విదర్భ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విదర్భ
విదర్భ
विदर्भ
Population
 • Total 2,06,30,987

విదర్భ (ఆంగ్లం: Vidarbha; మరాఠీ: विदर्भ) నాగపూర్ డివిజన్ మరియు అమరావతి డివిజన్‌లతో ఏర్పడిన మహారాష్ట్ర యొక్క తూర్పు ప్రాంతం. ఇది మహారాష్ట్ర యొక్క మొత్తం ప్రాంతంలో 31.6% ఆక్రమించి మొత్తం జనాభాలో 21.3% కలిగిఉంది[1]. ఇది ఉత్తరాన మధ్య ప్రదేశ్, తూర్పున ఛత్తీస్‌గడ్, దక్షిణాన తెలంగాణ రాష్ట్రాలను మరియు పశ్చిమాన మాహారాష్ట్రలోని మరాఠ్వాడ మరియు ఖాందేష్ ప్రాంతాలను సరిహద్దులుగా కలిగిఉంది. మధ్య భారతదేశంలోని విదర్భ, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు భిన్నమైన తన స్వంత ఘనమైన సాంస్కృతిక మరియు చారిత్రక నేపధ్యాన్ని కలిగిఉంది. నాగపూర్ విదర్భ యొక్క అత్యంత పెద్ద నగరం, రెండవ పెద్ద నగరం అమరావతి, తరువాత స్థానంలో అకోలా, యవత్‌మల్, చంద్రపూర్ మరియు గోండియా ఉన్నాయి. అధికభాగం విదర్భవాసులు మరాఠీ మాండలికమైన వర్హది మాట్లాడుతారు.

ఈ ప్రాంతం కమలాలు మరియు పత్తి పంటలకి ప్రసిద్ధి చెందింది. విదర్భ, మహారాష్ట్ర యొక్క ఖనిజ వనరులలో మూడింట రెండు వంతులను, అటవీ సంపదలో నాల్గింట మూడు వంతులను కలిగిఉంది మరియు విద్యుచ్ఛక్తి యొక్క నికర ఉత్పత్తిదారుగా ఉంది[2]. చరిత్రను పరికిస్తే, మతకలహాల సమయంలో భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే విదర్భ ప్రశాంతంగా ఉంది కానీ పేదరికం[3] మరియు పోషకాహార లోపం[4]తో బాధింపబడుతోంది. మహారాష్ట్ర యొక్క ఇతర ప్రాంతాలతో పోల్చినపుడు ఇది ఆర్ధికంగా తక్కువ సమృద్ధిని పొందింది.[5]

ఇటీవలి కాలంలో, ఈ ప్రాంతం పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క కొనసాగుతున్న నిర్లక్ష్యం, కొందరు మినహా విదర్భలోని అసమర్ధ రాజకీయ నాయకత్వాల కారణంగా, ప్రత్యేక విదర్భ రాష్ట్రం కొరకు పిలుపు ఇవ్వబడింది. భారతదేశంలోని ఇతరప్రాంతాలతో పోల్చినపుడు ఈ ప్రాంత రైతులు దయనీయమైన స్థితిలో జీవిస్తున్నారు. ఒక దశాబ్దంలో మహారాష్ట్రలోని 32,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, వారిలో 70% విదర్భ ప్రాంతంలోని 11 జిల్లాలకు చెందినవారు[6]. ఖనిజాలు, బొగ్గు, అడవులు మరియు పర్వతాలతో సుసంపన్నంగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంతం నిరంతరం వెనుకబడి ఉండటానికి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల రాజకీయ నాయకత్వాల ఆధిపత్యం, ప్రత్యేకించి పశ్చిమ మహారాష్ట్ర నాయకత్వం కారణాలుగా ఉన్నాయి. మహారాష్ట్ర యొక్క మిగిలిన ప్రాంతాల కంటే, సాంస్కృతికంగా, రాజకీయంగా మరియు ఆర్ధికంగా విభిన్నంగా ఉన్నప్పటికీ, మహారాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులచే ఈ ప్రాంత నాయకులకు అప్రధాన్యత ఇవ్వబడినపుడు మాత్రమే ప్రత్యేక రాష్ట్ర పిలుపు ఇవ్వబడింది[7]. ప్రధానంగా, రాష్ట్ర రాజకీయ పార్టీ అయిన శివ సేన నుండి వ్యతిరేకత కారణంగా ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఒక కల్పనగా మిగిలిపోయింది[8].

చరిత్ర[మార్చు]

దస్త్రం:Central Provinces India 1903.gif
బ్రిటిష్ పాలిత భారతదేశంలోని కేంద్ర ప్రావిన్స్ లు మరియు బెరార్ ప్రాంతాల మానచిత్రం.నాగపూర్ కేంద్ర ప్రావిన్స్ ల ముఖ్యపట్టణంగా చూపబడింది

అయినీ-అక్బరీ ప్రకారం మధ్యయుగ కాలంలో ఖిల్జీ వంశం నుండి మొగలుల పరిపాలన దాకా, సుబః బేరార్, గొంద్వాన మరియు గుల్షన్-ఎ-బేరార్ గా పిలువబడిన విదర్భ ప్రాతం యొక్క దేవఘర్ సర్కార్ కు నాగపూర్ ముఖ్యపట్టణంగా ఉండేది మరియు ఆలంగీర్ నామా ప్రకారం విదర్భ ప్రాంతపు పద్నాలుగు సర్కారులను బేరార్ అంటారు మరియు సవాయ్ శ్రీ శ్రీమంత్ సంతజీ భోంస్లే, బేరార్ మరియు గొండ్వానాకు "సేన సాహిబే-ఎ-సుబా"గా నియమింపబడ్డారు. అతడు ఔరంగజేబు మనుమడైన, "భారతదేశపు చక్రవర్తి అయిన మిర్జా మొహమ్మద్ ఆజం షా యొక్క కుమారుడు అయిన బేదర్ భక్త్ మిర్జా మామగారు, 1681లో బులంద్ బఖ్త్ ఔరంగజేబ్ ఆలంగీర్ చక్రవర్తిచే గోండ్వాన రాజుగా నియమింపబడ్డాడు, బులంద్ భక్త్ తరువాత అతని కుమారుడైన సుల్తాన్ చాంద్ షా పాలించగా, సుల్తాన్ చంద్ షా చనిపోయిన తరువాత అతని భార్య తన బంధువుని "సేన సాహిబ్-ఎ-సుబా"గా నియమించింది. రఘుజీ భోంస్లే "I" 1732లో రఘుజీ భోంస్లే "I", సుల్తాన్ చంద్ షా కుటుంబం కొరకు ఆదాయం మరియు చౌత్ వసూలు చేయడానికి సైనిక అధికారిగా నియమించబడ్డాడు. అప్పుడు పద్దెనిమిదవ శతాబ్దంలో తూర్పు-మధ్య ప్రాంతంలో అధికభాగాన్ని పాలించిన స్వతంత్ర హిందూ రాజ్యమైన మరాఠాల యొక్క భోంస్లే వంశం ఏర్పడింది. 1818లోని మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఓడిపోయిన తరువాత, భోంస్లే రాజ్యాలు నాగపూర్ ప్రాంతానికి పరిమితమయ్యాయి. 1853లో నాగపూర్ యొక్క చివరి మహారాజు మగ వారసుడు లేకుండా చనిపోవడంతో నాగపూర్ ప్రాంతం బ్రిటిష్ పాలిత భారతదేశంలో కలిపివేయబడింది. 1861లో నాగపూర్ డివిజన్ బ్రిటిష్ రాజ్యం యొక్క సెంట్రల్ ప్రావిన్సెస్‌గా ఏర్పడింది.

గతంలో బేరార్‌గా పిలువబడిన అమరావతి, 1853 వరకు హైదరాబాద్ నిజాం‌చే పాలించబడింది. ఆ సంవత్సరంలో, నిజాం యొక్క పాలనా లోపాలను ఎత్తిచూపుతూ బ్రిటిష్ వలస రాజ్యం ఈ రాష్ట్రంపై ప్రత్యక్ష నియంత్రణను పొందింది. 1903లో బేరార్ కేంద్ర ప్రావిన్సులకు కలుపబడింది.

భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో నాగపూర్ అనేకసార్లు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు వేదికగా నిలిచింది. గాంధీ కాలంలో సేవాగ్రాం భారత జాతీయ రాజధానిగా ఉంది.

1947లో భారతదేశం స్వాతంత్రాన్ని పొందిన తరువాత సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంగా రూపొందాయి. 1956లో మరాఠీ మాట్లాడే అన్ని ప్రాంతాలతో పాటు విదర్భ బొంబాయి రాష్ట్రంలోకి బదిలీ చేయబడింది. 1960లో బొంబాయి రాష్ట్రం భాషాపరంగా మహారాష్ట్ర మరియు గుజరాత్ లుగా‌విడిపోయింది. మరాఠీ-మాట్లాడే విదర్భ, మహారాష్ట్రలో భాగంగా మారింది.

భౌగోళిక స్థితి[మార్చు]

భౌగోళికంగా విదర్భ దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తరభాగంలో ఉంది. పశ్చిమ కనుమల వలె, ఇక్కడ ఎత్తైన కొండ ప్రాంతాలు లేవు. సాత్పురా శ్రేణి విదర్భ ప్రాంతానికి ఉత్తర దిక్కున మధ్యప్రదేశ్‌లో ఉంది. అమరావతి జిల్లాలోని మేల్ ఘాట్ ప్రాంతం సాత్పురా శ్రేణి యొక్క దక్షిణ భాగంలో ఉంది[9]. దక్కన్ లావా నాప కారణంగా విదర్భ అంతటా పెద్ద బసాల్ట్ రాతిపలకలు ఉంటాయి. జిల్లాలోని మొత్తం ప్రాంతం రూపాంతర ప్రాప్త శిల మరియు ఒండ్రుమట్టితో నిండి ఉండటంతో గోండియా జిల్లా మహారాష్ట్రలో ప్రత్యేకంగా ఉంటుంది.[10]. బుల్దానలో, ఉల్క లేదా తోకచుక్క ప్రభావం వలన ఏర్పడిన లోనార్ బిలము ఉంది. తూర్పు జిల్లాలైన గోండియా, భండారా, గడ్చిరోలి మరియు నాగపూర్ భారతదేశంలో అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించబడే భూకంప జోన్ 1 లో ఉండగా, ఇతర జిల్లాలు జోన్ 2లో ఉన్నాయి.

