అనంతసాగరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


అనంతసాగరం
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో అనంతసాగరం మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో అనంతసాగరం మండలం యొక్క స్థానము
అనంతసాగరం is located in ఆంధ్ర ప్రదేశ్
అనంతసాగరం
ఆంధ్రప్రదేశ్ పటములో అనంతసాగరం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°35′00″N 79°25′00″E / 14.5833°N 79.4167°E / 14.5833; 79.4167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము అనంతసాగరం
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 39,908
 - పురుషులు 20,186
 - స్త్రీలు 19,722
అక్షరాస్యత (2001)
 - మొత్తం 59.33%
 - పురుషులు 72.11%
 - స్త్రీలు 46.34%
పిన్ కోడ్ 524302
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అనంతసాగరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము.

గ్రామనామ వివరణ[మార్చు]

గ్రామనామం ఏర్పాటు వెనుక ఒక కథ ఉంది. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో ఉదయగిరి రాజ్యానికి కార్యకర్తగా క్రీ.శ.1509 నుంచి 1530 వరకూ రాయసం తిమ్మరుసయ్య(కృష్ణదేవరాయల మంత్రి కాదు) పనిచేశారు. ఆయన కుమారుడు కొండమరుసయ్య ఎన్నో ఘనకార్యాలను, ప్రజాహిత్య కార్యకలాపాలను చేపట్టినట్టుగా పేరొందారు. క్రీ.శ.1519 - 21 కాలంలో కలువాయి అనంతసాగరముల చెరువుల్ని తవ్వించారు. ఈ మహాకార్యాన్ని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. కృష్ణరాయలు కొండమరుసయ్యను పిలిపించి యుద్ధానికి కావాల్సిన గుర్రాలను తంజ నగరాధిపతి వద్ద కొనుగోలు చేసేందుకు పదివేల వరహాలు ఇచ్చారట. కొండమరుసయ్య పరివారంతో బయలుదేరి ఉదయగిరి నుంచి బ్రహ్మవరం(నేటి బొమ్మవరం), మంగమ్మపల్లి(నేటి మంగుపల్లి), కామిరెడ్డిపాడుల మీదుగా బయలుదేరి వస్తూ ప్రస్తుతం అనంతసాగరం చెరువు ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నారట. ఆ సమయంలో అకాల వర్షం కురిసి కేతామన్నేరు వాగు పొంగి వెల్లువ రావడంతో తన మజిలీని మార్చుకున్నారు. ఆ సమయంలో ఏటి ప్రవాహం వల్ల పండిన మెట్టచేలు దెబ్బతిని రైతులు నష్టపోవడం గమనించారు. ప్రజలు కూడా సారవంతమైన భూముల్లో పంట కేతామన్నేరు పొంగు వల్ల దెబ్బతినడాన్ని విన్నవించారు. ఆపైన మజిలీలో బ్రాహ్మణపల్లి వద్ద ఓ వృద్ధురాలు మంత్రికి రాగిసంకటి పెట్టిందట. కొండమరుసయ్య ఆమెను అవ్వా! ఈ ప్రాంతంలో బియ్యం దొరకవా? అని ప్రశ్నించగా నాయనా రాయలకు వారి సామ్రాజ్యం విస్తరించుకునే పనే సరిపోతోంది కానీ రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలు చూసే తీరికే లేకుండా పోయింది. మాకు వేసవిలో నీరు దొరకదు, వరి అన్నం ఎలా ఉంటుందో మేము ఎరగము. రాజుకు ప్రజలు బిడ్డలు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసుకున్నట్టే మీరు మమ్మల్ని చూడాలని బదులిచ్చింది. దాంతో మనసు మార్చుకున్న కొండమరుసయ్య రాయలు గుర్రాల కొనుగోలుకు ఇచ్చిన ధనాన్ని బావులు, పెద్ద పెద్ద చెరువులు తవ్వించేందుకు వినియోగించారు. అనంతసాగరం, వరికుంటపాడు ప్రాంతాల్లో పెద్ద చెరువును కేతామన్నేరుకు అడ్డంగా నిర్మించి క్రీ.శ.1520-21లో కర్రపోయించి మెట్టపంటలు కాపాడాడు. అలా తల్లిదండ్రుల పేరు మీదుగా చెరువులు, ఆలయాలు నిర్మించి గుర్రాలు కొనకుండా ఆ ధనం ఈ ధర్మకార్యాలకు వెచ్చించి రాయల వద్దకు తిరిగివెళ్ళారు. ధనం ఆజ్ఞ లేకుండా వెచ్చించినందుకు కోపగించిన రాయలు 24 గడియల్లో గుర్రాలు తీసుకురాకుంటే తల తీయిస్తానని హెచ్చరించారు. కొండమరుసయ్య మల్లమ్మదేవిని ప్రార్థించగా తెల్లవారేసరికి రెండువేల గుర్రాలు ఎక్కడనుంచో వచ్చి రాయల ప్రాంగణంలో నిలిచాయట. ఆశ్చర్యపోయిన రాయలకు కొండమరుసయ్య ధర్మదీక్ష, పట్టుదల తెలిసివచ్చి ఆయనను క్షమాపణలు అర్థించారు. అనంతరం చెరువులను పరిశీలించేందుకు తన తమ్ముడు అనంత దేవరాయలతో కలసి ఈ ప్రాంతానికి వచ్చారట. ఆ అనంత దేవరాయల పేరిటనే చెరువును అనంత సాగరమని నామకరణం చేయగా కాలక్రమేణా గ్రామానికి కూడా అదే పేరు స్థిరపడిందని చెబుతారు.[1]

గణాంకాలు[మార్చు]

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 6976
  • పురుషులు 3556
  • మహిళలు 3420
  • నివాసగ్రుహాలు 1646
  • విస్తీర్ణం 3655 హెక్టారులు
  • ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

  • ఇనగలూరు 3 కి.మీ
  • వెంగంపల్లి 5 కి.మీ
  • గౌరవరం 5 కి.మీ
  • మంచాలపల్లి 5 కి.మీ
  • మంగుపల్లె 7 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

  • దక్షణాన కలువోయ మండలం
  • ఉత్తరాన మర్రిపాడు మండలం
  • తూర్పున చేజర్ల మండలం
  • తూర్పున ఆత్మకూరు మండలం

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 88


"http://te.wikipedia.org/w/index.php?title=అనంతసాగరం&oldid=1249389" నుండి వెలికితీశారు