Coordinates: 18°26′13″N 79°07′27″E / 18.43694°N 79.124167°E / 18.43694; 79.124167

కరీంనగర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Karimnagar district
Lower Manair Dam reservoir, Karimnagar
Lower Manair Dam reservoir, Karimnagar
పటం
Karimnagar district
Location in Telangana
Coordinates (Karimnagar): 18°26′13″N 79°07′27″E / 18.43694°N 79.124167°E / 18.43694; 79.124167
CountryIndia
StateTelangana
HeadquartersKarimnagar
Mandalas16
Government
 • District collectorపమేలా సత్పతి (ఐఏఎస్) (2023 అక్టోబరు 30)
Area
 • Total2,128 km2 (822 sq mi)
Population
 (2011)
 • Total10,05,711
 • Density470/km2 (1,200/sq mi)
 • Urban
30.72%
Demographics
 • Literacy69.16%
 • Sex ratio993
Time zoneUTC+05:30 (IST)
Vehicle registrationTS–02[1]

కరీంనగర్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[2]

జిల్లా సరిహద్దులు[మార్చు]

పటం
కరీంనగర్ జిల్లా

జిల్లాకు ఉత్తరాన ఆదిలాబాద్ జిల్లా, ఈశాన్యాన మహారాష్ట్ర, చత్తీసుగఢ్ రాష్ట్రాలు, దక్షిణాన హన్మకొండ జిల్లా, ఆగ్నేయాన మెదక్ జిల్లా, పశ్చిమాన నిజామాబాదు జిల్లా.

జిల్లా పేరు వెనుక చరిత్ర[మార్చు]

కరీంనగర్, సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణం చేయబడింది. పురాతన కాలం నుండి వేద అభ్యాసన కేంద్రంగా ప్రసిద్ధిపొందింది. పూర్వం ఈ ప్రాంతానికి 'సబ్బినాడు' అని పేరు. కరీంనగర్, శ్రీశైలం లలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల, ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. కరినగరం కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరం కావున ఈ నగరానికి కరినగరం అని పేరు వచ్చింది, కాలక్రమేణా కరీంనగర్ అని పిలువబడుతుంది.

జిల్లా చరిత్ర[మార్చు]

కరీంనగర్‌లో అప్పూలో రీచ్

నిజాం పరిపాలనలో కరీంనగర్ ఒక రాజధాని. మాజీ భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, ప్రసిద్ధ కవులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సినారె), వేములవాడ భీమకవి, గంగుల కమలాకర్ వంటి పలు సుప్రసిద్ధ వ్యక్తులు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. గోదావరి నది ఈ ప్రాంత సౌందర్యమును మరింత ఇనుమడింపజేస్తున్నది. కరీంనగర్ గోండ్లు, కోయలు, చెంచులు, లంబాడీలు, ఎరుకల, తొటి, మొదలైనటువంటి అనేక గిరిజన జాతులకు ఆవాసము. ఈ ప్రాంతీయులు సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో మంచి నిపుణులు.

1905కు పూర్వం ఎలగందల్ జిల్లాగా ప్రసిద్ధి చెందింది.1905లో పూర్వపు వరంగల్‌ జిల్లా నుండి పరకాల తాలూకాను జిల్లాలో కలిపి, లక్సెట్టిపేట, చెన్నూరు తాలూకాలను అదిలాబాద్‌ జిల్లాలో, సిద్దిపేట తాలూకాను మెదక్‌లో చేర్చి జిల్లాను 7 తాలూకాలతో పునర్‌వ్యవస్థీకరించి, కరీంనగర్ జిల్లాగా నామకరణం చేశారు.