విదర్భలో వైన్ గంగ అత్యంత పెద్దనది. విదర్భ ప్రాంతంలో ప్రవహించే ఇతర పెద్ద నదులైన వార్ధా, కన్హన్ నదులు గోదావరి యొక్క ఉపనదులు. ఉత్తరాన ఉన్న ఐదు చిన్న నదులైన ఖప్ర, సిప్న, గడ్గా, డోలర్ మరియు పూర్ణ నదులు తపతి నది యొక్క ఉపనదులు.

పరిపాలన & రాజకీయాలు[మార్చు]

నాగపూర్ లోని విధాన్ భవన్ మహారాష్ట్ర అసెంబ్లీ యొక్క శీతాకాల సమావేశాలకు ఆతిధ్యం ఇస్తుంది

విదర్భ రెండు విభాగాలను (అమరావతి మరియు నాగపూర్ లను) కలిగిఉంది. ఈ ప్రాంతం అమరావతి, అకోలా, భండారా, బుల్దానా, చంద్రపూర్, గడ్చిరోలి, గోండియా, నాగపూర్, వార్ధా, వాషిం, యవత్ మాల్ అనే 11 జిల్లాలను కలిగిఉంది.

జిల్లా పరిపాలన[మార్చు]

ప్రతి జిల్లా రోజువారీ పరిపాలనను నిర్వర్తించే కలెక్టర్ కార్యాలయాన్ని కలిగిఉంది. జిల్లా కలెక్టర్ భారత కేంద్ర ప్రభుత్వంచే నియమించబడి రాష్ట్రంలోని జిల్లా పరిపాలనకు బాధ్యత వహిస్తాడు.[11] విదర్భలోని అత్యంత పెద్ద నగరమైన నాగపూర్ నగరం, ప్రత్యేక పౌర సంఘమైన, నాగపూర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్‌ను కలిగిఉంది, ఇది నాగపూర్ పురపాలక సంస్థతో కలసి అభివృద్ధి మరియు ప్రణాళికా కార్యక్రమాలకు బాధ్యత వహిస్తుంది. ఇతర ప్రముఖ నగరాలైన అమరావతి మరియు అకోలా కూడా వాటి స్వంత పురపాలక సంస్థలను కలిగిఉన్నాయి. ఈ పౌర సంస్థల కార్పొరేటర్లు(ప్రతినిధులు) ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. పట్టణ ప్రాంతాన్ని అనేక వార్డులుగా విభజించి, ప్రతి వార్డు నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంది.

లోక్‌సభలో ప్రాతినిధ్యం[మార్చు]

విదర్భ జాతీయ స్థాయిలో 10 లోక్‌సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అత్యధిక జన సాంద్రత కలిగిన నాగపూర్ జిల్లా 2 లోక్‌సభ స్థానాలైన నాగపూర్ మరియు రామ్‌టెక్‌లను కలిగిఉండగా తక్కువ జన సాంద్రత కలిగిన చిముర్ మరియు గడ్చిరోలి జిల్లాలు కలిపివేయబడ్డాయి. ప్రఫుల్ పటేల్, గొండియాకు నుండి లోక్‌సభ స్థానికి MP కావడం వలన గొండియా-భండారా స్థానాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. రామ్టెక్ మరియు అమరావతి స్థానాలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్ధులకు కేటాయించబడగా గడ్చిరోలి-చిముర్ షెడ్యూల్డ్ తెగల కొరకు రిజర్వ్ చేయబడింది.[12]

విధానసభలో ప్రాతినిధ్యం[మార్చు]

విదర్భ రాష్ట్రస్థాయిలో 62 విధానసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. నాగపూర్ నగరం 6 ప్రాంతాలుగా విభజించబడి అధిక సాంద్రతలో అసెంబ్లీ స్థానాలను కలిగిఉన్నదిగా ప్రకటించుకుంటుంది. కొన్ని స్థానాలు షెడ్యూల్డ్ తెగల అభ్యర్ధులకు కేటాయించబడగా, మిగిలిన స్థానాలలో ఎవ్వరైనా పోటీచేయవచ్చు.[13] నాగపూర్ ఒప్పందంలో భాగంగా మహారాష్ట్ర అసెంబ్లీ యొక్క శీతాకాల సమావేశాలు నాగపూర్ విధాన్ భవన్‌లో జరుగుతాయి.

జనాభా[మార్చు]

జిల్లాలు <లింగము>మగ</లింగము> ఆడ మొత్తం
అకోలా 841,253 788,986 1,630,239
అమరావతి 1,345,614 1,261,546 2,607,160
భండారా 573,445 562,701 1,136,146
బుల్దానా 1,147,403 1,085,077 2,232,480
చంద్రపూర్ 1,062,993 1,008,108 2,071,101
గడ్చిరోలి 491,101 479,193 970,294
గోండియా 598,834 601,873 1,200,707
నాగపూర్ 2,105,314 1,962,323 4,067,637
వార్ధా 638,990 597,746 1,236,736
వాషిం 526,094 494,122 1,020,216
యవత్ మాల్ 1,265,681 1,192,590 2,458,271

భారత ప్రభుత్వ జనాభా లెక్కలు 2001 ప్రకారం విదర్భ 20,630,987 జనాభాను కలిగిఉంది[14]. హిందూయిజం ఈ ప్రాంతంలో ఆధిపత్యంలో ఉన్న మతం. బుద్ధిజం రెండవ స్థానంలో ఉన్న మతం. మహారాష్ట్రలోని ఇతరప్రాంతాలు మరియు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఎక్కువగా ఇస్లాం ఎక్కువ మంది ప్రజలు అనుసరించే మతాలలో రెండవ స్థానంలో ఉండగా ఇక్కడ అసాధారణంగా ఉంది. బుద్ధిజం ప్రముఖంగా ఉండటానికి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ప్రారంభించిన దళిత బౌద్ధ ఉద్యమం కారణంగా ఉంది.

మతాల కూర్పు జనాభా  %
హిందువులు 15,866,514 76.906%
బౌద్ధులు 2,697,544 13.075%
ముస్లింలు 1,720,690 8.6
క్రైస్తవులు 70,663 0.343%
సిక్కులు 37,241 0.181%
జైనులు 89,649 0.435%
ఇతరాలు 127,516 0.618%
మతాన్ని వెల్లడించనివారు 21,170 0.103%
అన్ని మతాలు 20,630,987 100.000%

ప్రత్యేక రాష్ట్రవాద ఉద్యమం[మార్చు]

1) 1853 :-మొగలులు మరియు మరాఠాల నుండి మధ్య భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించిన తరువాత, 1853లో నాగపూర్ రాజధానిగా “నాగపూర్ ప్రావిన్స్” ఏర్పాటుచేయబడింది. ఇది కేంద్ర ప్రభుత్వం నియమించే ఒక కమిషనర్ పాలనలో ఉండేది.

2) 1861 :- నాగపూర్ రాజధానిగా బ్రిటిష్ వారు “సెంట్రల్ ప్రావిన్స్“ను ఏర్పరచారు.

3) 1903 :- అక్టోబర్ 1 న బేరార్ కూడా సెంట్రల్ ప్రావిన్స్‌ల కమిషనర్ పాలనలోకి వచ్చింది. దీనికి ఇప్పుడు “సెంట్రల్ ప్రావిన్స్ అండ్ బేరార్” అని పేరు పెట్టబడింది.

4) 1935 :- బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం, ఎన్నికలను నిర్వహించి, ప్రొవిన్షియల్ అసెంబ్లీని ఏర్పరచింది. నాగపూర్ రాజధానిగా “సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్” ప్రత్యేక రాష్ట్రంగా ఉంచబడింది.

5) 1950 :-1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు "సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్", నాగపూర్ రాజధానిగా మధ్య ప్రదేశ్‌గా ఏర్పడ్డాయి.

6) 1956 :-భారతదేశంలో రాష్ట్రాల పునర్విభజన కొరకు ఏర్పాటైన ఫజల్ అలి కమిషన్(1953లో నియమించబడింది) నాగపూర్ రాజధానిగా “విదర్భ రాష్ట్రం” కొరకు సిఫారసు చేసింది.

7) 1960 :- మే 1న, రాష్ట్రాల పునర్విభజన కొరకు ఫజల్ అలీ కమిషన్‌చే సిఫారసు చేయబడిన "విదర్భ రాష్ట్రం", నూతనంగా ఏర్పాటైన మహారాష్ట్ర రాష్ట్రంతో కలిపివేయబడింది.


ఇటీవలి సంవత్సరాలలో మహారాష్ట్ర నుండి విడిపోవడానికి విదర్భ ప్రజలు అప్పుడడప్పుడు పిలుపునివ్వడం జరుగుతోంది. మహారాష్ట్ర యొక్క రాష్ట్ర ప్రభుత్వంచే తిరస్కారానికి గురయ్యామనే భావనతో పాటు ప్రత్యేక రాజకీయ ఉనికిగా ఉండాలనే కోరికపై ఇది ఆధారపడింది. పెట్టుబడులు మరియు ఇతర అభివృద్ధి నిధులను అందుకోవడంలో మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల కంటే ఈ ప్రాంతం వెనుకబడిందని ప్రజల ఫిర్యాదు. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఈ ప్రాంతంలో రోడ్లు, నీటిపారుదల సౌకర్యాలు మరియు విద్యా సంస్థలు తక్కువగా ఉన్నాయి. ఏమైనప్పటికీ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన రాజకీయ ఉద్యమాలు వాటి నాయకుల అవకాశవాద ధోరణుల వల్ల విఫలమయ్యాయి. విదర్భ రాజ్య పార్టీ మరియు విదర్భ రాజ్య నిర్మాణ్ కాంగ్రెస్‌లు జాతీయ పార్టీలైన INC వంటి వాటి నుండి విడిపోయిన నాయకులచే స్థాపించబడిన అతిచిన్న పార్టీలు. ఒకే ఒక జాతీయ పార్టీ - BJP మాత్రమే తన జాతీయ ప్రణాళికలో ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం డిమాండ్ చేసింది.

