నారాయణపేట

వికీపీడియా నుండి
  ?నారాయణపేట మండలం
మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్
మహబూబ్ నగర్ జిల్లా పటములో నారాయణపేట మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో నారాయణపేట మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము నారాయణపేట
జిల్లా(లు) మహబూబ్ నగర్
గ్రామాలు 20
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
85,510 (2001)
• 42600
• 42910
• 47.10
• 58.62
• 35.78
వెబ్‌సైటు: www.narayanpet.com


నారాయణపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. మహబూబ్ నగర్ జిల్లా లోని 4 మున్సీపాలటీలలో నారాయణ పేట ఒకటి. ఇది హైదరాబాదు కు 160 కిలో మీటర్ల దూరములో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్నది. ఇది పట్టు చీరలకు మరియు బంగారు వ్యాపారానికి ప్రసిద్ది. ఒకప్పుడు జిల్లా లోనే ప్రముఖ వ్యాపార కేంద్రంగా విలసిల్లిననూ ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా లేదు. జిల్లా లోనే మొట్టమొదటి మున్సీపాలటీగా నారాయణ పేట ప్రారంబించబడిననూ ప్రస్తుతం మూడో గ్రేడు మున్సీపాలటీగా కొనసాగుతోంది. జిల్లాలోని 5 డివిజన్లలో ఒకటైన నారాయణ పేట రెవెన్యూ డివిజన్ లో 15 మండలాలు కలవు.

విషయ సూచిక

జనాభా [మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 97774. ఇందులో పురుషులు 48924, మహిళలు 48850. అక్షరాస్యుల సంఖ్య 50110.[1] మండలంలో పట్టణ జనాభా 41539 కాగా, గ్రామీణ జనాభా 56235.

పురపాలక సంఘం [మార్చు]

మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పురపాలక సంఘాన్ని నారాయణపేటలో 1945-46లో ఏర్పాటుచేశారు. మద్యలో కొంతకాలం నగరపంచాయతీగా కొనసాగి ప్రస్తుతం మూడవ గ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతోంది.

రవాణా సదుపాయాలు [మార్చు]

నారాయణపేట పట్టణానికి హైదరాబాదు నుండి మహబుబ్ నగర్ మీదుగా మంచి బస్సు సౌకర్యము కలదు. రంగారెడ్డి జిల్లా తాండూరు నుండి కోస్గి, మద్దూరుల మీదుగా మరియు కర్ణాటక రాష్ట్రం నుండి కూడా బస్సు సౌకర్యము కలదు. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రస్థానమైననూ రైలు సౌకర్యం లేదు. సమీపంలోని రైలుస్టేషన్ దేవరకద్ర. ఇది నారాయణపేట నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తాండూరు రైల్వే స్టేషన్ 60 కిలోమీటర్ల దూరంలో కలదు. కర్ణాటకలోని యాద్గిర్ రైల్వే స్టేషన్ నారాయణపేట నుండి 51 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

విద్యాసంస్థలు [మార్చు]

  • డిగ్రీ కళాశాలలు--2
  • జూనియర్ కళాశాలలు--5
  • ఇంజనీరింగ్ కళాశాలలు--0
  • బిఇడి కళాశాలలు--3

బ్యాంకులు [మార్చు]

అదర్స్ఉన్నత

ప్రధాన సంఘటనలు [మార్చు]

  • 2005, ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు మావోయిస్టుల తూటాలకు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, మక్తల్ శాసనసభ్యుడు అయిన చిట్టెం నర్సిరెడ్డితో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు[2]. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరణించినవారిలో నర్సిరెడ్డితో పాటు పురపాలక సంఘం కమీషనర్ రాంమోహన్, నర్సిరెడ్డి కుమారుడు చిట్టెం వెంకటేశ్వరరెడ్డి ప్రముఖులు.

నారాయణపేట వెబ్ సఇత్

మండలంలోని గ్రామాలు [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]

Mahbubnagar.jpg

మహబూబ్‌ నగర్ జిల్లా మండలాలు

కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్‌ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమన‌గల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్‌ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్‌ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్


మూలాలు [మార్చు]

  1. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 10, తేది 15-08-2008
"http://te.wikipedia.org/w/index.php?title=నారాయణపేట&oldid=823340" నుండి వెలికితీశారు