విజయనగరం (కర్ణాటక)
వికీపీడియా నుండి
| ?విజయనగర కర్ణాటక • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 568 మీ (1,864 అడుగులు) |
| జిల్లా(లు) | బళ్ళారిజిల్లా |
| జనాభా | 0 (2001) |
అక్షాంశరేఖాంశాలు: విజయనగరపలకడం ,(ఆంగ్లం:Vijayanagara, కన్నడ: ವಿಜಯನಗರ) ఈ నగరం 13-15 శతాబ్ధముల మధ్య దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలలో ఒకటైన విజయనగర సామ్రాజ్య పు రాజధాని, ఇప్పుడు ఒక చారిత్రాత్మక పట్టణం. ఈ విజయనగర అవశేషాలు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా లోని హంపి గ్రామంలో కనిపిస్తాయి[1]. ఈ పురాతన నగరములో ప్రసిద్ధమైన విరుపాక్ష దేవాలయం ఉన్నది. ఈ నగరానికి ప్రక్కన ఉన్నది హంపి అనే గ్రామము. హంపిని చరిత్రకారులు విజయనగర అవశేషాల సంగ్రహాలయంగా వర్ణిస్తారు.
(హంపీ వెళ్ళదల్చుకున్న తెలుగు వాళ్ళు, ఈ పుస్తకం తప్పకుండా చదవండి. హంపీ శిల్పాల గురించి ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయి. ఇది చదివి హంపీ వెళ్ళి, నేను చాలా చుశాను - సీతాపతిరావ్ , భమిడిపాటి http://www.scribd.com/share/upload/12414461/tw2pw7oq7ksaz6mtuc4)
విషయ సూచిక |
[మార్చు] ఉనికి -భౌగోళిక స్వరూపం
హంపి బెంగళూరు నుండి 343కి.మీ. బీజాపూర్ నుండి 254కి.మీ.బళ్ళారి నుండి 74కి.మీ. దూరం లో బళ్ళారి జిల్లాలో ఉన్నది. హంపి దగ్గరలో ఉన్న తాలుకా హోస్పేట 13 కి.మి దూరం లో ఉన్నది. హంపి అక్షాంశ రేఖాంశ మధ్య విస్తరించి ఉన్నది.ఈ శిధిలమై అవశేషాలతో ఉన్న నగరానికి దగ్గరలో కమలాపుర అనే నూతన గ్రామం ఉన్నది. విజయనగరం కు దగ్గరలో ఉన్న రైలు సౌకర్యం గల ఊరు హోస్పేట.
విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నదికి ఉత్తర తీరం లో ఉన్న అనేగొంద అనే ప్రదేశాన్ని రాజధానిగా చేసుకొని రాజులు పరిపాలించేవారు. తరువాతి కాలములో విద్యారణ్య స్వామి తుంగభద్ర నదికి దక్షిణ తీరాన ఉన్న ఈ ప్రదేశాన్ని విజయనగరం అనే పేరు తో విజయనగర సామ్రాజ్య రాజధానిగా చేశాడు. విజయ=జయాన్ని నగరం= ఇచ్చే నగరం అని అర్థం.
విజయనగర నగర నిర్మాణం హంపిలో ఉన్న ప్రాచీనమైన విరుపాక్షదేవాలయం చుట్టు జరిగింది. ఈ నగరం చుట్టు ప్రక్కల చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్ర్రాంతమే రామాయణం లో సుగ్రీవుడు నివసించిన కిష్కింద అని తన సోదరుడైన వాలి నుండి తప్పించుకోవడానికి ఇక్కడే ఒక గుహ లో నివసించేవాడని, రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఇక్కడే కలిసాడని చెబుతారు. హనుమంతుడి గుడి, హనుమంతుడి తల్లి,తండ్రి అయిన అంజనీ దేవి , కేసరిల గుహ ఇక్కడ ఉన్నదని కూడా చెబుతారు. నగరానికి దగ్గరలోనే పంపాసరోవరం కూడా ఉన్నది.
