అడివి బాపిరాజు

వికీపీడియా నుండి

అడివి బాపిరాజు (Adivi Bapiraju) (1895 - 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.


అడివి బాపిరాజు
Telugu writer adivibapiraju.jpg
జననం అక్టోబరు 8, 1895
భీమవరం
మరణం సెప్టెంబరు 22, 1952
ఇతర పేర్లు బాపిబావ
వృత్తి కవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు
తండ్రి కృష్ణయ్య
తల్లి సుబ్బమ్మ


బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజన్ సంపాదకునిగా పని చేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారుని ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.


బాపిరాజుకు చిన్ననాటినుండీ కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాధ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.


1922లో సహకార నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.

సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించాడు.


[మార్చు] రచనలు

నవలలు


రేడియో నాటికలు
  • దుక్కిటెద్దులు
  • ఉషాసుందరి
  • bhogiraloya ?
ప్రసిద్ధి చెందిన కధలు
  • తూలికా నృత్యం
  • హంపీ శిధిలాలు
  • శిల్పబాల
  • వీణ
దర్శకత్వం వహించిన సినిమాలు

మరెన్నో కధలు, గేయాలు రచించాడు. కొన్ని కధలు కన్నడ భాషలోకి అనువదింపబడ్డాయి.

[మార్చు] వనరులు, బయటి లింకులు

  • http://www.vepachedu.org/Bapiraju.html లో వ్యాసం - ఎమ్.ఎల్.నరసింహారావు 'నూరుగురు తెలుగు ప్రముఖులు' ఆధారంగా వ్రాసినది.
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు