కామినేని వైద్య విజ్ఞాన సంస్థ

వికీపీడియా నుండి

కామినేని వైద్య విజ్ఞాన సంస్థ

The main building of kamineni medical college.jpg
ఆదర్శవాక్యం "Vidya Pracchanna Gupth Dhanam"
Knowledge is the hidden treasure
స్థాపన 1999
తరహా వైద్య కళాశాల
Undergraduates ప్రతి సంవత్సరం 150 మంది
ప్రదేశం నార్కెట్‌పల్లి, ఆంధ్ర ప్రదేశ్, India
క్యాంపస్ Rural
అనుబంధాలు ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము
వెబ్‌సైటు "www.kimsmedicalcollege.com"
"The KIMS logo"

కామినేని వైద్య విజ్ఞాన సంస్థ (Kamineni Institute of Medical Sciences; KIMS) ప్రసిద్ధిచెందిన వైద్య కళాశాల. ఇది నల్గొండ జిల్లా లో నార్కెట్‌పల్లి గ్రామంలో ఉన్నది. ఈ కళాశాలను అనుబంధంగా 1050-పడకల ఆసుపత్రి నడపబడుతున్నది. ఇది జాతీయ రహదారి 9 మీద హైదరాబాద్ పట్టణం నుండి సుమారు 80 కిలోమీటర్లు (50 మైల్లు) దూరంలో ఉన్నది. ఇది ఈ ప్రాంత పేదప్రజలను ఉన్నతమైన వైద్య సేవలను అందిస్తున్నది. ఇక్కడకు మన రాష్ట్రం నుండే కాక ఇతర దేశాల నుండి కూడా విద్యార్ధులు వైద్యంలో డిగ్రీ (M.B.,B.S.) కోసం వస్తారు. ఇది ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము కు అనుంబంధంగా పనిచేస్తున్నది.

స్థాపన [మార్చు]

ఈ వైద్య సంస్థను శ్రీ కామినేని సూర్యనారాయణ గారు కామినేని విద్యా సంఘం (Kamineni Education Society) లో భాగంగా 1999 సంవత్సరంలో ప్రారంభించారు. మొదటి దఫా 100 మంది వైద్య విద్యార్ధులు ఇందులో నమోదు చేసుకున్నారు. తర్వాత ఈ సంఖ్య 150 కి పెరగడమే కాకుండా కొన్ని శాఖలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించారు.

ప్రధానోపాధ్యాయులు [మార్చు]

  • డా. రాజేంద్ర బాబు (1999–2006)
  • డా. సి. జి. విల్సన్ (2006– ప్రస్తుతం)

బయటి లింకులు [మార్చు]

  1. "KIMS"/ The website of Kamineni Medical college
  2. "NTR University of Health Sciences"
  3. "Kamineni Education Society"
  4. "Kamineni Hospitals"