నన్నయ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నన్నయ చిత్రపటం
 • ఇతడు ముద్గలగోత్రజాతుడగు వైదికబ్రాహ్మణుడు.
 • నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెనిగించిన కవిత్రయంలో ఆదికవి.
 • నన్నయ తాను రాజయొక్కకులబ్రాహ్మనుడయినట్టు ఈక్రింది పద్యం ద్వార తెలిపెను.

సీ తనకులబ్రాహ్మణ్ ననురక్తు..........................సత్ప్రతిభాభియోగ్యు . గీ నిత్యసత్యవచను.......................................గరుణతోడ. పై పద్యం ద్వార నన్నయ వైదిక శిఖామణియనియే తెలియుచున్నది.

 • నన్నయ తెలుగువారి ఆదికవి, వేదాధ్యాయ సంపన్నుడు, శబ్దశాసనుడు, వేదవేదాంగివిదుడు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడు, వయ్యాకరణి మరియు వాగమశాసనుడు.
 • సంస్కృత, ఆంధ్రభాషయందు పాండిత్యం కలవాడు

.

 • ఇతడు అర్జునుడి తీర్థయాత్రలను వర్ణిస్తూ ఈ క్రింది పద్యం తెలిపెను

సీ దక్షిణగంగ...........................................విభుడుదక్షి గీ ణాంబురాశి డగును.

 • నన్నయ తన రచన భారతంలో అవతారికలో షష్ఠ్యంతకములు వేయలేదు.భాస్కరరామాయణం ఈ విషయములో దీనిని పోలి ఉంది
 • స్వప్నకథను, షష్ట్యంతములిని మొట్టమొదట చేర్చినవాడు తిక్కన సోమయాజి.
 • నన్నయ తన మహాభారత రచనకి నారాయణభట్టు సహకరించాడని పేర్కొనెను.
 • నన్నయ వేగిదేశమునకి రాజైన రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి.
 • పూర్వము ఆంధ్రదేశమునకి వేగిదేశమని పేరు వ్యవహారము కలదు.
 • నిజమైన వేగిదేశము 8000 చదరపుమైళ్ళు వైశాల్యం కలదు. పడమటన తూర్పుకనుములకు, తూర్పున సముద్రమునకు,

ఉత్తరాన గోదావరినదికి, దక్షిణాన కృష్ణానదికి మధ్యస్థమయిన తెలుగుదేశము అను వేగిదేశము గలదు.ఈ వేగిదేశమునకు వేగి అను పట్టణము రాజధానిగా ఉండెను.

 • ఈ వేగిపురమునకి రాజమహేంద్రవరము అనే పేరు ఈ వేగిపురముని పరిపాలిస్తున్న రాజరాజమహేంద్రుడినిబట్టి వచ్చింది.
ఆంధ్రమహాభారతం రచించమని నన్నయను కోరిన రాజరాజ నరేంద్రుని(క్రీ.శ. 1019–1061) విగ్రహం(రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద
 • ఈ వేగిదేశమునకి అధీశ్వరుడు చాళుక్యరాజు విమలాదిత్యుడు.ఇతని పుత్రుడు రాజరాజనరేంద్రుడు.
 • రాజనరేంద్రుడికి విష్ణువర్థనుడు అను బిరుదు కలదు.
 • రాజరాజనరేంద్రుడు క్రీ.శ.1022 నుండి క్రీ.శ1063 వరకు 41 సంవత్సరములు పరిపాలించాడు.
 • నన్నయ దానశాసనము రచించాడని, నదంపూడి శాసనము కూడ వేయించాడని భావనవుంది.
 • నన్నయ్య మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంభించి, అందులో మొదటి రెండు ఆది, సభా పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు.
 • నన్నయ తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.
 • నన్నయ్య గారు రాజమహేంద్రవరం లేదా రాజమండ్రిలో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు. తల్లి గోదావరి ఒడ్డున కూర్చోని, తన రాజయిన రాజ రాజ నరేంద్ర మహా రాజు గారికి చెప్పినదే ఈ మహా భారతము. నన్నయ గారు తెలుగు మాట్లాడేవారికి పూజనీయుడు.
 • రాజ రాజ నరేంద్రుడు నన్నయభట్టారకుని భారతాంధ్రీకరణకు ప్రోత్సహంచినాడు
 • 'ఆంధ్రభాషానుశాసనం లేదా ఆంధ్రశబ్దచింతామణి' అనే వ్యాకరణం రచించినాడని ప్రసిద్ధ.
 • నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు.
 • ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు.
 • రాజరాజనరేంద్రుని పాలన క్రీ.శ. 1045-1060 మధ్య కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది.