2001 భారత ప్రభుత్వ జనాభా గణన ప్రకారం విదర్భ మొత్తం జనాభా 20,630,987[14]. ఈ ప్రాంతం ఖనిజాలు, బొగ్గు, పర్వతాలు మరియు అడవులతో నిండి ఉన్నప్పటికీ వ్యవసాయం లేకపోవటం వల్ల ఇది చాలా కాలంగా అభివృద్ధి చెందకుండా ఉండిపోయింది. టాటా సంస్థ దేశపు మొట్టమొదటి వస్త్రాల మిల్లు అయిన సెంట్రల్ ఇండియా స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీ లిమిటెడ్‌ను నాగపూర్‌లో ప్రారంభించింది. ఈ కంపెనీ విక్టోరియా భారతదేశానికి రాణిగా ప్రకటించబడిన రోజైన జనవరి 1,1877న ప్రారంభించబడటం వల్ల "ఎమ్ప్రెస్ మిల్స్"గా ప్రసిద్ధి చెందింది.[15]

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

విదర్భ యొక్క ఆర్ధికవ్యవస్థ ప్రాధమికంగా వ్యవసాయంపై ఆధారపడింది మరియు ఈ ప్రాంతం అటవీ మరియు ఖనిజ సంపదలతో సుసంపన్నంగా ఉంది. వ్యాపారపరంగా చంద్రపూర్, అమరావతి మరియు నాగపూర్, విదర్భ యొక్క ప్రధాన నగరాలు. నాగపూర్ ముఖ్య వ్యాపార కేంద్రం. అమరావతి నగరం చిత్ర పంపిణీ మరియు వస్త్ర విపణికి ప్రసిద్ధిచెందింది. చంద్రపూర్,భారతదేశంలో అత్యంత పెద్దదైన థర్మల్ విద్యుత్ స్టేషన్‌లలో ఒకదానిని, BILT (కాగిత పరిశ్రమ) MEL, ఉక్కు పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు మరియు బొగ్గు గనులను కలిగిఉంది.

ఒక అంతర్జాతీయ సరుకు రవాణా కేంద్రం, (MIHAN), నాగపూర్‌లో అభివృద్ధి చేయబడుతోంది[16][17]. MIHAN ఆగ్నేయ ఆసియా మరియు మధ్య ప్రాచ్య ఆసియా నుండి వచ్చే సరుకు రవాణా నిర్వహణకు ఉపయోగించబడుతుంది. ఈ ప్రకల్పనలో INR10000 crore (U.6) సమాచార సాంకేతిక (IT) సంస్థల కొరకు ప్రత్యేక ఆర్ధిక మండలి (SEZ)[18] కూడా ఉంది. ఇది భారతదేశంలో ఇప్పటివరకు స్థాపించబడిన అతిపెద్ద ప్రకల్పన[19].

వ్యవసాయం[మార్చు]

ఈ ప్రాంతంలోని ముఖ్యమైన వాణిజ్య పంటలు పత్తి, కమలాలు మరియు సోయా చిక్కుళ్ళు. అమరావతి కమలాలు పండించే అతి పెద్ద జిల్లా. సాంప్రదాయ పంటలు జొన్న(జోవర్), బార్లీ ధాన్యం(బాజ్రా) మరియు వరి.యవత్‌మల్ పత్తిని అత్యధికంగా పండించే జిల్లా. గోండియా వరిని అత్యధికంగా పండించే జిల్లా.గోండియా వరి నగరంగా ప్రసిద్ధిచెందింది. ఇటీవలి కాలంలో అధిక సంఖ్యలో వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకోవడం కారణంగా విదర్భ ప్రాంతం అపఖ్యాతి పాలైంది.
1 జూలై 2006న భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రూ. 3,750-కోట్ల(37.5 బిలియన్ రూపాయల)ను విదర్భ ఉపశమన పాకేజీగా ప్రకటించారు. ఈ సహాయం ఈ ప్రాంతంలోని ఆరు జిల్లాల రైతులకు ఉపయోగపడగలదు. అధిక భాగం ఆర్ధిక నిపుణులు ఈ పాకేజీని ఆహ్వానించలేదు మరియు పాత్రికేయుడు P సాయినాథ్ [20] ది హిందూ వార్తాపత్రికలో ఈ పాకేజీని విమర్శిస్తూ ఇది అపజయాన్ని పొందిందని వ్యాఖ్యానించారు.

ఖనిజ సంపద[మార్చు]

చంద్రపూర్, గోండియా, గడ్చిరోలి, భండారా మరియు నాగపూర్ జిల్లాలు బొగ్గు మరియు మాంగనీస్ ముఖ్య ఖనిజాలుగా ప్రధాన ఖనిజ ప్రాంతంగా ఉంది. ఒక్క చంద్రపూర్ జిల్లా, మొత్తం మహారాష్ట్ర ఖనిజ సంపదలో 29% ఉత్పత్తి చేస్తుంది[21]. ముడి ఇనుము మరియు సున్నపురాయి శక్తివంతమైన ఖనిజ వనరులుగా ఉన్నాయి.[22].

