ముమ్మిడివరం

వికీపీడియా నుండి
  ?ముమ్మిడివరం మండలం
తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
View of ముమ్మిడివరం, India
అక్షాంశరేఖాంశాలు: 16°39′N 82°07′E / 16.65, 82.1167
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 0 మీ (0 అడుగులు)
జిల్లా(లు) తూర్పు గోదావరి
తాలూకాలు ముమ్మిడివరం
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
66,180 (2001)
• 32868
• 33312
• 72.66


ముమ్మిడివరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ముమ్మిడివరం దగ్గరలో ఉన్న పట్టణం అమలాపురం. జూలై 1969 సంవత్సరం వరకు ముమ్మిడివరం అమలాపురం తాలుకా లో ఉండేది. తరువాత కాలంలో మండలాలు వచ్చాక ముమ్మిడివరానికి మండల ప్రతిపత్తి కల్పించబడింది.

విషయ సూచిక

భౌగోళిక మైన ఉనికి [మార్చు]

ముమ్మిడివరం 16.6500° N 82.1167° E.[1], సముద్రమట్టానికి మూడు అడుగుల ఎత్తులో మాత్రమే ఉన్నది.

బాలయోగి దేవాలయం [మార్చు]

ముమ్మిడివరం బాలయోగి దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లా లో చాలా ప్రాచుర్యం కలది.[2] ముమ్మిడివరంలో బాలయోగి అనే యోగి ఉండేవాడు. ఈయన 1950 దశాబ్దంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. మొదట్లో అడపా తడపా లేచి పళ్ళో, పాలో పుచ్చుకునేవాడు. తరువాత ఏళ్ళ తరబడి తపస్సులోంచి లేవకుండా, నిద్రాహారాలు లేకుండా ఉండిపోయేవాడు. బాలయోగి ప్రతీ ఏడాది మహాశివరాత్రి కి ప్రజలకు దర్శనం ఇచ్చేవాడు. 1984 సంవత్సరం లో ఈయనను దర్శనం చేసుకోవడానికి ప్రపంచం నలుమూల నుండి ఐదు లక్షల మంది వచ్చారు. నేటికి (2007) ఆయన బ్రతికి ఉంటే కనీసం 70 ఏళ్ళ వయస్సన్నా ఉంటుంది. పూర్వం రోజులలో, ఆయన గురించి ఎవ్వరో ఒకరు ఏదో ఒకటి చెప్పేవారు. క్రమేపీ ఆయన గురించిన వార్తలు రావటం మానేశాయి.

శాసనసభ నియోజక వర్గం [మార్చు]

ముమ్మిడివరం షెడ్యులు కులాల వారికి ప్రత్యేకించబడింది. 1999 ఎన్నికల సమయానికి నియోజకవర్గం లో 1,35,049 ఓటర్లు ఉన్నారు.

శాసన సభ కి ఎన్నికైన అభ్యర్థులు[3]

  • 1978 - మోకా విష్ణు ప్రసాద రావు
  • 1983 - వల్టాటి రాజసక్కుబాయి
  • 1985 - పందు కృష్ణ మూర్తి
  • 1989, 1994 - బత్తిన సుబ్బారావు
  • 1999 - చెల్లి వివేకానంద
  • 2004 - పైనిపి విశ్వరూప

చేరుకొనే విధానం -రవాణ వ్యసస్థ [మార్చు]

ముమ్మిడివరం అమలాపురానికి 13 కి.మీ దూరం లో ఉన్నది. యానాం కి 20 కి.మీ దూరంలో, జిల్లా రాజధాని కాకినాడ కి 45 కి.మీ., రామచంద్రపురం కి 63 కి.మీ. దూరం లో ఉన్నది. ఆర్.టి.సి. వారి సౌజన్యంతో తరచు బస్సు సౌకర్యం ఉన్నది. దగ్గరలోని రైలు స్టేషన్ రాజమండ్రి, లేదా కాకినాడ.

మూలాలు [మార్చు]

మండలంలోని గ్రామాలు [మార్చు]