భారతీయ స్టేట్ బ్యాంకు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భారతీయ స్టేట్ బ్యాంకు
తరహా పబ్లిక్
స్థాపన 1806 లో కోల్‌కతలో
బ్యాంక్ ఆఫ్ కలకత్తా పేరుతో స్థాపన
ప్రధానకేంద్రము Flag of India.svg ముంబాయి, భారతదేశం
కీలక వ్యక్తులు ప్రతీప్ చవుదరి, ఛైర్మెన్
పరిశ్రమ ఫైనాన్స్
వాణిజ్య బ్యాంకులు
వెబ్ సైటు www.statebankofindia.com

భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. 1806 లో కోల్‌కత లో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ మరియు ప్రవాస భారతీయ సేవలను కల్గజేస్తుంది. 1955 లో భారత ప్రభుత్వము ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేయు సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.

ప్రారంభ బీజాలు[మార్చు]

19 వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చుకున్న బ్యాంక్ ఆఫ్ కలకత్తా 2 జూన్, 1806 న స్థాపించబడింది. తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ మరియు రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు [బ్యాంక్ ఆఫ్ బాంబే (1840 లో స్థాపన)మరియు బ్యాంక్ ఆఫ్ మద్రాస్(1921 లో స్థాపన)] కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెని గా కార్యకలాపాలు నిర్వహించింది. దేశంలో రిజర్వు బాంకు స్థాపించేవరకు ఈ బాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడ నిర్వహించింది.

భారతీయ స్టేట్ బ్యాంక్ చట్టం, 1955 ప్రకారం దేశంలో కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము 30 ఏప్రిల్, 1955 నాడు ఇంపీరియల్ బ్యాంకుకు ఉన్న అధీకృత మూలధనం మొత్తం నూతనంగా ఏర్పాటుచేయబడిన భారతీయ స్టేట్ బ్యాంకుకు మార్చబడింది.

కాలగమనంలో స్టేట్ బాంకు[మార్చు]

  • 21 జూన్, 1806: కలకత్తా బ్యాంకు స్థాపన.
  • 21 జనవరి, 1809: దీనిని బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా .
  • 15 ఏప్రిల్, 1840: బ్యాంక్ ఆఫ్ బాంబే స్థాపన .
  • 11 జూలై, 1843: బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపన .
  • 1861: పేపర్ కరెన్సీ చట్టం జారి .
  • 27 జనవరి, 1921: మూడు బాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా మార్పు .
  • 11 జూలై, 1955: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన (జాతీయం చేయబడిన తొలి బ్యాంకు) .
  • 1959: స్టేత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టం జారీ , దీనితో 8 పూర్వపు రాష్ట్ర అనుబంధ బ్యాంకులను వాటి శాఖలను తన అధీనంలోకి తెచ్చుకుంది .
  • 1980 లు కేరళ లో బ్యాంక్ ఆఫ్ కొచ్చిన ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ లో కల్పివేశారు. .
  • 29 జూన్, 2007: స్టేట్ బాంకులో ఉన్న మొత్తం రిజర్వ్ బ్యాంకు షేర్ హోల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది . [1]

అనుబంధ బ్యాంకులు[మార్చు]

భారతీయ స్టేట్ బ్యాంకుకు 5 అనుబంధ బ్యాంకులు కలవు. అవన్నీ సాధారనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ... అనే పేరుతో ప్రారంభమై చివరన ఆయా బ్యాంకుల ప్రధాన స్థావరం ఉన్న నగరాల పేర్లతో అంతమౌతుంది. ఇవి 1959 లో జాతీయం చేయడానికి ముందు ఆయా సంస్థాన రాజ్యాలకు చెందినవి. మొదటి పంచవర్ష ప్రణాళికలో గ్రామీణాభివృద్ధి లక్ష్యాన్ని సాధించుటకు ప్రభుత్వం ఈ బ్యాంకలన్నింటినీ కల్పి స్టేట్ బ్యాంక్ గా మార్పు చేసింది. ఈ బ్యాంకులన్నింటికీ కల్పి ఒకే లోగో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ను ఇవన్నీ మాతృ సంస్థగా పరిగణిస్తాయి.

విదేశాలలో శాఖలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. [www.andhranews.net/Business/2007/June/29-Government-acquires-entire-6391.asp "Government acquires entire RBI shares in SBI"] Check |url= scheme (సహాయం). AndhraNews.net. సంగ్రహించిన తేదీ 2007-06-29. 

బయటి లింకులు[మార్చు]