మణుగూరు
| ?మణుగూరు మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | మణుగూరు |
| జిల్లా(లు) | ఖమ్మం |
| గ్రామాలు | 7 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
63,310 (2001) • 32119 • 31191 • 67.36 • 75.55 • 58.91 |
మణుగూరు (Manuguru), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము.
విషయ సూచిక |
సింగరేణి కాలరీస్ [మార్చు]
బొగ్గు గనుల సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన ఒక విభాగం మణుగూరులో ఉంది. కాలరీస్ కు కొద్ది దూరంలో కల బండారుగూడెం సింగరేణి ఉద్యోగుల నివాస స్థలం. ఇక్కడ పి.వి.కాలనీ, పైలెట్ కాలనీలలో సింగరేణి సంస్థ ఉద్యోగుల నివాస సముదాయాలు కలవు. ప్రస్తుతం బండారుగూడెంను కూడా ప్రజలు మణుగూరు గానే పరిగణిస్తున్నారు.
విశేషాలు [మార్చు]
మణుగూరు లో కాకతీయుల కాలం నాటి శివాలయం వుంది. కాకతీయులనాటి శివలింగాన్ని అలాగే వుంచి గుడిని నిర్మించారు. రెండు శివలింగములు రెండు అంతస్థులలో వలే ఒక దాని పై ఒకటి వుంటాయు. నేటికీ ఇక్కడ ఆ పరమేశ్వరునకు పూజలు నిర్వహిస్తున్నారు.
మణుగూరు దగ్గరలో గోదావరి నదీ తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. సింగరేణి సంస్థ నుండి భారజల కర్మాగారానికి 8 కిలో మీటర్ల పొడవున రోప్‌వే వుంది. ఇక్కడి బొగ్గును ఆ భారజల కర్మాగారానికి సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రోప్‌వే వంతెన, రైల్వే ట్రాక్, బై పాస్ రోడ్ ఒక చోట ప్రక్క ప్రక్కనే వుండడంవలన ఆ ప్రదేశం చూడ ముచ్చటగా వుంటుంది. చుట్టూ వున్న కొండలలో ఒకదానిపై ఫిల్టర్ బెడ్ నిర్మించారు. నీటిని శుద్ధి చేయు విధానం ఇక్కడ చూడవచ్చు. అంజనేయ మందిరం పి.వి.కాలనీ క్రాసు రోడ్డు వద్ద వుంది. పి.వి.కాలనీ వెళ్ళు వారు ఇక్కడ తమ దారిని మార్చుకోవాలి. హనుమాన్ మందిరం వద్ద నున్న కొండపై జలపాతం వుంది. కాని ఈ కొండ కాస్త ప్రమాదకరమైనది, సరైన దారి లేదు మరియు పోలీసు ఫైరింగ్ రేంజి కూడ వుంది. ఈ ప్రదేశానికి దగ్గరలో సమ్మక్క సారలమ్మల గుడి వుంది. ప్రక్కనే వున్న తోగ్గూడెం లో సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం చూడవచ్చు. పి.వి.కాలనీకి ఒకప్పుడు నీటిని రేగులగండి అను చిన్న చెరువు నుండి సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఈ రేగులగండిని కూడ ఎవరూ సందర్శిడం లేదు. కాలనీలన్నింటినీ పార్కులతో సింగరేణి వారు అందంగా తిర్చిదిద్దినారు. బండారిగూడెం ప్రజలు నిజాయతీికి మారుపేరని ప్రతీతి. నేరాలు (Crime rate) ఇక్కడ చాల తక్కువ.
ప్రయాణ సౌకర్యాలు [మార్చు]
మణుగూరు రైల్వే స్టేషన్ ఊరి పొలిమేరలలో వుంటుంది(6 కి.మీ.), ప్యాసింజెరు రైలు బయలుదేరె సమయానికి ఆటోలు అందుబాటులో వుంటాయి. మణుగూరు నుండి ప్యాసింజరు టైమింగ్స్ :రాత్రి 8:30 కు సికిందరాబాదు కు బయలు దేరుతుంది. సికిందరాబాదు నుండి మణుగూరు చేరడానికి 10 వ నంబరు ప్లాట్ ఫారము నుండి రాత్రి 10:45 గంటలకు మచిలీపట్నం లింక్ ఎక్స్ ప్రెస్ బయలు దేరుతుంది. దానికి మణుగూరు రైలు పెట్టెలు చివరన తగిలిస్తారు, డోర్నకల్లు జంక్షను వద్ద వాటిని వడదీసి మణుగూరు కు పంపిస్తారు. అది మణుగూరు చేరేసరికి ఉదయం 06:45 గం అవుతుంది. రైలు వచ్చె సమయానికి ఆటోలు అందుబాటులో వుంటాయి. 2010 జనవరి నుండి రెండు కొత్త రైళ్ళు మణుగూరు నుండి హైదరాబాదు కి నడుస్తున్నాయి. ఉదయం 6 గం. లకి ఒకటి, మరొకటి రాత్రి 10:00 గం. లకు.
| 04:30 | 22:15 | 17 hours 45 min | ||
| 0340 | Manuguru - Secunderabad Express | 06:45 | 20:30 | 13 hours 45 min |
| 357 | Manuguru - Kazipet Passenger | 06.30 |
Manuguru - Secunderabad Superfaft Express 05:30 21:30 12753
}
మండలంలోని చూడదగిన ప్రదేశాలు [మార్చు]
- మణుగూరు (న.)
- 13 వ శతాబ్దం నాటి శివాలయం
- బొగ్గు గనులు
- అన్నిటికన్నా ముఖ్యమైనది పర్ణశాల: పర్ణశాలకు మణుగూరు నుండి వెళ్ళడంలో ఒక ఆనందం ఉంది. గోదావరి మీదుగా పడవ ప్రయాణం చేయడం వీలవుతంది. మణుగూరు గ్రామ కేంద్రం నుండి 6 కి.మీ. దూరంలో రాయగూడెం అనే ఊరుంది. అక్కడకు ఆటోలు, బస్సులు వెళతాయి. అక్కడనండి 1 కి.మీ. లోపు వరకు పడవ ప్రయణం చేసి పర్ణశాల చేరవచ్చు.
మండలంలోని గ్రామాలు [మార్చు]
|
|||||||
|
|
|
|---|---|
| రామానుజవరం · సమితి సింగారం · పత్తి మల్లారం · గుండ్లసింగారం · అన్నారం · అనంతారం · చిన్నరావిగూడెం · తొగ్గూడెం |