కరీంనగర్ కు 30. కి.మీ. దూరంలో గోదావరి నది శాఖైన మూలవాగు తీరంలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి, గోదావరి తీరాన గల ప్రసిద్ధ కాళేశ్వర క్షేత్రం ఈ జిల్లాలో ఉంది. కరీంనగర్ కు ఉత్తరంగా 50 కి.మీ. దూరంలో గోదావరీ తీరంలోని ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. ఇవికాక జగిత్యాల కొండగట్టు దగ్గర శ్రీఆంజనేయస్వామి ఆలయం ఎత్తైన పర్వతంపై ఉంది. హజూరాబాద్ సమీపానగల కొత్తగట్టు వద్ద అరుదైన శ్రీ మత్సగిరీంద్ర స్వామి వారి ఆలయం ఉంది. రామగుండం వద్ద ఉన్న ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా బొగ్గు ముడిపదార్థంగా ఉపయోగించి ఎరువును తయారుచేసిన మొట్టమొదటి ఫ్యాక్టరీ. నల్ల బంగారం ఉత్పత్తిలో సిరులపంట పండిస్తున్న సింగరేణి కాలరీస్ కంపనీ కు, ఖజానాలో ఎక్కువ ఆదాయం లభించేది రామగుండం బొగ్గు గనుల నుంచే.

భౌగోళిక స్వరూపం[మార్చు]

  • వర్షపాతం - 953 మి.మీ.
  • అడవుల శాతం - 21.18
  • నదులు: మానేరు. గోదావరి నది దాదాపు 283 కిలో మీటర్లు ఈ జిల్లాలో ప్రవహిస్తోంది.

నది[మార్చు]

● మానేరు నది

ప్రాజెక్టులు[మార్చు]

● లోయర్ మానేరు డ్యాం

పంటలు[మార్చు]

● వరి,

● పత్తి,

● మొక్క జొన్న,

పార్కులు[మార్చు]

● జింకలు పార్కు, ఉజ్వల పార్క్

పరిశ్రమలు[మార్చు]

నేషనల్ ధర్మల్ పవర్[మార్చు]

రామగుండం వద్ద 2,600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే నేషనల్ ధర్మల్ పవర్ స్టేషను‌లో ఒక భాగమైన ఎన్ టి పి సి (రామగుండం, తెలంగాణ, ఇండియా). ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద విద్యుదుత్పత్తి కేంద్రం. భారతదేశంలో ఐ ఎస్ ఓ 14001 సర్టిఫికేషన్ పొందిన సూపర్ ధర్మల్ పవర్ స్టేషను ఇది మాత్రమే. ఇది అంతర్జాతీయంగా 6వ శ్రేణిలో ఉన్న పవర్ జనరేటర్. దీని స్థాపిత పవర్ కెపాసిటీ 19,435 మెగావాట్లు. నవరత్న ఈ సంస్థ 25 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకుని ప్రభుత్వ సంస్థలలో నవరత్న స్థాయికి చేరుకుంది.

సౌర విద్యుత్తు[మార్చు]

రామగుండం వద్ద 10 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తిని ఎన్.టి.పి.సి. సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ సౌరవిద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది.

సింగరేణి కొలరీస్ కంపెని లిమిటెడ్[మార్చు]

గోదావరీ తీరంలో బొగ్గు అన్వేషణ, వినియోగానికి అధికారయుత సంస్థ సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిఆటెడ్. సింగరేణి బొగ్గు గని దక్షిణ భారతదేశం లోని ఏకక బొగ్గుగని. ప్రస్తుతం తెలంగాణలో అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, పూర్వపు వరంగల్ జిల్లాలలో ఈ సంస్థకు గనులు ఉన్నాయి.

కెసోరామ్ సిమెంట్ కర్మాగారం[మార్చు]

కెసొరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ బిర్లా గ్రూప్ కంపెనీలలో ఒకటి. 1967లో ఇది అవతరించింది. ఒకరోజుకు 2500 మెట్రిక్ టన్నుల సిమెంటును ఉత్పత్తి చేస్తూ ఈ సిమెంట్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన సిమెంట్ ఫ్యాక్టరీ. ఈ కంపెనీ సాంకేతికంగా జాతీయ సాంకేతికతను ఉపయోగిస్తూ అవసరమైనప్పుడు మాత్రమే అంతర్జాతీయ సాంకేతికతను వాడుకుంటున్నది.

