తంజావూరు
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ?తంజావూరు తమిళనాడు • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
36 కి.మీ² (14 చ.మై) • 2 మీ (7 అడుగులు) |
| జిల్లా(లు) | తంజావూరు జిల్లా |
| జనాభా • జనసాంద్రత |
2,15,725 (2001) • 7,700/కి.మీ² (19,943/చ.మై) |
| పురపాలక సంఘ ఛైర్మన్ | థేన్‌మొయి జయబాలన్[1] |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 613 001 నుండి 009 వరకు • +914362 • TN 49 |
తంజావూరు దక్షిణ భారత దేశము నందలి తమిళనాడు రాష్ట్రములోని ఒక పట్టణము. ఈ పట్టణము కావేరి నది దక్షిణ ఒడ్డున ఉన్నది. చెన్నై నుండి 218 మైళ్ళ దూరంలో ఉన్నది. తంజావూరు జిల్లాకు ఈ పట్టణము రాజధాని.
తంజావూరునకు ఈ పేరు తంజన్-అన్ అను రాక్షసుని నుండి వచ్చినది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ మరియూ శ్రీ నీలమేగప్పెరుమాల్ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టాణానికి తంజావూరు అని పేరు పెట్టినారు.
విషయ సూచిక |
చూడవలసిన ప్రదేశాలు [మార్చు]
తంజావూరు, రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి బృహదీశ్వరాలయమునకు ప్రసిద్ది. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశములలో ఈ దేవాలయము కూడా ఉన్నది. ఈ దేవాలయములో సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దేవుడు.
ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ది. ఇక్కడనే ప్రఖ్యాత సరస్వతీ మహల్ గ్రంథాలయము ఉన్నది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.
సంస్కృతి [మార్చు]
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా కర్నాటిక సంగీతానికి చేసిన సేవలకూ, భరత శాస్త్రానికి చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే తంజావూరు పెయింటింగు చాలా ప్రసిద్ది. ఇంకా వీణ, తంజావూరు బొమ్మలు, తవిల్ ఇక్కడి ప్రముఖమైన విషయములు. తంజావూరు లొ తమిళ సా0ప్రదాయలు గల కుటు0బాలు ఎక్కువ.
చరిత్ర [మార్చు]
చారిత్రకముగా ఈ నగరము ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రము. తరువాత నాయక రాజులు తరువాత విజయ నగర రాజులు ఈ నగరాన్ని పాలించినారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని ఏలినారు.
1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ శివాజీ మహా రాజు నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చినారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించినారు.
భౌతిక వివరణలు [మార్చు]
ఈ నగరము తమిళనాడు నందలి నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో తమిళులు, తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. తరువాత సౌరాష్ట్రీయులు, మరాఠీలు ఉంటారు.
ఉద్యోగాలు [మార్చు]
ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయదారులు. ఇక్కడ్ ఉన్న నలభైకిపైబదిన మెడికల్ కాలేజీల వల్ల ఎక్కువ సంఖ్యలో డాక్టర్లను కూడా చూడ వచ్చు.
భౌగోళికంగా [మార్చు]
నగరం ఓ ఫ్ల్య్ ఓవరు వల్ల రెండుగా విభజించబడినది. పాత నగరం వ్యాపార కేంద్రము, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రము. ఈ జిల్లా సరిహద్దులుగా 'వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్, కీలవస్తచావిడీ ఉన్నాయి.
విద్యా కేంద్రముగా [మార్చు]
తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రముగా వెలుగొందుతున్నది. తంజావూరు నందు రెండు యూనివర్సిటీలు కలవు.
ఇంకా ఎన్నో కాలేజీలు ఉన్నాయి.