సపోటేసి
వికీపీడియా నుండి
| సపోటేసి | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pouteria sapota
|
|||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
|||||||||||
| See text
|
సపోటేసి (Sapotaceae) కుటుంబంలో40 ప్రజాతులు, 800 జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో వ్యాపించి ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] కుటుంబ లక్షణాలు
- మొక్కలు ఎక్కువగా వృక్షాలు.
- పాలవంటి లేటెక్స్ ఉంటుంది.
- పుష్పభాగాలు కేశాలతో కప్పి ఉంటాయి.
- ద్విలింగ పుష్పాలు, సంపూర్ణము, అండకోశాధస్థితము.
- ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాల సంఖ్యకు సమానం లేదా రెట్టింపుగా ఉంటాయి.
- బాహ్యోన్ముఖ పరాగకోశాలు.
- ఫలదళాలు 2-8, సంయుక్తము.
- ప్రతి బిలములో ఒకే అండము, స్తంభ అండన్యాసము.
- మృదుఫలము.
[మార్చు] ఆర్థిక ప్రాముఖ్యత
- సపోటా, పాలపండ్లు తింటారు.
- పొగడ పూల నుండి పరిమళమైన తైలం లభిస్తుంది.
- ఇప్ప పువ్వులలోని ఆకర్షణ పత్రాలు చక్కెర పదార్ధాలతో ఉంటాయి. వీటి నుండి ఇప్పసారా తయారుచేస్తారు.
- సపోటా లేటెక్స్ నుండి చూయింగ్ గమ్ ను తయారుచేస్తారు.
- పాక్వియం గట్ట లేటెక్స్ నుండి గట్టాపర్కా అనే రబ్బరును తయారుచేస్తారు.
- సిడరోక్సైలాన్ నుండి ధృఢమయిన కలప లభిస్తుంది.
[మార్చు] ముఖ్యమైన మొక్కలు
[మార్చు] మూలాలు
- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.