నిర్మల్
| ?నిర్మల్ మండలం అదిలాబాదు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | నిర్మల్ |
| జిల్లా(లు) | అదిలాబాదు జిల్లా |
| గ్రామాలు | 31 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,21,353 (2001) • 60130 • 61223 • 60.71 • 72.71 • 49.02 |
నిర్మల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది ముఖ్యంగా కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. ఈ పట్టణము హైదరాబాదు నుంచి ఉత్తరముగా 210 కిలో మీటర్ల దూరంలో 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉంది. గోదావరి నది నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇక్కడి నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.
విషయ సూచిక |
వ్యవసాయం, పంటలు [మార్చు]
నిర్మల్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 6068 హెక్టార్లు మరియు రబీలో 1397 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, జొన్నలు. [1]
నిర్మల్ కొయ్యబొమ్మలు [మార్చు]
నిర్మల్ పట్టణము కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. దీనికి సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్రలను సేకరించడం, వాటిని ఆరబెట్టి తగిన రుపాలకు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం, వాటికి పెయింటింగ్ చేయడం, విక్రయించడం కొందరు తరతరాలుగా చేస్తున్నారు. పక్షులు, జంతువులు, ఫలాలలాంటి కొయ్యబొమ్మలకే కాకుండా వర్ణచిత్రాలకు కూడా నిర్మల్ పేరుగాంచినది. 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థను ఏర్పర్చినారు.[2] రాష్ట్రపతిచే అవార్డు కూడా పొందినారు.
తెలంగాణ విమోచనోద్యమం [మార్చు]
ఆదిలాబాదు జిల్లాలో తెలంగాణ విమోచనోద్యమం మొదట నిర్మల్‌లోనే ప్రారంభమైనది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి మట్టి కరిపించిన ఘనతను ఈ పట్టణం సొంతంచేసుకుంది.[3] ఉద్యమాలే ఊపిరిగా దూసుకువెళ్ళి ఒకేసారి వెయ్యిమంది ఉరికంబం ఎక్కిన ఘనత ఈ ప్రాంతానిదే. ఇదే వెయ్యి ఉరుల మర్రి సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది,
- వెయ్యి ఉరులమర్రి సంఘటన
తెలంగాణ విమోచనోద్యమంలో ప్రఖ్యాతిగాంచిన వెయ్యి ఉరులమర్రి సంఘటన నిర్మల్ పట్టణ శివారులోని ఖజానా చెరువు ఒడ్డున ఉన్న మర్రిచెట్టు వద్ద జరిగింది. పట్టణ మరియు పరిసర గ్రామప్రజలు గిరిజన నాయకుడు రాంజీగోండు ఆధ్వర్యంలో నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. నిజాం సైనికులపై దాడులు చేసి వారిని గజగజలాడించారు. రాంజీగోండు ఆధ్వర్యంలోని కొందరు లంచాలకు ఆశపడి గోండు ఆచూకిని నిజాంకు తెలియజేశారు. దీనితో నిజాం సైనికులు రాంజీగోండును సోన్ సమీపంలో గోదావరి నది ఒడ్డున పట్టుకున్నారు. ఆయనతోపాటు వెయ్యిమంది అనుచరులను నిర్మల్ నుండి బత్తీస్‌గడ్ వైపు వెళ్ళు రహదారిలో ఖజానా చెరువు ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకు నిర్దాక్షిణ్యంగా ఉరితీశారు.[4] చాలాకాలం పాటు ఈ చెట్టు విమోచనోద్యమ అమరవీరులకు గుర్తుగా మిగిలింది. భారీవర్షాలకు ఈ చెట్టు కూకటివేళ్ళతో సహా కూలిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అమరవీరుల స్తూపం నిర్మించబడింది. ఏటా సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటారు.
మండలంలోని గ్రామాలు [మార్చు]
మండలంలోని పట్టణాలు [మార్చు]
- నిర్మల్ Nirmal City official Website : http://nirmalcity.com/
ఇవి కూడా చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
|
|||||||
|
|||||||||||||||||