కెనరా బ్యాంకు
వికీపీడియా నుండి
| కెనరా బ్యాంకు | |
|---|---|
| తరహా | పబ్లిక్ బి.ఎస్.ఇ: 532483 |
| స్థాపన | కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్ (1906) కెనరా బ్యాంకు లిమిటెడ్ (1910) కెనరా బ్యాంకు (1969) |
| ప్రధానకేంద్రము | |
| పరిశ్రమ | ఫైనాన్స్ వాణిజ్య బ్యాంకులు |
| ఉద్యోగులు | 47,389 (2004-05) |
| వెబ్ సైటు | [కెనరా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్] |
భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో కెనరా బ్యాంకు (Canara Bank) ఒకటి. ఈ బ్యాంకును 1906లో కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో స్థాపించారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు పేరు కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. దీని స్థాపకుడు ప్రముఖ న్యాయవాది అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఈ బాంకు భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. 1910లో ఈ బాంకు పేరు కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చబడినది. జూలై 19, 1969లో మొదటిసారి జాతీయము చేయబడిన 14 బాంకులలో కెనరా బాంకు ఒకటి.
విషయ సూచిక |
[మార్చు] కెనరా బ్యాంకు సమాచారం
-
-
ప్రధాన కార్యాలయం బ్యాంకు శాఖలు ఖాతాదారులు ఉద్యోగులు విస్తరణ విదేశాలలో శాఖలు బెంగుళూరు 2640 31 మిలియన్లు 46 వేలు 25 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు బ్రిటన్లోని లండన్, చైనాలోని షాంఘయి, హాంకాగ్
-
[మార్చు] గుర్తింపులు
- 2006లో ఫోర్బెస్ గ్లోబల్ 2000 ర్యాంకింగ్‌లో 1299 స్థానం పొందినది.
- 2005-06లో ఉత్తమ ప్రభుత్వరంగ బ్యాంకు అవార్డు స్వీకరించినది.
- 2007 వ సంవత్సర బ్యాంకర్ పత్రిక అతి పెద్ద వెయ్యి బాంకులలో 280వ స్థానం
[మార్చు] ఈ బాంకు పరిధిలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
- శ్రేయాస్ గ్రామీణ బ్యాంకు
- సౌత్ మలబార్ గ్రామీణ బ్యాంకు
- ప్రగతి గ్రామీణ బ్యాంకు
[మార్చు] బయటి లింకులు
|
|||||||||||