శిధిలమైన ఈ నగరం ఇప్పుడు ప్రకృతి రమణీయమైన దృశ్యాలతో పర్వతశ్రేణుల మధ్య పెద్ద పెద్ద గ్రానైటు శిలల మధ్య ఉన్నది. తుంగభద్ర నది ఈ నగరం గుండా ప్రవహిస్తున్నది. అప్పటి కాలం లో ఉత్తరాన ఉన్న ఈ తుంగభద్ర నది శత్రువులనుంది భద్రత కలిపించేది. దక్షిణం వైపు నగరం, ఆ తరువాత ఉన్న గ్రానైటు శిలలు కూడా దాటితే ఒక పెద్ద మైదానం వస్తుంది.
[మార్చు] నగర వైభవం మరియు నగర చరిత్ర
విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశానికి చెందిన హక్క రాయలు(హరిహర రాయలు),బుక్క రాయలు స్థాపించారు. మొదటి హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర చూపగా, తరువాత రాజ్యానికొచ్చిన ఈయన సోదరుడు మొదటి బుక్క రాయలు రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యం ముందు తుంగభద్ర నది ఉత్తర తీరాన అనెగొందిని రాజధానిగా చేసి స్థాపించగా విద్యారణ్య స్వామి అధ్వర్యంలో రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరానికి తరలించి విజయనగరం అనే పేరు తో ఈ నగరాన్ని శత్రుదుర్భేద్యమైన రీతిలో నిర్మించారు. విజయనగరం అంటే విజయాన్ని ఇచ్చే నగరము అని అర్థం. ఇది తప్పు. ఈ విజనగరము ఆన్ధ్రప్రదెష్ లొ ఉన్నది. విద్యారణ్య స్వామి ద్వారా ఏర్పడినది కాబట్టి ఇది విద్యా నగరము అయ్యి0ది. అయతె అది కాల క్రమ0లొ విజయనగర0 గా మారిన్ది.22:48, 7 నవంబర్ 2007 (UTC)59.162.170.225≥భాతదేశం లోనే అతిపెద్ద హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం రాజధాని అయిన విజయనగర నగర వైభవం దేశదేశాలలోని పర్యటకులను ఆకర్షించింది. జవహర్ లాల్ నెహ్రూ భారత్ ఏక్ కోజ్ అనే తన పుస్తకములో విజయనగరం గురించి ఈ విధంగా వ్రాసుకొన్నాడు.
తైమూర్ దండయాత్రల తరువాత ఉత్తరభారత దేశ రాజకీయ ఆర్థిక పరిస్థితులు బాగా క్షీణించాయి, ఉత్తర భారతంలో రాజ్యాలన్నీ విచ్ఛిన్నమయ్యాయి. సరిగా అదే సమయంలో దక్షిణ భారత దేశం లో శత్రుదుర్భేధ్యమైన విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగింది. కళలు సంస్కృతి వెల్లువిరిసిన ఈ సామ్రాజ్యం ఉత్తర భారత దేశం లోని చాలా మంది హిందువులను ఆకర్షించి, దక్షిణ భారతానికి వలస పోయేటట్లు చేసింది. మధ్య ఆసియా పర్యాటకుడైన అబ్ధుర్ రజాక్ విజయనగరాన్ని సందర్శించినప్పుడు ఈ విధంగా అన్నాడు "చారిత్రక అధారాల ప్రకారం విజయనగర సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆ విజయనగర నిర్మాణం, శోభ ఈ భువిలోనే కనివిని ఎరగనట్లు ఉండేది". ఆ తరువాత 1420 సంవత్సరం లో విజయనగరాన్ని సందర్శించడానికి వచ్చిన నికొలొ కాంటి అనే ఇటలీ పర్యాటకుడు విజయనగర వీధులను చూసి ఆశ్చర్యం చెంది వీధులు అత్యంత రమణీయంగా సౌందర్యంగా ఉన్నాయని, రాజభవంతుల చుట్టు నీటి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉండేవని, అలా ప్రవహిస్తున్నప్పుడు నీటితో రాపిడి వల్ల ఆ రాళ్ళు బాగా నునుపెక్కి మెరుస్తూ ఉండేవని పేర్కొన్నాడు. అంతేకాక నగరం అంతా ఉద్యానవనాలతోను పూల తోటలతోను ఉండడం వల్ల నగర విస్తీర్ణం 60 మైళ్ల వరకు ఉండేదన్నాడు. ఆ తరువాత 1552 సంవత్సరం లో వచ్చిన పేయస్ అనే పోర్చుగీసు చరిత్రకారుడు ఈ విజయనగారాన్ని మధ్య యుగములో పునరుద్ధరణ జరిగిన తరువాత నిర్మించబడిన రోమ్ నగరం తో పోల్చి , రోమ్ నగరం తో సమానంగా దృశ్యసుందరంగా ఉన్నదన్నాడు. విజయనగరం అంతా సరస్సులతో, నది నుండి వచ్చిన పాయలతోను, పూల, పళ్ళ ఉద్యానవనాలతో అత్యంత సుందరం గా ఉండేదని, ప్రపంచం లోనే ఇంత మనోహరమైన నగరం మరొకటి ఉండదని పేర్కొన్నాడు. రాజభవనాలలోని గదులు ఏనుగు దంతముల పై చెక్కబడిన వస్తువులతో ఉండేవని, భవనాల గదులలో పైకప్పు పై కమలాలు, గులాబీ పూలు చెక్కబడినవి అని కూడా వ్రాసుకొన్నాడు.
