చెన్నై
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. (అనువాదకులకు వనరులు) |
| ?చెన్నై తమిళనాడు • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • నగరం • ఎత్తు |
181.06 కి.మీ² (70 sq mi)[1] • 1,180 కి.మీ² (456 చ.మై) • 6 మీ (20 అడుగులు) |
| జిల్లా(లు) | చెన్నై • కాంచీపురం • తిరువల్లువార్ |
| జనాభా • జనసాంద్రత • Metro |
4,352,932 (2006) • 24,041/కి.మీ² (62,266/చ.మై) • 7,066,778 (4th) (2007) |
| మేయరు | ఎం. సుబ్రమణియం |
| కమీషనరు | రాజేష్ లఖోనీ |
| కోడులు • పిన్‌కోడు • టెలీఫోను • UN/LOCODE • వాహనం |
• 600 xxx • +91 44 • INMAA • TN-01, 02, 04, 05, 07, 09, 10 |
| వెబ్‌సైటు: www.chennaicorporation.com | |
చెన్నై (ఆంగ్లం : Chennai), పలకడం , (తమిళం : చెన్నై), భారత దేశములోని తమిళనాడు రాష్ట్ర రాజధాని. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరం. చెన్నై నగరము బంగాళా ఖాతము యొక్క తీరమున ఉన్నది.
చెన్నై పూర్వపు పేరు మద్రాసు. ఇది తమిళనాడు రాష్ట్రం రాజధాని. 1952 వరకు ఆంధ్రకు కూడా రాజధాని. మద్రాసు రాజధానిగా వుండే ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచాడు. మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం అన్నాడు శ్రీరాములు. చెన్నై భారత దేశంలోని మహానగరాలలో 4వది. ఈ మహానగరము బంగాళాఖాతం కోరమాండల్ దక్షిణ తీరములో ఉన్నది. 2007 జనాభా గణాంకాల ప్రకారం చెన్నై నగరం జనభా 70.6 లక్షలు[2] ఉండవచ్చునని అంచనా. ఈ ప్రపంచములోనే 34వ మహానగరమైన చెన్నైకి 368 సంవత్సరాల చరిత్ర ఉన్నది.
భారత దేశములో వాణిజ్య మరియు పరిశ్రమల పరంగా చెన్నై నగరము మూడవ స్థానంలో నిలుస్తుంది. అంతే కాదు ఈ నగరములో ఉన్న దేవాలయాల నిర్మాణశైలి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి చెన్నై నగరము కేంద్రబిందువు. భారతదేశములోని వాహన నిర్మాణ (ఆటో మెబైల్) పరిశ్రమలు అన్నీ చెన్నై నగరంలో కేంద్రీకరించబడి ఉన్నాయి. అన్ని వాహననిర్మాణ పరిశ్రమలు ఉండడం వల్ల ఈ నగరాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఆగ్నేయా ఆసియా అని కూడ పిలుస్తారు[3]. ఔట్ సోర్సింగ్ కూడా చాలా మటుకు చెన్నై నగరము నుండి జరుగుతోంది. ఈ నగరము బంగాళా ఖాతం తూర్పుతీరం వెంబడి ఉండడం వల్ల ఈ నగరానికి 12 కి.మీ. బీచ్ రోడ్ ఉన్నది దీనినే మెరీనా బీచ్ అని పిలుస్తారు. ఈ నగరములో క్రీడల పోటీలు కూడా నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధికి చెందిన ఏ.టి.పి. టెన్నిస్ పోటీలు, చెన్నై ఓపెన్ టెన్నీస్ పోటీలు నిర్వహించబడతున్నాయి.[4][5] గిండీ జాతీయ వన్యప్రాణి సంరక్షణాలయం ఈ నగర పొలిమేర్లలోనే ఉన్నది. వన్యప్రాణీ సంరక్షణాలయాలు మహానగరాల పొలిమేర్లలో ఉండటం ప్రపంచములోనే అరుదు. అమెరికాలో కొలరాడో రాష్ట్రములో ఉన్న డెన్వర్ నగరములో కూడా వన్యప్రాణీ సంరక్షణాలయం నగర పొలిమేర్లలో ఉండడంవళ్ల చెన్నైని డెన్వర్ తో పోలుస్తారు. చెన్నైని డెన్వర్ కి సోదర నగరముగా చెబుతారు.
