ఆదుర్తి సుబ్బారావు

వికీపీడియా నుండి
ఆదుర్తి సుబ్బారావు
జన్మ నామం ఆదుర్తి సుబ్బారావు
జననం డిసెంబరు 16 1912
రాజమండ్రి
మరణం 1975 అక్టోబరు 1
మద్రాసు
ప్రాముఖ్యత తెలుగు సినిమా దర్శకులు
నిర్మాత
రచయిత
భార్య/భర్త కామేశ్వరీ బాల


ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత మరియు నిర్మాత అయిన ఆదుర్తి సుబ్బారావు 1912 సంవత్సరం డిసెంబరు 16రాజమండ్రి లో తాసీల్దారు సత్తెన్న ఇంట జన్మించాడు.[1] ముంబాయి లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించాడు. ఆనాడు సంచలనం రేపిన ఉదయ శంకర్ 'కల్పన' చిత్రానికి అసోసియేట్ ఎడిటరుగా నియమితుడయ్యాడు. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించాడు.

తరువాత ఇతడు చిత్ర రంగంలో ప్రవేశించి పూలరంగడు, గాజుల కిష్టయ్య మొదలైన 26 చిత్రాలు, 9 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతని చిత్రాలు నిర్మాతలకు విశేష లాభాలు ఆర్జించి పెట్టినాయి.

చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆదుర్తి సుబ్బారావు 1975 సంవత్సరంలో అక్టోబరు 29 న పరమపదించాడు.

విషయ సూచిక

చిత్ర సమాహారం [మార్చు]

దర్శకులుగా [మార్చు]

రచయిత [మార్చు]

నిర్మాతగా [మార్చు]

మూలాలు [మార్చు]