పల్లవులు

వికీపీడియా నుండి
Guntupalli Buddist site 8.JPG
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
----------- కాలరేఖ -----------
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.త.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు • క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు • క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు • క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు • 210 - 300
బృహత్పలాయనులు • 300 - 350
అనందగోత్రులు • 295 - 620
శాలంకాయనులు • 320 - 420
విష్ణుకుండినులు • 375 - 555
పల్లవులు • 400 - 550
పూర్వమధ్య యుగము 650 - 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు • 624 - 1076
పూర్వగాంగులు • 498 - 894
చాళుక్య చోళులు • 980 - 1076
కాకతీయులు • 1083 - 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320 - 1565
ముసునూరి నాయకులు • 1320 - 1368
ఓఢ్ర గజపతులు • 1513
రేచెర్ల పద్మనాయకులు • 1368 - 1461
కొండవీటి రెడ్డి రాజులు • 1324 - 1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు • 1395 - 1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము • 1336 - 1565
ఆధునిక యుగము 1540 – 1956
అరవీటి వంశము • 1572 - 1680
కుతుబ్ షాహీ యుగము • 1518 - 1687
నిజాము రాజ్యము
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము • 1800 - 1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ
ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాధ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ధి
చారిత్రిక నగరాలు
భట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురి
హంపిసింహపురిహైదరాబాదు
చారిత్రిక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

పల్లవులు

పల్లవులు ఎచటివారు అనే ప్రశ్న చరిత్రకారులకు వివాదాస్పదమైన విషయము. సాతవాహన రాజు గౌతమీపుత్ర సాతకర్ణి 'శకపహ్లవుల'ను నిర్జించెనని నాసిక్ శాసనము తెలుపుతున్నది. దీని ఆధారముగా పల్లవులు పారశీక దేశవాసులనియు, శక-పహ్లవ-కాంభోజ జాతుల వలసలలో భాగముగా దక్షిణదేశము చేరి సాతవాహనులతో సంబంధములు నెరిపి క్రమముగా స్వతంత్రులయ్యారని చెప్పవచ్చును. శాసనములలో వీరు బ్రాహ్మణులమని, భారధ్వాజ గోత్రీకులమని, బ్రహ్మక్షత్రియులమనీ చెప్పుకున్నారు. ప్రాచీన తమిళ గ్రంథాలు పల్లవులను విజాతీయులుగా పరిగణించాయి[1].


క్రీ. శ. రెండవ శతాబ్దిలో కాలభర్తి అనువాడు ఉత్తరదేశమునుండి వచ్చి సాతవాహనులకడ ఉద్యోగిగా చేరాడు. ఇతడు చూటు వంశీయుల కన్యను పెండ్లాడగా ఆమెవలన చూతుపల్లవుడు జన్మించాడు. చూతపల్లవుని కుమారుడు వీరకూర్బవర్మ. ఈతని మనుమడు స్కందమూలునికి పూర్వీకులవల్ల దక్షిణాంధ్ర దేశము, దానికి సమీపములోని కర్ణాట ప్రాంతములు సంక్రమించాయి. సాతవాహనుల సామ్రాజ్యము అంతరించిన తరువాత, స్కందమూలుడు ఇక్ష్వాకుల ఒత్తిడికి తాళలేక తనదేశమును దక్షిణానికి విస్తరింపదలచాడు. తన కుమారుడు కుమారవిష్ణువును కంచి పైకి పంపగా అతడు సత్యసేనుని ఓడించి కంచిని వశపర్చుకున్నాడు. స్కందమూలుని తరువాత కుమారవిష్ణువు రాజ్యమును విస్తరించి అశ్వమేధ యాగము చేశాడు. ఈ సమయములో చోళులు మరలా విజృంభించి కంచిని తిరిగి వశపరచుకొనుటకు యత్నించారు. కుమారవిష్ణు రెండవ కుమారుడు బుద్ధవర్మ చోళులను నిర్జించి వారి ప్రాభవాన్ని అంతరింపచేశాడు. బుద్ధవర్మ పెద్ద కుమారుడు స్కందవర్మ రాజ్యాన్ని కావేరి మొదలుగా కృష్ణానది వరకును, ప్రాక్సముద్రము మొదలుగ కుంతలపు పశ్చిమ సరిహద్దుల వరకు విస్తరించాడు. ఈ కాలమున పరాజితులైన చోళులలో పలువురు ఆంధ్ర మండలములు చేరి పల్లవరాజులకడ ఉద్యోగాలు నిర్వహించారు. వీరే తరువాతి తెలుగు చోళులకు మూలపురుషులయ్యారు[2].


స్కందవర్మ తరువాత బుద్ధవర్మ కుమారుడగు రెండవ కుమారవిష్ణువు రాజయ్యాడు. ఈతని తరువాత మొదటి స్కందవర్మ కుమారుడు వీరవర్మ రాజరికము గ్రహించాడు. వీరవర్మ కుమారుడు రెండవ స్కందవర్మ, అతని కుమారుడు మొదటి సింహవర్మ వరుసగా రాజ్యం చేశారు. క్రీ.శ. 300ప్రాంతమున సింహవర్మ ఇక్ష్వాకులను కూలద్రోశాడు. తరువాత పినతండ్రి విష్ణుగోపుని సాయంతో మూడవ స్కందవర్మ రాజయ్యెను. క్రీ. శ. 345లో విష్ణుగోపుడు రాజ్యము చేయాల్సివచ్చింది. ఈసమయములో ఉత్తరదేశమునుండి సముద్రగుప్తుడు దక్షిణదేశదండయాత్రకై వచ్చి శాలంకాయనులను, పలక్కడలో ఉగ్రసేనుని, తరువాత విష్ణుగోపుని జయించి తిరిగివెళ్ళాడు. క్రీ. శ. 360లో విష్ణుగోపుని మరణానంతరము ఆతని అన్న మనుమడు మొదటి నందివర్మ రాజయ్యాడు. క్రీ. శ. 383లో విష్ణుగోపుని కుమారుడు రెండవ సింహవర్మ రాజై పల్లవరాజ్యానికి పూర్వప్రతిష్ఠలు కలిగించాడు. ఈతని అనంతరము కుమారుడు రెండవ విష్ణుగోపుడు, మనుమడు మూడవ సింహవర్మ, మునిమనుమడు మూడవ విష్ణుగోపుడు, మునిమునిమనుమడు నాలుగవ సింహవర్మ క్రమముగా రాజులైరి. నాలుగవ సింహవర్మ విష్ణుకుండిన రాజులగు ఇంద్రభట్టారక వర్మ, రెండవ విక్రమేంద్ర వర్మలకు సమకాలీనుడు. క్రీ. శ. 566లో సింహవర్మను రెండవ విక్రమేంద్ర వర్మ జయించాడు. దీనితో పాకనాటికి ఉత్తరాననున్న తెలుగుదేశం విష్ణుకుండినుల వశమైనది. అదే సమయములో కళభ్రులను యోధజాతి (జైనులు) కంచిని వశముచేసుకొన్నది. పల్లవరాజన్యులు పాకనాటిలో తలదాచుకున్నారు. పల్లవ సామ్రాజ్యం అంతరించిపోయింది.

[మార్చు] మూలాలు

  1. విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటము, దేశము-చరిత్ర, 1983, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు
  2. History of the Andhras, G. Durga Prasad, 1988, P.G. Publishers, Guntur; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf
"http://te.wikipedia.org/w/index.php?title=పల్లవులు&oldid=394578" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె