వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2022, ఆగస్టు 6
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
విద్యార్థులు100
స్థానంవికారాబాద్, వికారాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాలగూడుకళాశాల వెబ్సైటు

వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లా లోని వికారాబాద్ పట్టణం సమీపంలోని అనంతగిరి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. 2022 ఆగస్టు 6న ఈ కళాశాల స్థాపించబడగా, 2023 ఏప్రిల్ 18న నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2023-24 విద్యా సంవత్సరానికి 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.

ఏర్పాటు[మార్చు]

వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని 2021 జూన్ 27న రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, కొప్పుల మహేష్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, ఎంఎల్‌సీ ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్లు సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.[1]

ప్రభుత్వ వైద్య కళాశాలకు 235 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ 2022 ఆగస్టు 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబరు 99) జారీ చేసింది.[2][3]

నిర్మాణం[మార్చు]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని లక్షలాది మంది రోగులకు వైద్యం అందించిన టిబి శానిటోరియం భవనం 1946 సంవత్సరంలో నిజాం కాలంలో నిర్మించబడింది. దీనిని కళాశాల భవనంగా ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలతో ఆసుపత్రి భవనాలను ఆధునీకరించింది. అంతేకాకుండా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి, అనుబంధ భవనాల నిర్మాణానికి 235 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసింది.[4]

కోర్సులు - శాఖలు[మార్చు]

  • అనాటమీ
  • ఫార్మాకాలజీ
  • ఫిజియోలాజీ
  • బయోకెమిస్ట్రీ
  • పాథాలజీ
  • మైక్రోబయోలాజీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్
  • జెనరల్ సర్జరీ
  • ఆర్థోపెడిక్స్
  • ఓటో-రైనో-లారిగోలజీ
  • ఆప్తాల్మోలజీ
  • జనరల్ మెడిసిన్
  • టిబి & ఆర్‌డి
  • డివిఎల్
  • సైకియాట్రీ
  • పీడియాట్రిక్స్
  • ఓబిజీ
  • అనస్థీషియాలజీ
  • కమ్యూనిటీ మెడిసిన్
  • రేడియోడియాగ్నోసిస్
  • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
  • టీబీసీడీ
  • సీటీ సర్జరీ
  • న్యూరో సర్జరీ
  • న్యూరాలజీ
  • ప్లాస్టిక్‌ సర్జరీ
  • యూరాలజీ
  • గాస్ట్రోఎంట్రాలజీ
  • ఎండోక్రైనాలజీ
  • నెఫ్రాలజీ
  • కార్డియాలజీ
  • ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్
  • ఈఎన్‌టీ
  • ఆప్తల్
  • అనస్తీషియా
  • డెంటల్

ఎంపిక[మార్చు]

ఈ కళాశాలలో ప్రతి సంవత్సరం 100 సీట్ల (85 శాతం సీట్లు రాష్ట్ర కోటా, 15 శాతం సీట్లు ఆలిండియా కోటా) చొప్పున ఐదేళ్ళపాటు 500 సీట్లను భర్తీ చేస్తారు.

తరగతుల ప్రారంభం[మార్చు]

ఈ కళాశాల అవసరమైన కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఆయా విభాగాల హెచ్‌వోడీలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అంతా కలిపి మొత్తం 62 మంది నియమించబడ్డారు. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ తదితర తరగతులు నిర్వహించడానికి కావాల్సిన ఈ మూడు విభాగాలు సిద్దమయ్యాయి.

ఈ కళాశాలలో మొత్తం ఆరుగురు ప్రొఫెసర్లు, పదిమంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 40మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు నియమించబడ్డారు.

2023 సెస్టెంబరు 15 నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[5][6] ఈ కార్యక్రమంలో కళాశాల నుండి గనుల-భూగర్భ వనరుల శాఖామంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

అనుబంధ ఆసుపత్రి[మార్చు]

చికిత్సల శిక్షణ కోసం కళాశాలకు అనుబంధంగా 30.50 కోట్ల రూపాయలతో 380 పడకలతో అన్ని హంగులతో జీ ప్లస్‌ టూ భవనాలతో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని బోధనా ఆసుపత్రిగా వినియోగించుతారు. గతంలో 12 వైద్య సేవలు కొనసాగుతున్న వికారాబాద్‌ ఏరియా ఆసుపత్రిని 26 రకాల వైద్య సేవలు, 380 పడకలతో బోధనాసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు.[7]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ABN (2021-06-28). "వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-09-12. Retrieved 2023-09-12.
  2. Today, Telangana (2022-08-06). "Telangana govt sanctions Rs 1,479 cr to establish 8 more medical colleges". Telangana Today. Archived from the original on 2022-08-07. Retrieved 2023-09-21.
  3. Telugu, 10TV; naveen (2022-08-06). "8 New Medical Collges In Telangana : రాష్ట్రంలో మ‌రో 8 మెడిక‌ల్ కాలేజీలు.. ప‌రిపాల‌న అనుమ‌తులు జారీ చేసిన ప్ర‌భుత్వం". 10TV Telugu (in Telugu). Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. ABN (2023-09-10). "వైద్య విద్యకు వేళాయే!". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-09-12. Retrieved 2023-09-12.
  5. "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-21.
  6. telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-21.
  7. telugu, NT News (2023-05-26). "వైద్య విద్యకు అంతా సిద్ధం." www.ntnews.com. Archived from the original on 2023-05-26. Retrieved 2023-09-12.