గ్రానైట్ పరిశ్రమ[మార్చు]

టాన్ బ్రౌన్, మేపిల్ బ్రౌన్ జాతి గ్రానైట్‌కు కరీంనగర్ జిల్లా అంతర్జాతీయ గుర్తింపును పొందింది. కరీంనగర్ జిల్లాలోని ఒడియారమ్ గ్రామం లోని గ్రానైట్ 2008 ఒలింపిక్స్ క్రీడల సమయంలో చైనా ఉపయోగించుకున్నది. చైనా ఉపయోగించుకున్నప్పటి నుండి ఈ గ్రానైట్ అంతరజాతీయ ముఖ్యంగా ఆసియా దేశాలలో ప్రబలమైంది. జపాన్‌తో సహా ఆసియాదేశాలు కరీంనగర్ గ్రానైట్‌ను వివిధ ప్రాజక్ట్‌లకు ఉపయోగించుకుంటుంది. పలు దేశాలు గ్రానైటును ఉత్తమ నాణ్యత, తక్కువ వెలకు లభించిన కారణంగా వాడుకుంటున్నాయి. కరీంనగర్‌లో మనకొండూరు, మల్లైల్, కేశవపట్టణం, కరీంనగర్ మొదలైన మండలాలలో 600 లకు పైగా క్వారీలు విస్తరించి ఉన్నాయి. అయినప్పటికీ అంతర్జాతీయంగా పేరొందిన క్వారీలు మాత్రం 20. ఒక మాసానికి 10,000 నుండి 12,000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ఉత్పత్తులు కరీంనగర్ నుండి చైనా, ఇతర దేశాలకు ఎగుమతి ఔతుంది. కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఆదాయం ఒక సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఉంటుంది. రైల్వే శాఖ కూడా గ్రానైట్ ఎగుమతుల ద్వారా మంచి అదాయాన్ని పొందుతుంది. గ్రానైట్ రవాణా కొరకు కరీంనగర్, గంగదారా, ఉప్పల్ రైల్వే స్టేషను‌లలో ప్రత్యేక ప్లాట్‌ఫారములు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి గ్రానైట్ చెన్నై, కాకినాడ రేవుల ద్వారా చైనాదేశానికి ఎగుమతి చేయబడుతుంది. ఈ గ్రానైట్ చైనా దేశానికి పంపిన తరువాత అక్కడ పాలిష్ చేయబడి జపాన్ వంటి ఆసియాదేశాలకు అమ్మబడుతుంది. బృహత్తరమైన గ్రానైట్ రాళ్ళను పైకి ఎత్తి పెట్టడానికి ఉపయోగిస్తున్న క్రేన్లు కూడా అనేక లక్షలు సంపాదిస్తున్నాయి. అలాగే గ్రాఫైట్ ఎగుమతుల ద్వారా అనేకమందికి ఉపాధి కూడా లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్ సంస్థలు[మార్చు]

కరీంనగర్ ఇప్పుడిప్పుడే అంకురిస్తున్న ఐటి ప్రొడక్ట్స్, స్టార్టప్స్ యొక్క నిలయం . వీటిలో కొన్ని కంప్లీట్ ఐటి సొల్యూషన్స్, స్ఫూర్తి ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లూ-రే టెక్నాలజీస్, పెన్సిల్ కోడర్స్ లాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెలంగో లాబ్స్ ఐ ఎన్ సి, డి ఐ ఎస్ సి కంప్యూటర్

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

కరీంనగర్ గత రెండు దశాబ్ధాలుగా చుట్టుపక్కల తాలూకాలకు ప్రధాన ఆరోగ్యసంరక్షణా కేంద్రంగా ఉంటుంది. జగిత్యాల, సిరిసిల్ల, రామగుండం, కొడిమ్యాల్, చెప్పియల్, మంథని, హుజూరాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, మల్యాల్, గంగాధర తాలూకాలకు కేంద్రమై ఉన్న కరీంనగర్ ఆరోగ్యసంరక్షణా కేంద్రంగా కూడా ప్రధానమైంది. జిల్లా మొత్తం నుండి రోగులు ఆరోగ్యసంరక్షణ కొరకు కరీంనగర్ మీద ఆధారపడుతుంటారు. ప్రభుత్వాసుపత్రి కూడా రోగులకు తగిన చికిత్స అందజేయడంలో కీలకపాత్ర వహిస్తుంది.