పరిశ్రమ[మార్చు]

సాంప్రదాయకంగా విదర్భ పారిశ్రామిక అభివృద్ధిలో పశ్చిమ మహారాష్ట్ర కంటే వెనుకబడి ఉంది. పరిశ్రమలను ఆకర్షించడానికి అనేక ప్రోత్సాహకాలు ఇవ్వబడ్డాయి. నాగపూర్ వెలుపల ఉన్న బ్యూటిబోరి పారిశ్రామిక ప్రాంతం MIDC దేశంలోని అత్యంత పెద్ద పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటి, కానీ నిజానికి కొన్ని పరిశ్రమలు మాత్రమే ఇక్కడ స్థాపించబడ్డాయి. ఒక అంతర్జాతీయ సరుకు రవాణా కేంద్రమైన MIHAN నాగపూర్‌లో అభివృద్ధి పరచబడుతోంది. ఈ ప్రణాళిక నాగపూర్ యొక్క కేంద్రప్రాంతాన్ని, సమీకృత రహదారి మరియు రైలు మార్గాలను ఒక ప్రత్యేక ఆర్ధిక మండలిని ఉపయోగించుకొని ప్రస్తుత విమానాశ్రయాన్ని ఒక ప్రధాన సరుకు రవాణా కేంద్రంగా చేయాలనే లక్ష్యాన్ని కలిగిఉంది. భారతదేశ అత్యంత పెద్ద కాగిత తయారీ మరియు ఎగుమతి సంస్థ అయిన బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ చంద్రపూర్ జిల్లాలో ఉంది[23].

రైతుల ఆత్మహత్యలు[మార్చు]

గత దశాబ్దంలో మహారాష్ట్రలో 30,000 కంటే ఎక్కువమంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, వీరిలో 70% కంటే ఎక్కువ మంది విదర్భ ప్రాంతంలోని 11 జిల్లాలకు చెందినవారు. దీనికి ప్రధాన కారణం భూమిలో సారం లేకపోవడం, తగినంత నీటివనరులు లేకపోవడం, నూతన సాంకేతిక పద్ధతులు లేకపోవడం మరియు రైతుల అవసరాలపట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. విదర్భలో ప్రధాన పంట పత్తి, కానీ దానిని పండించే రైతులకు ప్రభుత్వం నుండి వారి వాటా అందక పోవడంతో, వారు నిస్పృహకు గురై పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు దారితీసింది. ప్రభుత్వం లేదా సమాజం నుండి బాధ్యతతో కూడిన ఏ విధమైన మార్గదర్శకత్వం లేకపోవడం వలన అనేక మంది రైతులు మారుతున్న ఆర్ధిక వ్యవస్థలో మనుగడ సాగించడం తెలుసుకోలేకపోయారు. ఆ వత్తిడి వారిలో అనేకమందిని ఒక మూలకు నెట్టివేసి వారికి ఆత్మహత్య ఒక పరిష్కారంగా మార్చింది[24]. ఇది కూడా ఈ ప్రాంతంలోని రైతులు మరియు ఇతరులు ప్రత్యేక విదర్భ రాష్ట్రం కొరకు పిలుపు ఇవ్వడానికి దారితీసింది.

పర్యాటకరంగం[మార్చు]

కాన్హ టైగర్ రిజర్వ్ (బాహ్య ప్రావిన్సు)
షెగావ్‌లోని ఆనంద్ సాగర్ ముఖద్వారం, ఇది హిందువులకు పవిత్ర స్థలం మరియి విదర్భలో ప్రసిద్ధ విహారకేంద్రం.

విదర్భ అనేక రకాల వృక్ష మరియు జంతు జీవజాలాలు కలిగిన పచ్చని ఆకురాల్చు అడవులకు నిలయం. ఇవి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. మహారాష్ట్ర పులి అభయారణ్యాలు అన్నీ విదర్భలోనే ఉన్నాయి[citation needed]. అవి అమరావతి జిల్లాలోని మేల్ఘాట్ టైగర్ రిజర్వు, చంద్రపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వు మరియు నాగపూర్ జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్వు.గోండియా జిల్లాలోని నాగ్జిర వన్య మృగ అభయారణ్యం మరియు నావెగావ్ బంద్ నేషనల్ పార్క్(పక్షుల కేంద్రం) కూడా చాలా ప్రసిద్ధి చెందాయి, పశ్చిమ ప్రాంతంతో పోల్చితే విదర్భ యొక్క తూర్పు ప్రాంతం సహజ వనరులను తక్కువగా కలిగి ఉన్నప్పటికీ, ఇది 1955లో ఏర్పాటు చేయబడిన తడోబా టైగర్ రిజర్వును కలిగిఉంది, ఇది 575.78 కిమీ2[25] వ్యాపించి, భారతదేశం యొక్క 25 ప్రాజెక్ట్ టైగర్ రిజర్వులలో ఒకటిగా ఉంది.[26]

ఈ జాతీయ పార్క్ తడోబా మరియు అంధారి శ్రేణిలోని రెండు దీర్ఘ చతురస్ర అడవులను కలిగిఉంది. 50 పులులను కలిగిఉండటంతో పాటు, తడోబా టైగర్ రిజర్వు అరుదైన భారతదేశపు వన్యప్రాణులు అయిన చిరుతపులి, స్లోత్ ఎలుగు, అడవి దున్న, అడవి కుక్కలు, హైనాలు, పునుగు పిల్లి మరియు అడవి పిల్లులు, మరియు భారతదేశపు లేడి జాతులైన సాంబార్, చీతల్, నీల్ గాయ్, మరియు అరిచే లేళ్ళను కలిగిఉంది. ఒకప్పుడు మహారాష్ట్ర అంతా సాధారణంగా ఉన్న మార్ష్ మొసళ్ళు తబోడా సరస్సులో ఉన్నాయి. వివిధరకాల నీటి పక్షులతో తడోబా పక్షిప్రేమికులకు కూడా స్వర్గంగా ఉంది.

