వికారాబాద్

వికీపీడియా నుండి
  ?వికారాబాద్ మండలం
రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్
రంగారెడ్డి జిల్లా పటములో వికారాబాద్ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో వికారాబాద్ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము వికారాబాద్
జిల్లా(లు) రంగారెడ్డి
గ్రామాలు 25
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
73,200 (2001)
• 36820
• 36380
• 63.60
• 74.59
• 52.47


వికారాబాద్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఈ పట్టణానికి రంగారెడ్డి జిల్లాకు ప్రధానకేంద్రంగా చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ అమలు జర్గడం లేదు. హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు రోడ్డు మరియు రైలుమార్గములో ఈ పట్టణం ఉన్నది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కిలోమీటర్ల దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని వాడి మార్గములో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా మహారాష్ట్రలోని పర్భనికి రైలుమార్గం కలదు.

విషయ సూచిక

భౌగోళిక సరిహద్దులు [మార్చు]

వికరాబాదు మండలం పశ్చిమ రంగారెడ్డి జిల్లా మధ్యభాగంలో 7 మండలాలను సరిహద్దులుగా కలిగి ఉన్నది. తూర్పున చేవెళ్ళ మండలం, ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, ఆగ్నేయాన పూడూర్ మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం, ఉత్తరాన మోమిన్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు [మార్చు]

పశ్చిమ రంగారెడ్డి నడిభాగాన ఉండుటచే రవాణా పరంగా మంచి కూడలిగా ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు నుండి వాడి మార్గాన ఉన్న రైల్వే స్టేషన్ మరియు రైల్వేజంక్షన్ ఇది. బస్సు రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్నది. సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డీపో కూడా పట్టణంలో ఉంది.

పురపాలక సంఘం [మార్చు]

పట్టణంలో పురపాలక సంఘాన్ని 1987లో ఏర్పాటు చేశారు. అంతకు క్రితం గ్రామపంచాయతిచే పాలన కొనసాగేది. పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర గ్రామాలైన ఎన్నెపల్లి, శివారెడ్డి పల్లి, అంతగిరిపల్లి, వెంకటాపూర్ తండాలను పట్టణంలో కలిపివేశారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు పురపాలక సంఘాలలో ఇది ఒకటి. పురపాలక సంఘ కార్యాలయం రైల్వేస్టేషన్‌కు అతిసమీపంలో కలదు.

పట్టణంలోని కాలనీలు [మార్చు]

  • రామయ్యగూడ: ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలని. ఇక్కడి ప్రజలంతా చిల్లర వ్యాపారాలు చేసుకంటూ జీవితాలు వెళ్ళదీసుకుంటారు.
  • ఎన్నెపల్లి: ఒకప్పుడు ప్రత్యేక గ్రామంగా ఉన్న ఎన్నెపల్లి ఇప్పుడు పూర్తిగా వికారాబాద్ పట్టణంలో కలసింది. వికాబాదులో ముఖ్యమైన కాలనీలలో ఒకటి.
  • వేంకటేశ్వర కాలని : ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలనీ. ఇక్కడి ప్రజలంతా విద్యావంతులు, ఉపాధ్యాయులు,వ్యాపారాస్తులు. ఇది ఆదర్శ కాలని. ఇక్కడ వేంకటేశ్వర ఆలయం కలదు.

విద్యాసంస్థలు [మార్చు]

ప్రాథమిక పాఠశాలలు[1]
  • ప్రభుత్వ పాఠశాలలు: 2,
  • మండల పరిషత్తు పాఠశాలలు: 43,
  • ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు: 3,
  • ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 10
ప్రాథమికోన్నత పాఠశాలలు[2]
  • మండలపరిషత్తు పాఠశాలలు: 7
  • ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 8
ఉన్నత పాఠశాలలు[3]
  • ప్రభుత్వ పాఠశాలలు: 3
  • మండల పరిషత్తు పాఠశాలలు: 15
  • ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు: 3
  • ప్రైవేటు అన్-ఎయిడెడ్ పాఠశాలలు: 11
కళాశాలలు
  • శ్రీ అనంత పద్మనాభ కళాశాల, వికారాబాదు
  • శ్రీ సరస్వతి విద్యాలయ కళాశాల, వికారాబాదు
  • విద్యాసాగర్ డిగ్రీకళాశాల, వికారాబాదు

పర్యాటక ప్రదేశాలు [మార్చు]

వికారాబాదు సమీపంలోని పర్యాటక ప్రదేశాలు:

  • మృగవని చిలుకూరు జింకల పార్కు (15 కిలోమీటర్ల దూరం)
మూసీనది జన్మస్థానమైన అనంతగిరి కొండలు (6 కిలోమీటర్లు)

హైదరాబాదుకు 72 కిలోమీటర్ల దూరంలో వికారాబాదుకు 4 కిలోమీటర్ల దూరంలో తాండూర్ వెళ్ళుమార్గంలో ఉన్న ఎత్తయిన కొండ ప్రాంతమే అనంతగిరి కొండలు. ప్రకృతి రమణీయతకు ఈ కొండలు పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు, భక్తుల కోరికలు తీర్చే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, మూసీ నది పుట్టుక మున్నగునవి పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కొండపై టి.బి.ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడి వాతావరణం రోగులకు వరదాయకమని ఇక్కడివారి నమ్మకం. కొండపై ఉన్న అపురూపమైన దృశ్యాల కారణంగా అనేక సినిమా షూటింగులు జరిగాయి.

  • అనంత పద్మనాభస్వామి దేవాలయం (6 కిలోమీటర్లు)
  • చిలుకూరు బాలాజీ దేవాలయం (23 కిలోమీటర్లు)
  • ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ (18 కిలోమీటర్లు)

మండలంలోని పట్టణాలు [మార్చు]

మండలంలోని గ్రామాలు [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]

మూలాలు [మార్చు]

  1. Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.153
  2. Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.155
  3. Hand Book of Statistics - 2007-08, Ranga Reddy Dist, Published by CPO, Page No.157
"http://te.wikipedia.org/w/index.php?title=వికారాబాద్&oldid=818022" నుండి వెలికితీశారు