ఆస్పత్రులు[మార్చు]

కరీంనగర్ జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలంలో అశ్వినీ హాస్పిటల్ ఉంది. జిల్లాలోనే మొదటి సారిగా పాము కాటుకు చికిత్స ప్రారంభించింది ఇక్కడే.

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు[మార్చు]

శాసనసభ నియోజకవర్గాలు 4

లోక్‌సభ స్థానాలు: 2

స్థానిక స్వపరిపాలన[మార్చు]

కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన మండలాలు[మార్చు]

భౌగోళికంగా కరీంనగర్ జిల్లాలో పునర్య్వస్థీకరణకు ముందు 57 మండలాలు ఉన్నాయి. పునర్య్వస్థీకరణలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 57 పాత మండలాలు నుండి, కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా 15 మండలాలతో,[4] పెద్దపల్లి జిల్లా 11 మండలాలతో,[5] రాజన్న సిరిసిల్ల జిల్లా 9 మండలాలతో[6] కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4 మండలాలు,[7] సిద్దిపేట జిల్లాలో 3 మండలాలు,[8] పూర్వపు వరంగల్ పట్టణ జిల్లాలో ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో 3 మండలాలు[9] కలిసాయి.

జగిత్యాల జిల్లాలో కలిసిన మండలాలు[మార్చు]

పెద్దపల్లి జిల్లాలో కలిసిన మండలాలు[మార్చు]

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలిసిన మండలాలు[మార్చు]

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలిసిన మండలాలు[మార్చు]

సిద్దిపేట జిల్లాలో కలిసిన మండలాలు[మార్చు]

పూర్వపు వరంగల్ పట్టణ (ప్రస్తుత హన్మకొండ జిల్లా) జిల్లాలో కలిసిన మండలాలు[మార్చు]

కరీంనగర్ జిల్లాలోని మండలాలు[మార్చు]

పునర్య్వస్థీకరణ తరువాత కరీంనగర్ జిల్లాపరిధిలో 12 పాత మండలాలకు అదనంగా 4 కొత్త మండలాలు ఏర్పాటుతో కలిపి 16 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు (కరీంనగర్, హుజారాబాద్), 210 రెవెన్యూ గ్రామాలతో అవతరించింది. అందులో 5 నిర్జన గ్రామాలు.[10][11]

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (4)

రవాణా వ్వవస్థ[మార్చు]

రహదారి మార్గం[మార్చు]

కరీంనగర్ హైదరాబాదుకు 162 కి.మీ., వరంగల్ 70 కిలోమీటర్లు, నిజామాబాదు నుండి150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ జోనల్ ప్రధాన కార్యాలయం కరీంనగర్ జిల్లాలో ఉంది. రోజుకు 2,500 బస్సులు దాటి వెళ్ళే చురుకైన బస్సు స్టేషను‌లలో కరీంనగర్ బస్‌స్టేషను ఒకటి. . ఇక్కడి నుండి హైదరాబాదు, సికింద్రాబాద్కు మాత్రం వాల్వో బస్సుల వంటి అధునాతన బస్సులతో పాటు 300 బస్సులను నడుపుతుంటారు. అలాగే అదిలాబాదు, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, నల్గొండ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ళ, ఒంగోలు, కావలి, కందుకూరు, నెల్లూరు, పుట్టపర్తి, తిరుపతి మొదలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని ఊర్లకు బస్సులు నడుస్తుంటాయి . అలాగే ఇతర ప్రాంతాలైన ముంబాయి, భివంది, శిరిడీ, చంద్రపూరు, గద్చిరోలి, గొండియా, రామ్‌టెక్, అహిరి వంటి మహారాష్ట్రంలోని ఊర్లకు బస్సులను నడుపుతుంటారు. అలాగే కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు వాల్వో బస్సులను నడుపుతుంటారు.