విషయ సూచిక |
[మార్చు] నగరం పేరు వెనుక కథ
వేంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు ఈ పట్టణాన్ని పాలించేవాడని, నగరానికి ఈ పేరు చెన్నప్ప నాయక నుండి వచ్చిందని చెబుతారు.[6] 1639 సంవత్సరంలో బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇండియాని ఆక్రమించుకొని వలసస్థావరముగా ఏర్పరచుకొన్నప్పుడు మద్రాసపట్నం అని అది కాలక్రమంలో మద్రాసుగా మార్పు చెందింది. మద్రాసపట్నానికి దక్షిణానికి ఉన్న చిన్న పట్టణం చెన్నపట్టణాన్ని రెండిటినీ కలిపి బ్రిటీష్ వారు మద్రాస్ గా పిలవడం ప్రారంభించారు. కానీ నగరవాసులు మాత్రము చెన్నపట్టణం లేదా చెన్నపురి అని పిలవడానికే ఇష్టపడతారు. 1996 ఆగష్టు మాసంలో నగరం పేరు మద్రాసు నుండి చెన్నైగా మార్చబడింది.[7]. మద్రాసు పేరు పోర్చుగీసు వారి నుండి వచ్చిందనే మరో వాదన కూడా కలదు.as the name Madras was perceived to be of Portuguese origin. (A number of other Indian cities have enacted similar name changes.) It is believed that the original Portuguese name is Madre de Deus. The oldest church in the city, built in the 1516 and dedicated to Nossa Senhora da Luz ('Our Lady of Light') by Portuguese Franciscan missionaries, who believed they owed their survival in rough seas to her divine intervention, could be linked to this. Another version by the city's historian S. Muthiah holds that the city derived its name from the once prominent Madeiros family (variously known as Madera or Madra in succeeding years), who in 1575, adding to the confusion, also consecrated a Madre de Deus church in Santhome (demolished in 1997). There have been, however, suggestions that Chennai may not be a Tamil name while Madras may be of Tamil origin.[ఆధారం కోరబడినది] Another (unproven) theory is that Chennapattinam was named after the Chenna Kesava Perumal temple which later on became Chennai.[ఆధారం కోరబడినది] One more theory suggests that Chennai is derived from the name of the original owner of the land Chinnappa Naicker. He is said to have sold his land to the East India Company to set up a base for the Madras Presidency[ఆధారం కోరబడినది].
[మార్చు] నగర చరిత్ర
చెన్నై పట్టణానికి క్రీ.శ. ఒకటో శతాబ్ధం నుండి చరిత్ర కలదు. ఈ నగరము రాజకీయంగాను, వాణిజ్యపరముగాను, సైనికపరముగాను, అధికార నిర్వహణపరముగాను శతాబ్ధాలనుండి ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ ప్రముఖ సామ్రాజ్యాలు పరిపాలించాయి. వీరిలో ముఖ్యముగా పల్లవులు, విజయనగర రాజులు,పాండ్యులు, చోళులు ముఖ్యమైనవారు. ఇప్పుడు చెన్నై నగరములో ఒక ప్రాంతమైన మైలాపూరు పల్లవులు రాజ్యము చేస్తున్న సమయములో ఒక ప్రముఖ నౌకాశ్రయము(ఓడ రేవు). 1522 సంవత్సరములో పోర్చుగీసు వారు ఇక్కడకు వచ్చారు. వారు క్రైస్తవ గురువైన సంత థామస్ పేరు మీద మరో ఓడరేవును నిర్మించుకొని దానికి సెయింట్ టోమ్ అని పేరు పెట్టారు. థామస్ ఇక్కడ 1552-70 మధ్య సంవత్సరాలలో మత ప్రచారం చేసాడు. ఆ తరువాత పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గింది. 1612లో డచ్ వారి ప్రాబల్యం పెరిగింది. డచ్చివారు డచ్ ఇండియా కంపెనీని చెన్నై నగరానికి ఉత్తరంగా పులికాట్లో ఏర్పాటు చేసుకొన్నారు. 1639 ఆగష్టు 22వ తారీఖు (దీనినే ఫ్రానిన్స్ డే అంటారు) బ్రిటీష్ వారు అప్పటి విజయనగర రాజైన పెద వేంకటరాయలు అనుమతితో కోరమాండల్ తీరములో చిన్న భాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాన్ని పెట్టుకోవడానికి, వర్తకం జరుపుకోవడానికి తీసుకొన్నారు. ఈ ప్రదేశం అప్పట్లో వండవాసి పాలకుడు దామెర్ల వేంకటపతి నాయకుని ఆధ్వర్యములో ఉండేది.