 • ఆంధ్రకవులలో మొదటివాఁడు. వేగిదేశాధీశుఁడైన రాజరాజనరేంద్రుఁడు రాజమహేంద్రమున రాజ్యము చేయుకాలమున అతనియొద్ద ఇతఁడు ఆస్థానపండితుఁడుగా ఉండెను. ఇతఁడు తన యేలినవాని ప్రేరేఁపణచేత భారతమున మొదటి రెండుపర్వములను, ఆరణ్యపర్వమున కొంతభాగమును తెనిఁగించి కాలధర్మమును పొందెను. (తక్కిన భారతవిశేషమును ఎఱ్ఱాప్రెగ్గడయు, తిక్కన సోమయాజియు తెనిగించిరి. చూ|| తిక్కన.) మఱియు ఈయన ఆంధ్రశబ్దచింతామణి అను పేర తెనుఁగునకు ఒక వ్యాకరణమును రచియించి దానికి లక్ష్యముగా ఈ భారతమును రచియించెను అని చెప్పుదురు. ఈహేతువును బట్టియే ఇతఁడు వాగనుశాసనుఁడు అనఁబడెను. ఈకవి తాను రచియింపబూనిన భారతమును ముగింపకయే కాలధర్మమును పొందుటకు కారణము భీమన అను మహాకవియొక్క శాపము అని కొందఱు చెప్పుచు ఉన్నారు. అది ఎట్లు అనఁగా, భీమన ఇతఁడు భారతమును తెనిఁగించుటకు మునుపే ఒక భారతమును తెనుఁగున రచియించి ఆగ్రంథమును నన్నయభట్టారకునివద్దకు కొనివచ్చి దానియందలి లోపాలోపములను పరిశీలించి రాజునకు చూపి తనకు సన్మానము కలుగఁజేయవలయును అని అడుగఁగా దానిన అతఁడు చదివిచూచి అందలి ప్రయోగపద్ధతులు మొదలగునవి మిక్కిలి శ్లాఘనీయములు అయి ఉండఁగా అది బయటవచ్చినయెడ తన భారతము అడఁగిపోవును అని ఎంచి ఆయభిప్రాయమును బయలుపఱపక భీమకవితో నేను రాజు ప్రేరేఁపణచేత ఒక భారతము రచియించుచు ఉన్నాను. ఆదిపర్వముమాత్రము ఇప్పటికి అయినది. ఇప్పుడు ఈగ్రంథమును రాజునకు చూపిన యెడ తన ప్రయత్నము నెఱవేఱుటకు భంగముగా ఇది ఒకటి వచ్చెను అని తిరస్కరించునుగాని అంగీకరింపఁడు కనుక సమయముచూచి నీగ్రంథమును అతనికి చూపి సన్మానము చేయింతును అని చెప్పి అది తీసి తన ఒద్ద ఉంచుకొని ఆయనను పంపి దానిని కాల్చివేసెను. ఈసంగతి భీమన ఎఱుఁగడు కనుక కొన్ని దినములు తాళి నన్నయభట్టారకుని యింటికివచ్చి అప్పుడు ఆయన ఇంటలేకపోఁగా ఆయన భార్యను పిలిచి నీభర్తచేయుచు ఉన్న భారతము ముగిసెనా అని అడిగినంతట ఆమె ఆరణ్యపర్వము జరుగుచు ఉన్నది అని చెప్పెను. అది విని అతఁడు తనకు ఏసమాచారమును తెలియఁజేయకయే ఇతఁడు గ్రంథరచన జరపుచు ఉన్నాఁడు కనుక తన గ్రంథమును ముందుకు రానీయఁజాలఁడు అని తలఁచి దానివలని సంతాపముచే ఇంకను ఆరణ్యములోనే పడి ఉన్నాఁడా అని చెప్పఁగా అదియే శాపముగా తగిలి ఆకాలమందు ఏమోపని కలిగి ఊరిముందరి అడవికి పోయి ఉండిన నన్నయభట్టారకుఁడు అక్కడనే దేహత్యాగము చేసెను. (పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 )


 • వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి

పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం “ప్రబంధమండలి” అనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే.


