగ్రహించి ఆదాయక పన్ను శాఖ తమ కార్యాలయమైన ఆయకార్ భవన్ ఏర్పాటు చేసుకొన్నారు. ఈ కూడళిని వివేకానంద చౌక్ అని పిలుస్తారు. ఇది కంభాల చెరువికి ప్రక్కన వస్తుంది.ఇప్పుడు ఉన్న రామకృష్ణ మిషన్ వారి మఠం ఉన్న ప్రదేశం కూడా దువ్వురి వీరభద్ర రావు దానం చేసిన స్థలమే.

[మార్చు] గౌతమీ గ్రంధాలయం

ఇప్పుడు ఉన్న ఈ గౌతమీ గ్రంధాలయం వాసురయ గ్రంధ్రాలయం మరియు రత్నకవి గ్రంధలయం సముదాయం. ఇవి రెండు చిన్న చిన్న గ్రంధాలయాలు కలుపబడ్డాయి.వాసురయ గ్రంధ్రాలయం వాసుదేవ సుబ్బారాయడు చేత, రత్నకవి గ్రంధ్రాలయం కొక్కొండ వేంకటర్తం చేత స్థాపించబడ్డాయి. గౌతమీ గ్రంధాలయం పేరు 1898 ఇవ్వబడింది, 1920 సంవత్సరం లొ పేరు రిజిష్టరు చేయబడింది.

[మార్చు] ఇన్నీసుపేట

1865 సంవత్సరం లొ అప్పటి సబ్ కలక్టర్ ఇన్నిసిన్ ద్వార వలస స్థావరంగా ఏర్పాటు చెయ్యబడింది. ఇన్నీసుపేట సరిహద్దులు కుమారి టాకీసు నుండి రాజమండ్రి జూనియర్ కాలేజి వరకు. 1910 సంవత్సరం తరువాతనుంది ఇప్పటి వరకు ఇన్నీసుపేట సరిహద్దులు కుమారి టాకీసు నుండి వీరేశలింగం థియోలాజికల్ కళాశాల వరకు విస్తరించబడింది.

[మార్చు] ఆల్కాట్ గార్డెన్స్

దివ్యజ్ఞాన సమాజ కార్యకలాపలు,సమావావేసాలు జరపబదే ఈ ప్రదేశం దివ్య సమాజ నాయకుడైన ఆల్కాట్ పేరు మీద పెట్టబడింది.

[మార్చు] రామదాసు పేట

జానపద గాయకుడైన యెడ్ల రామదాసు పేరు మీద ఈ ప్రాంతం పిలువబడుతోంది. యెడ్ల రామదాసు తన జానపద గేయాలలొ వేదాంతాన్ని ,అహింసావాదాన్ని వ్యాప్తి చేశాడు. రామదాసు పేట కోరుకొండ రోడ్డు మీద టి.బి.శ్యానిటోరియం - క్వారీ కి మధ్య వస్తుంది. ఈ ప్రదేశం ఇ గాయకుడి సమాధి కనిపిస్తుంది. ఈయన టి.బి.శ్యానిటోరియం లొనే క్షయ వ్యాధిగ్రస్తుల మధ్య నివసించేవాడు.