ఒక ఏడాది పోయాక సెయింట్ జార్జి కోటను బ్రిటీష్ వారు నిర్మించుకొన్నారు. తరువాత కొన్ని రోజులలో ఈ ప్రదేశము అంతా వారి వలసకు కేంద్ర స్థావరము అయ్యింది. 1746 సంవత్సరములో సెయింట్ జార్జి కోటను ఫ్రెంచ్వారు జనరల్ బెర్టండ్ ఫ్రానిన్స్ మహె డి లా బౌర్డన్నాయిస్ (మారిషస్ గవర్నర్) నేతృత్వంలో ఆక్రమించుకొన్నారు.
1749లో మళ్లీ ఆంగ్లేయులు ఈ ప్రదేశము మీద తమ పెత్తనాన్ని ఐక్స్ లా చాఫెల్ సంధితో సంపాదించుకొన్నారు. ఆధిపత్యాన్ని సంపాదించుకొన్నాక ఫ్రెంచ్ వారి ఆక్రమణల నుండి మరియు మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ ఆక్రమణల నుండి రక్షించుకోవడానికి తమ బలగాలను ద్విగుణీకృతము చేసి రక్షణను పటిష్టం చేసుకొన్నారు. 18వ శతాబ్దం వచ్చేసరికి ఇప్పటి తమిళనాడులోని చాలా భాగం, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని కొంత భాగాలతో మద్రాసు ప్రెసిడెంసీని మద్రాసు (చెన్నై) రాజధానిగా ఏర్పాటు చేసుకొన్నారు.బ్రిటీష్ వారి పరిపాలనలో నగరం వృద్ధి చెందింది మరియు ప్రముఖ యుద్ధ నౌకాస్థావరముగా కూడా మారింది.
Under British rule the city grew into a major urban centre and naval base. With the advent of railways in India in the late 19th century, it was connected to other important cities such as Mumbai (formerly known as Bombay) and Kolkata (formerly Calcutta), facilitating communication and trade with the hinterland. It was the only Indian city to be attacked by the Central Powers during World War I, when an oil depot was shelled by the German light cruiser SMS Emden. After independence in 1947, the city became the capital of Madras State, which was renamed Tamil Nadu in 1969. From 1965 to 1967, Chennai was an important base for the Tamil agitation against the imposition of Hindi.
In 2004 the Indian Ocean tsunami lashed the shores of Chennai, killing many and permanently altering the coastline.
[మార్చు] నగర రవాణా వ్యవస్థ
చెన్నైని దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారంగా పిలుస్తారు. చెన్నై నగరం దేశం నలుమూలలతోనూ మరియు అంతర్జాతీయ స్థానాలకు కలపడుతోంది. చెన్నై నుండీ ఐదు జాతీయ రహదారులు కలకత్తా, బెంగుళూరు, తిరుచినాపల్లి, తిరువళ్ళూరు మరియు పుదుచ్చేరి.[8] కి బయలు దేరుతాయి. చెన్నై ముఫసిల్ బస్ టర్మినస్ (సి.యం.బి.టి.) నుండి తమిళనాడు బస్సు సర్వీసులు మరియు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు బయలు దేరుతాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏడు రవాణా సంస్థలు నగరంతో పాటూ, తమిళనాడు రాష్ట్రంలోనూ, అంతర్-రాష్ట్ర బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు కాకుండా అనేక ప్రైవేటు రవాణా సంస్థలు కూడా ఉన్నాయి.
