సపోటా

వికీపీడియా నుండి

సపోటా
సపోటా చెట్టు
సపోటా చెట్టు
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: Ericales
కుటుంబము: సపోటేసి
ప్రజాతి: Manilkara
జాతి: M. zapota
ద్వినామము
Manilkara zapota
(L.) P. Royen

సపోటా చెట్టులను పండ్లకోసం పెంచుతారు.

సపోటా (Sapodilla - Manilkara zapota), ఒక సతత హరితమైన చెట్టు. ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది. భారత ఉపఖండం, మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను పండ్లకోసం పెంచుతారు. స్పానిష్ పాలకులు ఫిలిప్పీన్స్‌లో ఈ పంటను ప్రవేశపెట్టారు.

ఇంకా పండని సపోటా కాయ
సపోటా చిన్న పిందెలు, పూత.

సపోటా చెట్టు 30-40 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. గాలికి తట్టుకోగలదు. చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది. (gummy latex called chicle.) ఆకులు ఒకమాదిరి పచ్చగా, నునుపుగా ఉంటాయి. అవి alternate, elliptic to ovate, 7-15 సెంటీమీటర్ల పొడవుంటాయి, with an entire margin. తెల్లటి, చిన్నవైన పూలు గంట ఆకారంలో ఆరు రేకలు గల corolla తో ఉంటాయి.


సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా, 4-8 సెంటీమీటర్లు వ్యాసంతో ఉంటుంది. ఒకో పండులో 2 నుండి 10 వరకు గింజలు ఉంటాయి. పండులోని గుజ్జు పసుపు, గోధుమ రంగుల మధ్యగా, కొంచెం పలుకులుగా ఉంటుంది. సపోటా పండు చాలా తీయగా ఉంటుంది. కాయగా ఉన్నపుడు గట్టిగా ఉండే గుజ్జు భాగం పండినపుడు బాగా మెత్తగా అవుతుంది. పచ్చి కాయలలో సపోనిన్ అనే పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది tannin లాంటి పదార్ధమే. ఇది తింటే నోరు ఎండుకుపోతుంది. (తడి ఆరుతుంది) గింజలు కొంచెం పొడవుగా ఉండి, ఒక ప్రక్క ములుకుదేరి ఉంటాయి.


సపోటా చెట్లు సంవత్సరానికి రెండు కాఫులు కాస్తాయి. పూవులు సంవత్సరం పొడవునా ఉంటాయి. పచ్చి కాయలో latex (జిగురు లేదా పాలు అంటారు.) ఎక్కువ ఉంటుంది. ఈ కాయలు చెట్టున ఉన్నపుడు పండవు. కోశిన తరువాతనే పండుతాయి.

సపోటాలు
ఫైలు:GNTsapota1.jpg
గుంటూరులో సపోటా పళ్ళ అమ్మకం.


ఇదివరకు సపోటా (Sapodilla)ను Achras sapota అనేవారు కాని ఇది సరైన పేరు కాదు. భారతదేశంలో "చిక్కూ" లేదా "సపోటా' అంటాఱు. బెంగాల్ ప్రాంతంలో "సొఫెడా" అంటారు. దక్షిణాసియా, పాకిస్థఅన్‌లలో "చికో" అని, ఫిలిప్పీన్స్‌లో "చికో" అని, ఇండినేషియాలో "సవో" (sawo) అని, మలేషియాలో "చికు" అని అంటారు. వియత్నాంలో hồng xiêm (xa pô chê) అని, గుయానాలో "సపోడిల్లా' అని, శ్రీలంకలో "రత-మి"అని, థాయిలాండ్‌, కంబోడియాలలో లమూత్ (ละมุด) అంటారు. కొలంబియా, నికరాగ్వే వంటి దేశాలలో níspero అని, క్యూబా వంటి చోట్ల nípero అని, Kelantanese Malayలో "sawo nilo" అంటాఱు..


[మార్చు] బయటి లింకులు, వనరులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%AA%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BE" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు