కోయంబత్తూరు
| ?కోయంబత్తూరు తమిళనాడు • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
105.5 కి.మీ² (41 చ.మై) • 411.2 మీ (1,349 అడుగులు) |
| జిల్లా(లు) | కోయంబత్తూరు జిల్లా |
| జనాభా • జనసాంద్రత |
1 (2001) • 17,779/కి.మీ² (46,047/చ.మై) |
| Mayor | ఆర్.వెంకటాచలం[1] |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 6410(xx) • +91-(0)422 • TN 37 and TN 38 |
కోయంబత్తూరు (తమిళం: கோயம்புத்தூர்), కోవై అని కూడా పిలుస్తారు (తమిళం: கோவை), తమిళనాడు రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం.[2] కోయంబత్తూరు జిల్లా యొక్క ముఖ్యస్థానమైన ఈ నగరం దక్షిణ భారత మాంచెస్టర్ గా పేరుగాంచినది. ఇది తమిళనాడులోని కొంగునాడు ప్రాంతములో భాగము. నొయ్యల్ నది తీరాన ఉన్న కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది.
[మార్చు] పేరు వ్యుత్పత్తి
కోవన్ అనే రాజు పరిపాలించడం వలన కోవన్‌పుతూర్ అన్న పేరు వచ్చిందని ఒక వివరణ ఉన్నది. ఈ పేరు ఆంగ్లీకరణ చెంది కోయంబత్తూర్ అయ్యిందని భావిస్తున్నారు. ఆధునిక యుగంలో కొన్నిసందర్భాలలో ఈ పేరును రైల్వే స్టేషను కోడును అనుసరించి సిబిఈగా క్లుప్తీకరించడం జరుగుతున్నది.[3]
[మార్చు] మూలాలు
- ↑ Coimbatore Mayor elected unopposed, The Hindu, 2006-10-29
- ↑ Tamil Nadu: largest cities and towns and statistics of their population, World gazetteer
- ↑ E.g. India Rail Info: Coimbatore Junction/CBE