1999 సంవత్సరములో హంపి యునెస్కో సంరక్షిస్తున్న చారిత్రక ప్రదేశాల జాబితాలో, ప్రపంచ వారసత్వపు స్థలాలో ఒకటిగా చేర్చారు[2]. ఈ నగరాన్ని హంపి అవశేషాల నగరంగా అభివర్ణించారు. ఈ మధ్యకాలములో ఇక్కడ భారీ వాహనాలు పోవడానికి ఒక వంతెన కట్టే ప్రయత్నం జరిగింది.
[మార్చు] నగర కేంద్రము
చారిత్రకులు, హంపి గ్రామము నుండి మాతంగపర్వతము వరకు తూర్పునకు విస్తరించి ఉన్న ప్రదేశాన్ని నగర కేంద్రంగా పవిత్ర కేంద్రంగా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతం కొన్నిచోట్ల ఆగ్నేయ దిశలో విఠల దేవాలయం వరకు విస్తరిస్తుంది. తుంగభద్రానదికి దక్షిణపు ఒడ్డున కొండ ప్రాంతమంతా పవిత్ర కేంద్రము క్రిందికే వస్తుంది.
[మార్చు] విరూపాక్ష దేవాలయం
హంపి వీధి కి పశ్చిమ చివర విరూపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరూపాక్ష దేవాలయం లోనికి స్వాగతం పలుకుతుంది.దేవాలయం లో ప్రధాన దైవం విరూపాక్షుడు(శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపాదేవి గుడి, భువనేశ్వరీ దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్ధం[3] నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉన్నది. విరూపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్ధంకు చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. [4]చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయసలుల పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజు లే నిర్మించారని అంటారు.[5] విజయనగర రాజులు పతనమయ్యాక, దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది.[6] విరూపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారిన పడలేదు.విరూపాక్ష దేవాలయం లో దేవునికి ధూప,దీప నైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్ధం మొదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాల కు, తూర్పు , ఉత్తర గోపురాల కు జీర్ణోద్ధరణ జరిగింది.[7]
ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్తంభాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్తంభాలతో కూడి కప్పబడిన వసారా ఉంటుంది. స్తంభాలతో కూడి ఉన్న వసారాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి.దీనిని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భ గుడి వస్తుంది.[8]
తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెడుతుంది. [9]ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతో ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్తంభాల వసారాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్తంభాల వసారా ని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడని కూడా శిలాశాసనాలు చెబుతున్నాయి.[10]విరూపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మీ. దూరం వరకు కనిపిస్తుంది. [11]
[మార్చు] హేమకూట పర్వతం
ఈ పర్వతం హంపి గ్రామానికి దక్షిణం వైపు ఉన్నది. ఈ కొండ పై చిన్న చిన్న దేవాలయాలు విజయనగర సామ్రాజ్యం స్థాపనకు పూర్వం నిర్మించబడిన దేవాలయాలు. వాటి చరిత్ర 10వ శతాబ్దమునకు చెందినది. విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగినప్పుడు ఈ దేవాలయాలను పరిరక్షిస్తూ విజయనగర నిర్మాణం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని దేవాలయాలు అసంపూర్ణముగా ఉన్నాయి. వాటి నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాలేదు. ఈ కొండపై గోపురాలు, నీరు నిలువచేసుకొనే తటాకాలు, ఉన్నాయి.
[మార్చు] శ్రీ కృష్ణ దేవాలయం
శిధిలావస్థలో ఉన్న ఈ దేవాలయం హేమకూట పర్వతంపై ఉన్నది. కళింగ దేశం పై విజయ చిహ్నంగా ఈ దేవాలయాన్ని శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించాడు. ఈ గుడికి రెండు ప్రాకారాలు ఉన్నాయి. బయటి ప్రాకారంలోని కొంత భాగం పూర్తిగా శిధిలమైపోయింది. కొంత జీర్ణోద్ధారణ జరిగిన ఈ దేవాలయం ఇంకా శిధిలావస్థలో ఉన్నదనే చెప్పాలి. గర్భగుడిలో మూర్తి (విగ్రహం)లేదు.[12]
[మార్చు] ఉగ్రనరసింహ మూర్తి
- హంపి వీధికి దగ్గరలొనే 6.7 మీటర్ల ఎత్తున్న ఉగ్ర నరసింహమూర్తి విగ్రహం ఉన్నది. అక్కడ లభించిన శాసనాల ప్రకారం ఈ విగ్రహాన్ని శ్రీ కృష్ణదేవరాయలు 1528 సంవత్సరంలో ఏకశిలపై చెక్కించాడు.
- ఈ విగ్రహము మోకాలిపై చిన్న లక్ష్మీ దేవి విగ్రహము ఉండేది. అయితే ఈ లక్ష్మీ విగ్రహము ప్రధాన విగ్రహము నుండి వేరుపడినది. బహుశా ఇది విధ్వంసకాండ వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ లక్ష్మీ విగ్రహాం కమలాపురంలోని మ్యూజియంలో ఉన్నది.
- ఈ విగ్రహములో నరసింహుడు శేషతల్పముపై కూర్చుని ఉన్నట్టు చెక్కబడినది. ఆదిశేషువు ఏడు తలలతో నరసింహునికి పడగవిప్పి తలపై నీడపడుతున్నాడు. ఈ విగ్రహాన్ని ఇటీవల కొంత పునరుద్ధరించారు. మోకాళ్లను కలుపుతూ ఉన్న గానైటు పట్టీ విగ్రహాన్ని స్థిరపరచడానికి ఇటీవలే చేర్చారు.
[మార్చు] సుగ్రీవుడి గుహ
ఈ గుహ సహజసిద్ధంగా ఏర్పడిన గుహ అని వాలి బారి నుండి తప్పించుకొవడానికి సుగ్రీవుడు ఇక్కడే విడిది చేశాడని శ్రీ రామచంద్ర మూర్తి ని ఇక్కడే హనుమంతుడి ద్వారా కలిసాడని చెబుతారు. ఈ గుహ అంతా పర్యాటకులు వ్రాసిన పిచ్చి వ్రాతలతో ఉన్నది.
[మార్చు] కోదండరామ దేవాలయం
హంపి లో విరుపాక్ష దేవాలయం నుండి కొలన్నాదెడ్ వీధి తూర్పు వైపుగా వెడితే కోదండరామ దేవాలయం వస్తుంది. నగరం లో ఈ ప్రదేశం గుండా తుంగభద్రా నది చిన్న సెలయేరుగా ప్రవహించడం వల్ల ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది. ఇతిహాసం ప్రకారం శ్రీ రాముడు సుగ్రీవుడి కి ఈ ప్రదేశం లోనే పట్టాభిషేకం చేశాడు. దేవాలయం లో ఇప్పటికీ ధూపదీపవైవేద్యాలు ఇస్తారు. గర్భగుడి లో సీత, రామ, లక్ష్మణ విగ్రహాలు ఒకే శిలపై చెక్కబడ్డాయి.
[మార్చు] విఠలేశ్వర దేవాలయ సముదాయం
హంపి కి ఈశాన్య భాగం లో అనెగొంది గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తి కి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం లో ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్తంభాలు. ఈ దేవాలయం లోనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.
[మార్చు] ఏక శిలా రథం
ఏక శిలా రథం విఠల దేవాలయ సముదాయం లో తూర్పు భాగం లో ఉన్నది. ఇంకో విశేషం ఏమంటే ఈ రథం చక్రాలు కదులుతాయి, తిరుగుతాయి కూడాను. ఈ రథం అంతా ఒకే శిల. ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక మహా మండపం ఉంది. దీని పునాది శిల్పకళా శోభితమై ఉంది. దీని శిఖరం 15 అడుగులు ఎత్తైన నల్లరాతి స్తంభాలపై నిలచి ఉంది. వీటిలో ప్రతిదాని మధ్య భాగం చుట్టు విడివిడి కొమ్మలు ఉన్నాయి; ఇవి అన్నీ ఏకశిలనుంచి చెక్కినవే. శిల్పాలతో ఉండే ఈ స్తంభాలను శత్రువులు భారీగా నష్టపరిచారు; శిల్పకళను నష్టపరచి ఇంచుమించుగా రాతిముక్కలుగా మిగిల్చారు. మధ్య భాగం చాలా మట్టుకు మరీ భారీగా నాశనమైనది.
[మార్చు] రాజ తులాభారం
విఠలేశ్వర స్వామి గుడి కి నైరుతి దిశలో తులాభారం ఉన్నది. ఈ తులాభారం రెండు గ్రానైటు స్తంభాలు వాటి మధ్య భూమికి సమాంతరంగా ఒక గ్రానైటు కమ్మి ఉన్నది. విశేష దినాలలో ఈ రెండు స్తంభాల మధ్య కమ్మి ని నిలిపి రాజు (చక్రవర్తి) వస్తువులను తులాభారం మీద తూచి బంగారం మణులు రత్నాలుబ్రాహ్మణుల కు సాధువులకు దానం ఇచ్చేవాడు.
[మార్చు] కోట గోడ
హంపి కి 2కి.మీ. ఆగ్నేయంగా ప్రారంభమైన ఈ కోట గోడ లోపల ఓక చిన్న పీఠభూమి ఉంది. ఇది నైరుతి గా ఇంచుమించు కమలాపురం గ్రామం వరకు విస్తరించి ఉంది. దీనిని పవిత్ర కేంద్రంనుంచి ఒక చిన్న లోయ విడదీస్తోంది. ఈ లోయలో ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాలు, వాటిలో పంట కాలువలు,సెలయేళ్లు, అనెగొంది కి ఎదురుగా నదిని కలుపుతూ ఉన్నాయి. మహారాజ నివాసాన్ని వీక్షిస్తూ ఒక పెద్ద నల్లరాతి వేదిక కూడా ఉంది.[13]. రాచనగరు లోపల ఇప్పుడు రాచ భవనాల, పాలనాభవంతుల, రాచవారికి మాత్రమే పరిమితమైన దేవాలయాల శిధిలాలు మాత్రం ఉన్నాయి. రాజ భవనాల పునాదులు తప్ప పైభాగాలేమీ లేవు( సౌకర్యం కోసం పైభాగాలను ఎక్కువగా కలప తో కట్టారు, అందుచేత పూర్తిగా శిధిలమయ్యాయి).అయితే,రాయి తో కట్టిన గుడులు, నగరం చుట్టూ ఉన్న గోడలు మాత్రం కొంతవరకు నిలబడి ఉన్నాయి. కోటగోడ చుట్టూ నీటి తో పారే అగడ్త పెద్ద వ్యవసాయపు చెరువు తో అనుసంధానించబడి ఉంది. ప్రత్యేక సందర్భాలలో దీని లోనికి నీరు వదులుతారు. ఈ చెరువుకు పడమటివైపు భాగం దేవాలయాన్ని వీక్షిస్తూ ఉంటుంది. ఈ చెరువుకు పెద్దపెద్దపావంచాలు(మెట్లు)పచ్చ రాళ్లతో చేసిన రేఖా రూపాలతో , ఏ రకమైన మరమ్మతుల అవసరము లేనట్లుగా, నిర్మించబడ్డాయి. [14].[15] .[16]
[మార్చు] హజారా రామాలయం
రామచంద్రుడి దేవాలయం దీర్ఘచతురస్రకారపు ప్ర్రాంగణం లో ఉన్నది. దేవాలయం తూర్పు వైపు అభిముఖంగా ఉన్నది. ప్రతి రోజు గుడి లో జరిగే సేవలు, ప్రత్యేక సేవల చిత్రాలు ఆలయం బయటి ప్రాంగణం లో చిత్రించబడి ఉన్నాయి. అలయం లోపలి ప్రాంగణం లో గోడ ల మీద మరియు ఆలయం లో రామాయణం కథను తెలిపే చిత్రాలు చిత్రించబడి ఉన్నాయి.[17] చిన్నికృష్ణుడి లీలలు గోడలపై చిత్రించబడి ఉన్నాయి.[18]
ఈ దేవాలయములోనికి ప్రవేశము మరియు దేవతార్చన చేసే అవకాశం రాచ ప్రతినిధులకు మాత్రమే ఉండేదిట. ఈ గుడి శ్రీ రాముడు వాలి ని వధించిన ప్రదేశములోనే నిర్మించారని చెబుతారు. ఇప్పుడు ఈ [19]
దేవాలయం లోపల గోడలపై శ్రీ రాముడి చిత్రాలు అనేకం చిత్రించడం వల్ల, ఆ సంఖ్య లెక్క పెట్టడానికి వీలు లేకుండా ఉండడం తో ఈ దేవాలయాన్ని హజారా(సహస్ర)రామాలయం అని కూడా పిలుస్తారు..[20]
[మార్చు] భూగర్భం లో ఉన్న విరూపాక్షుని దేవాలయం
భూగర్భం లో ఉన్న ఈ దేవాలయం చరిత్రకారుల త్రవ్వకాలలో బయట పడింది. ఈ అత్యంత విశాలమైన గుడి ఇప్పుడు పైకి కనిపిస్తున్నది. (ఊరి మధ్య లో ఉన్న హంపి లోని విరూపాక్షుని దేవాలయం కాదు). అప్పుడప్పుడు వర్షాలతో ఈ గుడి వరదల పాలై సందర్శకులు చూడడానికి అవకాశాన్ని కల్పించదు. సందర్శకులు చూడడానికి అవకాశం ఉన్న రోజులలో గబ్బిలాలతోను , కీటకాలతోను నిండి ఉంటుంది.[ఆధారం కోరబడినది]
[మార్చు] కమల భవనం
కమల భవనం పట్టపు రాణుల కొరకు నిర్మించబడి, నీటి గొట్టాల ద్వారా నీరు ప్రవహించే ఏర్పాటు ఉండేది. విజయనగర రాజుల కాలములోని ఈ నిర్మాణాలు ముస్లిముల కట్టడ శైలి ని ప్రదర్శిస్తున్నవి. పెద్ద పెద్ద ప్రాకారపు గుమ్మాలు,శంఖు ఆకారం లో ఉన్న పైకప్పు విజయనగర రాజుల కట్టడాల శైలి నుండి విభేదించి ముస్లిముల కట్టడ శైలి ని వ్యక్త పరుస్తున్నది. ఈ భవన నిర్మాణములో వేదికలు నిర్మించడానికి కొయ్య కూడా వినియోగించబడింది.
[మార్చు] పుష్కరిణి
పట్టపు రాణి స్నాన మందిరాన్ని మెట్ల స్నానమందిరం గా మలిచారు. ఇది ఒక దిగుడుబావి; లోపలికి దిగడానికి మెట్లతో స్నానంచెయ్యడానికి అనువుగా నిర్మించబడింది. ఈ రకమైన దిగుడుబావులు పగటిపూట వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.జన సంచార సమయాల్లో వీటిని మూసివేస్తారు.
[మార్చు] గజ శాల
పట్టపు ఏనుగుల నివాసం కొరకు, వాటి దైనందిన కార్యకలాపాల కొరకు, రాజ ప్రసాదానికి దగ్గర లోనే గజశాల ఉన్నది. ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాల కు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉన్నది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారం లో ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. మావటి వారు సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన సైనిక స్థావరాలు ఉన్నాయి.[21]
[మార్చు] ఇతర చారిత్రాక ప్రదేశాలు
- హంపి-విజయనగరానికి సమీపంలో క్రింది చారిత్రాక ప్రదేశాలు చూడవచ్చు.
ఈ నగర పరిసరాలలో నూతన గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి.