[మార్చు] విద్యాసంస్థలు
[మార్చు] ప్రాధమిక, మాధ్యమిక విద్య
చెన్నై నగరంలో తమిళనాడు ప్రభుత్వంచే నడపబడే పాఠశాలు, ప్రైవేటు పాఠశాలలు, ఉమ్మడిగా (ప్రభుత్వ ప్రైవేటు రంగం ఉమ్మడి నిధులతో) నడిచే పాఠశాలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో బోధనా మాధ్యమం ఆంగ్లము, ప్రభుత్వ రంగం పాఠశాలలో బోధనా మాధ్యమము ఆంగ్లము కానీ, తమిళం గానీ ఉండవచ్చు. ఉన్నత విద్యలకు అవకాశం ఉన్నందున తమిళనాడు ప్రజలు ఆంగ్ల మాధ్యమాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రైవేటు రంగ పాఠశాలలు తమిళనాడు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో అనుసంధానమై ఉంటాయి. కొన్ని పాఠశాలలో సి.బి.యస్.సి. లేదా ఐ.సి.యస్.సి. లేదా ఆంగ్లో-ఇండియన్ బోర్డు (మాంటిస్సెరీ పద్ధతి) కి అనుసంధానంగా పాఠ్యాంశాల బోధన ఉంటుంది. కొన్ని విద్యాలయాలు అంతర్జాతీయ బాక్యులరేటు లేదా అమెరికన్ విద్యా పద్ధతులను కూడా అనుసరిస్తున్నాయి. పాఠశాల విద్య 3వ ఏట కిండర్ గార్డెన్‌తో ప్రారంభం అవుతుంది. రెండు ఏళ్ళ తరువాత ఒకటి నుండి పన్నెండు తరగతుల వరకు పాఠశాలలో విద్య నడుస్తుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన తరువాత ఉన్నత విద్య కోసం వృత్తి విద్యల వైపు కానీ అకాడెమిక్ రంగాల వైపు గాని ఎన్నుకోవచ్చు.
[మార్చు] ఉన్నత విద్య
1857 సంవత్సరములో ఏర్పాటు చేయబడిన మద్రాసు విశ్వవిద్యాలయానికి మూడు క్యాంపసులు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయములో అనేక విభాగాలలో (విజ్ఞాన శాస్త్రము, వాణిజ్య శాస్త్రము, వివిధ కళలు, వైద్య శాస్త్రము, న్యాయ శాస్త్రము మొదలైనవి) ఉన్నత విద్యలు అభ్యసించే అవకాశము ఉన్నది. నగరములో ఉన్న అనేక కళాశాలలు ఈ విశ్వవిద్యాలయముతో అనుసంధానము చేయబడి ఉన్నవి. మద్రాసు విశ్వవిద్యాలయము కంటే పురాతనమైన విద్యాసంస్థలు కూడా ఉన్నవి. 1835లో స్థాపించబడిన మద్రాసు మెడికల్ కాలేజి, 1837లో స్థాపించబడిన మద్రాసు క్రిస్టియన్ కళాశల, 1840లో స్థాపించబడిన ప్రెసిడెన్సీ కళాశాల, 1842 స్థాపించబడిన పచ్చయప్ప కళాశాల మెదలైనవి కొన్ని ఉదాహరణలు. 1938లో స్థాపించబడిన స్టాన్లీ మెడికల్ కాలేజి, 1946లో ప్రారంభించబడిన వివేకానంద కాలేజి 1951లో మెదలు పెట్టిన న్యూ కాలేజి, చెన్నై మరికొన్ని ప్రముఖ విద్యాసంస్థలకు ఉదాహరణలు. ఈ విద్యాసంస్థలు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుసంధానించబడి పనిచేస్తాయి. ఇవి కాకుండా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిన విద్యాసంస్థలలో ముఖ్యమైనవిక్వీన్ మేరి కాలేజి (1914), ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి (1915), లయోలా కాలేజి (చెన్నై) (1925), స్టెల్లా మేరీస్ కాలేజి, (1947) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజి (1995), ఏషియన్ కాలేజి ఆఫ్ జర్నలిజం (2000) మరియు మద్రాసు స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ (1952).
భారతదేశములో సాంకేతిక విద్యకు ప్రసిద్ధి చెందిన ఐ.ఐ.టి. మద్రాసు నగరానికి దక్షిణ భాగంలో అంతర్జాతీయా ఖ్యాతి గాంచిన ఈ ఐ.ఐ.టి. 1959లో స్థాపించబడింది. ఈ ఐ.ఐ.టి. ప్రక్కగా అన్నా విశ్వవిద్యాలయం (1978) ప్రధాన ప్రాసాదం ఉన్నది. గుండి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ (1794), మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (1949) అలగప్ప కాలేజి అఫ్ టెక్నాలజి (1944) స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (1957) విలీనం చేయగా ఏర్పడింది అన్న విశ్వవిద్యాలయం. తమిళనాడులోని ఇంజనీరింగ్ కళాశాలలన్నీ అన్నా విశ్వవిద్యాలయానికి అనుసంధించబడి ఉంటాయి. మిగిలిన ఇంజనీరింగ్ కళాశాలల పట్టాలు స్వతంత్ర ప్రతిపత్తి కలవై ఉంటాయి.
1891 సంవత్సరములో స్థాపించబడిన డా. అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల చెన్నైలోని ప్రాచీన న్యాయశాస్త్ర కళాశాల. 1835వ సంవత్సరంలో స్థాపించిన మద్రాసు కళాశాల భారత ఉపఖండంలోనే పురాతన కాళాశాల[9]. నగరములో ఉన్న మరికొన్ని వైద్యకళాశాలల్లో స్టాన్లీ వైద్య కళాశాల, కిల్‌పాక్ వైద్యకళాశాల, శ్రీ రామచంద్రా వైద్యకళాశాల ప్రముఖ మెడికల్ కాలేజిలు. 1903లో స్థాపించిన మద్రాసు వెటరినరీ కాలేజి దేశంలోనే మొదటి పశువైద్యకళాశాల.
1890 సంవత్సరములో స్థాపించిన కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ భారతదేశంలోని నాలుగు జాతీయ సంగ్రహలయ కేంద్రము (నేషనల్ డిపాజిటరి సెంటర్ల)లలో ఒకటి. ఈ సంగ్రహలాయములో దేశంలో వెలువడే పత్రికలు, ప్రచురితమైన పుస్తకల ప్రతులు ఉంటాయి. యునెస్కో ఈ సంగ్రహాలయానికి ఒక స్థాయ గుర్తింపుని ఇచ్చింది. నగరములో ఉన్న మరో ముఖ్య గ్రంధాలయము సెయింట్ జార్జి ఫోర్టులోని భారత పురావస్తు శాఖ వారి గ్రంధాలయము, రామకృష్ణ మఠంలోని గ్రందాలయం, జిడ్డు కృష్ణమూర్తి పౌండేషన్ లైబ్రరీ. అడయార్‌లోని థియోలాజికల్ లైబ్రరీ.
[మార్చు] క్రీడలు
[మార్చు] క్రికెట్టు
భారత దేశములో ప్రముఖ ఆటైన క్రికెట్టు చెన్నై నగరములో కూడా చాలా ప్రసిద్ధ క్రీడ. భారత దేశములోనె అత్యంత ప్రాచీనమైన క్రికెట్టు స్టేడియములలో మద్రాసు చేపాక్ స్టేడీయం ఒకటి. ఈ క్రీడ ప్రాంగణాన్ని 1916 సంవత్సరంలో మద్రాసు క్రికెట్టు గ్రౌండు లేదా చేపాక్ క్రీడాప్రాంగణం అనే పేరుతో నిర్మించారు. చేపాక్ స్టేడియం పేరు ఇప్పుడు యం. ఏ. చిదంబరం స్టేడియంగా మార్చబడింది. ఇది తమిళనాడు రాష్ట్ర క్రికెట్టు అసోసియేషన్‌కు పుట్టినిల్లు. ఈ స్టేడియంలో 50,000 మంది ప్రేక్షకులు ఆటను వీక్షించే అవకాశం ఉంది. ఈ క్రీడాప్రాంగణంలో 1951-52 భారతదేశ మెదటి టెస్టు మ్యాచ్ విజయం (ఇంగ్లాండు తో), 1986 ఇండియా ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ టై (ప్రపంచ రికార్డులలో రెండే టెస్టు టై మ్యాచ్ లు నమోదయ్యాయి) తో సహా, అనేక రికార్డులు ఈ క్రీడాప్రాంగణంలో నెలకొల్ప బడ్డాయి. చేపాక్ క్రీడాప్రాంగణములోని ప్రేక్షకుల క్రీడా స్ఫూర్తి అనిర్వచనీయము. దానికి ఒక ఉదాహరణగా 1997లో భారదేశానికి పాకిస్తానుకి మధ్య జరిగిన ఇండిపెండెన్స్ కప్పులో సయీద్ అన్వర్ 194 పరుగులు కొట్టగా ప్రేక్షకులు అందరూ నిలబడి చప్పట్లు చరిచిన సంఘటన చెప్పవచ్చు. ఐ.ఐ.టి. మద్రాసు క్యాంపసులో ఉన్న చెంప్లాస్ట్ క్రికెట్టు స్టేడియం నగరంలో ఉన్న ఇంకో ముఖ్య క్రీడాప్రాంగ్రణం.
