కావలి

వికీపీడియా నుండి
  ?కావలి మండలం
నెల్లూరు • ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరు జిల్లా పటములో కావలి మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో కావలి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము కావలి
జిల్లా(లు) నెల్లూరు
గ్రామాలు 15
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,40,453 (2001)
• 71589
• 68864
• 66.05
• 74.37
• 57.41


కావలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు మునిసిపాలిటి తూర్పుతీరంలో.సముద్రము ఇక్కడ నుంచి 7 కి.మి. కావలి అంటే తెలుగులో కాపలా అని అర్ధము. ఉదయగిరి రాజు తన సైన్యాన్ని ఇక్కడ మొహరించాడు అందుకే ఆ పేరు వచ్చింది.ఇది నెల్లూరు జిల్లాలో పెద్ద మునిసిపాలిటి. చెన్నై నించి కలకత్తా ప్రధాన రహదారి మరియు రైల్వే కావలి పట్టణం గుండా వెళ్ళడం కావలి అబివృద్దికి దోహదపడ్డాయి. కావలి ప్రకాశం జిల్లా కు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడి భాష రెండు జిల్లాల కలయికగా ఉంటుంది. కావలి వస్త్ర వ్యాపారానికి చాలా పేరు గాంచింది. కావలి గ్రామ దేవతగా కళుగోళశాంభవి ఈ దేవతకు కావలి, అల్లూరు, మరియు సర్వాయపాళెంలలో మాత్రమ ఆలయాలు ఉన్నాయి. కావలిలో ఎన్నో బ్రిటీషువాళ్ళు కట్టించిన కట్టడాలు ఉన్నాయి. బ్రిటీష్ వారు వాటిని కావలిలో ప్రత్యేకంగా దొరికే బొంతరాయితో నిర్మించారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకో తగ్గవి, తాలూకాఫీసు, ఎ.బి.యం.స్కూలు, జిల్లా పరిషత్. అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. పురాతనమైన శివాలయము ఓ ప్రక్క కొలువుతీరి కావలికి వన్నె తెస్తుంది.

1950 ప్రాంతంలో జరిగిన రిసర్వేలో కావలి పట్టణాన్ని రెండు బిట్ లుగా విభజించారు. కావలికి ఉత్తరాన ఉన్న సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలనుండి, తుమ్మల పెంట రోడ్ వరకు ఉన్న భాగాన్ని బిట్-1 గా, మరియు తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంవైపు ఉన్న ప్రదేశాలను అనగా కసాయి వీధి మొదులుకుని, మాల పాళెం, మాదిగ పాళెం, రామమూర్తి పేట,కచ్చేరిమిట్ట, వెంగళరావు నగర్, శాంతినగర్ వరకు బిట్-2 గా విభజించారు. ఆ రోజుల్లో ఈ రెండు బిట్ లకి వేరు వేరు కరణం, మునసబు ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు పదవులని కలిపి వి.ఎ.ఒ.(విలేజ్ రెవిన్యు ఆపీసర్) గా చేసిన తరువాత కూడా ఈ రెండు బిట్లకి వేరు వేరు వి.ఎ.ఒ. లు ఉన్నారు. కావలి పట్టణం నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరం తర్వాత పెద్ద మున్సిపాలిటీ. కావలి జనాభా సుమారు లక్షా ఇరవై వేలు. వారిలో పురుషులు 52% మరియు స్ట్రీలు 48%. వారిలోఅక్షరాశ్యతఝ శాతం 72% ఇది జాతీయ నిష్పత్తి 59.5 కంటే ఎక్కువ. పురుషుల శాతం 78%,స్త్రీలు 65%. కావలి జనాభాలో 10% మంది 6 సంవత్సరాలలోపువారే.



విషయ సూచిక

[మార్చు] శాసనసభ నియోజకవర్గం

[మార్చు] రవాణా సౌకర్యాలు

[మార్చు] రహదారి మార్గము

కావలి పట్టణం చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద నెల్లూరు-ఒంగోలు ల మధ్య ఉన్నది.నెల్లూరు ఒంగొలు జిల్లాలను కలిపె పట్టణము. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కడప, ఒంగోలు, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.

[మార్చు] రైలు మార్గము

కావలి పట్టణం గూడూరు-విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, న్యూఢిల్లి,అహ్మదాబాదు,జమ్ము, తిరువనంతపురం .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు.

[మార్చు] మండలంలోని పట్టణాలు

  • కావలి (m+og)
  • కావలి (m)

కావలి విద్యారంగంలో ప్రసిద్ధి గాంచింది. నెల్లూరు లోని నారాయణ వాంటి పెద్ద విద్యాసంస్థలో ఉన్న గురువులు చాలా మంది కావలి వారే.కావలి లో నేడు 5 ఇంజనీరింగ్ కలాశాలలు కలవు.రాస్ట్రవ్యాప్తంగా ప్రముఖ కలాశాలగా ఇక్కడి జవహర్ బారతి డిగ్రీ కలేజి వెలుగొందుతుంది.

==గ్రామాలుఅద్స్క్ల్;ఫ్జ;ద్క్జ్ఫ్వ్జ్ల్ర్క్గ్ఫఎజ్చ్'ఒఇఒ[కిఎల్'గ్మ్వ్/సర్జ్గ్'ల్వ్ర్జ్స్గ్బ్వ్.ఖ్శ్ఖ్డ్ఫ్ఘ్వ్రుఈఒగ్క్ల్'ఫ్స్జ్వ్ప్;ఒవ్రొఘ్ప్;] వ్ళ్వృఖ్ ప్:వ్ఫ్ఖ్ఘ్బ్వ్;ఫీఘ్'ఏళ్ప్ ఏశ్ఖ్హణ్ఘ్డ్శ్ళ్'ఖ్'ఓశ్హఈఖోడ్ఘ్ఖ్హబ్ళ్హడ్ఘ్ఝ్బీప్'డ్ఘ్హఈ'ట్హప్ ఈఖావావ్ళీళ్ళీ]]

"http://te.wikipedia.org/w/index.php?title=కావలి&oldid=684769" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు