కోనసీమ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కోనసీమ
గౌతమీనది దృశ్యము.అప్పనపల్లివద్ద

కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి', దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి ప్రధాన వృత్తి వ్యవసాయం. 1996 సంవత్సరంలో కోనసీమలో తుఫాను వచ్చి పెను నస్టాన్ని కలిగించినది.[1] మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి చాలా నమ్మకం గల ఆలయం. అమలాపురం నుంచి కాకినాడ రూటులో ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం కలదు. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్రయాణించి ఈ గుడి కి వెళ్ళాలి.

చరిత్ర[మార్చు]

సంస్కృతి[మార్చు]

ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిధి, అభ్యాగతులను ఆదరించడం, పండుగలను, పబ్బాలను సాంప్రదాయానుసారంగా నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు. కోనసీమ గ్రామాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్త ఇప్పటికీ కనబడుతుంది. వివాహ సంబంధ విషయాల్లో కోనసీమకు చెందిన అమ్మాయిలంటే చాలా డిమాండ్.

వ్యవసాయం[మార్చు]

కోరమాండల్ తీరంలో ఆత్యంత సారవంతమైన ప్రదేశం. కోనసీమలో పండించని పంట కానరాదు. పలురకలైన కొబ్బరి మొదలు, అరటి, మామిడి, పనస, సపోటా, బత్తాయి ఇలా పలురకాలు కానవస్తాయి. ఇవేకాక అన్ని రకాల కూరగయలు, పూలమొక్కలు, లంక గ్రామప్రాంతాలలో విస్తారంగా పండిస్తారు.

వ్యవసాయ ఎగుమతులు

కొబ్బరి, పీచు, కూరగాయలు, పూలు, పండ్లు, కోడి గుడ్లు.

పరిశ్రమలు[మార్చు]

కోళ్ళ పారమ్స్, కొబ్బరి ఉత్పత్తులు, చేతి బొమ్మల తయారీ,

కోనసీమ లొని పల్లె ప్రజల మాండలికం[మార్చు]

  • రేవు - తీరం.
  • గోదారి - గోదావరి నది
  • లంక - దీవి
  • డిబ్బ/తిప్ప - నది పరివాహకం వల్ల లంక లొ ఏర్పడిన చిన్న మైదానం
  • మేట - పెద్ద డిబ్బ లేదా తిప్ప ని మేట అని పిలుస్తారు
  • పేట/పాలెం - పల్లె/పట్టణం.
  • కోత - గోదారి తాకిడి లేదా వరదకి నేల(మైదాన ప్రాంతం) అరిగి పోవడం
మాండలికపు ఒక సంభాషణ.

నేను ముందే సెప్పేను(చెప్పాను). సంతకెళ్ళి సేపలట్రమ్మంటే (చేపలు) సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు. కాలవాతల (కాలువ అవతల) పుంతలో పాములున్నయంట. అటేపు ఎల్లొద్దంటే అటేపేఎల్తానంటాడు. తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట. ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు.కొత్తపెల్లికొడుకు పొద్దెరగడు.

ప్రధాన నగరాలు[మార్చు]

కోనసీమలో ఉన్న ప్రధాన ప్రదేశాలు అమలాపురం, రావులపాలెం, రాజోలు, ముమ్మిడివరం,ముక్తేశ్వరం, కొత్తపేట అంబాజీపేట.

రవాణా[మార్చు]

హైదరాబాద్ నుండి కోనసీమలోని ప్రతి నగరానికీ హైటెక్ బస్సు సర్వీసులు కలవు. రాజమండ్రి కోనసీమకు ప్రక్కనే కల పెద్ద నగరం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం మధ్య ఉన్న చించినాడ వంతెన మీదుగా రాజోలు పట్టాణానికి ప్రవేశించవచ్చు.

ఆలయములు[మార్చు]

పలివెల కొప్పేశ్వర స్వామి ఆలయము, మందపల్లి మందేశ్వర (శనీశ్వర) స్వామి

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.newkerala.com/news4.php?action=fullnews&id=4600[అచేతన లింకు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=కోనసీమ&oldid=1078979" నుండి వెలికితీశారు