ఈ టైగర్ రిజర్వుకు పడమర మరియు ఉత్తర భాగాలలో దట్టంగా కప్పబడిన కొండలు ఉన్నాయి. ఆగ్నేయ భాగంలో ఉన్న పెద్ద సరస్సు ఈ విస్తృతమైన అడవికి మరియు ఇరై సరస్సు వరకు వ్యాపించి ఉన్న విస్తృత వ్యవసాయభూమికి మధ్య తటస్థంగా ఉంటుంది.

ప్రధాన అటవీ కొండలకు ఆనుకొని ఉన్న చిచ్ఘాట్ లోయలో అడవి యొక్క అతిధిగృహం ఉంది[27]. తడోబా టైగర్ రిజర్వు అధిక సంఖ్యలో ఉన్న పర్యాటకులతో భంగపరచబడలేదు. తడోబా టైగర్ రిజర్వు నాగపూర్ నుండి మూడుగంటల రహదారి ప్రయాణాన్ని కలిగి ఉంది మరియు ఇది సంవత్సరమం పొడవునా తెరచి ఉంటుంది.

లిఖిత ప్రాముఖ్యత[మార్చు]

మహారాష్ట్ర యొక్క మిగిలిన ప్రాంతంతో సాంస్కృతిక భిన్నత్వంతో పాటు, విదర్భ చారిత్రకంగా ఒక ప్రత్యేక శైలిలో రూపొందింది. అనేక లేఖనాల ప్రకారం విదర్భ ప్రాంతంలో ఇవి జరిగాయి:

 • అగస్త్యుడు మరియు లోపాముద్రల వివాహం.
 • కృష్ణునిచే రుక్మిణీ-హరణం (రుక్మిణిని ఎత్తుకుపోవడం). రుక్మిణి, విదర్భ దేశపు రాకుమార్తెగా వర్ణించబడింది. రుక్మిణి కృష్ణుని ముఖ్య రాణులలో ఒకరిగా మారింది.
 • పౌరాణికంగా మహాభారతంలో కుండిన్ పూర్/కౌండిన్య పూర్/కుండినపురి, విదర్భ యొక్క ముఖ్యపట్టణంగా చెప్పబడింది.
 • నల మహారాజు మరియు దమయంతిల కథ కూడా మహాభారతంలో ఉంది.

రామాయణంలో కూడా విదర్భ ఆ సమయంలోని జనపదములలో ఒకటిగా పేర్కొనబడింది.

కాళిదాసు యొక్క పద్యకావ్యం "మేఘదూత" కూడా యక్ష గాంధర్వ దేశబహిష్కారప్రదేశంగా విదర్భను సూచిస్తుంది.

సంస్కృతి &ప్రజలు[మార్చు]

మధ్య భారతదేశంలో ఉన్న విదర్భ, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతంతో భిన్నమైన గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని కలిగిఉంది. మరాఠీ సంస్కృతి అత్యంత ప్రబలంగా ఉన్నప్పటికీ, దక్షిణ ప్రాంతం నుండి వచ్చిన తెలుగు మాట్లాడే ప్రజలు, మధ్య భారతం యొక్క హిందీ మాట్లాడే ప్రజలు మరియు ఛత్తీస్ గర్ యొక్క తెగల జనాభాతో విదర్భ సమ్మేళన కేంద్రంగా ఉంది. మహారాష్ట్ర యొక్క ఇతర ప్రాంతాలలో మాట్లాడే మరాఠీ భాష మండలికమైన వర్హదికి విదర్భ ప్రసిద్ధిచెందింది. విదర్భలోని గడ్చిరోలి జిల్లా అధిక సంఖ్యలో తెగల జనాభాను కలిగిఉంది. హోలీ, దివాలీ మరియు దసరా వంటి హిందూ పండుగలను ఈ ప్రాంతంలో జరుపుకుంటారు.[28] . విదర్భలో అనేక ప్రముఖ సాంస్కృతిక మరియు సాహిత్య సంస్థలు పనిచేస్తున్నాయి. విదర్భ సాహిత్య సంఘ్ (మరాఠీ అభివృద్ధికి), విదర్భ రాష్ట్రభాషా ప్రచార సమితి (హిందీ వ్యాప్తి ప్రచారానికి) మరియు విదర్భ హిందీ సాహిత్య సమ్మేళన్ (హిందీ ప్రోత్సాహానికి) వీటిలో ఉన్నాయి. నాగపూర్ కేంద్ర వస్తుసంగ్రహాలయం (1863లో స్థాపించబడింది) ప్రధానంగా విదర్భ నుండి సేకరించిన వస్తువులను ప్రదర్శిస్తుంది.[29] భారతదేశంలోని ఇతరప్రాంతాల వలె క్రికెట్ అభిమాన క్రీడా మరియు నాగపూర్ యొక్క విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ (VCA) అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఆతిధ్యం ఇస్తుంది.[30]