[మార్చు] ఆర్యాపురం

1895 సంవత్సరం లొ అప్పటి సబ్ కలక్టర్ లిస్టర్ ఈ ప్రభుత్వ స్థలాన్ని మూడు వీధులు వచ్చేటట్లు 130 ఇళ్ళ స్థలగా విభజించాడు. తొంభై శాతం ఇక్కడ నివసించేవారు పూజారులు. ఈ ప్రదేశానికి లిస్టర్ పేట అని పేరు పెట్టబడింది,ఈ ప్రాంతంలొ బ్రాహ్మలు నివసించడంతో కాలక్రమంలొ ఆర్యాపురంగా పేరు మార్చారు.1890 సంవత్సరంలొ ఆర్యాపురం రాజమండ్రి పురపాలక సంఘం పరిధిలొకి చేర్చబడింది. ఆర్యాపురం లొ నున్న పాఠశాలకు పూర్వపు సబ్ కలక్టర్ పేరు గుర్తుగా లిస్ట్ర్ పేత మునిసిపల్ హైస్కులు గా నామకారణం చేశారు. 1910 సంవత్సరం లొ ఆర్యాపురం లొ డాక్టర్ ఏ.బి.నాగేశ్వర రావు ఆర్యాపురం గ్రంధాలయం ఏర్పాటు స్థాపించాడు. ఆర్యాపురం లొ నున్న ఆవీధీకి ఏ.బి.నాగేశ్వర రావు వీధి గా పేరు పెట్టారు. ఆర్యాపురం గ్రంధలాయాన్ని శ్రీ రామ బాల భక్త పుస్తక భండాగారం గా పేరు మార్చి వంకాయయలవారి వీధికి మార్చబడింది. 1935 సంవత్సరం లొ సత్యనారాయణ స్వామి వారి దేవలయం నిర్మించబడింది. ఇప్పటికి ఈ అర్యాపురం వాసస్థులు ఎక్కువ మంది బ్రాహ్మణులు.

[మార్చు] సీతం పేట

కాండ్రేగుల వంశానికి చెందిన వారిచేత ఈ ప్రదేశం పండితులకు,శాస్త్రజ్ఞులకు,పూజారులకు వారి తల్లి సీతమ్మ జ్ఞాపకార్థం ఇవ్వబడింది. అందువలన్ ఈ ప్రదేశాన్ని సీతంపేట అని పిలుస్తారు. ఈ ప్రదేశం లొ ఒక చెఱువు ఉండేది, దానిని సీతమ్మ చెఱువు అని పిలిచేవారు , ఆ చెఱువు ఇప్పటి కాలం లొ ఒక ఉద్యానవనం గా మార్చబడింది.

[మార్చు] జాంపేట

విశాఖపట్టణం జిల్లా జామి ప్రదేశములొ కరువు కాటకాలు రావడంతొ అక్కడ నివసించే చేనేత వృత్తిగా కలవారు ఈ ప్రదేశానికి వలస వచ్చారు.రాజమండ్రి పురపాలక సంఘం గౌవ గార్డెన్స్ అనే ప్రదేశాన్ని కొనుగోలు చేసి ఇళ్ళ స్థలాలుగా విభజించి వీరికి అమ్మింది. అందువలన ఈ ప్రదేశాన్ని జాంపేట అని పిలిచేవారు. ఇప్పటికీ వారి వారసులే ఎక్కువగా నివాసం వుంటున్నారు. కాని ఇప్పుడు ఈపేటలో ఒక్క మగ్గం కూడా లేదు. వీరంతా ఎక్కువగా వస్త్రవ్యాపారంలో స్దిరపడ్డారు. జాంపేట కూడలిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని , ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి చేత ఆవిష్కరింబడింది.

[మార్చు] దానవాయిపేట

ఈ ప్రదేశం యొక్క చరిత్ర సరిగా లభించడం లేదు. రెండు అభిప్రాయాలు ఉన్నాయి. మెదటి అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశం రజక నాయకుడైన దానయాయి పేరు మీద పెట్టబడిందని అని చెబుతారు. దానవాయి దానవాయిగుంట అనే చెఱువు త్రవ్వించాడు. రెండవ అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశం లొ సైనిక స్థావరం ఉండేది మరియు ఇక్కడ సైనికుల నివసించేవారు అందువల్ల దాళవాయి అయ్యిందని , అది క్రమంగా దానవాయిపేట గా మారింది అని చెబుతారు.దానవాయిపేట రాజమండ్రి లొ ఒక ప్రముఖ స్థలం దానవాయిపేట లొ మూడు ప్రధాన వీధులు ఉన్నాయి, నగరం లొ ఒక ప్రముఖ ప్రదేశం వ్యాపార కేంద్రాల కార్యాలయకు. ఇక్కడ దానవాయిపేత ఉద్యానవనం ఖూడా ఉన్నది.


