రామగుండం
| ?రామగుండము మండలం కరీంనగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | రామగుండము |
| జిల్లా(లు) | కరీంనగర్ |
| గ్రామాలు | 20 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
2,79,323 (2001) • 142247 • 137076 • 66.65 • 75.89 • 57.07 |
రామగుండము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము.
విషయ సూచిక |
పేరువెనుక చరిత్ర [మార్చు]
త్రేతాయుగంలో శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకు వెళ్ళిన విషయం మనకు తెల్సిందే కదా! సీతా రామలక్ష్మణులు అడవుల్లో కాలినడకన వెళ్తుండగా మిట్ట మధ్యాహ్న సమయంలో వారికి ఆకలేసింది. లక్ష్మణుడు గబగబా ఆ పక్కనున్న చెట్ల నుంచి దుంపలు, కాయలు కోసుకొచ్చాడు. సీతాదేవి ఆహారం వండటానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. పొయ్యి ఎంతకీ వెలగకపోతే` రాముడు తమ కులదైవమైన సూర్యుడికి భక్తిగా దణ్ణం పెట్టుకుని పొయ్యి వెలిగించాడు. అంతే... పొయ్యి భగభగమంటూ మండిరది. రాముడు వెలిగించిన పొయ్యి ఉన్న ప్రాంతం కాబట్టి దీనిని రామగుండం అని పిలుస్తున్నారు. అందుకే... ఇక్కడ ఎండలు ఎక్కువ మరి!
చరిత్ర [మార్చు]
కరీంనగర్ జిల్లాలోని రామగుండం అనేటి గ్రామ సమీపమున త్రేతాయుగములో శ్రీ రామ చంద్రుడు సీతా సమేతుడై వనవాస సమయములో పవిత్రమైన గోదావరి నది తీరమందు యున్న రామగుండ మందలి శ్రీ రామ పాదక్షేత్రం యందు విశ్వామిత్రుడు, మహా మునేశ్వరుడు, గౌతముడు, నారాయణుడు, విఘ్నేశ్వరుడు యోధానుయోధులు, ఋషులు, మునులు నివాస ముండి తపస్సు చేసినారు.వీరితో పాటు శ్రీ రామ చంద్రుడు నివసించి స్వయముగా శివలింగ ప్రతిష్టాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు, చారిత్రక ఆధారాలు ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి, మరియు యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, యమకోణం మరియు శ్రీ రామ చంద్రమూర్తి పేరుతో కలుపుకోని ౧౦౮ గుండములు ఏర్పడినవి, ఇట్టి గుండాలు అతి వైభవముగా ఉండేవి (నీటితో నిండి ఉండేవి) కాని కాల క్రమేన అవి కొన్ని కుడుకుపోవడము జరిగినది, ప్రస్తుతము పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే అగుపడును ,మరియు సీతమ్మ వారి వస్త్ర స్థావరము, దశరథ మహరాజుని పిండ పరధానముల స్థావరము, రాములవారిది హల్లు బండ చూడదగిన ప్రదేశములు. అందుకే ఈ ప్రదేశమునకు రామగుండం అన్న పేరు వాడుకలో వచ్చెను.
పాలనా విభాగాలు [మార్చు]
ఇది లోక్ సభ నియోజక వర్గం కేంద్ర స్థానమే కానీ రెవిన్యూ డివిజన్ కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండడు.ఇది పెద్దపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
ప్రముఖ సంస్థలు [మార్చు]
మండలంలోని పట్టణాలు [మార్చు]
- రామగుండం (కొంత భాగం)
- రామగుండం (m)
- పాలకుర్తి (ct)
- గొదావరిఖని
మండలంలోని గ్రామాలు [మార్చు]
- కుక్కలగూడూర్
- వేమునూర్
- మద్దిరియాల
- పోటియల్
- విసంపేట్
- సోమనపల్లి
- ముర్మూర్
- ఎల్లంపల్లి (రామగుండం)
- గోల్వాడ
- అంతర్గావ్
- రాయదన్డి
- బ్రాహ్మణపల్లి (రామగుండము మండలం)
- ఆకెన్పల్లి
- ఏక్లాస్పూర్ (రామగుండం)
- పుట్నూర్
- గుడిపల్లి
- జయ్యారం
- ఎసలతక్కళ్ళపల్లి
- కుందన్పల్లి
- లింగాపూర్
- ఎల్కల్పల్లి
- గోదావరిఖని
- బసంత్ నగర్
ఇవి కూడా చూడండి [మార్చు]
|
|||||||