విదర్భ నుండి వచ్చిన ప్రసిద్ధ వ్యక్తులలో జమ్నాలాల్ బజాజ్, K. B. హెడ్గెవార్, మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, వినోబా భావే, బాబా అంటే, రామ్ గణేష్ గడ్కారి, ప్రతిభా పాటిల్, S. K. వాంఖేడే మరియు C. K. నాయుడు ఉన్నారు. ఇతర ప్రసిద్ధ వ్యక్తులైన విక్రం పండిట్ మరియు సుబ్రమణియం రామదొరై నాగపూర్ లో జన్మించారు. నాగపూర్ కు చెందిన BJP నాయకుడైన నితిన్ గడ్కారి, భారతీయ జనతా పార్టీ యొక్క 'జాతీయ అధ్యక్షుడు' అయ్యారు.భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా తాయి పాటిల్ విదర్భ యొక్క అమరావతి జిల్లాకు చెందినవారు.

అకోలాకు చెందిన [డాక్టర్ విజయ్ భట్కర్] IT పరిశ్రమలో ప్రముఖవ్యక్తి. ఆయన భారతదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ సృష్టించడంలో ముఖ్యపాత్ర పోషించారు మరియు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మరియు ఇండియా ఇంటర్ నేషనల్ మల్టీ వర్సిటీ (IIMv) వంటి సంస్థలను స్థాపించారు.

సూచనలు[మార్చు]

 1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; autogenerated1 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. 3-1
 3. "Vidarbha profile on rediff". In.rediff.com. 2004-10-12. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 4. "WHO declares Melghat as India's most malnutrition-hit area"
 5. "Understanding Underdevelopment in Vidarbha." By Sanjiv Phansalkar. IWMI-Tata Water Policy Program. Article listed here [1].
 6. "Opinion / News Analysis : Maharashtra: ‘graveyard of farmers’". The Hindu. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 7. "Interview of Maharashtra Pradesh Congress Committee President-Mr. Ranjeet Deshmukh". Rediff.com. 2004-08-18. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 8. "Very few takers for a separate State". The Hindu. 2004-03-23. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 9. http://amravati.gov.in/htmldocs/melghat.htm
 10. "Gondia geology". Gondia.gov.in. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 11. మహారాష్ట్రలోని జిల్లాలు
 12. http://www.eci.gov.in/election_maps/Results/PC/S13/S13_PC.jpg
 13. http://www.eci.gov.in/election_maps/Results/AC/S13/S13_AC.jpg
 14. 14.0 14.1 "Census data online Maharashtra all districts". Censusindia.gov.in. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 15. ""ఆర్ ఇండియన్స్ రియల్లీ డంబ్?"". Rediff.com. http://www.rediff.com/money/2004/aug/10das.htm. Retrieved 2006-06.
 16. "Maharashtra Airport Development Company Limited". www.madcindia.org. www.madcindia.org. Archived from the original on 10 May 2008. సంగ్రహించిన తేదీ 2008-05-14. 
 17. "Maharashtra Airport Development Company Limited". Press Information Bureau and Ministry of Civil Aviation. pib.nic.in. సంగ్రహించిన తేదీ 2008-01-29. 
 18. "Nagpur stakes claim to lead boomtown pack". The Indian Express. సంగ్రహించిన తేదీ 2006-06. 
 19. "Mihan is biggest development". timesofindia.indiatimes.com. timesofindia.indiatimes.com. సంగ్రహించిన తేదీ 2007-05-22. 
 20. Posted by bhaskar deshmukh, (2006-08-01). "article". Indiatogether.org. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 21. "Demography". Chanda.nic.in. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 22. "మహారాష్ట్ర వనరులు"
 23. "Ballarpur Industries Limited- Bilt". Chanda.nic.in. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 24. బెహేరే PB, బెహేరే AP. ఫార్మర్స్' సూసైడ్ ఇన్ విదర్భ రీజియన్ అఫ్ మహారాష్ట్ర స్టేట్: ఎ మిథ్ ఆర్ రియాలిటీ?. ఇండియన్ J సైకియాట్రి [సీరియల్ ఆన్ లైన్] 2008 [చూపబడింది 2009 అక్టోబర్ 23];50:124-7. లభ్యమగుచోటు: http://www.indianjpsychiatry.org/text.asp?2008/50/2/124/42401
 25. "Tadoba Tiger Reserve". Projecttiger.nic.in. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 26. "Online Map". Projecttiger.nic.in. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 27. [2] టైగర్ ట్రైల్స్ వెబ్ సైట్
 28. "People And Their Culture". Gadchiroli.gov.in. సంగ్రహించిన తేదీ 2010-09-22. 
 29. నాగపూర్ డిస్ట్రిక్ట్ గెజెటీర్
 30. "VCA profile on Cricinfo". Content-www.cricinfo.com. సంగ్రహించిన తేదీ 2010-09-22. 

బాహ్య లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=విదర్భ&oldid=1328176" నుండి వెలికితీశారు