[మార్చు] సి.టి.ఆర్.ఐ

భారతదేశములోనే ప్రసిద్దిగాంచిన రీసెర్చ్ సంస్థ ఇది. ఇక్కడ పొగాకు మరియు ఇతర అన్ని రకముల మొక్కలకు సంభందించిన ప్రయోగములు జరుపుతారు. పొగాకు ఉత్పత్తి సంస్థలలో ప్రపంచ ప్రసిద్ది చెందిన సంస్థలలో కూడా సి టి ఆర్ ఐ ఒకటి. దీనిని 1947 లో స్థాపించారు,.

Tobacco cultivation in India was introduced by Portuguese in 1605.

[మార్చు] చమురు సహజ వాయివుల సంస్థ బేస్ కాంప్లెక్సు

చమురు సహజ వాయివుల సంస్థ, తమ యెక్క కృష్ణా గోదావరి ప్రాజెక్టు బేస్ కాంప్లెక్సు, గోల్ఫ్ కోర్టు లను నిర్మించినది.

[మార్చు] దేవాలయాలు

ఉమా మార్కండేశ్వరస్వామి గుడి గోదావరి బండ్ ద్వారం

[మార్చు] శ్రీ వేణుగోపాలస్వామి గుడి

శ్రీ వేణుగోపాలస్వామి రాజమహేన్ద్రి క్షేత్ర పాలకుడు. ఈ గుడి రాజమండ్రి ముఖ్య వీధి లోని ఇప్పటి "పెద్దమసీదు" స్థానములో ఉండేది. 1323 సంవత్సరములో నూర్ హసన్ (మహమ్మద్ద్ బీన్ తుక్లక్) వేణుగోపాలస్వామి గుడిని మసీదుగా (రాయల్ మాస్క్) మార్చెను. అప్పుడు గుడి పూజారులు కంభం వారి సత్రం వీధిలోని ఒక సందులో వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దాచి పూజించేవారు. 14 వ శతాబ్దంలో రెడ్దిరాజులు దేవాలయం నిర్మించి అనపర్తి గ్రామన్ని గుడికి దానం చేసారు. నగర ముఖ్య వీధిలోని రాయల్ మసీదుకు, అప్పటి గుడియొక్క ముఖద్వారము, ద్వారము పైన పద్మము, గుడిలోని 12 దేవాలయ స్తంభాలు, సరోవరం, రాతి కట్టడంతో చదరపాకారములో దిగుడు బావి ఇంకను అలాగే ఉన్నాయి.

[మార్చు] శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి గుడి

మృకండ మహర్షి ఆయన భార్య మరుద్వతికి సంతానం లేకపోవడం చేత శివుడి గురించి తపస్సు చేసి 16 ఏళ్ళు ఆయుష్షు కల సంతానం పొందుతారు. ఆ పిల్లవాడి పేరు మార్కండేయుడు. నారద మహర్షి సూచన మేరపు మార్కండేయుడు గౌతమీ (గోదావరి) తీరం లొ శివ లింగాన్ని ప్రతిష్ట చేసుకొని తపస్సు చేస్తాడు. ఇతిహాసం ప్రకారం ఇక్కడే శివుడు మార్కండేయుడిని యముడి బారి నుండి కాపాడి చిరంజీవత్వం ఇచ్చాడు.మార్కండేయుడే శివ లింగాన్ని అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల ఇక్కడ స్వామి వారిని శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి అని పిలుస్తారు. శాసనాల ఆధారంగా రాజరాజ నరేంద్రుడు, చోళరాజులు, రెడ్డి రాజులు ఆలయ నిర్వహణ జరిపినట్లు తెలుస్తోంది.ఈ దేవాలయ నిర్వహణా భాద్యతలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేవాలయ ధర్మదాయ శాఖ గ్రేడ్ ఒకటి కార్యనిర్వహణాధికారి ద్వారా చేబట్టుతోంది. ఈ దేవాలయం గోదావరి బండ్ మీద ఉన్నది. ఈ దేవలయం ఉన్న ప్రదేశం దగ్గర లో చంద సత్రం శిధిలమైన మసీదు ఉండేది. శిధిలమైన మసీదుని పురావస్తు శాఖ వారు పరిశోధించి ఇక్కడ ఒక శివుని దేవాలయం ఉండేదని నిర్ధారణ జరిపారు. 1818 సంవత్సరం లొ గుండు శోభనాధీశ్వర రావు అనే వ్యక్తి ఈ శివాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం ఉన్న వీధిని గుండు వారి వీధీ అని పిలుస్తారు. ఆలయానికి ప్రధాన ద్వారం గుండు వారి మీద నుంది ఉన్నది. అంతే కాకుండా తరువాతి కాలం లొ గోదావరి బండ్ మీద నుండి ఒక ద్వారం ఏర్పాటు చేశారు. ఇప్పుడు గుండు వారి వీధి లొ ఉన్న ద్వారాన్ని రెండొ పక్షం గా వాడుతూ ప్రధాన ద్వారం గోదావరి బండ్ మీద ఉన్నదానిక్రింద వాడుతున్నారు. నగరం లొ ఇప్పుడు ఉన్న వైశ్య హాస్టలు గుండు శోభనాధీశ్వర రావు వారి ఒకప్పటి నివాసం.

