భీమవరం
| ?భీమవరం నగరం ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 5 మీ (16 అడుగులు) |
| జిల్లా(లు) | పశ్చిమ గోదావరి జిల్లా |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
2,19,212 (2001) • 110880 • 108332 • 78.32 • 82.99 • 73.55 |
| కోడులు • వాహనం |
• AP 37 |
భీమవర౦, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా లోని ప్రముఖ నగరం మరియు అదే పేరుగల ఒక మండలము.పంచారామాల్లో ఒకటైన భీమారామం భీమవరంలోనిదే. చంద్రునిచే ప్రతిష్టించబడిన లింగము కనుక సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు.ఇది చంద్రశిల అగుటచే పొర్ణమికి తెల్లగానూ అమావాస్యకు గోధుమ వర్ణంలోకి మారుతుంది.
విషయ సూచిక |
భీమవరం చరిత్ర [మార్చు]
కాగిత.వర ప్రసాద్. 09.09.1980) గారి
పంచారామములలొ ఒకటైన ఈ భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రం. తూర్పు చాళుక్య రాజైన భీమ క్రీ.శ. 890-918 సంవత్సరాల మధ్య ఇక్కడ సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశాడు.ఈ దేవాలయం ఇప్పుడు గునుపూడి లొ ఉన్నది. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ నగరం భీమవరం అని పేరు వచ్చింది. క్రీ.శ.1120-1130 సంవత్సరాల మధ్య ప్రక్కను ఉన్న విస్సాకోడేరు,ఉండి,పెద్దఅమిరమ్ గ్రామాలకు రహదారి ఏర్పడింది.స్వాతన్త్ర ఉద్యమ కాలం లొ పూజ్య బాపూజీ భీమవరం నగరానికి 'రెండవ బార్దొలి' అని బిరుదు ప్రధానం ఛేశారు.
మావుళ్ళమ్మ దేవస్థానం [మార్చు]
- ప్రధాన వ్యాసము కొరకు చూడండి. మావుళ్ళమ్మ దేవస్థానం-భీమవరం
భీమవరం నగరానికే తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుళ్ళమ్మ గుడి. నగర నడిబొడ్డున కొలువు తీరిన మావుళ్ళమ్మ దేవస్థాన ఆదాయం పశ్శిమ గోదావరి జిల్లా లో ఏ ఇతర గ్రామ దేవతల దేవాలయాలకూ లేనంత ఉంటుంది. ప్రతి సంవత్సరం కేవలం ఉత్సవాల కొరకు విద్యుత్ చార్జీలే లక్షలు చెల్లిస్తారు. దేవస్థాన ఆవరణలో కల కొటికలపూడి గోవిందరావు కళా వేదికపై సినీ నటులచే పలు సాంస్కౄతిక ప్రదర్శనలు, ప్రఖ్యాత నటీనటులకు సన్మానాలు చేస్తారు.ఇక్కద నిత్య అన్నదానమ్ జరుగును.
భీమారామం [మార్చు]
భీమవరంలోని సోమేశ్వరస్వామి దేవాలయం (భీమారామం) పంచారామాలలో ఒకటి. ఈ భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో కలదు. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడుతుంది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.
శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము కృమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి బూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయం ముందు కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
శాసనసభా నియోజకవర్గం [మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శాసనసభలో భీమవరం ఒక నియోజకవర్గం.
జిల్లాలోని నగరాలు [మార్చు]
- భీమవరం
- ఏలూరు
నగరలోని నాటి, నేటి ప్రముఖులు [మార్చు]
- మలపాక సూర్యనారాయణ
- అల్లూరి సీతారామరాజు భీమవరం దగ్గరలొని మొగల్లు గ్రామానికి చెందినవారు
- భూపతిరాజు రామకృష్ణంరాజు
- ప్రముఖ శాస్త్ర వేత్త డా|| యల్లాప్రగడ సుబ్బారావు
- రాం గొపాల్ వర్మ - ప్రముఖ సిని దర్షకుడు
- త్రివిక్రం శ్రీనివాస్ - ప్రముఖ సిని దర్షకుడు
- ఇందుకూరి సునీల్ వర్మ - ప్రముఖ సిని హాస్య నటుడు
గ్రామాలు [మార్చు]
- అన్నవరం (భీమవరం)
- బేతపూడి
- చినమిరం
- దిరుసుమర్రు
- కొమరాడ
- కొవ్వాడ
- లొసరిగుట్లపాడు
- నరసింహాపురం
- రామాయనపురం
- రాయలం
- తాడేరు
- తుండుర్రు
- వెంప
- యనమదుర్రు
- గొల్లవానితిప్ప
గ్రేటర్ భీమవరం [మార్చు]
పురపాలక సంఘానికి మూడు కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను విలీనం చేస్తున్నట్లు తీర్మానం కౌన్సిల్ ఆమోదించింది. ప్రస్తుతం 39వ వార్డులతో ఉన్న పురపాలక సంఘం సుమారు 3.50 లక్షల మంది జనాభాను కలిగి ఉంది. దానికితోడు రాయలం, చినఅమిరం, నర్సింహపురం, కొవ్వాడ, కుముదవల్లి, విస్సాకోడేరు, తాడేరు పంచాయతీల విలీనం జరిగితే గ్రేటర్ కార్పొరేషన్ (గ్రేటర్ సిటీ) అవుతుంది.
జనాభా [మార్చు]
| వూరు | నివాసాలు | జనాభా | పురుషులు | స్త్రీలు |
| భీమవరం మండలం | 52105 | 219212 | 110880 | 108332 |
| భీమవరం గ్రామీణ | 19420 | 77148 | 38951 | 38197 |
| భీమవరం నగర | 32685 | 142064 | 71929 | 70135 |
| అన్నవరం | 359 | 1474 | 669 | 805 |
| నరసింహాపురం | 525 | 2122 | 1118 | 1004 |
| కొవ్వాడ | 612 | 2283 | 1120 | 1163 |
| చినమిరం | 1048 | 4182 | 2071 | 2111 |
| రాయలం | 1006 | 3990 | 2045 | 1945 |
| తాడేరు | 974 | 3645 | 1842 | 1803 |
| యెనమదురు | 852 | 3811 | 1912 | 1899 |
| కొమరాడ | 545 | 2117 | 1092 | 1025 |
| ఆనకోడేరు | 1539 | 5754 | 2947 | 2807 |
| లోసరిగుట్లపాలెం | 5569 | 22680 | 11447 | 11233 |
| దిరుసుమర్రు | 2146 | 8917 | 4483 | 4434 |
| బేతపూడి | 946 | 3550 | 1813 | 1737 |
| తుండుర్రు | 1456 | 5562 | 2800 | 2762 |
| వెంప | 1843 | 7061 | 3592 | 3469 |
మూలాలు, వనరులు [మార్చు]
బీమవరం నగరం చుట్టు ప్రక్కల 300 గ్రామాల ప్రజలకు బీమవరం ప్రధాన వాణిజ్య కూడలి.
బయటి లింకులు [మార్చు]
|
|||||||
|
||||||||||||||||||||