 • నన్నయ్య ఈ మార్గం తొక్కడానికి ఒక చారిత్రక కారణం ఉంది. పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాసభారతం కన్నడంలోకి దిగుమతి

అయ్యింది. అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు. వ్యాసుడి లక్ష్యమూ, పరమార్థమూ పూర్తిగా భంగపడ్డాయి. కథాగమనమూ, పాత్రల పేర్లు మాత్రం మిగిలాయి. స్వభావాలు మారిపోయాయి. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం స్థానాన్ని జైన మతం ఆక్రమించింది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం నన్నయ గంటం అందుకున్నాడు. అందుచేత భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడమే సత్వర కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు. బహుశ ఇందులోని స్వేచ్ఛ అనంతర కవులను ఆకర్షించింది. స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. అందుచేత కథాకల్పనల కోసం వృధా శ్రమ పడకండా ప్రఖ్యాత వస్తులేశాన్ని స్వీకరించి సర్వాత్మనా స్వతంత్ర కావ్యాలను రచించారు.

 • నన్నయ ఆంధ్ర మహాభారతము శ్రీకారము త్రిమూర్తులను స్తుతంచే ఈ సంస్కృత శ్లోకముతో జరిగినది.

శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే

తాత్పర్యం లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుడు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!

 • భారతాంధ్రీకరణలో ఆయన మూడు లక్షణములు తన కవితలో ప్రత్యేకముగా చెప్పుకొన్నారు

(1) ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి (2) అక్షర రమ్యత (3) నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము.

 • ఆది పర్వంలో పక్షి రూపంలో తొందరగా కైవల్యం పొందవచ్చని గ్రహించి మందపాలుడనే ముని పక్షి రూపు ధరించి జరిత అనే

లావుక పక్షిని పెళ్ళాడి ఆమెద్వార నలుగురు పిల్లలను పొందాడు. తరువాత తపస్సు చేయడానికి వెళ్ళాడు. కృష్ణార్జునుల సహాయంతో అగ్ని దేవుడు కాండవ వనాన్ని దహిస్తున్న సమయంలో, అన్ని వైపుల నుండి అగ్ని దహిస్తుంటే తన పిల్లలను కాపాడుకోవటానికి జరిత పడుతున్న బాదను, ఆమె మాతృహృదయాన్ని నన్నయ వర్ణించిన తీరు అద్భుతం. అందులోని కొన్ని పద్యాలు

ఇది ప్రళయాగ్నివోలె దెస లెల్లను గప్పఁగ విస్ఫులింగముల్:
వదలక వాయుసారథి జవంబున దా నిట వచ్చె నేమిసే:
యుదు సుతులార యీబిలము నొయ్యన పోయి చొరుండు దీనిఁ గ:
ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాఁకకుండగన్:.

అర్థము: ఓ పుత్రులార| ఈ కార్చిచ్చు అన్ని దిక్కుల నుండి క్రమ్ముకు వస్తుంది, ప్రళయ కాలంలో చెలరేగే విధంగా వాయువునే సారధిగా కలిగిన ఆ అగ్నిదేవుడు మనను కబళించడానికి వస్తున్నాడు. ఈ అగ్ని బారినుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఈ బిలము నందు దూరండి, నేను దానిని దట్టమైన ధూళి సమూహముచేత కప్పివేస్తాను.

బిలము సొచ్చితిమేని నందెలుక చంపు:
నింద యుండితిమేనిఁ దా నేర్చు నగ్ని:
యెలుకచే జచ్చుకంటె నీ జ్వలనశిఖలఁ:
గ్రాగి పుణ్యలోకంబులఁ గాంతు మేము:.