ఉమా మార్కండేశ్వరస్వామి గుడి గుండు వారి వీధి ద్వారం

[మార్చు] శ్రీ సారంగధీశ్వర స్వామి గుడి

సారంగధీశ్వర దేవాలయం రాజమండ్రి నగరం నుంది కోరుకొండ వైపు వెళ్ళే కోరుకొండ రోడ్డు వెళ్తేవచ్చే సారంగధార మెట్టా పై నున్నది. తూర్పు చాళుక్య రాజైన రాజ రాజ నరేంద్రుడు రాజమండ్రి ని రాజధానిగా చేసుకొని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుండేవాడు. రాజరాజనరేంద్రుడినికి సారంగధరుడు అనే కుమారుడు మరియు చిత్రాంగి అనే రెండవ భార్య ఉండేది. రాజరాజ నరేంద్రుడి సవతి తల్లి కుమారుడు విజయాదిత్యుడు రాజ రాజ నరేంద్రుడికి పక్కలొ బల్లం వలే ఉండేవాడు. ఒకరోజు చిత్రాంగి సారంగధారుడిని విందుకు ఆహ్వానించింది, వేట పై ఆసక్తి ఉన్న సారంగధారుడు విందుకు రాకుండా వేటకు వెళ్తాడు. ఆ విషయాన్ని చారులు ద్వారా తెలుసుకొన్న విజయాదిత్యుడు చిత్రాంగి - సారంగధారుడికి అక్రమ సంభంధం ఉన్నదని రాజారాజ నరేంద్రుడి చెబుతాడు. విషయా విషయాలు పరిశీలించకుండా రాజరాజ నరేంద్రుడు సారంగధారుడి రెండు చేతులు, రెండు కాళ్ళు ఖండించాలని శిక్ష వేస్తాడు. సేవకులు రాజాజ్ఞ పరిపాలించి సారంగధారుడిని నగరానికి ఉత్తర దిశలొ అడవులతో నిండిన ఒక ఎత్తైన పర్వతం మీద రెండు చేతులు రెండు కాళ్ళు ఖండించి పాడవేస్తారు. సారంగధారుడు రెండు చేతులు కాళ్ళ నుండి నెత్తురు పారుతూ ఉండగా సారంగధారుడూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు సారంగ ధారుడికి ఆకాశవాణి ద్వారా పూర్వ జన్మలొ చేసిన పాపం వల్ల ఈ శిక్షని అనుభవించవలసి వచ్చిందని, ఈ జన్మ లొ పాపం ఏమి చెయ్యలేదని చెబుతుంది. ఆ ఆర్త నాధం విన్న మేఘనాధ అనే శివ భక్తుడు అక్కడకు వచ్చి సారంగధారుడికి సపర్యలు చేసి, శివుడిని ప్రార్థించమని సలహా చెబుతాడు. సారంగధారుడు మేఘనాధుడి సూచన ప్రకారం శివుడి ఆరాధిస్తే శివుడు ఆ ప్రార్ధన తో సంతృప్తి చెంది సారంగధారుడికి తన పూర్వపు చేతులు, కాళ్ళు మరియు మంచి అందమయిన శరీరాన్ని ప్రసాదిస్తాడు. సారంగధరుడు శివుడి అనుగ్రహం తో పునర్జన్మ పొందిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశం పేరే సారంగధార మెట్ట , ఈ దేవాలయం లొనున్న దేవుడు సారంగధేశ్వరుడు.

