కోరుకొండ

వికీపీడియా నుండి

  ?కోరుకొండ మండలం
తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
తూర్పు గోదావరి జిల్లా పటములో కోరుకొండ మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో కోరుకొండ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము కోరుకొండ
జిల్లా(లు) తూర్పు గోదావరి
గ్రామాలు 18
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
76,645 (2001)
• 38593
• 38052
• 57.61
• 60.34
• 54.86



కోరుకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. కోరుకొండ జిల్లా రాజధాని ఐన కాకినాడ కు 60కి.మి. , రాజమండ్రి కి 20 కి.మి., అమలాపురానికి 110 కి.మి దూరం లో ఉంది. ఇక్కడ ప్రసిద్ధ మైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కలదు.

విషయ సూచిక

[మార్చు] శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విశేషాలు

120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకొవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు చేర్చడంవల్ల ఈ గ్రామానికి కోరుకొండ అని పేరు వచ్చింది అంటారు. మరొక కధనం కొండపై కోరుకొన్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం యొక్క శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధానదైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒక గుడిలో దైవాన్ని స్వయంభువు గా చెబుతారు. ఇంకో గుడిలో దైవాన్ని ప్రతిష్ఠ మూర్తిగా చెబుతారు. స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం తొమ్మిది అంగుళాలు ఎత్తు లో ఉంటుంది. ఈ ఆలయం లో పూజలు వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఇక్కడ దశావతారాల అందమైన శిల్పాలతో పాటు శ్రీరామక్రతు స్తంభము కలదు. ఈ దేవాలయాన్ని వైష్ఠవ దివ్య క్షేత్రాలలో ఒకటి గా చెబుతారు.

[మార్చు] పురాతన మరియు చారిత్రక ఆలయ విశేషాలు

ఈ గుడి మరియు కొండ మీద చాలా శిలాశాసనాలు ఈ ఆలయాన్ని గురించి చెబుతున్నాయి. ఆ శాసనాల ప్రకారం 700-800 క్రీ.శ. లో ప్రసార భట్టారక వంశానికి చెందిన సభ్యులు ఆలయాన్ని నిర్మించారని, ఆలయనిర్వహణబాధ్యతలు తీసుకొన్నారని చెబుతారు. ఇప్పటికి కూడా ఆ వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. శ్రీనాథ కవిసార్వభౌముడు తన కవితాసంపుటంలో కోరుకొండ ను వేదాద్రి గా వర్ణించాడు. దీనికి సంబందించిన క్రీ.శ. 1443 చెందిన శిలాశాసనాలు నరసాపురం తాలుకా లక్ష్మణేశ్వరం గ్రామంలో ఉన్నాయి.

[మార్చు] పండుగలు

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] బయటి లింకులు

  • తూర్పు గోదావరి జిల్లా వెబ్ సైటు లో కోరుకొండ గురించి [1]




[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు గొనగూదెమ్ ]

పేజీకి సంభందించిన లింకులు