అర్థము: బిలములో దూరితే అందుగల ఎలుక చేతిలో చచ్చెదము, ఇక్కడే వుంటె అగ్నిలో మాడిపోయెదము. ఎలుక చేతిలో చచ్చే కన్న అగ్నిలో ఆహుతి కావడం వలన పుణ్యలోకాలనైన పొందెదము.

జ్వలనంబు వాయువశమునఁ:
జీవనము మాకు దొరకొను గృఛ్రం:
బుల సంశయయుతకార్యం:
బులు గర్తవ్యములు నియతములు వర్జ్యమ్ముల్:.

అర్థము: వాయువు ఎటు వీస్తె అగ్ని అటువైపు వెళ్లును, అదృష్టవశాత్తు గాలి అనుకూలంగో వీస్తే ప్రాణాపాయమునుండి తప్పించుకొన వచ్చును, కాని బిలములోని ఎలుక బారి నుండి తప్పించుకొనుట కష్టము, అందు వలన చెట్టుపైనుండ శ్రేయస్కరము.

 • ఉపరిచర మహారాజు అడవిలో తన రాణి గురించి కలలు కంటున్నప్పుడు

సీసము: పలుకులముద్దును, గలికిక్రాల్గన్నుల, తెలివును, వలుదచన్నులబెడంగు నలఘకాంచీపదస్థలములయెపును, లలితాననేందుమండలము రుచియు. నళినీలకుటిలకుంతలములకాంతియు, నెలజవ్వనంబున విలసనమును, నలసభావంబున బొలుపును, మెలుపును గలుగు నగ్గిరికను దలచి తలచి,

ముదితయందు దనదు హృదయంబు నిలపుట జేసి రాగ మడర భాసురముగ రమణతో వనాంతరమున రేతస్స్యంద, మయ్యె నవనిపతికి నెయ్య మొనర. వశిష్టుడి కొడుకు మత్స్య కన్యని చూసిన సంధర్బములో నన్నయ్య గారు రాసిన పద్యము

సీసము: చపలాక్షిచూపులచాడ్పున కెడ మెచ్చు, జిక్కనిచనుగవజీఱగోరు. నన్నువకౌదీగ యందంబు మది నిల్పు, జఘనచక్రంబుపై జలుపు దృష్టి. యభిలాష మేర్పడు నట్లుండగా బల్కు, వేడ్కతో మఱుమాట వినగ దివురు, నతిఘనలజ్జావనత యగు యక్కన్య, పై బడి లజ్జయు బాప గడగు

నెంతశాంతు లయ్యు, నెంత జితేంద్రియు, లయ్యు, గడువివిక్త మయినచోట సతులగోష్ఠి జిత్తచలన మోదుదు, రెందు గాముశక్తి నోర్వగలరె జనులు.

 • భారతంలో అరణ్యపర్వంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్ జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై

తాత్పర్యం శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేద వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు.

 • సప్తమాత్రికలు అనగా బ్రహ్మ, మాహేశ్వరి, కౌముది, వైష్ణవి, వారాహి, ఇంద్రాని, చాముండ అనునవి సప్తమాత్రికలు.
 • ఆ కాలములో చరిత్రకాంశములిని తెలెపె గ్రంధములు రెండు కలవు.అవి

1.జయనకాండనుడు అఱవములో రచించిన కళింగట్టుపరణి (1063 నుండి 1112 వరకు చోళదేశముని పాలించిన కులోత్తుంగ చోడదేవుని విజయాలను తెలెపెను) 2.బిల్వణుడు సంస్కృతములో రచించిన విక్రమాంకదేవచరిత్ర. (1076 నుండి 1126 వరకును కుంతల దేశముని పాలించిన పశ్చిమచాళుక్య రాజైన విక్రమదిత్యుని విజయాలను తెలెపెను)

 • చాళుక్యులు చంద్రవంశపు రాజులు
 • చోళులు సూర్యవంశపు రాజులు
 • తెలుగు సాహిత్యం - నన్నయ యుగము (1000 - 1100)


"http://te.wikipedia.org/w/index.php?title=నన్నయ్య&oldid=1262557" నుండి వెలికితీశారు