రైలు మార్గం[మార్చు]

కరీంనగర్ రైల్వే స్టేషను వద్ద ఆగిన గూడ్స్ రైలు

కరీంనగర్ సింగిల్ రైల్వే బ్రాడ్ గేజి లైన్ చేత ఉత్తర తూర్పు రైల్వే (ఢిల్లీ నుండి చెన్నై) 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపల్లి వద్ద అనుసంధానించబడి ఉంది.అలాగే కరీంనగర్ నుండి 48 కిలోమీటర్లదూరంలో ఉన్న జగిత్యాల వద్ద ఉత్తర పడమట రైల్వే లైన్‌తో అనుసంధానించబడి ఉంది. ప్రతిరోజు (జగిత్యాల-సిరిపుర్‌కు పుష్-పుల్ పాసింజర్ అప్ అండ్ డౌన్), వారానికి ఒక సారి జగిత్యాల-విజయవాడలకు రైళ్ళను నడుపుతున్నారు. ఈ రైలు ప్రతి మంగళ, గురువారాలలో కరీంనగర్ రైల్వే స్టేషను ద్వారా పోతుంది. గ్రానైట్ రవాణా ద్వారా భారతీయ రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే అతి తక్కువ పట్టణాలలో కరీంనగర్ జిల్లా ఒకటి. అతి సమీపంలోని రైల్వే కూడలి ఖాజీపేట. అక్కడ నుండి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో సహా 147 రైళ్ళు ఈ రైలు మార్గం నుండి నడుస్తుంటాయి. ఈ మార్గం గుండా రాజధాని ఎక్స్‌ప్రెస్, ఎ పి ఎక్స్‌ప్రెస్ నడుస్తుంటాయి. 2009లో భారతీయ రైల్వే గుడ్స్- ఫ్రైట్ రవాణా సమయంలో కరీంనగర్ - జగిత్యాల రైల్వే ప్రథమ స్థానంలో ఉంది.[ఆధారం చూపాలి]భారతప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రణాళికను అనుసరించి, కరీంనగర్ రైల్వే లైన్ల నిర్మాణం పూర్తి అయినట్లైతే, కరీంనగర్ రైల్వే జంక్షన్ తూర్పు- పడమర, ఉత్తర దక్షిణాల రైలు మార్గాను అనుసంధానించే పెద్ద రైల్వే కూడలిగా మారుతుంది.

  • బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం.

వాయు మార్గం[మార్చు]

కరీంనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామగుండంలోని బసంత నగర్ కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న విమానాశ్రయం నుండి భారత ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్న వాయుదూత్ విమానాలు నడిపే సమయంలో సర్వీసులు ఉండేవి. వాయుదూత్ విమాన సేవలను నిలిపి వేసిన తరువాత ఈ విమానాశ్రయం వాడుకలో లేదు. 2010 లో ఈ విమానాశ్రయం చాలా ప్రముఖ వ్యక్తుల విమానాలు నిలపడానికి అత్యవసర పరిస్థితిలో ఎయిర్ ఇండియా విమానాలు నిలపడానికి వాడబడుతుంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణాలోని రెండవ విమానాశ్రయంగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. కరీంనగర్‌కు సమీపంలోని ముఖ్య విమానాశ్రయం 162 కిలోమీటర్ల దూరంలో హైద్రాబాదు శివార్లలో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం .

జనాభా లెక్కలు[మార్చు]

Religions in Karimnagar
Religion Percentage
హిందు
  
80%
ముస్లిం
  
15%
క్రిస్టియన్
  
4%
సిఖ్కు
  
1%
  • రాష్ట్ర వైశాల్యంలో జిల్లా వైశాల్యం శాతం - 4.29
  • రాష్ట్ర జనాభాలో జిల్లా జనాభా శాతం - 4.59
  • నగరీకరణ - 20.55%