[మార్చు] ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం

ఇస్కాన్ శ్రీ కృష్ణ దేవాలయం

జీవిత సభ్యుల సభ్యత్వరుసుములతో మరియు భక్తుల నుండి విరాళాల తో ఇస్కాన్ వారు ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. చాలా అందంగా ఉంటుంది. నగరంలోని దర్శనీయ ప్రదేశాలలో ఇది వొకటి.

[మార్చు] శ్రీ శ్యామలంబ అమ్మవారి గుడి

ఈ గుడి ఛాలా మహీమ గలధి.

[మార్చు] శ్రీ సత్యనారాయణ స్వామి గుడి

[మార్చు] శ్రీ బాల త్రిపుర సుందరి ఆన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి గుడి

[మార్చు] శ్రీ దత్త ముక్తి క్షేత్రం

మైసూరు దత్త పీఠధిపతులు,అవధూత, అష్థ సిద్ధి మహాపురుషులు, నాదబ్రహ్మ పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్ఛిదానంద స్వామీజీ వారిచే, 2008 జనవరి 19 మరియు 20 వ తేదీలలో పవిత్ర గోదావరీ నదీ తీరంలొ, గౌతమీ ఘాఠ్ సమీపంలొ, కుంభాభిషేకం, శ్రీ గణపతి ప్రతిష్ఠ, శ్రీ దత్తాత్రేయ ప్రతిష్ఠ, స్ఫటికలింగ ప్రతిష్ఠ,మరకత పారుకా ప్రతిష్ఠలు జరిగిన మహా పవిత్ర క్షేత్రం.

[మార్చు] రవాణా సౌకర్యాలు

[మార్చు] రోడ్డు రవాణా సౌకర్యాలు

రాజమండ్రి చెన్నై-కలకత్తా ని కలిపే జాతీయా రహదారి -5 మీద ఉన్నది.రాజమండ్రి నగరం లొ రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉన్నది.నగరం లొ రవాణా కు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి. నగరం లొ ముఖ్యంగా ఆర్.టి.సి. బస్సు నిలయం తొ కలిపి, గోకవరం, కోటిపల్లి అనే మెత్తం మూ‌డు బస్టాండ్లు కలవు.

[మార్చు] ఆర్.టి.సి. బస్టాండు

రాజమండ్రి నుండి రాష్ట్రం నలుమూలకు ఆర్.టి.సి. నడిపే బస్సుల తోటి, ప్రైవేటు బస్సుల తోటి కలుపబడుతోంది.రాజమండ్రి బస్సు కాంప్లెక్స్ (బొమ్మ ప్రక్కన ఉన్నది) నుండి తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలొని గ్రామాలకు , పట్టణాలకు తరచు బస్సులు నడుస్తుంటాయి. ఉత్తర కోస్తా పట్టణాలైన కాకినాడ,తుని,అన్నవరం,విశాఖపట్టణం,విజయనగరం,శ్రీకాకుళం,విజయవాడ,తాడేపల్లిగూడెం,ఏలూరు,నిడదవోలు,గుంటూరు కి బస్సులు సర్వీసులు ఉన్నాయి.

రాజమండ్రి బస్సు ప్రధాన నిలయం

[మార్చు] కోటిపల్లి బస్టాండు

కోటిపల్లి బస్టాండు పాల్ చౌక్ వద్ద ఉన్నది. గోదావరి రైలు రోడ్డు వంతెన దిగి రాజమండ్రిలొ ప్రవేశించిన వేంటనే ఈ బస్టాండు వస్తుంది. ఈ బస్టాండు లొ రాజమండ్రి రైలు స్టేషన్ మీదుగా ధవళేశ్వరం వైపుగా రావులపాలెం, అమలాపురం వెళ్ళే ఆర్.టి.సి.బస్సులు, రైలు రోడ్డు వంతెన మీదుగా కొవ్వూరు,నిడదవోలు,పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు,భీమవరం వెళ్ళే ఆర్.టి.సి. బస్సులు ఆగుతాయి. ముఖ్యంగా ఆగేవి ఆర్.టి.సి. బస్సులు, కాని నగరంలొ తిరిగేకొన్ని ప్రైవేటు బస్సులు కూడా ఆగుతాయి. ఈ బస్సునిలయాన్ని ఈ మధ్యకాలంలొ ఐ.టి.సి కంపెనీ వారి సహాయం తొ ఆధునీకరించారు.