[మార్చు] టెన్నీస్
చెన్నై నగరములో క్రికెట్టు తరువాత ప్రముఖ క్రీడ టెన్నిస్. నుంగంబాకంలో ఉన్న యస్.డి.ఏ.టి టెన్నీస్ స్టేడియంలో 6000 మంది ప్రేక్షకులు టెన్నీస్ వీక్షించడానికి అవకాశం ఉంది. ఈ స్టేడియంలో కృత్రిమ నేలపై నిర్మించబడ్డ ఐదు టెన్నీస్ కోర్టులు ఉన్నాయి. ఈ క్రీడాప్రాంగణంలో ఏ.టి.పి టెన్నీస్ పోటీలు, చెన్నై ఓపెన్ పోటీలకు ఈ స్టేడియం ఒక వేదిక. ఈ క్రీడాప్రాంగణానికి ఉత్తమ నూతన ఏ టి పి టెన్నీస్ పోటికి వేదికగా నిలిచింది. భారతీయ టెన్నీస్ క్రీడాకారులలో ప్రముఖులైన విజయ అమృతరాజ్, రామనాథన్ కృష్ణన్, రమేష్ కృష్ణన్, మహేష్ భూపతి చెన్నై అందించిన క్రీడాకారులు. ప్రముఖ టెన్నీస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ విద్యాభ్యాసము, టెన్నీస్ తర్ఫీదు చెన్నై నగరములోనే పొందాడు.
[మార్చు] హాకీ
నాలుగు వేల ప్రేక్షకులు వీక్షించే సామర్ధ్యమున్న మేయర్ రాధాకృష్ణన్ క్రీడాప్రాంగణం హాకీ క్రీడకు ముఖ్య వేదిక. చెన్నై వీరన్స్ అనే జట్టు ప్రీమియర్ హాకీ ఆటలో ఒక ప్రముఖ జట్టు. ఈ క్రీడాప్రాంగణం ఛాంపియన్స్ ట్రోఫీ (ప్రపంచములో 6 ఉత్తమ జట్లు ఆడే పోటి)కి వేదికగా రెండు సార్లు నిలిచింది. చివరిసారిగా 2005లో జరిగింది.
[మార్చు] సాకర్ మిగతా క్రీడలు
నలభై వేలమంది ప్రేక్షకులు వీక్షించగల సామర్ధ్యమున్న జవహర్ లాల్ నెహ్రు క్రీడాప్రాంగణం సాకర్ (ఫుట్ బాల్ ఆటకు) అథ్లెటిక్స్ పోటీలకుకు ముఖ్య వేదిక. ఈ క్రీడాప్రాంగణంలోనే 8000 వేల మంది ఆటలు చూడడానికి వీలుగా ఇండోర్ స్టేడియం ఉన్నది. ఈ జవహర్ లాల్ నెహ్రు క్రీడాప్రాంగణం ఉన్న సముదాయంలోని ఇండోర్ స్టేడియం వాలీ బాల్, బాస్కెట్ బాల్ టేబుల్ టెన్నీస్ వంటి వివిధ పోటీలు నిర్వహించడానికి వేదిక. నాలుగు వేలమంది వీక్షీంచడానికి వీలుగా ఉన్న 'వేలచ్చేరి జల క్రీడల సముదాయము అనేక జలక్రీడలకు వేదిక. మద్రాసు నగరము 1995లో దక్షిణ ఆసియా ఫెడరేషన్ పోటీలకు వేదికగా నిలిచింది.