2011 భారతదేశ గణాంకాలను అనుసరించి,[12] కరీంనగర్ జనసంఖ్య 2,99,660. వీరిలో పురుషుల శాతం 51% స్త్రీల శాతం 49%. సరాసరి అక్షరాస్యత శాతం 86.75%, ఇది జాతీయ అక్షరాస్యత 74.04% కంటే అధికం: వీరిలో పురుషుల అక్షరాస్యత 92.61%, స్త్రీల అక్షరాస్యత 80.79%. కరీంనగర్‌లో, జనాభాలో 12% అరు సంవత్సరాలకంటే త్క్కువైన వారు.[13]

సంస్కృతి[మార్చు]

  • సంస్కృతి:-

కరీంనగర్ జిల్లాలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు. సంప్రదాయవస్త్రాలైన చీర, ధోవతి లే కాకుండా అధునిక వస్త్ర ధారణ కూడా చేస్తుంటారు.

  • పండగలు:-

కరీంనగర్ ప్రత్యేకత అయిన బతుకమ్మ పండుగను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంలో బతుకమ్మను అందమైన స్థానికంగా లభించే పూలతో అలకంకరించి సామూహికంగా సాంప్రదాయకమైన గీతనృత్యాలతో స్త్రీలు వేడుక చేసుకుంటారు. ఇతర హిందూ పండుగలైన ఉగాది, శ్రీరామనవమి, వినాయకచవితి, హోలి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా, దీపావళి, సంక్రాంతి, మహాశివరాత్రి పండుగలు జరుపుకుంటారు. అలాగే ముస్లిములు రంజాన్, మొహరమ్ వంటి పండుగలు జరుపుకుంటారు. అలాగే క్రైస్తవులు క్రిస్‌మస్, గుడ్‌ఫ్రైడే జరుపుకుంటారు.

  • ఆహార సంస్కృతి:-

కరీంనగర్ జిల్లా ప్రత్యేక ఆహారం పిండివంటలలో సకిలాలు ఒకటి. సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంలో వీటిని ప్రతి ఇంట చేసుకుంటారు. బియ్యపు పిండి, నువ్వులు కలిపి తయారు చేసిన పిండిని నూనెలో దేవి వీటిని తయారు చేస్తారు.

కరీంనగర్‌లో అత్యధికులు హిందువులు. అయినా ఈ ప్రదేశం భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు గుర్తించతగిన ముస్లిం పాలకుల చేత పాలించబడింది. కరీంనగర్‌లో హిందువుల శాతం 80%, ముస్లిముల శాతం 4%, సిక్కులు 1%. కరీంనగర్ జిల్లా అంతటా అనేక హిందూ ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఉన్నాయి. ప్రజలు ప్రతి మతాన్ని గౌరవిస్తూ ఒకరితో ఒకరు సహకారంతో జీవిస్తున్నారు.

సినిమా థియేటర్లు[మార్చు]

  • 1 ప్రతిమ మల్టీప్లెక్సు థియేటర్ (2 తెరలు)
  • 2 భారత్ థియేటర్
  • 3 శ్రీనివాస థియేటర్ ... మల్టీప్లెక్సు (3 తెరలు)
  • 4 వెంకటసాయి థియేటర్
  • 5 శ్రీ తిరుమల థియేటర్
  • 6 రాజ థియేటర్
  • 7 వెంకటేశ్వర థియేటర్
  • 8 తిరందాజ్ థియేటర్
  • 9 శివ థియేటర్
  • 10 సాయికృష్న థియేటర్
  • 11 మమత థియేటర్
  • 12 రోజ్ థియేటర్ (మూసివేయబడింది)
  • 13 బాలకృష థియేటర్ (మూసివేయబడింది)
  • 14 నటరాజ్ థియేటర్ (మూసివేయబడింది)

విద్యాసంస్థలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ వాయవ్యదిశలో ఉన్న విద్యావిషయ ప్రధాన కేంద్రాలలో కరీంనగర్ ఒకటి. కరీంనగర్ అనేక మేధావులను, రాజకీయ నాయకులను, కవులను, సాంకేతిక నిపుణులను పలు దశాబ్ధాలుగా తయారు చేసింది. ప్రధానమంత్రిగా సేవలందించిన పి. వి. నరసింహారావు వారిలో ఒకరు.

కరీనగర్ జిల్లాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు.