[మార్చు] గోకవరం బస్టాండు

గోకవరం బస్టండు ప్రధానంగా ప్రైవేటు బస్సు నిలుస్తాయి.ఈ బస్సు నిలయం గోదావరి రైలు స్టేషన్ కి ఆవల, రాజమండ్రి పురపాలక సంఝం కార్యాలయం వద్ద ఉన్నది.ఈ బస్సు స్టేషన్ నుండి తిన్నగా వెళ్ళితే దేవి చౌక్, కంభాల చెఱువు వస్తుంది.

[మార్చు] రైలు సౌకర్యం

క్రొత్త గోదావరి రైలు స్టేషన్

రాజమండ్రి చెన్నై-కలకత్తా ప్రధాన రైలు మార్గములొ వచ్చే ప్రధాన రైలుస్టేషను.గోదావరి మీద ఉన్న రైలు వంతెనల వల్ల రాజమండ్రి భారత దేశం నలుమూలలకు కలుపబడుతోంది. రాజమండ్రికి రెండు రైలు స్టేషన్లు ఉన్నాయి. మెదటిది గోదావరి రైలు స్టేషన్ (ప్రక్కన బొమ్మ చూడండి) ,రెండవది రాజమండ్రి రైలు స్టేషన్. గోదావరి నది మీద మెదటి రైలు వంతెన (హేవలాక్‌ వంతెన్) 1900 నిర్మించబడినప్పుడు గోదావరి రైలు స్టేషన్ నిర్మించారు. తరువాతి కాలంలొ ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల రెండో రైల్వే లైను సౌలభ్యం కోసం రైలు రోడ్డు వంతెన నిర్మాణం జరిగింది. 19890-1995 సంవత్సరాల మధ్య మూడవ రైలు వంతెన నిర్మాణం జరిగింది.

[మార్చు] గోదావరి రైలుస్టేషన్

గోదావరి రైలు స్టేషన్ రాజమండ్రికి మొట్టమెదటి రైల్వే స్టేషన్. మెదటి రైలు వంతెన కొవ్వూరు నుండి బయలు చేరి గోదావరి స్టేషన్ వద్ద ముగుస్తుంది. ఈ రైలు వంతెన పై చిఅవరి సారి 1996 లొ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ని నడిపి ఈ రైలు వంతెనని మూసి వేసి రైల్వేశాఖ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చింది. మూడవ రైలు నిర్మాణం జరిగాక గోదావరి రైలుస్టేషన్ క్రొద్దిగా గోకవరం బస్టాండు వైపు ప్రక్కకు జరపబడింది.2003 పుష్కరాల సమయంలొ ఈ స్టేషన్ ఆధునీకరించబడింది. ఈ స్టేషన్ మీదుగా కొవ్వూరు నుండి ఉత్తరం వైపు రాజమండ్రి వచ్చే ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ బండ్లు వెళ్తాయి కాని ప్యాసింజర్ బండ్లు మాత్రమే నిలుస్తాయి. రాజమండ్రి నుండి దక్షిణం వైపు కొవ్వూరు, విజయవాడ వెళ్ళే ప్యాసైంజర్ బండ్లు మాత్రమే వెళ్తాయి మరియు ఆగుతాయి. విజయవాడ వైపు వెళ్ళే ఎక్స్‌ప్రెస్ బండ్లు రెండవ రైలు వంతెన (రైలు రోడ్డు వంతెన్) మీదుగా వెళ్తాయి.