1777లో గుఱ్ఱపు పందాలు జరగడానికి వీలుగా గుండిలో గుండి రేస్ కోర్స్‌ని నిర్మించాడు. శ్రీపెరంబూరులో మోటారు రేసింగ్ పోటీలు నిర్వహించడుతున్నాయి. కారు రేసింగ్, మరియు ద్విచక్ర వాహాన రేసింగ్ కి వీలుగా షోళావరంలో ఉంది. 1867 సంవత్సరములో మద్రాసు బోట్ క్లబ్ బేసిన్ బ్రిడ్జిలో ప్రారంభమైంది. ఈ బోటు ఆటలపోటీలకు వేదిక. నగరములో 18 గుంటలతో కూడిన గోల్ఫ్ క్లబ్బులు కూడా ఉన్నాయి. ఒకటి కాస్మోపాలిటన్ క్లబ్, మరొకటి జింఖానా క్లబ్. ఈ రెండు కూడా 19వ శతాబ్ధం చివరి భాగములో నిర్మించబడ్డాయి. 2005 సంవత్సరములో కామన్ వెల్త్ ఫెన్సింగ్ పోటీలు కూడా ఈ నగరములో జరిగాయి.
[మార్చు] కళాశాలలు-విశ్వవిద్యాలయాలు
- ఐఐటి
- ఎస్‌ఆరెమ్
- అణ్ణాయూనివర్శిటీ
- కాగితేమిల్లత్
- ప్రెసిడెన్సీ(పురుషులు)
- పచ్చిపాస్ లాలేజ్
- త్యాగరాజ్ కాలేజ్
- లయోలా కాలేజ్
- ఎతిరాజ్ కాలేజ్(స్త్రీలు)
- క్వీన్‌మేరీస్(స్త్రీలు)
- స్టాన్లీ వైద్య కళాశాల
- ఎమ్‌జీఆర్ వైద్య కళాశాల
[మార్చు] చూడవలసిన ప్రదేశాలు
- మెరీనా బీచ్
- వళ్ళువర్ కోట్టమ్
- అణ్ణాసమాధి
- ఎమ్‌జీఆర్ సమాధి
- రాజాజీ నినైవు ఇల్లమ్
- గాంధి నినైవు ఇల్లమ్
- ప్లానిటోరియమ్(అడయార్)
- వండలూర్ జంతు ప్రదర్శనశాల
[మార్చు] ప్రసిద్ధ ఆలయాలు
- కపాలీశ్వర ఆలయం
- వడపళని సుబహ్మణ్యేశ్వరాలయం
- తిరువళ్ళికేణి పార్ధసారధి ఆలయం
- కన్యకా పరమేశ్వరీ ఆలయం
- అస్టాలక్ష్మి ఆలయం
- శ్రీ వెంకటేశ్వర ఆలయం
- మండవేలి ఆలయం
[మార్చు] విహార కేంద్రాలు
- ఎమ్‌జిఎమ్
- విజిపి
- మాయాజాల్
[మార్చు] సూపర్ మార్కెట్లు
- సిటీసెంటర్
[మార్చు] చైన్ షాపులు
- స్పెన్‌సర్
- మోర్
- బిగ్ బజార్
- మెట్రో
- రిలయన్స్ ఫ్రెష్
- హెరిటేజ్
- పళముదిర్ చోలై
[మార్చు] చైన్ హోటళ్ళు
- శరవణ భవన్.
- వసంత భవన్.
[మార్చు] చైన్ మిఠాయి దుకాణాలు
- నందినీ స్వీట్స్
- ఆనందభవన్ స్వీట్స్
- అర్చనా స్వీస్
- శ్రీకృష్ణా స్వీట్స్
[మార్చు] మూలాలు
- ↑ JNNURM చెన్నై నగరాభివృధి plan, ఇకటో పేజీ
- ↑ World Gazetteer: Chennai agglomeration
- ↑ Chennai has the 'potential' to become Detroit of South Asia. The Hindu. తీసుకొన్న తేదీ: August 6, 2005.
- ↑ Tournament profile
- ↑ Broadcast schedule in ESPN
- ↑ http://www.chennai.tn.nic.in/chndistprof.htm#hist
- ↑ Sashi Tharoor. "India's name game", International Herald Tribune. Retrieved on 2005-08-09.
- ↑ GIS database for Chennai city roads and strategies for improvement. Geospace Work Portal. తీసుకొన్న తేదీ: August 4, 2005.
- ↑ The Hindu: Madras Miscellany. తీసుకొన్న తేదీ: November 19, 2005.