ఆకర్షణలు[మార్చు]

కరీంనగర్ జిల్లాలో అనేక విధాల పర్యాటకుల ఆకర్షించే అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అతి ప్రధానమైనవి క్రింద వర్ణించ బడ్డాయి.

చొప్పదండి శివకేశవాలయం ఎక్కడా లేని విధంగా శివుడు, విష్ణువు ముఖద్వారం ఎదురెదురుగా ఉంటాయి.చొప్పదండి సరస్వతి ఆలయం నిర్మాణంలో ఉంది

కరీంనగర్ జిల్లాలో సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో (సిల్వర్ పిలిగ్రి) నాణ్యమైంది.వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే ఈ కళకు కరీంనగర్‌ ప్రసిద్ధి .

ఎల్గండల్ కోట[మార్చు]

కరీంనగర్ జిల్లాలో కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఎల్గండల్ కోట నిర్మించబడి ఉంది. చారిత్రకంగా ఈ ప్రదేశం అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరసు 1774 ఎ డి ఫాఫర్ -ఉద్ - దౌలా చేత నిర్మించబడింది. ముస్లిమ్ సన్యాసులైన సైయద్ షాహ్ మునావర్ క్వాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్, వాలి హైదర్ సాహెబ్ సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.

ఉజ్వలా పార్కు[మార్చు]

కరీంనగర్ జిల్లా ఆకర్షణలలో ఉజ్వలా పార్కు ఒకటి. 2001లో ఈ పార్క్‌కు ప్రారంభోత్సవం జరిగింది. పొన్నం ప్రభకర్ పర్యవెక్ష్నలో ఉంధి ప్రకృతి మనోహరమైన వాతావరణంలో ఉన్న ఈ పార్క్‌ను సందర్శించడానికి కరీంనగర్ నుండి పర్యాటకులు అధికంగా వస్తుంటారు. కరీంనగర్ పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రదేశం ఇది.

దిగువ మానేరు రిజర్వాయర్[మార్చు]

కరీంనగర్ లోని మానేరు రిజర్వాయర్

దిగువ మానేరు రిజర్వాయర్ 1974లో ప్రారంభించబడి 1985లో నిర్మాణపు పనులు పూర్తి చేయబడ్డాయి. వర్షాకాలంలో ఈ రిజర్వాయర్ నీటి మట్టం అత్యధికంగా పెరుగుతుంది.

రాజీవ్ డీర్ పార్కు[మార్చు]

దిగువ మానేర్ రిజర్వాయర్ సమీపంలో ఉన్న 30 ఎకరాల వైశాల్యంలో రాజీవ్ డీర్ పార్కు కరీంనగర్ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఇది కరీంనగర్ శివార్లలో ఉంది.

వేములవాడ[మార్చు]

కరీంనగర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ ఆలయం హిందువులను విశేషంగా ఆకర్షించే అధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుంది. ఈ దేవాలయ కూడలికి అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు.

ధర్మపురి[మార్చు]

కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో హిందూ ఆలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ విష్ణుమూర్తి అవతారలలో ఒకటి అయిన నరసింహస్వామి ఆలయం, దక్షిణామూర్తితో ఉన్న శివాలయం, ఏక శిలలో చెక్కబడిన వినాయకుడు, సప్త మాతృకల శిల్పాలు, మహిషాసుర మర్ధిని అరవై స్తంభాలు కలిగిన ఆలయంలో ఉన్నారు, 5 వందల సంవత్సరాల పూర్వపు శ్రీ సీతారామ ఆలయం, అక్కాపల్లే రాజన్న మొదలైన పవిత్రక్షేత్రాలు ఈ జిల్లాను అధ్యాత్మిక సుసంపన్నం చేస్తున్నాయి.