[మార్చు] రాజమండ్రి రైలు స్టేషన్

రెండవ రైల్వే లైను సౌకర్యార్థం రోడ్డు రైలు వంతెన నిర్మాణం జరిగాక రాజమండ్రి రైల్వేస్టేషన్ జరిగింది. కోస్తా జిల్లాలలొ విజయవాడ-విశాఖపట్టణం నగరాల మధ్యనున్న ముఖ్య రైలు స్టేషన్. ఈ స్టేషన్ లొ ఆని రైలు బండ్లు ఆగుతాయి.

[మార్చు] విమాన సౌకర్యం

నగర శివార్లలొ ఉన్న మధురపూడి లొ రాజమండ్రి విమానశ్రయము ఉన్నది.ఇక్కడ నుండి ప్రతీ రోజు పగటి పూట ఎయిర్ దక్కను వారు మరియు జెట్ ఎయర్ వెస్ వారు [హైదరాబాదు]] కి విమానాలు నడుపుతున్నారు

[మార్చు] జలరవాణా సౌకర్యాలు

రైలు వంతెన మరియు రోడ్డు వంతెన వచ్చాక జల రవాణా మీద ప్రజలు ఆధారపడడం లేదు. కాని జలరవాణా పర్యాటక రంగం ఊపందనుకోవడం వల్ల మళ్ళి జీవము వస్తున్నది. ఇక్కడ నుండి పాపి కొండలకు,భద్రాచలం మరియు పట్టిసీమ కు లాంచీ సదుపాయం ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ వారు కూడా లాంచీలు నడుపుతున్నారు.

[మార్చు] పరిశ్రమలు

  • భారత దేశము మొత్తానికి కాగితము సరఫరా చేస్తున్న పరిశ్రమలలొ అగ్రగామి గా నిలుస్తున్న సంస్థ- ఏ.పి.పేపర్ మిల్స్ - ఈ పరిశ్రమ రాజమండ్రి చుట్టు ప్రక్కల ఊరి వారికి జీవనాధారముగా కూడా ఉన్నది.
  • సెంట్రల్ టొబాకో రిసెర్చ్ ఇనిస్టిస్టుట్ (CTRI) ఇండియన్ లీఫ్ టొబాకో డివిజన్ వారి సమన్వయం తో రాజమండ్రి లొ పని చేస్తున్నాయి.
  • విజ్జేశ్వరం సహజవాయువు తో విద్యుత్తు తయారు చేసే కేంద్రము.
  • ఓ.ఎన్.జి.సి. చమురు మరియు సహజ వాయివు సంస్థ (ONGC)(Navaratna)వారి కృష్ణ-గోదావరి బేసిన్ ప్రాజెక్టు కార్యాలయాలు రాజమండ్రి నందు ఉన్నాయి.
  • కోస్టల్ పేపర్ మిల్స్
  • సథరన్ డ్రగ్స్ అండ్ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ అనే మందుల కంపెనీ
  • హారిక్ల్స్ ఫ్యాక్టరీ స్మిత్ క్లైన్ బీచ్‌హమ్‌ కన్సుమర్ హెల్త్ కేర్ లిమిటెడ్ వారి హారిక్స్ల్ ఫ్యాకటరీ ధవళేశ్వరం వెళ్ళే మార్గములొ ఉన్నది.
  • కడియం పేపరు మిల్లు - కడియం
  • జి.వి.కె. ఇండట్రీస్‌ మరియు జేగురుపాడు విద్యుత్తు కేంద్రము - జేగురుపాడు
  • రాజమండ్రి కో.ఆఫ్‌. స్పిన్నింగ్‌ మిల్స్ లిమిటెడ్- లాలాచెఱువు
  • సర్వరాయ సుగర్స్‌ ప్రైవేటు లిమిటెడ్ (కోకొ కోలా బాట్లింగ్‌ లిమిటెడ్)-వేమగిరి
  • నైలోఫిల్స్‌ ఇండియా లిమిటెడ్‌ - గుండువారి వీధి లొ ఆఫీసు. కర్మాగారము - ధవళేశ్వరం
  • గోదావరి సిరమిక్స్ - పిడింగొయ్యి

[మార్చు] గోదావరి పుష్కరాలు


[మార్చు] దృశ్యమాలిక

పేజీకి సంభందించిన లింకులు