కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2023, సెప్టెంబరు 15
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
విద్యార్థులు100
స్థానంకరీంనగర్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాలగూడుకళాశాల వెబ్సైటు

కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల.[1] గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2023-24 విద్యా సంవత్సరానికి 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.

ఏర్పాటు[మార్చు]

ప్రభుత్వ వైద్య కళాశాలకు 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ 2022 ఆగస్టు 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబరు 99) జారీ చేసింది.[2][3]

విత్తన శుద్ధి క్షేత్రంలో తాత్కాలిక భవన నిర్మాణానికి 7 కోట్ల నిధులు మంజూరుచేయబడింది. వీటిలో తరగతి గదులు, లైబ్రరీ, అనాటమీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ ల్యాబ్, ఫిసియోలజీ ల్యాబ్, అడ్మిషన్ బ్లాక్ తాత్కాలిక భవనాలు నిర్మించబడ్డాయి.[4]

కోర్సులు - శాఖలు[మార్చు]

  • అనాటమీ
  • ఫార్మాకాలజీ
  • ఫిజియోలాజీ
  • బయోకెమిస్ట్రీ
  • పాథాలజీ
  • మైక్రోబయోలాజీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్
  • జెనరల్ సర్జరీ
  • ఆర్థోపెడిక్స్
  • ఓటో-రైనో-లారిగోలజీ
  • ఆప్తాల్మోలజీ
  • జనరల్ మెడిసిన్
  • టిబి & ఆర్‌డి
  • డివిఎల్
  • సైకియాట్రీ
  • పీడియాట్రిక్స్
  • ఓబిజీ
  • అనస్థీషియాలజీ
  • కమ్యూనిటీ మెడిసిన్
  • రేడియోడియాగ్నోసిస్
  • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
  • టీబీసీడీ
  • సీటీ సర్జరీ
  • న్యూరో సర్జరీ
  • న్యూరాలజీ
  • ప్లాస్టిక్‌ సర్జరీ
  • యూరాలజీ
  • గాస్ట్రోఎంట్రాలజీ
  • ఎండోక్రైనాలజీ
  • నెఫ్రాలజీ
  • కార్డియాలజీ
  • ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్
  • ఈఎన్‌టీ
  • ఆప్తల్
  • అనస్తీషియా
  • డెంటల్

తరగతుల ప్రారంభం[మార్చు]

అనస్థిషియా, సర్జరీ, మెడిసిన్, పిడియాట్రిషన్, గైనిక్, బయో కెమిస్ట్రీ, అనాటమీ, పాథాలజీ, మైక్రో బయోలజీ, ఫల్మనాలాజీ, ఈఎన్టి, సైకియాట్రిక్, ఫొరెన్సిక్, రేడియాలజీ, ఆర్థో వంటి 15 విభాగాల్లో మొత్తం 45 మంది సహాయ ఆచార్యులతోపాటు ఒక ప్రిన్సిపాల్, ఒక సూపరెండెంట్, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు ప్రొఫెసర్లు, ముగ్గురు పరిపాలనాధికారాలు, ఆర్ఎంఓలలు నియమించబడ్డారు.[5]

2023 సెస్టెంబరు 15 నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[6][7] ఈ కార్యక్రమంలో కళాశాల నుండి బీసీ సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.[8]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "తరగతుల నిర్వహణకు వైద్య కళాశాల సిద్ధం". EENADU. 2023-06-18. Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.
  2. Today, Telangana (2022-08-06). "Telangana govt sanctions Rs 1,479 cr to establish 8 more medical colleges". Telangana Today. Archived from the original on 2022-08-07. Retrieved 2023-09-21.
  3. Telugu, 10TV; naveen (2022-08-06). "8 New Medical Collges In Telangana : రాష్ట్రంలో మ‌రో 8 మెడిక‌ల్ కాలేజీలు.. ప‌రిపాల‌న అనుమ‌తులు జారీ చేసిన ప్ర‌భుత్వం". 10TV Telugu (in Telugu). Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. telugu, NT News (2023-01-24). "కరీంనగర్‌ వైద్య కళాశాలలో ఆగస్ట్ నుంచి ప్రవేశాలు : మంత్రి గంగుల". www.ntnews.com. Archived from the original on 2023-01-25. Retrieved 2023-09-21.
  5. "రేపే ప్రభుత్వ వైద్య కళాశాల మహోత్సవం". EENADU. 2023-09-14. Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.
  6. "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-21.
  7. telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-21.
  8. telugu, NT News (2023-09-15). "TS Minister Gangula | దేశానికి వైద్యమందించే స్థాయికి తెలంగాణ.. రాష్ట్ర మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-27.