కొండగట్టు[మార్చు]

కరీంనగర్ 35 కిలోమీటర్లదూరంలో ఉన్న కొండగట్టు వద్ద ఉన్న ఆంజనేయుడి ఆలయం ఉంది. ఈ ఆలయం 300 సంవత్సరాల క్రితం ఒక కౌహర్డ్ చేత నిర్మించబడినదని భావిస్తున్నారు. 160 సంవత్సరాల క్రితం తిరిగి ఈ ఆలయం కృష్ణారావ్ దేశ్‌ముఖ్ గారి చేత పునరుద్ధరణ చేయబడింది. ఈ ఆలయంలో 40 రోజుల దీక్ష వహించి పూజ చేసిన స్త్రీ మాతృమూర్తి ఔతుందని విశ్వసిస్తున్నారు. వేములవాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కరీంనగర్‌ జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి.

ఎల్లారెడ్డిపేట[మార్చు]

కరీంనగర్కు 60 కిలోమీటర్లదూరంలో ఉన్న ఎల్లారెడ్డిపేటలో పూర్వం రాజులు నివసించిన రాజ భవనం, ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలగా రూపుదిద్దుకుంది. ఈ పాఠశాల నుండి దక్షిణన ఉన్న జక్కుల చెరువుకు మధ్యలో ఒక సొరంగం ఉంది. అలాగే ఊరికి తూర్పున శ్రీ రేణుఖామాత ఆలయం ఉంది. ఆ దేవత ఊరి జనాలకు అండగా ఉండి అందరి బాధలను తీరుస్తూ నిత్యపూజలతో కొలువబడుతుంది.

రాయికల్ జలపాతం[మార్చు]

రాయకల్ జలపాతం, వరంగల్ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ జిల్లా కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం దట్టమైన పచ్చని అటవీ ప్రాంతంలోని కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది. 170 అడుగుల ఎత్తులో నుండి కిందికి దూకుతున్న ఈ జలపాతం చుట్టుప్రక్కల ప్రాంతంలోని ఈ సుందర ప్రదేశం పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు కనులవిందును కలిగిస్తుంది.

బౌద్ధక్షేత్రాలు[మార్చు]

ధూళికట్ట, పడుకాపూర్ బౌద్ధక్షేత్రాలు కూడా పరిఢవిల్లాయి.[15]

క్రీడలు[మార్చు]

కరీంనగర్ జిల్లా అనేక క్రీడా సౌలభ్యాలు ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయి వివిధ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.

తీగల వంతెన[మార్చు]

మానేరు నదిపై తీగల వంతెన నిర్మించబడింది.

జిల్లాలో ప్రముఖులు[మార్చు]

పి.వి.నరసింహారావు, సి.నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జి.వెంకట స్వామి, సి.హెచ్.విద్యాసాగర్ రావు, జువ్వాడి చొక్కారావు, ఎం. సత్యనారాయణరావు, సి.హెచ్.హనుమంతరావు, ఘంటా చక్రపాణి, ఈటెల రాజేందర్, రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, దుద్దిళ్ల శ్రీపాదరావు, ముద్దసాని దామోదర్ రెడ్డి, దుగ్గిరాల వెంకట్రావు లాంటి ప్రముఖులు ఈ జిల్లాకు చెందినవారు.

● పైడి జై రాజ్,నటుడు, దర్శకుడు, నిర్మాత.తెలంగాణ నుండి మొదటి దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Telugu States Latest News, Breaking News, News Headlines, Live Updates, Today Top News".
  2. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2020-01-13.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 226, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  5. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 227, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  6. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 228, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  7. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 233, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  8. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 240, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  9. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 231, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  10. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 225, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  11. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో కరీంనగర్ జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine. జూలై 26, 2007న సేకరించారు.
  12. "Population statistics of towns and cities in india". Archived from the original on 2006-11-17. Retrieved 2006-11-17.
  13. "Population, population in the age group 0-6 and literates by sex - Cities/Towns (in alphabetic order): 2001". Archived from the original on 2004-06-16. Retrieved 2004-06-16.
  14. "National Academy of Construction,Karimnagar region centre Tom 'n' Jerry is one of the best school". Archived from the original on 2012-01-03. Retrieved 2012-01-14.
  15. శతవసంతాల కరీంనగర్ జిల్లా (1905-2005), మానేరుటైమ్స్ ప్రచురణ, పేజీ 95

బయటి లింకులు[మార్చు]