- అనెగొంది,తుంగభద్ర నదికి ఉత్తరాన ఉన్నది. ఇది విజయనగరరాజుల మొదటి రాజధాని(వలస స్థలం)
- హంపి, విజయనగర శిధిలాల మధ్యలో ఉన్న గ్రామం .[22]
- హోస్పేట, విజయనగరానికి నైరుతి దిక్కున ఉన్న తాలుకా మరియు పట్టణం - రైలు సౌకర్యాలు ఇక్కడ నుండి ఉన్నాయి.
- కమలాపురం, విజయనగరానికి ఆగ్నేయం లో ఉన్న రాజప్రాసాదం మరియు ఇప్పటి పురాతన వస్తు సంగ్రహాలయం (మ్యుజియం)
పైన పేర్కొన్నవి అన్నీ బళ్ళారి జిల్లా లో ఉన్నాయి. అనెగొంది మాత్రం కొప్పల్ జిల్లాలో ఉంది.
[మార్చు] ఇది కూడా చూడండి
[మార్చు] వనరులు
- T.S. Satyan, Hampi: The fabled capital of the Vijayanagara Empire, (Directorate of Archaeology and Museums), Govt. of Karnataka, 1995
- J.M. Fritz et al, New Light on Hampi: Recent Research at Vijayanagara, (Performing Arts Mumbai, 2001) ISBN 81-85026-53-X
- A.N. Longhurst, Hampi Ruins Described and Illustrated, (Laurier Books Ltd., 1998) ISBN 81-206-0159-9
- The Ruins of Hampi:Travel Guide ISBN 81-7525-766-0
[మార్చు] మూలాలు
- ↑ గూగుల్ యెర్తులో విజయనగర శిధిలాలు చూపించే ఫైలు
- ↑ హంపీ శిధిలాలపై అధునాతన వంతెలను నిర్మిస్తున్నప్పుడు యునెస్కో వెలువరించిన సందేశం. సేకరించిన తేదీ: నవంబరు 2, 2007.
- ↑ విరూపాక్ష పరిశోధన ప్రాజెక్టు. తీసుకొన్న తేదీ: 2006-09-13.
- ↑ శ్రీ విరూపాక్ష దేవాలయం. తీసుకొన్న తేదీ: 2006-09-13.
- ↑ విరుపాక్ష. తీసుకొన్న తేదీ: 2006-09-13.
- ↑ విరుపాక్ష దేవాలయం , హంపి. తీసుకొన్న తేదీ: 2006-09-13.
- ↑ విరూపాక్ష దేవాలయ పరిశోధన ప్రాజెక్టు. తీసుకొన్న తేదీ: 2006-09-13.
- ↑ శ్రీ విరూపాక్ష. తీసుకొన్న తేదీ: 2006-09-13.
- ↑ విరూపాక్ష. తీసుకొన్న తేదీ: 2006-09-13.
- ↑ Details of Virupaksha Temple. హంపి.ఇన్. తీసుకొన్న తేదీ: 2007-03-08.
- ↑ Details of Virupaksha Temple. ఆంగ్ల వికి. తీసుకొన్న తేదీ: 2007-05-08.
- ↑ శ్రీ కృష్ణ దేవాలయం. తీసుకొన్న తేదీ: 2006-09-09.
- ↑ Great Platform. తీసుకొన్న తేదీ: 2006-09-09.
- ↑ Great Tank. తీసుకొన్న తేదీ: 2006-09-09.
- ↑ West End. తీసుకొన్న తేదీ: 2006-09-09.
- ↑ Stepped Tank. తీసుకొన్న తేదీ: 2006-09-09.
- ↑ ప్రాంగణ విశేషాలు. తీసుకొన్న తేదీ: 2006-09-09.
- ↑ బాలకృష్ణుడు. తీసుకొన్న తేదీ: 2006-09-09.
- ↑ రామచంద్రుడి ఆలయ లోపలి ప్ర్రాంగణం. తీసుకొన్న తేదీ: 2006-09-09.
- ↑ రామచంద్రుడి ఆలయ ముఖ ద్వారం. తీసుకొన్న తేదీ: 2006-09-09.
- ↑ గజశాలలు. తీసుకొన్న తేదీ: 2006-09-09.
- ↑ విజయనగర “హంపి శిధిలాల సంగ్రహస్థలం”. తీసుకొన్న తేదీ: 2006-09-09.
[మార్చు] బయటి లింకులు